సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 469వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. "బాబానే నాతో మాట్లాడుతున్నారా!"
  2. బిడ్డ దిగులుపడుతుందని ఓదార్పునిచ్చిన బాబా
  3. బాబాని తలచుకున్నంతనే దొరికిన తాళాలు

సాయిభక్తురాలు శ్రీమతి శ్రావణి తనకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

"బాబానే నాతో మాట్లాడుతున్నారా!"

మే 14, గురువారంనాడు నేను బాబాకి అభిషేకం చేసి ఆ అభిషేకతీర్థం మా బాబుకి ఇష్టమని, వాడు త్రాగుతాడని భద్రంగా కప్‌బోర్డులో దాచిపెట్టాను. ఆరోజు మధ్యాహ్నం నుండి నాకెందుకో ఒకటే చిరాకుగా, కోపంగా, అసహనంగా ఉంది. రాత్రి వరకూ అలానే ఉంది. ప్రతిరోజూ రాత్రి సాయి టీవీలో శేజారతి ప్రత్యక్ష ప్రసారాన్ని మా ఇంట్లో అందరం చూస్తాము. ఆ అలవాటు ప్రకారం ఆరోజు నేను శేజారతి చూస్తున్నాను. హఠాత్తుగా బాబా ప్రేరణో ఏమోగానీ ఉన్నట్టుండి నా మనసుకు "బాబా అభిషేకతీర్థం ఉంది కదా, దాన్ని తలపై చల్లుకుంటే మనసులో ఉండే చికాకులన్నీ పోతాయి" అనిపించి కప్‌బోర్డు వైపుకి వెళ్తున్నాను. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు అవుతోంది. శిరిడీలో బాబా చుట్టూ దోమతెర దించేసి ప్రత్యక్ష ప్రసారం ఆఫ్ చేశారు. టీవీలో వేరే ప్రోగ్రాం మొదలవుతోంది. నేను ఆ ప్రోగ్రాం ఏమిటో కూడా సరిగా గమనించలేదు. కానీ టీవీలో, “అప్పట్లో శిరిడీలో ఉన్న భక్తులు బాబాపై ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా బాబా పాదతీర్థాన్ని తలపై చల్లుకునేవారేగానీ త్రాగేవారు కాదు” అని చెబుతున్నారు. అది విన్న వెంటనే ఆశ్చర్యంతో కప్‌బోర్డు వైపు వెళ్తున్నదాన్ని కాస్తా వెనక్కి తిరిగి టీవీ దగ్గరకి వెళ్ళాను. “బాబాకి మనలో ఉండే అహం అంతా పోయి మనం పరిపూర్ణ శరణాగతి చెందడమే కావాలి. మన కోపాన్ని ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టాలి” అని చెప్పారు. ఒక్కక్షణం "బాబానే నాతో మాట్లాడుతున్నారా?" అని అనిపించింది. ఎంత ఆశ్చర్యం! నాలో ఉన్న చిరాకుకి, కోపానికి, అప్పుడే బాబా అభిషేకతీర్థాన్ని తలపై చల్లుకోవాలన్న తలంపుకి సరిగ్గా సరిపోలే విషయాలు బాబా టీవీ ద్వారా చెప్పించారు. వెంటనే వెళ్లి బాబా అభిషేకతీర్థం త్రాగి, కొద్దిగా తలపై చల్లుకున్నాను. ఎంత అద్భుతమో! మధ్యాహ్నం నుండి వేధిస్తున్న చిరాకు, కోపం, అసహనం క్షణాల్లో మాయమైపోయాయి. మనస్సు ఎంతో తేలికపడగా సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

బిడ్డ దిగులుపడుతుందని ఓదార్పునిచ్చిన బాబా

రెండురోజుల తరువాత, అంటే 2020, మే 16వ తేదీన నేను ఏవో ఆలోచనలతో కాస్త  దిగులుగా ఉన్నాను. హఠాత్తుగా నా వాట్సాప్‌లో “బాబా bless you 🙌”, “కారణాలు అడగకండి. ఆశీస్సులేగా తీసుకోండి” అని రెండు మెసేజ్‌లు వచ్చాయి. అవి చూసి ఆశ్చర్యపోయాను. కారణం, ఆ మెసేజ్ పెట్టిన అన్నయ్యకి నేను దిగులుపడుతున్న సంగతి తెలిసే అవకాశమే లేదు. నిజానికి తను కొద్దికాలంగా నాతో మాట్లాడలేదు. అందువలన క్షణంపాటు నాకు ఏమీ అర్థం కాలేదు. తరువాత నా దిగులు తెలిసిన బాబానే తమ ఆశీస్సులు అలా అందించారని చాలా సంతోషించాను. తరువాత అన్నయ్యతో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు, "అన్నా! అకస్మాత్తుగా ఆ మెసేజ్ పెట్టారేమిటి?" అని అడిగితే, అందుకు తను, "ఏమో! ఆ సమయంలో ఆ మెసేజ్ పెట్టాలని నా మనసుకి చాలా బలంగా అనిపించింది" అన్నారు. అంటే, బాబానే తనకి ఆ ప్రేరణనిచ్చారని అర్థమైంది. బాబా మనల్ని ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో కదా! బిడ్డ దిగులుపడుతోందని ప్రేమతో ఓదార్పునిచ్చారు. "థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా!"

బాబాని తలచుకున్నంతనే దొరికిన తాళాలు

2019, నవంబర్ 17, ఆదివారంనాడు నేను, మావారు, మా బాబు షాపింగ్ మాల్‌కి వెళ్ళాము. షాపింగ్ పూర్తైన తరువాత మా బాబు అక్కడే కొంతసేపు ఆడుకున్నాడు. తరువాత ఇంటికి వెళదామని మేము మా బండి పార్క్ చేసిన ప్రదేశానికి వచ్చాము. తీరా చూస్తే బండి తాళాలు కనిపించలేదు. మావారు తన జేబులన్నీ వెతికినప్పటికీ తాళాలు కనపడలేదు. దాంతో మావారు అప్పుడే షాపింగ్ చేసిన బట్టలన్నీ విదిలించి మరీ చూశారు. అయినా తాళాలు దొరకలేదు. తరువాత మమ్మల్ని అక్కడే ఉండమని చెప్పి మావారు మాల్‌లో మేము షాపింగ్ చేసిన 4వ అంతస్తుకి వెళ్లి వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయేసరికి నాకు ఫోన్ చేసి, "ఇక్కడ కూడా తాళాలు దొరకలేదు" అని చెప్పారు. దాంతో నేను 'తను ఇంటికి వెళ్లి డూప్లికేట్ తాళాలు తీసుకొచ్చేవరకు బండి ఇక్కడే ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఇంత రాత్రివేళ బాబుని తీసుకొని ఆటోలో వెళ్ళాలి' అని ఆందోళన చెందుతూ, "బాబా! ఇప్పటికే చాలా రాత్రి అయింది. బాబుతో ఒంటరిగా నేను వెళ్ళలేను. తాళాలు దొరికితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. అంతేకాదు, ఇప్పటివరకు వ్రాయకుండా ఆలస్యం చేసిన అనుభవాలను కూడా రాస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబాతో చెప్పుకుంటూనే కవరులో ఉన్న జీన్స్ ప్యాంట్ ఒకటి బయటకి తీశాను. ఆశ్చర్యం! ఒక మడత తెరిచానో లేదో, ఎవరో పెట్టినట్టు తాళాలు అక్కడ ఉన్నాయి. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే, అంతకుముందు వెతికినప్పుడు మావారు మడతలన్నీ విప్పి చూడటమే కాదు, విదిలించారు కూడా. అయినా అవి కనిపించలేదు. అంతలో మావారు వచ్చారు. బాబా చేసిన అద్భుతంతో అప్పటిదాకా ఎంతో అలసిపోయి ఉన్న మాకు ఒక్కసారిగా కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది. మనసారా బాబాకి కృతజ్ఞతలు తెలుపుకొని ఇంటికి వచ్చేశాము.


9 comments:

  1. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏

    వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా
    మా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
    కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి
    మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం

    శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!🙏🌹🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ....

    ReplyDelete
  3. వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా

    ReplyDelete
  4. sai ram
    emi adagli sai
    help me sai
    please cure my son helath
    memu undikuda anadhala elaundo teleyadam ledu
    help him sairam

    ReplyDelete
  5. OM sairam baba,nenu gatam lo gnapakalu marchipoyelaga chesi dairyangaa naa lakshyanni saadinchettu chudandi baba,om sainatha jai,guru bharadwaja jai

    ReplyDelete
  6. Nammakam tho mi bharalanu baba medha veyandi.antha manche jarugutundi

    ReplyDelete
  7. Baba! Enduku naku ila chestunav nenu em chesanu enduku nenu adigina Job ivvavuu ,andaru cheta matalu padela chestunav

    ReplyDelete
  8. Om sai ram 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo