సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 561వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సందేశమిచ్చినట్లే సమస్యను పరిష్కరించిన బాబా
  2. మనలను సర్వదా అన్ని సమస్యల నుండి కాపాడుతుంటారు బాబా

సందేశమిచ్చినట్లే సమస్యను పరిష్కరించిన బాబా

సాయిభక్తుడు రాంప్రసాద్ తనకు బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ప్రియమైన సాయిబంధువులందరికీ నమస్కారం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా గతంలో నేను నా అనుభవం ఒకటి పంచుకున్నాను. అందులో నేను ఒక స్నేహితుడికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక ప్లాట్ కొనివ్వడం, తద్వారా కొన్ని మనస్పర్థలతో సమస్యల వలయంలో చిక్కుకొని, దానికి పూర్తి బాధ్యత నేను వహించి హామీ పత్రం వ్రాసివ్వడం గురించి పంచుకున్నాను. ఇప్పుడు ఆ గండం నుంచి బయటపడడంతో మరలా సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

నేను హామీ పత్రం వ్రాసి ఇచ్చాక వాళ్ళు ఆ మొత్తాన్ని చెల్లించడానికి నాకు రెండు నెలల గడువు ఇచ్చారు. నిజంగా ఆ గడువు లభించడం సాయి దయే. అయితే, 'రెండు నెలల వ్యవధిలో అంత మొత్తాన్ని చెల్లించగలనా? పరువు నిలబెట్టుకోగలనా?' అనిపించింది. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "రెండు నెలల గడువు లోపల నేను అనుకున్న పనిని సాధించగలనా?" అని అడిగి, నా అలవాటు ప్రకారం సాయిబాబా ప్రశ్నలు-జవాబులు పుస్తకంలో బాబా సందేశం కోసం చూశాను. అందులో, "అనుకున్న సమయానికి ఒక మిత్రుని ద్వారా నీ బాధ తీరును" అని వచ్చింది. బాబా సందేశంతో, గడువు ముగిసే సమయమైన 2020, జులై 27 నాటికి డబ్బు సమకూరుతుందిలే అని నేను ధైర్యంగా ఉన్నాను. చూస్తుండగానే రెండు నెలల సమయం రోజులు, క్షణాల్లా గడిచిపోయింది. నేను డబ్బు చెల్లించాల్సిన సమయం రానే వచ్చింది. కానీ రావాల్సిన డబ్బులు చేతికి అందలేదు. మరేవిధంగానూ డబ్బు సర్దుబాటు కాలేదు. దాంతో 'బాబా చెప్పిన మాట ఎలా తప్పింద'ని నాలో నేను మధనపడ్డాను. అప్పుడు, "బాబా! వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోయింది. డబ్బు సమకూరలేదు. కాబట్టి నాకు మరికొంత సమయం కావాలి. దానికి వాళ్లు ఒప్పుకోవాలి, నా పరువు నిలబడాలి బాబా" అని మనసులోనే బాబాను వేడుకున్నాను. బాబా దయవలన వాళ్ళు ఏమీ అనలేదు. కానీ, 'బాబా మాట ఎలా తప్పిందా?' అని ఆలోచనలో పడ్డాను. అలాగే కొన్ని రోజులు గడిచాక ఒక మిత్రుడు నాకు డబ్బిచ్చి సహాయం చేశాడు. అమితానందంతో ఆ డబ్బులు తీసుకెళ్లి నా స్నేహితుడికిచ్చి హామీ పత్రాన్ని రద్దు చేసుకున్నాను. ఆరోజు తేదీ 2020, ఆగస్టు 27. విచిత్రమేమిటంటే, నాకిచ్చిన రెండు నెలల గడువు దాటిన తరువాత సరిగ్గా నెలరోజులకి అదే తారీఖున నేను సమస్య నుండి బయటపడ్డాను. బాబా చెప్పినట్లే స్నేహితుని ద్వారా నాకు డబ్బు అందింది. అయితే, బాబా చెప్పినట్లు రెండు నెలలకి డబ్బు ఎందుకు సమకూరలేదో నాకు అర్థం కాలేదుగానీ, అదనంగా నడిచిన ఆ నెలరోజుల కాలం బాబా నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష అని, ఓర్పుతో ఉండేవారికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుందని అర్థం చేసుకున్నాను.

కానీ నిజం చెప్పాలంటే, బాబా నాకు ఎటువంటి పరీక్షా పెట్టలేదు. ఆయన, "అనుకున్న సమయానికి ఒక మిత్రుని ద్వారా నీ బాధ తీరును" అని మాత్రమే సందేశాన్ని ఇచ్చారు. దాన్ని అనుసరించి నేను సరిగ్గా రెండు నెలలకి వచ్చే జులై 27వ తేదీకి అని పొరపడి, ఆలా జరగకపోవడంతో బాబా మాట అసత్యం ఎలా అయ్యింది అనుకున్నాను. కానీ బాబా సర్వజ్ఞుడు, ఆయనకు సర్వం తెలుసు. ముందు ఇచ్చిన రెండు నెలల గడువే కాదు, తరువాత నాకు లభించే గడువు గురించి కూడా ఆయనకు తెలుసు. అనుకున్న సమయం అంటే, ఆయన దృష్టిలో ఆ రెండవసారి ఇచ్చిన గడువు లోపల అని నాకిప్పుడు అర్థం అయ్యింది. బాబా మాట ఎప్పుడూ అసత్యం కాదు. మన పరిధిలో మనం అలోచించి పొరపాటు పడతాం. కానీ వారికీ అన్నీ తెలుసు. వారు చెప్పేది సర్వత్రా సత్యమే అవుతుంది. నా సమస్య తీరితే నా అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకుంటానని బాబాకి ఇచ్చిన మాట ప్రకారం నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!

మనలను సర్వదా అన్ని సమస్యల నుండి కాపాడుతుంటారు బాబా

సాయిభక్తురాలు అంజలి తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.  

సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. నా పేరు అంజలి. ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నేను చాలా అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటాను. ఇలా మీ అందరితో బాబా ప్రేమను పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

నేను ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్నాను. 2020, ఆగస్ట్ 29న నేను పనిచేసే సబ్‌స్టేషన్‌లో ఒక సంఘటన జరిగింది. ఆరోజు రాత్రి 11 గంటలకి, 'సబ్‌స్టేషన్ బ్యాటరీస్ ఓల్టేజ్ తక్కువ వస్తోంద'ని ఫోన్ వచ్చింది. దాంతో నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే, బ్యాటరీస్ సబ్‌స్టేషన్‌కి హార్ట్ వంటివి. అవి ఓల్టేజ్ తక్కువ వస్తే చాలా సమస్య అవుతుంది. వెంటనే ఆ రాత్రివేళ నా భర్తను, పిల్లల్ని తీసుకుని సబ్‌స్టేషన్‌కి వెళ్ళాను. ఇంక డిపార్ట్‌మెంట్ వాళ్ళని లైన్లోకి తీసుకొని సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యాను. నా బిజీలో నేను ఉంటూనే బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాను. ఒకతను, "పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఆఫ్ చేయమ"ని చెప్పి, "ఓల్టేజ్ చాలా తగ్గిపోయింది, ట్రాన్స్‌ఫార్మర్స్ ఆఫ్ అవుతాయో, లేదో" అని అన్నాడు. నా టెన్షన్ ఇంకా పెరిగింది. బాబాను తలచుకుంటూనే పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఆఫ్ చేశాను. బాబా దయవలన అవి ఆఫ్ అయ్యాయి. లేకుంటే చాలా సమస్య అయ్యేది. బాబా దయవలన మరుసటిరోజు మధ్యాహ్నానికి సమస్య పరిష్కారమై పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఆ భయానక పరిస్థితి నుండి నన్ను బాబానే కాపాడారు. లేదంటే, నా ఉద్యోగానికి చాలా ప్రాబ్లెమ్ అయ్యేది. బాబా మనలను సర్వదా అన్ని సమస్యల నుండి కాపాడుతుంటారు. ఆయన ఉండగా మనకు భయమెందుకు? "చాలా చాలా ధన్యవాదాలు బాబా! సమస్య పరిష్కారమైతే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని అనుకున్నట్లే పంచుకున్నాను బాబా. కాకపోతే కాస్త ఆలస్యం అయింది. అందుకు నన్ను క్షమించండి బాబా!"

జై సాయిరామ్!


16 comments:

  1. om sai ram om sai ram om sai ra m

    ReplyDelete
  2. సాయి భక్తులకీ ఈ బ్లాగ్ నిర్వహకులకి నా హృదయ పూర్వక నమస్కారములు 😊🙏 ఈ బ్లాగ్ నన్ను బాబా కి మరింత దగ్గర చేసింది, భక్తుల అనుభవాలు నాలో సంతోషాన్ని , ధైర్యాన్ని, బాబా మీద విశ్వసాన్ని కలిగిస్తున్నాయి,

    నేను ఒక ఒంటరి సాయి భక్తురాలిని, నా చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరు కూడా సాయి భక్తులు లేరు , కొందరు భక్తులు తమ అనుభవల్లో చెప్తుంటారు, బాబా అఖండ దీపం అని, ప్రశ్న జవాబు పుస్తకం అని, ఇంకా చాలా రకాలుగా బాబా ని పూజిస్తుంటారు, అవి అన్ని తెలుసుకోవడానికి ఇంకేదైన website లాంటిది ఉంటుందా , దయ చేసి ఎవరైనా తెలుపగలరు
    మనందరి తండ్రి, సద్గురువు అయిన సాయినాథుడు మనల్ని సదా రక్షించు గాక
    ఓం సాయి రాం 🙏🙏🙏
    Thank you 😊🙏🙏🙏

    ReplyDelete
    Replies
    1. http://www.saibharadwaja.org/

      ఈ వెబ్సైటు మీకు ఉపయోగపడుతుంది.
      🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

      Delete
    2. Om Sai ram.
      Book stalls lo Mana prasnalaki baba javabulu and book dorukuthumdi Andi.
      Or Google lo Sai answers Ani search chesthe Chala websites open avutai. www.yoursaibaba.com and website lo aithe manaki language options kooda untai Andi..once choodamdi
      Om Sai ram.

      Delete
    3. చాలా చాలా థాంక్స్ 😊🙏
      ఓం సాయి రాం 😊🙏💐

      Delete
    4. are u havig interest to join in mahaparayana group sairam

      Delete
    5. With Baba's blessings i recently joined in Mahaparayana 😊
      Thanks for asking
      Om sai ram 🙏💐

      Delete
  3. Replies
    1. సదా సాయి అష్టోత్తర శతనామావళి జపించండి
      శుభం భూయాత్..ఓం సాయిరాం
      🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
      ఓం ఆపద్బాంధవాయ
      ఓం మార్గబంధవే నమః
      రక్ష రక్ష సాయి రక్ష

      Delete
    2. చాలా థాంక్స్ అండి
      ఓం సాయి రాం 😊🙏💐

      Delete
  4. Om sai ram,www.yoursaibaba.com lo Mee questions ki baba answers istaru

    ReplyDelete
  5. Om sai ram,sainatha TQ deva,naa prashna ki anubhavam dwara answer icchinanduku.

    ReplyDelete
  6. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  7. 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏 Om Sri Sairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo