సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి భక్తుడు - కవాజీ పాటిల్



అంధేరికి చెందిన కవాజీ పాటిల్ తన తండ్రి జ్ఞాపకార్థం ఒక ఆలయ నిర్మాణం చేయాలనుకున్నాడు. ఆ విషయమై అతడు సాయిబాబాని దర్శించి, ఒక నిర్దిష్ట స్థలం గురించి చెప్పి, అందులో వణిదేవి ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి కోరాడు. బాబా 'వద్ద'ని సమాధానమిచ్చారు. అతడు సమయం చూసుకొని మళ్ళీ అడిగాడు. ఈసారి కూడా బాబా "వద్ద"నే అన్నారు. ఆ తరువాత కూడా అతడు ఆ విషయం గురించి పదేపదే బాబాను అడుగుతూ వేధిస్తుండేవాడు. అప్పుడు బాబా, "నేను వద్దని చెప్పినప్పటికీ నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను వేధిస్తున్నావు. నీకు నచ్చినట్లు చేసుకో, వచ్చే పర్యవసానాలను అనుభవించుకో!" అన్నారు. ఆపై అతడు ఒక కపట వైద్యుని గురువుగా భావించి, అతని సలహాపై ఆలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలు మొదలుపెట్టాడు. తరువాత ఒకసారి కవాజీ పాటిల్ తన మామల్తదారైన బి.వి.దేవ్‌తో కలిసి బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడతను తాను నిర్మిస్తున్న ఆలయంలో తన గురువు ఆదేశానుసారం వణి నుండి కొత్త విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించాలా లేక పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా అని షామా ద్వారా బాబాను అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు బాబాకు షామాకు మధ్య సంభాషణ క్రింది విధంగా జరిగింది.

షామా: బాబా, ఈ కవాజీ పాటిల్ తాను కొత్తగా నిర్మిస్తున్న మందిరంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా లేక పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా అని తెలుసుకోవాలనుకుంటున్నాడు.

బాబా: అతను అనాదిగా తమ పూర్వీకుల కాలం నుండి ఆరాధింపబడుతున్న విగ్రహాలనే ప్రతిష్ఠించుకోవాలి. కొత్తది వద్దు.

షామా: వణి నుండి కొత్తది తెచ్చుకోవడంలో అభ్యంతరం ఏమిటి?

బాబా: మీకు ఇష్టమైన విధంగా వ్యవహరించండి షామా. నేను చెప్పినట్లు పాతది పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు.

షామా: బాబా! దయచేసి వణి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలో, వద్దో ఖచ్చితంగా చెప్పండి.

బాబా: అతను కొత్త విగ్రహమే కావాలని కోరుకున్నట్లైతే, అతను ఆ విగ్రహం యొక్క చేతులు, కాళ్ళు విరగగొట్టిన తరువాత దాన్ని ప్రతిష్ఠించి పూజించుకోవాలి. నన్ను మళ్లీ మళ్లీ ప్రశ్నించవద్దు. ఒకసారి నేను ఒక సహచరుడితో కలిసి ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్ళాను. అతను ఒక ఆవును కొనాలనుకున్నాడు. నేను వద్దని చెప్పాను. కానీ అతను ఆవుని కొని గ్రామానికి తీసుకువచ్చాడు. అక్కడ అంటువ్యాధి చెలరేగి చాలామంది మరణించారు.

అదేరోజు కాసేపటి తరువాత...

షామా: బాబా, కొత్త విగ్రహాన్ని తెస్తే ఏం హాని జరుగుతుంది?

బాబా: అతను పాత వాటినే పూజించుకోవాలి, కొత్తది వద్దు.

షామా: కొత్తది తేవడంలో హాని ఏమిటి?

బాబా (కోపంగా): నేను నోటితో మాట్లాడుతున్నాను తప్ప మరిదేనితోనూ కాదు.

అంతే, అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. కవాజీ పాటిల్‌కు బాబాపై నమ్మకం లేదు. కాబట్టి తన గురువు చెప్పినట్లే చేయడానికి నిశ్చయించుకున్నాడు. 

తరువాత ఒకసారి తన గురువుని కవాజీ తన నివాసానికి తీసుకొచ్చాడు. అప్పుడు ప్లేగు చెలరేగి కొంతమంది చనిపోయారు. అంతేకాదు, అప్పటికే కవాజీ వద్దనుండి మూడు లేదా నాలుగు వందల రూపాయలు తీసుకున్న అతని గురువు, అది చాలదన్నట్లు అతనికున్న భూమిని కూడా తన పేరు మీద రిజిస్టర్ చేసి బహుమతిగా ఇవ్వకపోతే మరణం ప్రాప్తించేలా శపిస్తానని ఒక సందేశం పంపాడు. దాంతో పాటిల్ మేల్కొన్నాడు. ఆ కపట వైద్య గురువుపై విశ్వాసాన్ని కోల్పోయి వణిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న ఆలోచనను విరమించుకున్నాడు. అయితే మొదటినుండి అనాదిగా అర్చింపబడుతున్న కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్తున్న బాబా మాటలలోని ఉద్దేశ్యం అతనికి అర్థంకాక తన స్వంత జ్ఞానంతో వేరొక దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటినుండి అతను అనారోగ్యంతో రెండు సంవత్సరాల పాటు చాలా బాధపడ్డాడు. కేవలం బాబా దయవల్ల మాత్రమే మరణం సంభవించకుండా రక్షింపబడ్డాడు. అలా ఎన్నో బాధలు అనుభవించిన తరువాతే అతను సాయిబాబాపై విశ్వాసం పెంచుకున్నాడు. 

తరువాత అతను సాయిబాబా దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఆయన తమ మునుపటి సలహాను పునరావృతం చేస్తూ, "ఆలయంలో ఉన్న దేవత విగ్రహాన్ని తొలగించి, మీ పూర్వీకుల నుండి ఆరాధింపబడుతున్న కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించు" అని చెప్పారు. ఈసారి అతడు బాబా చెప్పినట్లే చేసినందువల్ల ఇంకే హానీ జరగకుండా రక్షింపబడి మనశ్శాంతిని పొందాడు. ఈ సంఘటన గురించి కవాజీ పాటిల్ మరాఠీలో కీర్తనలు స్వరపరిచాడు. అప్పట్లో అవి సాయిలీల పత్రికలో ప్రచురింపబడ్డాయి.

సమాప్తం...

source: శ్రీసాయిబాబా, రచన: సాయి శరణానంద.
బాబా చార్టర్స్ అండ్ సేయింగ్స్, నం.174 బై బి.వి.నరసింహస్వామి.

6 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌹🙏సాయి లీలామృతం మధురం మధురం 🙏🌹🙏
    🍎🥭🍊🍎🍊🍎🍊🍎🍑🥭🍍🍎🍊🥭🍍🍎🍍🥭🍊🍎

    ReplyDelete
  3. Om sri sai ram om srisairam om srisairam thankyou sister

    ReplyDelete
  4. Enkyvvynaa vunty pettandi plz sai leelalu🙏🙏🙏🙏🙏💐🍇

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo