సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 564వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సమస్యలకి స్వప్నమందు బాబా సందేశాలు
  2. అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు

సమస్యలకి స్వప్నమందు బాబా సందేశాలు

సాయిభక్తురాలు హేమ తన స్నేహితురాలికి బాబా ప్రసాదించిన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:

బాబా నాకు ప్రసాదించిన మంచి స్నేహితురాలు కల్పన. మేమెప్పుడు కలుసుకున్నా బాబా లీలల గురించే మాట్లాడుకుంటాం. తానెప్పుడు నేరుగా కలిసినా, ఫోన్ చేసినా ముందుగా 'జై సాయిరాం' అని పలకరిస్తుంది. అందుకే తన మాటగా అందరికీ 'జై సాయిరాం!' వృత్తిరీత్యా తను చాలా బిజీగా ఉండటం వలన నేను తన తరఫున తన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను 

కల్పన కొన్ని సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలు. ఆమెకి ఇద్దరు అమ్మాయిలు. మొదటి పాప 7వ నెలలోనే పుట్టడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో కుటుంబసభ్యులంతా బాబాను ప్రార్థించసాగారు. ఒకరోజు కల్పనకి ద్వారకామాయిలో కూర్చొని బాబా స్వప్నదర్శనమిచ్చారు. ఆయన, "నీ బిడ్డకి 'ద్వారమాలిక' అని పేరు పెట్టు. అంతా మంచి జరుగుతుంది" అని చెప్పారు. తను అలాగే చేసింది. అప్పటినుంచి పాపకు నయమై చాలా ఆరోగ్యంగా ఉంది.

మరో అనుభవం

ఇండియాలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో తను చాలా ఆందోళన చెందింది. అప్పుడొకరోజు ఆమెకు కలలో బాబా ద్వారకామాయి లోపలినుంచి బయటకు వస్తున్నట్లు కనిపించి, తన నోటిలో రొట్టెముక్క వేశారు. అప్పటినుంచి ఆమె ఆందోళన లేకుండా సంతోషంగా తన విధులు నిర్వర్తిస్తున్నది.

ఇంకో అనుభవం: 

నాకు తెలిసి కల్పనకి జీవితంలో అన్నీ ఉన్నాయి, ఒక్క పుత్రసంతానం తప్ప. దానికోసమే ఆమె చాలా రోజులుగా బాబాను వేడుకుంటున్నది. పదిరోజుల క్రిందట (2020, ఆగస్టు చివరిలో) ఆమెకు ఒక కల వచ్చింది. కలలో ఆమెకి శిరిడీలోని శిథిలమైన మసీదు కనిపించింది. ఆరతికి సమయమవుతున్న తరుణంలో ఆమె భయపడుతూ దూరంనుంచే బాబాను తొంగి చూస్తుంటే, బాబా ఆమెను చూసి, "ఎందుకలా భయపడుతున్నావు? ఇలా దగ్గరికి రా!" అని పిలిచి, "ద్వారమాలిక ద్వారకామాయి యొక్క శక్తి. నిజానికి నీకేమీ ఇవ్వకూడదని అనుకున్నప్పటికీ నీకు కావాల్సింది మూడునెలల్లో ఇస్తాను" అని చెప్పారు. బాబా సందేశంతో ఆమె చాలా సంతోషించింది.

"బాబా! మీరు చెప్పినట్లు నా స్నేహితురాలికి పుత్రసంతానం కలిగితే, ఆ అనుభవాన్ని తప్పకుండా ఈ బ్లాగులో పంచుకుంటాను తండ్రీ. సాయిదేవా! కరోనా వైరస్ నుంచి మా అందరికీ రక్షణను ప్రసాదించండి".

జై జై సాయిరాం!

అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథుడు

విజయనగరం నుండి సాయిభక్తుడు రాంబాబు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!

అనుక్షణం మాతోనే ఉంటూ మమ్మల్ని పరిరక్షిస్తున్న సాయినాథునికి శతకోటి నమస్కారాలతో ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నా పేరు రాంబాబు. నేను విజయనగరంలో నివసిస్తున్నాను. ఈమధ్య నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. సరిగ్గా అదేరోజు శిరిడీ నుంచి బాబా ఊదీ ప్రసాదము పోస్టు ద్వారా మా ఇంటికి వచ్చింది. దానితో నేను బాబా ఆశీస్సులు ఉన్నాయని ఎంతో ధైర్యంగా ఉన్నాను. ఆ తర్వాత మా ఇంట్లో మా అత్తగారికి, మా బాబుకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మా అత్తగారి వయసు అరవై సంవత్సరాలు. తనకు బీపీ, షుగరు కూడా ఉన్నాయి. అయినా భారమంతా బాబా మీద వేసి హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. అదే సమయంలో "గురుబంధువులు" వాట్సాప్ గ్రూప్ మరియు మా వదినగారి ద్వారా బాబా వాక్కుగా "నా చరిత్ర పఠనం చేస్తూ, ఊదీ రాస్తూ ఉండు. నీకు నయమవుతుంది" అనే మెసేజ్ నాకు చేరింది. బాబా చెప్పినట్లే చేస్తూ, మందులు వాడుతూ బాబాపై పూర్తి నమ్మకం ఉంచాను. ఆ తర్వాత జ్వరము, దగ్గు, విరోచనాలు ఒకదాని తర్వాత ఒకటి రావడంతో అత్తయ్యగారు చాలా బలహీనపడిపోయారు. అప్పుడు నేను, "అత్తయ్యగారు ఈ గండం నుంచి బయటపడితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. అప్పటినుంచి మెల్లగా అన్ని సమస్యలు తగ్గుతూ వచ్చాయి. తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తే, అత్తగారితో సహా మా అందరికీ నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో మా అందరి మనసులు అవధులు లేని సంతోషంతో నిండిపోయాయి. మనస్ఫూర్తిగా బాబా, గురువుగారి పాదాలకు ప్రణామాలు అర్పించుకున్నాము. ఈ విధంగా బాబా, గురువుగారి అనుగ్రహం మాపై ఎల్లవేళలా ఉండటం మా పూర్వజన్మ సుకృతం.


4 comments:

  1. Baba eppudu nuvu mathone vundu baba om sai ram

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo