సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అమీదాస్ భవానీ మెహతా


సాయి మహాభక్త అమీదాస్ భవానీ మెహతా గుజరాత్ లోని భావ్ నగర్ (కతేవాడ్, సౌరాష్ట్ర) నివాసస్తుడు. అమీదాస్ నరసింగ్ "మెహతా కమ్యూనిటీ"కి చెందినవాడు. అతను మేధోకవి, శ్రీకృష్ణుడి భక్తుడు. ప్రతిరోజూ ఎంతో భక్తితో కృష్ణుడిని పుజిస్తుండేవాడు. ఎప్పుడు కృష్ణుడి ఫోటో చూసినా ఆ ఫోటో గ్లాస్ లో అతనికి ఒక ఫకీరు కనిపిస్తూ ఉండేవారు. అలా రోజూ చూడటం వలన అతనిలో ఏదో తెలియని కలవరం మొదలైంది. అతనికి ఆ ఫకీరు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత రోజురోజుకీ పెరగసాగింది. అందువలన, అతను ఆ ఫకీరు గురించి  తెలుసుకొనేందుకు ప్రయాణాన్ని ప్రారంభించాడు. చివరకు ఆ ఫకీరు శిరిడీలోని "సాయిబాబా" అని తెలుసుకున్నాడు.

అమీదాస్ బాగా చదువుకున్న వ్యక్తి. అతను ఇండియన్ క్లాసికల్ మరియు వోకల్ మ్యూజిక్ లో శిక్షణ కూడా పొందాడు. అతను చాలా ధనవంతుడు, కటేవాడ్ కి చెందిన దయాశంకర్ రేవశంకర్ పాండ్య రాజకుటుంబానికి చెందినవాడు. ఆరోజులలో, ఈ ప్రాంతం గుజరాతీ నవాబులచే పాలించబడింది.
అతను చాలా తరచుగా శిరిడీని సందర్శిస్తూ, అక్కడ ఉండటానికి ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. శిరిడీలో ఎక్కువకాలం ఉంటూ సాయిబాబాతో అతను ఎక్కువ సమయం గడిపేవాడు. అమీదాస్ ఒక కవి. గుజరాతీలో సాయిబాబా గురించి అనేక వ్యాసాలు మరియు పుస్తకాలు వ్రాసి గుజరాత్ రాష్ట్రంలో బాబా పేరును వ్యాప్తి చేయడానికి అతను బాధ్యత వహించాడు. అతను సాయిబాబా యొక్క ఇష్టాలు, అయిష్టాలు, లక్షణాలు వివరిస్తూ అనేక కవితలు వ్రాసాడు. అతను సాయి బాబా యొక్క జీవిత చరిత్రను PURNA PARABRAHMA SRI SADGURU SAINATH MAHARAJNI – JANAVAJOG VIGATO TEMAJ CHAMATKARO అనే పేరుతో వ్రాశాడు.

అమీదాస్ యొక్క సున్నితమైన స్వభావాన్ని బాబా ఇష్టపడేవారు. ఎవరైనా బాధితులు వచ్చినప్పుడు బాబా వారిని అమీదాస్ భవానీ మెహతా వద్దకు పంపించేవారు. అతను ఆ రోగిని సంతోషంగా ఆదరించి, ఆ వ్యక్తి పట్ల అత్యంత జాగ్రత్త తీసుకొనేవాడు. ఆ రోగిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించేవాడు. అతను తన సద్గురువు ఎదుట శిరిడీలో చనిపోవాలని కోరుకోనేవాడు. తన మహాభక్తుని కోరికను తెలుసుకొన్న బాబా, "అతను ఎక్కడ చనిపోయినా తాను ఎప్పుడూ అతనితోనే ఉంటాన"ని చెప్పారు.


తన జీవితంలో తరువాతి కాలంలో, అమీదాస్ ముంబైలోని కలబాదేవి వద్ద M/S బ్రిటిష్ ఫోటో ఎన్లార్జింగ్ కంపెనీ పేరుతో ఒక ఫోటో స్టూడియోను యజమానిగా నడిపారు. 1923లో మరో సాయిమహాభక్త గణేష్ దత్తాత్రేయ సహస్రబుద్ధే అలియాస్ దాసగణు శ్రీ సాయిబాబా సంస్థాన్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఇతడు శ్రీ సాయిబాబా సంస్థాన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు.

ఇతని మరణానంతరం, పారాయణ హాల్ ఎదుట ముక్తారాం సమాధి పక్కనే ఈ గొప్ప సాయిమహాభక్తుని సమాధి చేసి శ్రీ సాయిబాబా సంస్థాన్ సత్కరించింది.
(Source: Baba’s Rinanubandh by Vinny Chitluri and  Shri Sai Leela Magazine Chaitra Shake 1923)

4 comments:

  1. Kothakonda SrinivasMarch 20, 2021 at 10:58 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo