సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 551వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా తప్ప ఇంకెవరు కాపాడతారు?
  2. “నేను ఉన్నాను” అని నిదర్శనమిచ్చిన బాబా

సాయిభక్తురాలు శ్రీమతి అంజలి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
 
సాయిబంధువులందరికీ నమస్కారం. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. నా పేరు అంజలి. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇటీవల జరిగిన కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బాబా నాకు ఇంకా ఎన్నో అనుభవాలు ఇవ్వాలని, అవన్నీ మీ అందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను.

బాబా తప్ప మమ్మల్ని ఇంకెవరు కాపాడతారు?

2020, ఆగస్టు 20వ తేదీన హెల్త్ చెకప్ కోసం నేను, మావారు మా కారులో నకిరేకల్ నుండి బయలుదేరి చీరాలలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్‍కి వెళ్లాము. చెకప్ చేయించుకొని ఆ మరుసటిరోజు తిరిగి నకిరేకల్‌కి బయలుదేరాము. సగం దూరం ప్రయాణించిన తరువాత కారు స్టీరింగ్ ఉన్న వైపునుండి ఏదో శబ్దం రావటం మొదలైంది. అదేమిటో మాకు అర్థం కాలేదు. క్రమంగా ఆ శబ్దం పెరుగుతూ ఉంది. మేము నకిరేకల్ చేరుకున్న తరువాత కారును షోరూంలో చూపిద్దామని అనుకున్నారు మావారు. ఆగస్ట్ 21న అత్యవసరమైన పని ఉన్నందువల్ల మావారు నన్ను కారులో ఆఫీసుకి తీసుకెళ్లారు. అప్పుడు కూడా కారులో ఆ శబ్దం వస్తూనే వుంది. నాకు చాలా ఒత్తిడిగా అనిపించి, కొంచెంసేపు ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకున్నాను. కేవలం పది నిమిషాలు ధ్యానం చేశానంతే. ధ్యానంలో, స్టీరింగ్ వైపు వున్న కారు చక్రం పడిపోతున్నట్లు అనిపించింది. వెంటనే కళ్ళు తెరిచాను. ఈ విషయం మావారికి చెపితే భయపడతారని చెప్పలేదు. మరుసటిరోజు కారుని నల్గొండలోని కారు షోరూంకి తీసుకెళ్ళారు మావారు. షోరూంవాళ్ళు కారుని పరీక్షించి, “కారు స్టీరింగ్ వైపున్న చక్రంలో గాలి 64 యూనిట్లు ఉంది. మామూలుగా అయితే 30 మాత్రమే ఉండాలి. 64 ఉంటే కారు చక్రం పేలిపోతుంది” అన్నారు. మేము కారులో దాదాపు 600 కి.మీ. దూరం చాలా వేగంగానే ప్రయాణించాము. బాబా దయవలన మాకు గానీ, కారుకి గానీ ఏమీ కాలేదు. బాబానే మమ్మల్ని కాపాడారు. బాబా తప్ప మమ్మల్ని ఇంకెవరు కాపాడతారు? బాబాకి మా మీద వున్న ప్రేమకి నాకు ఏడుపు ఆగలేదు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథునికి ఈ అల్పురాలు ఏమి ఇవ్వగలదు, మా పట్ల ఆయనకున్న ప్రేమకి హృదయపూర్వకంగా వారి పాదపద్మాలకు నమస్కారములు తప్ప. “బాబా! దయామయా! ఎల్లప్పుడూ ఇలానే మమ్మల్ని రక్షిస్తూ ఉండండి”. 

“నేను ఉన్నాను” అని నిదర్శనమిచ్చిన బాబా

ఇటీవల మా ఆఫీసులో ఒక సహోద్యోగితో భగవంతుని గురించిన చర్చ జరిగింది. ఆ సహోద్యోగి ‘దేవుడు లేడ’ని వాదించారు. దానికి మేమిచ్చిన సమాధానాలు అతనిని సమాధానపరచలేదు. నాకు కూడా ఒక్కక్షణం అతను మాట్లాడేది నిజమే కదా అనిపించింది. ‘నిజంగా దేవుడు లేడా?’ అని ఒక్కక్షణం అనిపించింది. ఆ తరువాత ఆ చర్చ గురించి మర్చిపోయాను.

అదేరోజు రాత్రి బాబా నాకు స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో నేను శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాను. బాబా నన్ను తమకు పూలమాల వేయమన్నారు. నేను పూలమాల కోసం చూస్తున్నాను. అంతలో నాకు మెలకువ వచ్చింది. నేను కరోనా ప్రభావానికి ముందు ప్రతి గురువారం నకిరేకల్‌లోని బాబా గుడిలో బాబాకు పూలమాల వేసి ఆరతి ఇచ్చేదాన్ని. లాక్‌డౌన్ పెట్టినప్పటినుండి బాబా గుడికి వెళ్ళటం లేదు, బాబాకు పూలమాల వేయటం లేదు. ఆ కల ద్వారా బాబా నన్ను మరలా ప్రతి గురువారం తనకు పూలమాల వేయమని చెప్పినట్లు అనిపించింది. అంతేకాదు, స్వప్నంలో దర్శనమిచ్చి “నేను ఉన్నాను” అని బాబా నాకు నిదర్శనమిచ్చినట్లు అనిపించింది. బాబా నాకు స్వప్నదర్శనమిచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఈ పదిహేడేళ్లలో ఇప్పటికి మూడుసార్లు స్వప్నంలో దర్శనమిచ్చి ఉంటారు. ‘నా బిడ్డలకి నేనున్నానని నిదర్శనం ఇవ్వక్కర్లేదు’ అని బాబా నాకు చాలాసార్లు నిరూపించారు. కానీ నిన్న నా మనసుకి ఒక్కక్షణం సందేహం వచ్చేటప్పటికి బాబా నాకు స్వప్నంలో దర్శనమిచ్చి “నేను ఉన్నాను” అని నిదర్శనమిచ్చారు. మరుసటి ఉదయం నిద్రలేచాక నేను పొందిన ఆనందాన్ని మాటలలో చెప్పలేను. ఎన్నో జన్మల పుణ్యం వలన మనం బాబాను పూజించుకోగలుగుతున్నాము. “ఈ అదృష్టం మాకు అన్ని జన్మలలోనూ కలగాలని కోరుకుంటున్నాను బాబా! నీ పాదాలను ఎప్పటికీ పట్టుకుని ఉండేలా మమ్మల్ని అనుగ్రహించండి బాబా! లవ్ యు సో మచ్ బాబా!”


9 comments:

  1. Samarda sadguru sai nadha Maharaj ki jai

    ReplyDelete
  2. Dfntly sai..sai will bless u...om sai ram👏🙌🙏💐

    ReplyDelete
  3. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  4. 🌼🙏🙏🙏🌼 Om Sri Sairam🌼

    ReplyDelete
  5. Om sai ram baba ma pyna karuna chupinchu thandri ne daya kosam vechi chustunamu thandri

    ReplyDelete
  6. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo