సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 558వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కరోనా నుండి వృద్ధులైన నా తల్లిదండ్రులను కాపాడారు బాబా
  2. బాబా ఊదీతో గొంతునొప్పి మాయం

కరోనా నుండి వృద్ధులైన నా తల్లిదండ్రులను కాపాడారు బాబా

సాయి భక్తురాలు శిరీష ఇటీవల బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరాం! గత నెలలో బాబా మా తల్లిదండ్రులను కరోనా విషయంలో ఎలా కాపాడారో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గత నెల(2020, ఆగష్టు) మొదటివారంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేనొక పెద్ద భవనంలో ఉన్నాను. దాని గోడలు గాజుతో కట్టబడివున్నాయి. ఇంతలో దూరంనుండి పెద్ద పొగ, దానిలో మంటలు చాలా త్వరగా భవనం వైపు వస్తున్నాయి. అది చూసి నేను “ఇక తప్పించుకునే సమయం లేదు, మరణ సమయం సమీపించింది” అనుకుని ‘ఓం సాయి’ అని బాబా నామస్మరణ చేయసాగాను. కొంచెంసేపు ఆగిన తరువాత కళ్ళు తెరచి చూస్తే మంటలు లేవు, అంతా మామూలుగానే ఉంది. ‘బాబానే నన్ను కాపాడారు’ అనుకున్నాను. ఇదంతా కలలోనే జరిగింది. మెలకువ వచ్చాక ఆలోచిస్తే ‘ఏదో జరగబోతుందేమో!’ అనిపించింది.

తరువాత నాలుగైదు రోజులకు నా తల్లిదండ్రులిద్దరూ కరోనా బారినపడ్డారు. ఇద్దరూ వృద్ధులు. ఒంటరిగా ఉంటారు. నేను వారికి సహాయంగా వస్తానంటే వాళ్ళిద్దరూ వద్దన్నారు. నాకు మనసంతా ఆందోళనగా అనిపించింది. ఇద్దరూ ఆహారం కూడా సరిగా తీసుకోలేదు. ఇంట్లోనే ఉండి మందులు వాడటం ప్రారంభించారు. నేను ఆందోళనలో పారాయణ కూడా చేయలేకపోయాను. పది రోజుల తర్వాత వారిద్దరూ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. నన్ను అసలు రావద్దని గట్టిగా చెప్పి ఒంటరిగానే వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళారు.  నాకు చాలా ఆందోళనగా అనిపించి ప్రతిరోజూ వాళ్ళిద్దరి గురించి బాబాను ప్రార్థిస్తూ, “ఏం చేసినా మీ ఇష్టం బాబా, వాళ్ళకి ఏది మంచిదో అదే చేయండి” అని బాబాకు శరణాగతి చెందాను. కానీ మనస్సును మాత్రం ప్రశాంతంగా ఉంచుకోలేకపోయాను. ఆ సమయంలో ఈ బ్లాగ్ ఓపెన్ చేశాను. అందులో, “నేనుండగా నీకు భయమేల?” అనే శీర్షికతో ఒక అనుభవం ప్రచురించారు. ఆ వాక్యాన్ని చూడగానే బాబా నాకు అభయం ఇస్తున్నారని అనిపించింది. రెండు రోజుల తరువాత నా తల్లిదండ్రులిద్దరూ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. బాబా అనుగ్రహంతో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోజు కలలో ఆ మంటలను చూసి ఎలా ఆందోళనచెందానో, సరిగ్గా అలాగే నా తల్లిదండ్రు అనారోగ్యం గురించి ఆందోళనచెందాల్సి వచ్చింది. తర్వాత బాబా కృపతో అంతా ప్రశాంతంగా మారింది. “థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ బాబా! నేను ఎప్పుడూ, ఏ పరిస్థితుల్లోనూ మీకు దూరం కాకుండా చూడండి”.

బాబా ఊదీతో గొంతునొప్పి మాయం

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకి బాబా ప్రసాదించిన అనుభవాలన్నిలా మనతో పంచుకుంటున్నారు:

ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా నమస్కారం. నేనొక సాయి బిడ్డను. ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నేను కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు సాయి కృపతో మరో అనుభవాన్ని పంచుకుంటాను.

బాబా కరుణతో నేను టీచరుగా పనిచేస్తున్నాను. నా వృత్తి టీచర్ కావడంతో అప్పుడప్పుడు నాకు గొంతునొప్పి వస్తుంటుంది. అది తగ్గటానికి ప్రతిసారీ జలుబు టాబ్లెట్ వాడేదాన్ని. ఈమధ్యన ఆన్లైన్ క్లాసుల కారణంగా గొంతునొప్పి గానీ జలుబు గానీ లేకుండా పోయాయి. కానీ ఒకరోజు ఉన్నట్టుండి కొద్దిగా గొంతునొప్పి వచ్చింది. అది ఏ కారణంగా వచ్చిందో కూడా తెలియదు. కానీ ఈసారి మాత్రం నేను బాబాతో, "బాబా! నేను నీ ఊదీని రాసుకుంటాను. మీ అనుగ్రహంతో నా గొంతునొప్పి తగ్గితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని చెప్పుకుని బాబా ఊదీని రాసుకున్నాను. ఏ టాబ్లెట్ వాడకుండానే కేవలం బాబా ఊదీతో నా గొంతునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బాబాకు ఇచ్చిన మాట ప్రకారం నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది జరిగి చాలా రోజులైంది. "బాబా! ఈ అనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి. బాబా! మీరు నన్ను కన్నతల్లిలా చూసుకుంటుంటారు, కాదు..కాదు, కన్నతల్లి కంటే ఇంకా ప్రేమగా చూసుకుంటుంటారు. కానీ అప్పుడప్పుడు నేను మీపై కోపగించుకుంటుంటాను. కన్నతల్లిలా నన్ను క్షమించండి బాబా! ఎందుకంటే, మీరు లేని జీవితం ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది". 

శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


7 comments:

  1. శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Baba na kastam ni teerchu thandri

    ReplyDelete
  4. ఓం సాయిరాం

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo