సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 563వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అడుగడుగునా బాబా సమాధానాలు!

సాయిభక్తురాలు అనూష తనకు బాబా ఇటీవల ప్రసాదించిన చక్కటి అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
 
మనం 2020లో ఉన్నాం. ఈ జనరేషన్‌లో కొన్ని విషయాలు నమ్మడానికి మనం ఒప్పుకోము. మనసు ఒప్పుకున్నా బ్రెయిన్‌లో ఎక్కడో ఒక మూలన అనుమానం ఉండనే ఉంటుంది. పూర్తిగా అంగీకరించలేము. మనం మామూలు మనుషులం. మన మనసు చంచలంగా ఉండటం సహజం. అలాంటి స్థితిలో ఉన్న నాకు బాబా చక్కటి అనుభవాలను ప్రసాదించారు. వాటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:
 
జూలై నెలలో నా పుట్టినరోజు అయిపోయిన రెండు రోజులకి నాకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. టాబ్లెట్స్ వాడాక రెండురోజులకి నొప్పి తగ్గింది. 'హమ్మయ్య.. తగ్గింది' అనుకున్నంతలో మరో సమస్య వచ్చింది. అలా ఒకటి తరువాత ఒకటిగా ఆరోగ్య సమస్యలు రాసాగాయి. రోజూ బాబాని, "నా సమస్య తీర్చమ"ని వేడుకొని, సమస్య ఉన్నచోట ఊదీ పెట్టుకుంటూ ఉండేదాన్ని. అయినప్పటికీ నెలరోజులవుతున్నా ఏదో ఒక ఆరోగ్య సమస్య నన్ను బాధపెడుతూనే ఉంది. నాకేమవుతోందో అర్థం కాలేదు. పోనీ, ఏదైనా పెద్ద సమస్య కారణంగా ఇలా అవుతుందేమో అనుకుందామంటే, అన్నీ ఒకదానికొకటి పొంతనలేని సమస్యలు. అసలే ఈ కోవిడ్ సమయంలో హాస్పిటల్స్‌లో కూడా సరిగా చూడట్లేదు. ఒకవేళ హాస్పిటల్‌కి వెళ్లినా రోజుకో సమస్యైతే దేనిగురించని చెప్పేది? అటువంటి స్థితిలో నేను చాలా భయపడిపోయాను. నాకు తెలిసినవాళ్లతో నా సమస్యల గురించి చెప్పుకుంటే, ఒకరు 'నరదిష్టి' అని, ఇంకొకరు 'చెడు జరిగింద'ని, మరొకరు 'నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇదంతా అవుతుంద'ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారు. బాధలో ఉన్న నాకు అవన్నీ నమ్మశక్యంగానే అనిపించాయి. కానీ, "నిజంగానే చెడు జరగటం, నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఉంటాయా? అవి మనుషులకి ఇబ్బంది కలిగిస్తాయా?" అని ఆలోచనలో పడ్డాను. అంతలోనే బాబా నాకు సమాధానమిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బాబా గ్రూపు నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే, నా మనసులో ఉన్న ఆలోచనలకి 100% సరిపోయే బాబా సందేశం అందులో ఉంది. దాన్ని బాబానే పంపారని అనుకుంటున్నాను. ఎందుకంటే, నా మనసులో ఉన్న అనుమానాలకు సరిపోయేలా రావడమన్నది ఏదో యాదృచ్ఛికంగా జరిగినదైతే కాదు. మీ అందరికోసం నాకొచ్చిన సందేశాన్ని ఇక్కడ పెడుతున్నాను. దాన్ని వివరించడం కన్నా మీరే చదివితే బాగుంటుందని నా అభిప్రాయం.
(భావం: "మీరు చేతబడికి భయపడుతున్నారా?? అఘోరీలకు, తాంత్రికులకు భయపడుతున్నారా? నాకన్నా పెద్ద అఘోరి ఉందా?? నన్ను నమ్ముకున్నవారిని తాకే ధైర్యం ఎవరు చేయగలరు?? నేను అగ్నిస్వరూపుడను, నా బిడ్డలకు హాని కలిగించే ప్రయత్నం చేసే ఎవరినైనా దహించివేస్తాను. అన్ని భయాలను విడిచిపెట్టి ప్రశాంతంగా జీవించండి! నేను మీ రక్షకుడను!")

రెండవ అనుభవం:

బాబా అంత చక్కటి సందేశం ఇచ్చినప్పటికీ నెగిటివ్ ఎనర్జీకి భయపడి నాకు తెలిసిన ఒక జ్యోతిష్కుడిని సంప్రదించాను. ఆయన, 'ఇప్పుడు నీ టైమ్ బాగాలేదని, ఒక పూజ చేసుకోవాలని, ఇంకా ఒక ఉంగరం పెట్టుకోవాలని' చెప్పారు. అప్పుడు నేను బాబాని, "బాబా! నిన్ను కొలుస్తున్నప్పుడు ఇలాంటివి నమ్మొచ్చో, లేదో తెలియని గందరగోళంలో ఉన్నాను. నాకొక దారి చూపించండి. నేను మాములు మనిషిని. పరిస్థితులకు లొంగిపోయే మనసు నాది. దయచేసి నాకు సమాధానం ఇవ్వండి బాబా" అని అడిగాను. అప్పుడు కూడా బాబా నాకు సమాధానమిచ్చారు. దాన్ని కూడా క్రింద జతపరుస్తున్నాను.
(భావం: "నా బిడ్డలైన మీకు (వేరే)మద్దతు ఎందుకు కావాలి?? నేను మీకున్న అతిపెద్ద మద్దతు కాదా? మీరు మానవరూపంలో ఉన్న గురువులు, బాబాల వద్దకు ఎందుకు పరిగెత్తుతారు?? వాళ్ళు మీ బాబానైన నాకంటే ఎక్కువనో లేదా సమానమనో మీరు అనుకుంటున్నారా, నమ్ముతున్నారా?? మీరు వాళ్ళను నాతో ఎందుకు పోల్చుతారు?? మీ దైవంగానేకాక మీ గురువుగా, తండ్రిగా, తల్లిగా, మంచి స్నేహితునిగా నేను మీకోసం సదా లేనా?? ఇంతకంటే ఎక్కువ మద్దతు మీకు అవసరమా?? ఇతర మానవులను 'బాబా' అని పిలిచి, మీరు నా హృదయాన్ని ముక్కలు చేస్తున్నారు. నేను మీకు దూరంగా ఉన్నానా?? ప్రేమతో పిలిస్తే, నేను రానా?")

మూడవ అనుభవం: 

అయినప్పటికీ నేను నా ఆరోగ్యం గురించి దిగులుపడుతూ చాలా చెడుగా ఆలోచించటం మొదలుపెట్టాను. అప్పుడు కూడా బాబా, "నీ వ్యాధి చాలా చిన్నది, అది పెద్దదని అనుకోవద్దు. మంచి ఆహారం తీసుకో!" అని సందేశం పంపారు.
నాలుగవ అనుభవం:

తరువాత 2020, సెప్టెంబర్ 8న నేను బాబాకి దండం పెట్టుకొని, "నా మనసు కుదుటపడేలా ఒక జవాబు ఇవ్వండి" అని బాబాను అడిగి మా ఇంట్లో ఉన్న 'బాబా ప్రశ్నలు జవాబులు' అనే పుస్తకం తెరిచాను. అందులో, "షష్టి మంగళవారం, కృత్తిక నక్షత్రం కలిసి ఉన్న రోజు సుబ్రమణ్యస్వామిని ఆరాధించు. తొందరపడకుండా ఉండు. దుఃఖాలు దూరం అవుతాయి, ఆపదలు తొలగుతాయి. వ్యాధి నయం అవుతుంది" అని ఉంది. గొప్ప అద్భుతమేమిటంటే, ఆరోజు మంగళవారం; తిథి షష్టి; కృత్తిక నక్షత్రం. ఆ విషయం నాకు ఆరోజు మధ్యాహ్నం తెలిసింది. అప్పుడు అనిపించింది, 'బాబా ఆ సందేశం ఊరికే ఇవ్వలేదని, ఆయన చెప్పింది ఖచ్చితంగా సత్యమై తీరుతుందని, వాటిని మనం గ్రహించగలగాలి' అని. ఇలా నేను మానసికంగా బలహీనపడుతున్న ప్రతిసారీ నా సందేహాలకు బాబా సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. బాబా ఎల్లవేళలా మనల్ని కనిపెట్టుకొని ఉంటూ, ప్రతిక్షణమూ సమాధానమిస్తున్నా మనం మన చంచలమైన స్వభావంతో అనుమానపడుతూనే ఉంటాం. కానీ బాబా ఎల్లప్పుడూ మనకోసం, మనకి తోడుగా ఉన్నారు. "బాబా! ప్రతిసారీ 'నేనున్నా'నంటూ సమాధానమిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కృపని తెలుసుకునే శక్తిని, సహనాన్ని నాకు ఇవ్వండి".


8 comments:

  1. om sai ram today is babas maha samadhi day.i am m.p. member.i feel happy i finished my pooja,parayanam.in siridi they celebrete babas punya thidhi.corana time we can't go to temple.bad luck.

    ReplyDelete
  2. Sai nadha! Meeru matho sadha untaru🙏🌺🌻🌼🌿🌹🌹🌹🌹🌹

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Baba u r really great ni biddalanu sada kapadu thandri OM SAI RAM

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo