ఈ భాగంలో అనుభవాలు:
- బాబా కృపతో పొడిగింపబడిన వీసా గడువు
- నాకొచ్చిన సమస్యను పరిష్కరించిన సాయిబాబా
బాబా కృపతో పొడిగింపబడిన వీసా గడువు
ఓం గణేశాయ నమః! ఓం సాయిరాం!
ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తూ బాబాపై మాకున్న ప్రేమను ఇంకా ఇంకా రెట్టింపు చేస్తున్న సాయికి నా వందనం. నా పేరు సౌజన్య. బాబా అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నతనంనుండి నేను బాబా గుడికి వెళ్తుండేదాన్ని. బాబాని నా స్నేహితునిగా భావించి 'ఫ్రెండ్' అని పిలిచేదాన్ని. నాకు వచ్చిన ప్రతి కష్టం నుండి నా బాబా నన్ను కాపాడారు. నాకు బాబా చాలా అనుభవాలను ప్రసాదించారు. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరి డెలివరీ సమయంలో నేను చాలా ఇబ్బందిపడ్డాను. కానీ బాబా ఊదీ పెట్టిన కొద్దిసేపటిలోనే ఎటువంటి బాధా లేకుండా నాకు నార్మల్ డెలివరీ అయింది. నిజంగా ఇది బాబాకు నాపై ఉన్న ప్రేమ. నా బాబా తండ్రి దయవలన నేను నా భర్త, పిల్లలతో అమెరికాలో నివాసముంటున్నాను. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.
అమెరికాలో నివాసం ఉండటానికి అనుమతినిచ్చే మా వీసా గడువు ఈ మధ్యనే పూర్తయింది. గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకుంటే, అది క్వరీలో పడింది. దాంతో నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, వీసా గడువు పూర్తయిపోతే మేము ఇండియాకి వెళ్లిపోవాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పిల్లలని తీసుకొని ఇండియా వెళ్ళడమంటే చాలా ఆందోళనగా అనిపించింది. ఈ సంగతి ఇలా ఉంచితే, మాకు వచ్చిన క్వరీకి సంబంధించి కంపెనీవాళ్ళని డాక్యుమెంట్స్ పంపమంటే, వాళ్ళు అంతకుముందు పంపిన డాక్యుమెంట్సే మళ్ళీ పంపారు. దాంతో ఈసారి కూడా మా వీసా గడువు పెరుగుతుందన్న ఆశ లేకపోయింది. వెంటనే నా బాబాని మనస్ఫూర్తిగా ప్రార్థించి, 'సాయి దివ్యపూజ' ప్రారంభించాను. పూజ చేస్తున్న ఆ 5 వారాలలోపు గాని, తరువాత గాని వీసాకి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. కానీ నా బాబాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. బాబా తన బిడ్డలను ఎన్నడూ బాధపెట్టరని, ఆయన కృపతో తప్పకుండా వీసా వస్తుందని నేను విశ్వసించాను. నేను అనుకున్నట్టుగానే మా వీసా గడువు పొడిగింపబడింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుని, 'అన్నదానం చేయిస్తానని, బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన'ని బాబాకి చెప్పుకున్నాను. కానీ ఆలస్యం చేశాను. "నన్ను క్షమించండి బాబా! నాకు, నా కుటుంబానికి ఎల్లప్పుడూ రక్షణనివ్వండి. అందరినీ చల్లగా చూడండి. నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే నాన్నా(బాబా). ఈ కరోనా బారినుండి అందరినీ రక్షించండి, ప్లీజ్ ప్లీజ్...". మరలా ఇంకొక అనుభవంతో మీ ముందుకు వస్తాను. చాలా ఓపికగా చదివిన బాబా బిడ్డలందరికీ నా కృతజ్ఞతలు.
ఓం సాయిరాం!

నాకొచ్చిన సమస్యను పరిష్కరించిన సాయిబాబా
పేరు వెల్లడించని ఒక సాయి భక్తుడు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
సాటి సాయిబంధువులకు మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను సాయి భక్తుడిని. నేను గత 20 సంవత్సరాలనుండి ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్తున్నాను. ఎప్పుడైనా వెళ్లలేని పరిస్థితి వస్తే తప్ప బాబా గుడికి వెళ్ళటం మానేవాడిని కాదు. నాకు వచ్చిన సమస్యను సాయిబాబా ఏవిధంగా పరిష్కరించారో నేనిప్పుడు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నేను వేరేవాళ్ళకు సంబంధించిన ఒక ప్రవేట్ సంస్థను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. అయితే మేము అద్దెకు తీసుకోకముందు నుండే ఆ సంస్థకు వున్న కొన్ని సమస్యల వలన ఇప్పుడు ఆ సంస్థ మనుగడే ప్రశ్నార్ధకంగా మారిపోయింది. అంతేకాదు, ఆ సంస్థకు ప్రభుత్వం నుండి రావలసిన కొన్ని లక్షల డబ్బు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనివలన నేను వ్యాపారపరంగానూ, ఆర్థికంగానూ రెండు విధాలుగా కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి స్థితిలో నేను, "ఈ సమస్య నుండి నన్ను రక్షించమ"ని ప్రతిరోజూ సాయిబాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. మానవప్రయత్నంగా నాకు తెలిసిన రాజకీయ నాయకులను, అందుకు సంబంధించిన అధికారులను కలిశాను. చివరికి సంస్థకి ఎటువంటి సమస్యా లేదు కానీ, నాకు రావాల్సిన డబ్బులు మాత్రం వచ్చే మార్గం కనపడలేదు. అప్పుడు నేను, “బాబా! డబ్బు విషయంలో నేను ఎవరివద్దకూ వెళ్ళను, ఎటువంటి ప్రయత్నాలూ చేయను, మిమ్మల్నే నమ్ముకొని వుంటాను. నాకు రావలసిన డబ్బులు వస్తే నేను ‘నవ గురువారం వ్రతం’ చేస్తాను. అంతేకాదు, నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను మనసారా వేడుకున్నాను. ఆపైన బాబాకు మాట ఇచ్చినట్లుగానే డబ్బుల కోసం ఎటువంటి ప్రయత్నాలూ చేయకుండా బాబా మహిమ కోసం ఎదురుచూడసాగాను. ఇక రావేమో అనుకున్న డబ్బులు బాబా అనుగ్రహంతో కొద్దిరోజుల్లోనే నా చేతికి వచ్చాయి. ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాను నమ్ముకొని, ఆయన నీడలో జీవితాంతం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏
ReplyDeleteవినయముగ మీకు పాద వందనము సల్పి
చేయనున్నాడ స్తోత్రంబు చిస్త్వరూప
తరచు మీ నామస్మరణంబు గరపు, నాదు
కోర్కె లీడేరకుండునా గురువరేణ్య
జయము దిగ్విజయము జయ సాయినాథ
🍎💐🍎🌺🍎🌸🍎🌷🍎💐🍎🌺🍎🏵️🍎
ఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sairam
ReplyDeletecure my son health
always be with him
Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
ReplyDeleteBhāvyā srēē
Om Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDelete