సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 574వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా రక్షణలో ఉన్న మనం దేనికి భయపడాల్సిన పనిలేదు

  2. ప్రార్థించినంతనే పని భారాన్ని తగ్గించారు బాబా


బాబా రక్షణలో ఉన్న మనం దేనికి భయపడాల్సిన పనిలేదు

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిఇలా  పంచుకుంటున్నారు:

ఓం సాయిరాం. శ్రీ సాయినాథ మహరాజుకు నా పాదాభివందనాలు. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

ఈమధ్య మా కోడలికి కడుపునొప్పి వచ్చింది. ఆ నొప్పితో తను చాలా బాధపడింది. తనకు చిన్న బాబు ఉన్నాడు. బాబుకి తను పాలు ఇస్తోంది. కడుపునొప్పి తట్టుకోలేక తను ఏడుస్తూ ఉంటే, “బాబా ఊదీ ఉండగా నీకు ఏమీ కాదు” అని తనను ఓదార్చి, బాబాను ప్రార్థించి, కొద్దిగా బాబా ఊదీని తన నుదుటన పెట్టి, కొంచెం ఊదీని నీళ్ళలో కలిపి ఇచ్చాను. మా అబ్బాయిని, మా మనవడిని చూసి, “బాబా, నీ బిడ్డలకు నీవే దిక్కు! నా కోడలి కడుపునొప్పిని త్వరగా తగ్గించండి బాబా!” అని బాబాను వేడుకున్నాను. మా కోడలు కూడా సాయిభక్తురాలే. తన కడుపునొప్పి తగ్గితే బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత తన గుండెల దగ్గర బాబా ఊదీ రాస్తూ బాబా నామం చేస్తూ ఉంటే బాబా అనుగ్రహంతో కేవలం 10 నిమిషాల్లో తన కడుపునొప్పి తగ్గిపోయింది. అంతా బాబా ఊదీ మహిమ. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ తరువాత మా కోడలిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి పరీక్ష చేయిస్తే రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. మనమందరమూ బాబా రక్షణలో ఉన్నాము, దేనికి భయపడాల్సిన పనిలేదు.

ఇంకొక అనుభవం: 

ఈమధ్య మావారికి బి.పి. ఎక్కువగా ఉంది. కరోనా కారణంగా అన్నీ భయాలే కదా!  మావారు ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకుని డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతున్నారు. నేనైతే మావారి ఆరోగ్య బాధ్యతను బాబాకే అప్పగించాను. మన వైద్యుడు, మన సర్వము కూడా బాబానే కదా! ఆయనే చూసుకుంటారు. బాబా దయవల్ల ఇప్పుడు మావారు ఆరోగ్యంగానే ఉన్నారు

మా మనవరాలికి చిన్న సమస్య ఉంది. అది బాబాకు తెలుసు. బాబానే నా మనవరాలి బాధ్యతను తీసుకుని, త్వరలోనే తనను మామూలు స్థితికి తీసుకొచ్చి నన్ను ఆనందపరుస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకో బాబా నన్ను ఇంకా కొంచెం పరీక్ష పెడుతున్నారు. అయినా బాబా ఉండగా నాకేమీ భయం లేదు. ఆయన ఈ పరీక్షలో నూటికి నూరుశాతం మార్కులతో నన్ను పాస్ చేయిస్తారు. సాయిబంధువుల ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాను. 

ఇట్లు..

బాబా పాదాల చెంత బాబా బిడ్డ.


ప్రార్థించినంతనే పని భారాన్ని తగ్గించారు బాబా

సాయిబంధువులందరికీ నమస్తే! నా పేరు అంజలి. నాకు ఈమధ్య బాబా చూపిన అద్భుతాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2020, జులై నెల నుండి నాకు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువైంది. నేను ఒకేసారి రెండు సబ్స్టేషన్లు చూసుకోవాల్సి వస్తోంది. ఈ కరోనా సమయంలో ఇటు ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం, అటు ఉద్యోగవిధులు నిర్వహించటం చాలా కష్టంగా అనిపించింది. “ఈ సమయంలో బాబా నాకు ఎందుకింత పని ఒత్తిడి ఇచ్చారు?” అని తరచూ అనుకునేదాన్ని. సెప్టెంబరు 3వ తేదీన నేను ఎస్.ఇ (సీనియర్ ఇంజనీర్) దగ్గరకు వెళ్ళి, “నేను రెండు సబ్స్టేషన్లు చూసుకోలేకపోతున్నాను, పాత సబ్స్టేషన్కి ఎ.ఇ ని (అసిస్టెంట్ ఇంజనీర్) ఇవ్వమ”ని అడిగాను. ఆ ఎ.ఇ కి నేను క్రొత్తగా తీసుకున్న సబ్స్టేషన్కి చాలాకాలం క్రితమే బదిలీ అయింది, కానీ అతని పైఆఫీసర్ అతన్ని రిలీవ్ చేయలేదు. ఆ ఎ.ఇ ని అక్టోబరులో పంపిస్తామని అన్నారు. “అతను త్వరగా వచ్చి ఇక్కడి ఉద్యోగవిధులు నిర్వహించేలా చేసి నాకు పని ఒత్తిడి తగ్గించమ”ని నేను బాబాను కోరుకున్నాను. బాబా కృప చూపించారు. పైనించి సి.జి.ఎమ్ (ఛీఫ్ జనరల్ మేనేజర్) “ట్రాన్స్ఫర్ ఇచ్చినా ఇంకా ఎందుకు జాయిన్ అవలేదు?” అని అడిగి రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఎ.ఇ వచ్చి జాయిన్ అవటానికి కనీసం ఒక నెలరోజులు పడుతుందని అనుకున్నాను. కానీ బాబా దయవల్ల అతను సెప్టెంబరు 15వ తేదీకల్లా (కేవలం 15 రోజుల్లోపే) వచ్చి జాయిన్ అయ్యాడు. బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇంక నాకు కొంత పని ఒత్తిడి తగ్గినట్లే. నాకు ఎల్లప్పుడూ బాబా మనతోనే ఉన్నట్లు ఉంటుంది. ఈ సమస్య పరిష్కారమైతే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “కాస్త ఆలస్యమైనందుకు క్షమించండి బాబా!” జై సాయిరాం!

బాబాను నమ్మినవారికి అన్యాయం జరగదు. కాస్త ఆలస్యమైనా బాబా మనకు కావలసింది ఇస్తారు.



6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo