సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నిజంగా బాబా దయ


కువైట్ నుండి సాయి గీత గారు తమకు బాబా ఇచ్చిన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

ఇండియాలో ఓటర్ ఐడి లా మాకు ఇక్కడ కువైట్ లో సివిల్ ఐడి కాపీ అని ఉంటుంది. అది లేకుండా బయటకు ఎటు వెళ్ళిన అది ఇల్లీగల్. అలాంటిది ఒక రోజు ఏమైందంటే సివిల్ ఐడి కాపీని స్వెటర్ లో పెట్టి గుర్తు లేక వాషింగ్ మెషిన్ లో వెసేసాను. కొద్ది సేపటికి ఏదో విషయంగా బాత్ రూమ్ కి వెళ్ళాను. ఏదో శబ్దం వస్తుంది, కానీ అంతగా గమనించలేదు. బాబాని తలచుకుంటూ ఉన్నాను. ఎందుకో మనఃశాంతి లేదు. బాబా నాకు మనఃశాంతి ప్రసాదించండి అని ప్రార్ధిస్తున్నాను. 

సాదారణంగా నేను ఒకసారి వాషింగ్ మెషిన్ ఆన్ చేసాక చూడను. అలాంటిది ఎందుకో సడన్ గా 15 నిమిషాల తర్వాత చూసేసరికి సివిల్ ఐడి కాపీ కనిపించింది. నాకు చాలా కంగారుగా అనిపించింది. ఏమి చేయాలో తోచలేదు. ఎందుకంటే మాది ఆటోమాటిక్ వాషింగ్ మెషిన్ ఒకసారి ఆన్ చేసాక మళ్ళి ఆఫ్ చేసినాగాని లాక్ ఓపెన్ కాదు. ఐదు నిమషాల  తర్వాత ఏమి చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు మెషిన్ లాక్ ఒకసారి ప్రయత్నించి ఓపెన్ కాకపోతే ఎవరైనా  ఎలక్ట్రీషియన్ కి  గాని, ప్లంబర్ కి గాని కాల్ చేద్దామనుకొని, ఒకసారి ప్రయత్నించాగానే లాక్ ఓపెన్ అయ్యింది. ఇది నిజంగా బాబా దయ. ఎందుకంటే ఇక్కడ మాకు సివిల్ ఐడి కాపీ లేకుంటే చాలా ప్రాబ్లం గా ఉంటుంది. అదికాక పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేద్దామన్న కూడా ఎలా చేయాలో తెలియదు. బాబా ఈజ్ గ్రేట్. అయన మాతో ఎప్పుడు తోడుగా ఉన్నారని నిరూపిస్తున్నారు. చాలా చాలా థాంక్స్ బాబా.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo