1. సమస్యలేవైనా బాబా కృపతో సమసిపోతాయి
2. సాయికి శరణాగతి - చేకూరిన ఆరోగ్యం
3. బాబా కృపతో ఆధార్‌లో పేరు మార్పు
సమస్యలేవైనా బాబా కృపతో సమసిపోతాయి
అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. నేను ఇంతకుముందు ఎన్నో అనుభవాలు పంచుకున్నాను. ఇకముందు కూడా ఇలాగే ఎన్నో అనుభవాలు పంచుకోవాలనీ, సాయిబాబా కృప ఎప్పటికీ నా మీద ఉండాలనీ కోరుకుంటున్నాను. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...
ఒకరోజు నేను, మావారు మా నాలుగు నెలల చిన్నబాబుని తీసుకుని కారులో మా ఊరు వెళ్లాల్సి వచ్చింది. కారు కండిషన్ సరిగా లేదని తెలిసినా కూడా తప్పనిసరై బయలుదేరాము. కొంతదూరం వెళ్ళాక 'కారు టైర్లు వేడెక్కిపోతున్నాయి' అన్నారు. అయితే అప్పటికే మేము సగం దూరం ప్రయాణం చేశాము. నేను అలాగే కూర్చుని సాయి స్మరణ చేస్తూ, "బాబా! ప్రయాణం సాఫీగా సాగి, మేము ఇంటికి క్షేమంగా చేరుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. దయగల సాయి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు. "సదా మీ అనుగ్రహం నా మీద ఇలానే ఉండనీయండి బాబా".
మరో అనుభవం: ఇటీవల మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లమ్ ఉందని మాకు తెలిసింది. కార్డియాలజిస్ట్, "ఒక నెలరోజులు మందులు వాడండి, తరువాత యాంజియోగ్రాం చేద్దాం" అన్నారు. నెలరోజులు మందులు వాడాక మేము బాబా మీద భారం వేసి యాంజియోగ్రాం చేయించాం. అయితే యాంజియోగ్రాం చేశాక, అమ్మకి 3 వాల్వులు బ్లాక్ అయ్యాయని డాక్టర్ చెప్పారు. మేము చాలా భయపడి, "ఇదేంటి బాబా, మందులతో తగ్గిపోతుంది అనుకుంటే, ఇలా చేశారేంటి?" అని అనుకున్నాను. తరువాత డాక్టరు పరిస్థితి గురించి మాకు వివరించి, "మూడు స్టెంట్లు వేయాలి. వయస్సు ఎక్కువ కాబట్టి రిస్క్ ఉంటుంది" అని అన్నారు. అది విని మేమంతా చాలా భయపడ్డాము. నేను, "బాబా! అమ్మకి తగ్గితే సాయి దివ్యపూజ చేస్తాన"ని మ్రొక్కుకుని భారం బాబా మీద వేశాను. తరువాత అమ్మ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకి వచ్చేవరకు 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాను. ఆపరేషన్ జరిగే సమయంలో అప్పటివరకు అమ్మకి చికిత్స చేసున్న డాక్టరుతోపాటు అకస్మాత్తుగా వచ్చిన ఒక సీనియర్ డాక్టరు కూడా ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్లారట. ఆ డాక్టరుని మా అమ్మకోసమే బాబా పంపారని నా ఖచ్చితమైన నమ్మకం. అంత బలంగా ఎందుకు చెప్తున్నానంటే, ఆ హాస్పిటల్లో ఇద్దరు కార్డియాలజిస్ట్ డాక్టర్లు కలిసి స్టెంట్లు వేయటం అదే మొదటిసారని తర్వాత మాకు తెలిసింది. ఇంకో అద్భుతం ఏమిటంటే, ఆపరేషన్ థియేటర్ నుండి బయటకి వచ్చిన డాక్టరు, "మూడు స్టెంట్లు అవసరం లేదు. అందువలన ఒకటే వేశాము. మిగతా 2 వాల్వులకి రక్తసరఫరా బాగానే జరుగుతోంది. కాబట్టి స్టెంట్ అవసరం లేదు" అన్నారు. ఇదంతా బాబా దయవల్లే జరిగిందని నేను నమ్మకంగా చెప్పగలను. "ధన్యవాదాలు బాబా. అమ్మకి ఇంకా చిన్నచిన్న ఆరోగ్యసమస్యలున్నాయి. అవి కూడా మీ దయతో పూర్తిగా తగ్గిపోవాలి బాబా. మీ మీదే భారం వేశాను తండ్రీ".
సాయికి శరణాగతి - చేకూరిన ఆరోగ్యం
నా పేరు వెంకట్రావు. 2021, జూన్ నెలలో నేను కోవిడ్ రాకుండా ఉండేందుకు మూలికలతో చేసిన మాత్రలు వేసుకున్నాను. మొదట అంతా బాగానే ఉంది. కానీ రెండోరోజు నుంచి విపరీతమైన నడుంనొప్పి మొదలైంది. ఆ నొప్పి దేనివల్లనో తెలియలేదు. పడుకుని ప్రక్కకు తిరగాలంటే భరించరానంత నొప్పిగా ఉండేది. రెండు, మూడు రోజులైనా నొప్పి తగ్గటం లేదు. అది తప్పించి ఇంకే సమస్యలూ లేవు. అయితే నాకు ప్రొస్టేటు ఎన్లార్జ్‌మెంట్ సమస్య ఉంది. దానికి మందులు ఎప్పటిలానే వాడుతున్నాను. దానికి సంబంధించిన లక్షణాలేమీ లేవు. పోనీ, ప్రొస్టేటు విపరీతంగా పెరిగిపోయి నడుంనొప్పి వస్తోందా అంటే, గత నాలుగేళ్ళుగా ఎప్పుడూ ఇలా కాలేదు. పైగా, ఈ ఏప్రిల్ నెలలోనే చెకప్ చేయించినప్పుడు అప్పుడేమీ ప్రాబ్లం లేదన్నారు. రెండు నెలల్లోనే ఇంత మార్పా? అంత మార్పు రావటానికి నా జీవనవిధానంలో గానీ, ఆహారపు అలవాట్లలో గానీ, పని విషయంలో గానీ ఎటువంటి తేడా లేదు. వేసవిలో మామిడిపళ్ళు ప్రతి సంవత్సరంలో లాగానే తిన్నాం. మరి నొప్పి దేనివల్ల వస్తోంది? అంతా అయోమయం, అగమ్యగోచరం. ఇక ఆ పరిస్థితుల్లో హాస్పిటల్‌కి వెళ్ళామా.. ఇంతే సంగతులు. ఏవేవో పరీక్షలు చేసి, ఉన్నవీ లేనివీ అన్నీ కల్పించి, అవసరమైనవి, లేనివీ కూడా మందులు రాసి అసలు సమస్యని మర్చిపోయేంతగా క్రొత్త సమస్యలు సృష్టిస్తారు. అందుకని మానవ ప్రయత్నంతో సమస్య కొలిక్కి రాదని, ఆ దేవదేవుడైన సాయినాథుడే శరణ్యం అనిపించి బాబా ముందు మ్రోకరిల్లి "నా పాపకర్మల ఫలితాన్ని అనుభవించటానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రీ. ఆ బాధని ఓర్చుకునే శక్తిని, ధైర్యాన్ని నాకివ్వు నాయనా. ఎన్నాళ్ళు ఎంత తీవ్రతతో దీన్ని భరించాలో, దాని పర్యవసానం ఏమిటో నీకే తెలుసు. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం" అని శరణాగతి చేసుకున్నాను. తరువాత ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి, కొంత ఊదీని నొప్పి ఉన్న చోట రాశాను. అప్పట్నుంచి సాయి మీదున్న నమ్మకం బలపడింది. ఆయన కాపాడడు అనే అపనమ్మకం కలలో కూడా లేదు. అయినా నా బ్రతుకే ఆయన పెట్టిన భిక్ష. కాబట్టి మన భవిష్యత్తుకి తగ్గట్టుగా మనల్ని సన్నద్ధం చేయటానికి ఇలాంటి బాధలు కల్పించి వాటి ద్వారా మనలో ఉన్న బలహీనతల్ని బాబా దూరం చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. ఆ స్థితిలో నాకొకటి అనిపించి, "నా మనసులో మెదిలిన ఒక అలవాటుని మానుకుంటాను సాయీ" అని అనుకున్నాను. ఆ సంకల్పం చేసిందే తడవుగా నొప్పి తగ్గటం మొదలైంది. ఒక వారంరోజుల్లో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా కేవలం సాయిబాబా మహిమే. ఆయనికెన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా సరిపోదు. "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! సాయినాథా! నీకివే మా శతకోటి ప్రణామాలు".
బాబా కృపతో ఆధార్‌లో పేరు మార్పు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా శుభాకాంక్షలు. నేను సాయిభక్తురాలిని. ఇదివరకే మా అబ్బాయికి ఆధార్ కార్డు ఉంది. అయితే ఇటీవల అందులో మా అబ్బాయి పేరు మార్పు చేయాల్సి వచ్చింది. ఆ పనిమీద ఆధార్ సెంటరుకి వెళ్తే, "డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో ఉన్నట్టు చేస్తాం కానీ, వేరేవిధంగా అంటే కుదరదు" అన్నారు. అప్పుడు నేను, "బాబా! ఆధార్‌లో పేరు మార్పు చేయడం జరిగితే ఈ అనుభవాన్ని 'సాయిభక్తుల అనుభవమాలిక'లో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. అంతే! బాబా అద్భుతం మొదలైంది. ఆధార్ సెంటరులో ఉన్న అతను కొన్ని ఫార్మ్స్ ఇచ్చి, వాటిమీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకుని రమ్మన్నారు. మేము అలాగే చేశాము. బాబా దయవలన ఒక్కరోజులో పేరు మార్పు చేయడం జరిగింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని అడిగితే ఏదీ కాదనరు. మీ పాదాలకు నా నమస్కారాలు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼❤
ReplyDeleteOm sairam
ReplyDeleteSai Always be with me
827 days
ReplyDeleteSairam
Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDelete