- ఆటంకాలు లేకుండా నవగురువార వ్రతం పూర్తైయ్యేలా అనుగ్రహించిన బాబా
- తలచిన వెంటనే పోయిన ఉంగరాన్ని కనిపించేలా చేసిన బాబా
ఆటంకాలు లేకుండా నవగురువార వ్రతం పూర్తైయ్యేలా అనుగ్రహించిన బాబా
ముందుగా బాబా పాదపద్మాలకు నా సాష్టాంగ నమస్కారాలను అర్పిస్తున్నాను. నా పేరు సుజాత. నేను టీచరుగా పనిచేస్తున్నాను. కరోనా రాకముందు వరకు అసలు ఇలాంటి బ్లాగ్ ఒకటుందని నాకు తెలియదు. మాకు సాయిబాబా గురించి తెలియచేసిన మా పెద్దసార్ ఒకరోజు ఈ బ్లాగ్ లింకును మాకు షేర్ చేశారు. దాంతో ఈ బ్లాగ్ ఓపెన్ చేసి సాయిభక్తుల అనుభవాలను చదవడం ప్రారంభించాను.
దీనికి కొన్నిరోజుల ముందు నేను పూజగది సర్దుతుంటే ‘సాయి దివ్యపూజ’ మరియు ‘సాయి తొమ్మిది గురువార వ్రత కథ’ పుస్తకాలు కనిపించాయి. కరోనా కారణంగా స్కూల్ కూడా లేదు కదా అని 2020, జూన్ 18, గురువారం నాడు మా పెళ్లిరోజు కావటంతో ఆరోజు సాయి తొమ్మిది గురువారాల పూజ ప్రారంభించాను. ఎంతో శ్రద్ధగా బాబాకు పూజ చేసుకున్నాను. ఆ తర్వాతి గురువారం నాకు నెలసరి సమయం. ‘పూజ ప్రారంభించిన రెండవ వారమే ఆటంకం వస్తోందే’ అని బాధపడ్డాను. ఆరోజు రాత్రి మన బ్లాగులో భక్తుల అనుభవాలను చదువుతూ, “ఈ తొమ్మిది వారాలు ఏ ఆటంకమూ లేకుండా వ్రతం పూర్తయితే నేను కూడా నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటే బాగుంటుంది” అని అనుకున్నాను. ఆశ్చర్యంగా, ఒక్క వారం కూడా ఏ ఆటంకమూ ఎదురవలేదు. అన్ని వారాలూ ఏ ఆటంకాలూ లేకుండా పూజ చేసుకున్నాను. ఆఖరి గురువారం పూజకు ఆటంకం కలుగుతుందేమో అనుకున్నాను. ఎందుకంటే, ఆ ముందు సోమవారం మా పెద్దమ్మగారు చనిపోయారు. కానీ సరిగ్గా గురువారంనాడు మాకు శుద్ధి జరిగి ఆ గురువారం కూడా ఏ ఆటంకమూ లేకుండా పూజ పూర్తయింది. అలా బాబా అనుగ్రహంతో ఆగస్టు 13వ తారీఖుతో తొమ్మిది గురువారాలు నిరంటంకంగా పూర్తయ్యాయి. ఇంతటితో నా అనుభవం పూర్తయింది. ఇక నా మనోభిప్రాయన్ని పంచుకుంటాను.
ఆరోజు సెప్టెంబరు 19. తొమ్మిది గురువారాలు పూర్తయి అప్పటికి నెలరోజుల పైనే అయింది. ఆరోజు నేను బాబా దగ్గర కూర్చుని, “బాబా! మీ గురించి నేను ఎందుకలా అనుకున్నాను? ఏ ఆటంకాలు లేకుండా తొమ్మిది గురువారాల పూజ పూర్తయితేనే మీ కృప ఉన్నట్లు, లేకపోతే లేనట్లు అని నేనెందుకు అనుకున్నాను? ఇలా తప్పుగా నేనెందుకు ఆలోచించాను? సాయీ! నన్ను క్షమించండి!” అని చాలా బాధపడ్డాను. అంతేకాదు, “‘అందరికీ ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి, మాకు ఏ అనుభవాలూ కలగడంలేదు’ అని నేను ఎప్పుడూ అనుకోకూడదు బాబా!” అని ఎంతో బాధపడుతూ బాబాకు చెప్పుకున్నాను. ఆ తర్వాత బాబానే నాకు సమాధానం తెలియచేశారు. అందరి అనుభవాలు తెలియడం వల్లనే కదా సాయినాథుని సర్వజ్ఞత, వారి అపార కరుణ, వారి మార్గం తెలిసేది. హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్ర రచించడం వల్లనే కదా మనం బాబాను, వారి ప్రేమను తెలుసుకున్నాము. అందువల్లనే ఈ బ్లాగ్ అనే సాయిభక్తుల అనుభవమాలికా సచ్చరిత్ర ద్వారా మనమందరమూ తనను అనుసరించాలని బాబా సంకల్పం కావచ్చు. నా ఆలోచనలలోని దోషాలనన్నిటినీ సరిచేయమని బాబాను మనసారా వేడుకుంటూ, మళ్లీ త్వరలోనే మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తూ...
సాయిభక్తురాలు
సుజాత
తలచిన వెంటనే పోయిన ఉంగరాన్ని కనిపించేలా చేసిన బాబా
నేను గత పదేళ్ళుగా సాయిబాబా భక్తురాలిని. మాది హైదరాబాద్. 2020, సెప్టెంబరు 15వ తేదీన నా పెద్ద కూతురు తన వ్రేలికున్న ఉంగరాన్ని పోగొట్టుకున్నది. మేము ఆ విషయాన్ని రాత్రి 9 గంటలకు గమనించాము. ఆ ఉంగరం కోసం ఇల్లంతా వెతికాము. కానీ, ఎక్కడా దొరకలేదు. 16వ తేదీ ఉదయం నేను నిద్రలేచి బాబాను తలచుకొని, “బాబా! మీ దయవల్ల ఈరోజు ఉంగరం దొరికితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని ప్రార్థించాను. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేను అలా బాబాను తలచుకొని వెతికానో లేదో, వెంటనే ఆ ఉంగరం నా ఎదురుగానే కనబడింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”
Om sai ram!!🙏🙏🙏🌹🌺🌺🌺🌺🌹
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sairam,
ReplyDeleteBaba always with devotees.
🙏🙏🙏 ఓం శ్రీ సాయి రాజారామ్ 🙏🙏🙏
ReplyDeleteOm Sai ram
ReplyDeleteBaba please bless us we r waiting for ur blessings
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🌟🌺🌟🙏 Om Sri Sairam🙏🙏🌟🌺🌟
ReplyDelete