సాయి వచనం:-
'అందరియెడలా దయగల ఈ ఫకీరు నిన్ను ఎంతో ప్రేమతో కాపాడుతాడు.'

'మనస్సు వివిధ రూపాలు ధరించడం మాని ఒకే రూపం ధరించడం ద్వారా చైతన్యఘనత లేదా బ్రహ్మతథాకారవృత్తి సిద్ధిస్తుంది' - శ్రీబాబూజీ.

డాక్టర్ తల్వైల్కర్



డాక్టర్ తల్వైల్కర్ బాబా భక్తుడు. అతనికి బాబాపట్ల ఎంత భక్తి అంటే డాక్టరై ఉండీ మందుల మీద ఆధారపడక బాబా ఊదీయే అత్యంత శక్తివంతమైన ఔషధమని నమ్మేవాడు. ఒకసారి అతను శిరిడీ వెళ్ళినప్పుడు బాబా అతనిని ఆశీర్వదించి ఊదీ ఇచ్చారు. ఆ ఊదీని అతనెంతో జాగ్రత్తగా భద్రపరచుకున్నాడు. తరువాత అతను ఇండోర్‌లో తన వైద్యవృత్తిని ప్రారంభించాడు. అతను బాబా పూజ చేసిన తరువాతనే తన వద్దకు వచ్చే రోగులను పరీక్షించి చికిత్స చేస్తుండేవాడు. బాబా కృపతో అతి ప్రమాదకర పరిస్థితులలో ఉన్న ఎంతోమంది రోగులకు నయం చేయడం వలన కొద్దికాలంలోనే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. 

ఒకరోజు జబ్బు బాగా ముదిరిపోయిన ఒక రోగిని అతని బంధువులు చివరి ప్రయత్నంగా  వైద్యం కోసం తల్వైల్కర్ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికి ఎంతోమంది వైద్యులు అతనికి చికిత్స చేసి విఫలమయ్యారు. ఆ రోగి జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ బంధువులు డాక్టర్ తల్వైల్కర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రోగిని అతని వద్దకు తీసుకుని వచ్చారు. తల్వైల్కర్ రోగి బంధువులను భయపడవద్దని ఓదార్చి, రోగికి కొన్ని ఔషధాలిచ్చి, “బాబా! మీ దయవల్లే ఇతను రక్షింపబడగలడు. ఇతనికి నయం చేయండి” అని బాబాను ప్రార్థించాడు. తరువాత రోగి బంధువులకు మూడు ఊదీ పొట్లాలిచ్చి, “రోజుకొక పొట్లం చొప్పున ఊదీని నీళ్లలో కలిపి రోగి చేత వరుసగా మూడు రోజులు త్రాగించండి” అని చెప్పాడు. వాళ్ళు తల్వైల్కర్ సూచించిన విధంగా మూడు రోజులు ఊదీనీటిని రోగి చేత త్రాగించారు. ఊదీ మహత్యం వల్ల రోగి స్పృహలోకి వచ్చాడు. అప్పుడు అతని బంధువులు, “రోగి ఆరోగ్యం చాలావరకు మెరుగుపడింది, ఒకసారి ఇంటికి వచ్చి చూసివెళ్లమ”ని తల్వైల్కర్‌కి కబురుపెట్టారు. అతను వాళ్ళింటికి వెళ్లి మరికొన్ని మందులను వాడమని సూచించాడు. ఆ మందులతో రోగి క్రమక్రమంగా కోలుకొని కొద్దిరోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. చివరిసారిగా ఆ వ్యక్తి పరీక్ష చేయించుకోవడానికి వచ్చినప్పుడు డాక్టర్ తల్వైల్కర్, “నీ జబ్బు నయంచేసి నిన్ను రక్షించింది నేను కాదు” అని చెప్పి అతనిని శిరిడీ తీసుకుని వెళ్ళాడు. మసీదులో అడుగుపెడుతూనే అతనికి బాబాను చూపిస్తూ, “మరణం నుండి నిన్ను రక్షించింది ఈయనే” అని చెప్పాడు. అది విన్న ఆ వ్యక్తి పరుగున వెళ్ళి, తనపై అంత అనుగ్రహాన్ని చూపినందుకు బాబా పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

సోర్స్: అంబ్రోసియా ఇన్ శిరిడీ.

11 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Very nice baba leela. Udhi is medicine. My health improved little. With baba blessings my health will cure fully thanks. Baba. I have no father . You are my father

    ReplyDelete
  3. 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
    సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

    ReplyDelete
  4. 🙏🌺🙏
    ఓం సాయిరాం

    ReplyDelete
  5. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  6. మా అనారోగ్యం రూపుమాపి నిర్ములించి ఆయరారోగ్య అష్ట ఐశ్వర్యలు ప్రసాదించి.. సాయి దివ్య మైన మహిమలు విశ్వ వ్యాప్తంగా ప్రచారం చేసుకునే భాగ్యం కలిగించు సాయిదేవా..

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  10. Om sai ram, me daya amma nannala meeda unchi vaallaki ayuru arogyalani ashta aishwarayalani prasadinchandi baba, me daya tho naaku manchi arogyanni prasadinchandi baba pls meere naaku unna oke okka asha tandri.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo