సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 482వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబాకు తన సమయమంటూ తనకుంటుంది

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నా సాయికుటుంబానికి ఓం సాయిరామ్! బాబాను ప్రేమించండి, ఆయన మనల్ని ప్రేమిస్తారు. నిజంగా బాబా మన సమస్యలను విని పరిష్కరిస్తారు. కొన్నిసార్లు మనం నిర్దిష్టమైన కొన్ని గంటల్లో మన సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటాం, కానీ బాబాకు తన సమయమంటూ తనకుంటుంది. అది రెండు నిమిషాలు కావచ్చు లేదా కొన్ని రోజులు కావచ్చు. అయితే ఆయన ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడటానికి మనకు సహాయం చేస్తారు. బాబా నాకు ప్రసాదించిన అలాంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను.

నాకు 28 సంవత్సరాలు. నేనింకా విద్యార్థిగా ఉన్నాను. నాకు సంపాదన లేదు. నాన్నని డబ్బు అడగడానికి నాకు చాలా సంకోచం. అందువలన సాధారణంగా నేను సెమిస్టర్ చివరిలో మాత్రమే ఆయనను డబ్బులు అడుగుతాను. ఒకవేళ మధ్యలోనే అనుకోని ఖర్చులు వస్తే, సమయానికి ముందే నా దగ్గర డబ్బులు అయిపోతాయి. ఇక నా పరిస్థితి మాటల్లో చెప్పలేను. 

ఒకసారి నా ల్యాప్‌టాప్ పనిచేయడం మానేసింది. ఎందరో భక్తులు తమ అనుభవాల్లో తమ ల్యాప్‌టాప్‌లు మొబైల్‌లు చెడిపోయినప్పుడు బాబాని ప్రార్థించినట్లు నేను కూడా సాయిని "నా ల్యాప్‌టాప్‌ పనిచేసేలా చేయమ"ని ప్రార్థించాను. కానీ వాళ్ళ విషయంలో అవి తిరిగి పనిచేసినట్లు, మూడు రోజులైనా నా విషయంలో జరగలేదు. ఈలోగా గురువారం వచ్చింది. ఆరోజు నేను, "ఈరోజు రిపేర్ చేయించడానికి నా ల్యాప్‌టాప్ షాపుకి తీసుకుని వెళ్ళనా?" అని చీటీల ద్వారా బాబాను అడిగాను. బాబా 'శనివారం వెళ్ళమ'ని సందేశం ఇచ్చారు. దాంతో నేను శనివారంనాడు నా ల్యాప్‌టాప్ తీసుకుని షాపుకి వెళ్లాను. షాపతను 700 రూపాయలు ఖర్చవుతుందని చెప్పి, మరుసటిరోజు రమ్మన్నాడు. ఇంక నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే నా వద్ద 200 రూపాయలు, ఎటిఎమ్‌లో 45 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏమి చేయాలో నాకు తెలియలేదు. షాపు నుండి తిరిగి వస్తున్నప్పుడు, 'బాబా నా ప్రార్థనను ఎందుకు వినట్లేదు? నన్ను ఎందుకు ఇంత కఠినంగా పరీక్షిస్తున్నారు?' అని ఆలోచిస్తూ, "నా సమస్యను పరిష్కరించమ"ని గట్టిగా బాబాను ప్రార్థించాను. బాబా సహాయం చేస్తారని నమ్మకం ఉన్నప్పటికీ నేను చాలా బాధపడ్డాను.

నేను అప్పటికే నా స్నేహితురాలి వద్ద 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను, తిరిగి ఇవ్వలేదు కూడా. హేయమైన నా పరిస్థితి గురించి చెప్పి ఇతర స్నేహితులను డబ్బు అడగటానికి సిగ్గుపడ్డాను. ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. ఏ తెల్లవారుఝామునో నిద్రపట్టి లేచేసరికి 12 గంటలు అయ్యింది. ఎవరిని డబ్బు అడగాలో అర్థంకాక చాలా ఆందోళనపడిన తరువాత ఒక స్నేహితురాలికి ఫోన్ చేశాను. కానీ ఆమె క్యాంపస్‌లో లేదని తెలిసి తనకి ఫోన్ చేసిన కారణాన్ని చెప్పడానికి సాకులు వెతుక్కున్నాను. దిక్కుతోచని స్థితిలో నేను నిస్సహాయంగా, "నాకు ఒక మార్గం చూపించమ"ని బాబా ముందు ఏడ్చాను.

నిరంతరం అదేపనిగా సమస్య గురించి ఆలోచిస్తున్నందువల్ల తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి కూడా వచ్చింది. తరువాత నేను నా స్నేహితురాలి గదికి వెళ్లి అక్కడ కాసేపు పడుకున్నాను. అక్కడ శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి ఉన్న క్యాలెండర్ ఉంది. నేను దాన్ని చూస్తూ ఒక నిమిషంపాటు శాంతిని అనుభవించి, శివుడిని చూస్తూ, "మీరే నా సాయి. సాయిశివా, దయచేసి నాకు ఒక పరిష్కారం చూపించండి. నేను నాన్నని డబ్బు అడగాలని మీరు అనుకుంటే, దయచేసి నా బిడియాన్ని, ఆత్మగౌరవాన్ని, అహాన్ని నాశనం చేసి, నా మనసును మార్చి ఆయనను అడిగేందుకు నాకు శక్తినివ్వండి" అని ప్రార్థించాను. నేను చాలా కృంగిపోయి ఉన్నాను, తలనొప్పి చాలా తీవ్రంగా ఉంది. "దేవుడు నా మాట వింటున్నాడు, నన్ను చూస్తున్నాడు, కానీ నా సమస్యను పరిష్కరించడం లేదెందుకు?" అని అలోచిస్తూ నా మనసు విరిగిపోతోంది.

కొద్దిసేపట్లో హఠాత్తుగా నా స్కూల్ స్నేహితురాలు నన్ను కలిసింది. ఆనందంతో ఆమె 5 నిమిషాలు పాటు నన్ను కౌగిలించుకుంది. దాదాపు నేను ఏడ్చే స్థితిలో ఉన్నాను. కానీ నేను నా కన్నీళ్లను నియంత్రించుకుంటున్నాను. ఆమె నేనుంటున్న గదికి సమీపంలోనే  ఉంటుంది. తరువాత ఆమె నాతో సాయిబాబా, గీత మొదలైనవాటి గురించి మాట్లాడుతోంది. అంతలో తను నా ఫోన్ స్క్రీన్ మీద ఉన్న సాయిని చూసి, నేను కూడా సాయిని నమ్ముతున్నానని గ్రహించి చాలా సంతోషించింది. నేను కూడా చాలా త్వరగా తనతో కనెక్ట్ అయ్యి నా సమస్య గురించి చెప్పాను. ఆమె నాకు వెంటనే 500 రూపాయలు ఇచ్చింది. మేము తన రూమ్మేట్‌తో కలిసి డిన్నర్ చేశాము. నా రూమ్మేట్ లేనందువలన తను ఆ రాత్రి నా గదిలో పడుకుంది. నా కుటుంబసభ్యులను కలిసినంత అనుభూతి కలిగి, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. తరువాత నేను నొప్పి నివారణ మందులు వేసుకొని ఈ అనుభవం గురించి వ్రాయడం ప్రారంభించాను. అప్పుడు నా సాయి శనివారానికి ముందు ల్యాప్‌టాప్ రిపేరుకి ఇవ్వడానికి ఎందుకు అనుమతించలేదో అర్థమైంది. ఎందుకంటే, నా స్నేహితురాలు ఆదివారం వస్తుందని ఆయనకు తెలుసు. ఐదురోజులు చాలా ఇబ్బందిపడ్డ తరువాత నేను ఆ టెన్షన్ నుండి బయటపడ్డాను. అయితే ఆ సమయంలో నా చదువుకు ఇబ్బంది కలుగకుండా నా స్నేహితుల ల్యాప్‌టాప్‌ ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశారు బాబా. అది నా సాయి గొప్ప ఆశీర్వాదం. ఆయన చాలా గ్రేట్. ఆయన ప్రేమ నిజంగా వందమంది తల్లుల ప్రేమకు సమానం. "నా సాయిశివా, మీకు చాలా ధన్యవాదాలు. లవ్ యు సాయి". బాబా మన మాటలు వింటారు. ఆయనపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి.

source:http://www.shirdisaibabaexperiences.org/2020/03/shirdi-sai-baba-miracles-part-2680.html


4 comments:

  1. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    ఓం సాయిరాం!!
    సమస్య చిన్నదే అయినా.. మానసిక ఆందోళన,వేదన వర్ణనాతీతం.సాయి బంధువులు అందరిని సమస్యల నుంచి విముక్తి చేయమని.వారికి గురు కృప కటాక్షం ఎల్లవేళలా ఉండాలని మనసారా ప్రార్థన.
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై🙏🌹🙏

    ReplyDelete
  2. 🙏🌹🙏 Om Sai Ram 🙏🌹🙏
    🙏🌹🙏ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏🌹🙏
    🙏🌹🙏ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏🌹🙏
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo