సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 619వ భాగం...



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఎంతో దయ చూపుతున్నారు
  2. ప్రార్థించినంతనే బాబా చూపిన కృప

బాబా ఎంతో దయ చూపుతున్నారు

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటనున్నారు:

సాయిబంధువులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. "సాయీ! నా అనుభవాలు పంచుకుంటానని ఆలస్యం చేసినందుకు క్షమించు. నేను ఇలా వ్రాసి పంపానని మా ఇంట్లో తెలిస్తే, ఇవన్నీ వట్టి మూఢనమ్మకాలు అని నన్ను ఎగతాళి చేస్తారు. కానీ నాకు మీ మీద ఉన్న నమ్మకంతో నేను నా అనుభవాలను పంచుకోవాలని అనుకుంటున్నాను". 

మొదటి అనుభవం: 

ఇటీవల మా చెల్లికి జ్వరం, దగ్గు వచ్చి ఒక వారం అయినా తగ్గలేదు. తనకు కరోనా సోకిందేమోనని భయపడి కోవిడ్ పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. కానీ, తనను పరీక్షించిన డాక్టర్ తనకు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి, ఇన్ఫెక్షన్ తగ్గటానికి మందులు ఇచ్చారు డాక్టర్. మా చెల్లి ఆ మందులు వాడుతూ సాయిసచ్చరిత్ర పారాయణ చేసింది. బాబా దయవలన తను ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. “థాంక్యూ బాబా!”

రెండవ అనుభవం: 

ఈమధ్య మా అక్క కొడుకుకి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వల్ల తను పెద్దగా ఇబ్బందిపడకుండా బాబా దయవలన వారం రోజుల్లో తనకు నెగిటివ్ వస్తే అన్నదానానికి 1,116 రూపాయలు ఇస్తామని బాబాకు మ్రొక్కుకున్నాము. బాబా దయవల్ల తనకు వారంరోజుల్లో నెగిటివ్ వచ్చింది. “థాంక్యూ సో మచ్ బాబా!”

మూడవ అనుభవం: 

మా నాన్నగారు డయాలసిస్ పేషెంట్. డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు నాన్నకి తోడుగా మా అమ్మ కూడా హాస్పిటల్కి వెళ్ళేది. ఇద్దరూ వారానికి రెండు రోజులు డయాలసిస్కి వెళ్ళేవారు. అలా ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళొస్తుండటం వల్ల వాళ్ళకు కరోనా ఎక్కడ వస్తుందోనని మేము భయపడ్డాము. వాళ్ళకు మూడుసార్లు కోవిడ్ పరీక్ష చేశారు. బాబా దయవల్ల ప్రతిసారీ వాళ్ళకు నెగిటివ్ వచ్చింది

కానీ, మా నాన్నగారు ఆగస్టు నెలలో విపరీతమైన కాలినొప్పితో కాలు కదపలేక మంచానికే పరిమితమయ్యారు. మా అమ్మ ఆరోగ్యం కూడా అంత బాగోదు. మా నాన్నగారికి సేవ చెయ్యటానికి అమ్మ చాలా ఇబ్బందిపడింది. నేను బాబాను ప్రార్థించి, “బాబా! అమ్మని కష్టపెట్టకు. నాన్నగారిని నీ సన్నిధానానికి తీసుకెళ్ళిపో!” అని కోరుకున్నాను. అది తప్పని తెలుసు. కానీ, అమ్మ బాధపడటం చూడలేక అలా కోరుకున్నాను. బాబా ఆయనను ఎక్కువ ఇబ్బందిపెట్టకుండా తన సన్నిధానానికి తీసుకువెళ్ళారు. బాబా దయవలన ఇప్పటికైనా మా అమ్మ ఆరోగ్యం బాగుండి ఆవిడ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

ప్రార్థించినంతనే బాబా చూపిన కృప

ఓం గణేశాయ నమః ఓం శ్రీ సాయినాథాయ నమః

సాయిబంధువులందరికీ నా నమస్కారములు. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. బ్లాగులోని తోటి సాయిభక్తుల అనుభవాలు చదవడం వలన మనసుకి ఎంతో ప్రశాంతత, ధైర్యం చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నా పేరు సురేష్. నేను విశాఖపట్నంలో నివసిస్తున్నాను. నేను సాయిబాబా భక్తుడిని. నేను గత 25 సంవత్సరాలుగా బాబా గుడికి వెళుతున్నాను. బాబాను నమ్ముకున్నందుకు బాబా నాకు ఎన్నో నిదర్శనాలను, అనుభవాలను ప్రసాదించారు. వాటిలోనుండి ఇటీవల నాకు కలిగిన ఒక నిదర్శనాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 

2020, అక్టోబరు నెలలో నాకు కోవిడ్-19 వచ్చి బాబా దయవలన తొందరగా కోలుకున్నాను. తరువాత నవంబరు 9వ తేదీ ఉదయం నుండి నా మనసులో ఏదో భయం. జ్వరం వచ్చినట్లు అనుభూతి, శరీరమంతా చెమటలు పట్టడంతో చాలా ఆందోళన చెందాను. ఆ సాయంత్రం నేను బాబా ఫోటో ముందు నిల్చుని బాబాకు నా బాధను చెప్పుకుని, “ఈ బాధనుండి నేను ఉపశమనం పొందితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా పంచుకుంటాన”ని బాబాకు మాట ఇచ్చాను. ఈ విధంగా ప్రార్థించిన క్షణం నుండి నా బాధ క్రమంగా తగ్గుతూ ఆ రాత్రికి పూర్తిగా తగ్గిపోయింది. “బాబా! దయామయా! మీ కృప నా కుటుంబంమీద, అలాగే సాయిభక్తులందరిమీద ఉండాలని కోరుకుంటున్నాను”. జై సాయిరాం!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


11 comments:

  1. Please sai bless us. Give long life to my husband, son, daughter. Please bless. Today baba be with me and my family🙏🙏

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. Baba ma amma ki rogam tagginchu thandri

    ReplyDelete
  4. ఓం గణేశాయ నమః ఓం శ్రీ సాయినాథాయ నమః

    ReplyDelete
  5. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo