సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 865వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలను పరిష్కరించే సచ్చరిత్ర పారాయణ
2. అవసరానికి ఇంజెక్షన్లు అందేలా చేసి ఆదుకున్న బాబా
3. స్వచ్ఛమైన మనసుతో అడిగితే బాబా ఎన్నడూ లేదనరు
4. సాయి కృప

నా పేరు చైతన్య. నేను గుంటూరు నివాసిని. ముందుగా, భగవత్ బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. ఈ బ్లాగు వలన మనం సాయి సాంగత్యంలో ఉంటున్నాం. ఆవిధంగా బ్లాగు మనల్ని సాయినాథునికి దగ్గర చేస్తుంది. నేను ఇదివరకు రెండు అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 


మొదటి అనుభవం:- సమస్యలను పరిష్కరించే సచ్చరిత్ర పారాయణ


2021, జులై నెల ఆరంభంలో మా చిన్నబాబుకి చాలా తీవ్రంగా జ్వరం వచ్చింది. టెంపరేచర్ 102 డిగ్రీల నుండి 103 డిగ్రీల వరకు ఉండేది. అసలే కరోనా కాలం, ఏం చేయాలో అర్థంకాక మాకు చాలా భయమేసింది. అయినా ధైర్యం చేసి, వెంటనే బాబుని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. ముందు బాబుకు కోవిడ్ టెస్ట్ చేశారు. బాబా దయవల్ల నెగిటివ్ వచ్చింది. కానీ బ్లడ్ టెస్ట్ చేసి, బాబుకి wbc(వైట్ బ్లడ్ సెల్) కౌంట్ మరియు ప్లేట్లెట్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మందులిచ్చారు. కానీ జ్వరం తగ్గలేదు. దాంతో మరుసటిరోజు మళ్లీ బాబుని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. డాక్టరు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించి, "wbc కౌంట్ మరియు ప్లేట్లెట్ కౌంట్ ఇంకా తగ్గిపోతున్నాయి. బాబుని హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది" అని చెప్పారు. మాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "బాబా! బాబుకి జ్వరం తగ్గేలా చూడండి. నేను శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేస్తాను. అలాగే, జ్వరం తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకుని, శ్రీసాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ మొదలుపెట్టాను. రెండవరోజు నుండి జ్వరం 102 - 103 డిగ్రీల నుండి 99 - 100 డిగ్రీలకి తగ్గుతూ వచ్చింది. ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరిగింది. డాక్టర్ వద్దకి వెళితే, "జ్వర తీవ్రత తగ్గుతోంది, ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతోంది. కాబట్టి బాబుని హాస్పిటల్లో చేర్చాల్సిన అవసరం లేదు" అన్నారు. మరో రెండురోజులకి బాబు టెంపరేచర్ నార్మల్‌కి వచ్చింది. బాబా దయవల్ల బాబు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మనకు ఏ కష్టం వచ్చినా బాబాకు చెప్పుకుంటే, ఆయన మన కష్టాలన్నీ తీరుస్తారు, మన వెంట ఉండి ధైర్యాన్ని ఇస్తారు. 'సాయీ' అని ఒక్కసారి పిలిస్తే చాలు, 'ఓయీ' అని పరిగెత్తుకుని వచ్చి మనల్ని కష్టం నుండి గట్టెక్కిస్తారు బాబా. శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. మనకు ఏ సమస్య ఉన్నా బాబా దగ్గర చెప్పుకుని పారాయణ చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇలాగే అందరినీ రక్షిస్తూ మనకి మంచి మంచి అనుభవాలను ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీసాయినాథునికి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని రక్షించమని వేడుకుంటూ సాయికి ప్రణామాలు సమర్పిస్తున్నాను.


రెండవ అనుభవం - అవసరానికి ఇంజెక్షన్లు అందేలా చేసి ఆదుకున్న బాబా


మా నాన్నగారికి కోవిడ్ వచ్చి బాబా దయవల్ల తగ్గింది. అయితే, తరువాత నెలరోజులకి నాన్నకి బ్లాక్ ఫంగస్ వచ్చింది. గుంటూరు హాస్పిటల్‌కి తీసుకొని వెళితే, వాళ్ళు సర్జరీ చేశారు. కానీ, “సర్జరీ తరువాత ఇవ్వాల్సిన ఇంజెక్షన్లు మా దగ్గర లేవు, మీరు తెస్తే వేస్తాం” అని చెప్పి నాన్నని డిశ్చార్జ్ చేశారు. మాకు చాలా భయమేసింది. ఎందుకంటే, బ్లాక్ ఫంగస్ కేసులు ఆ సమయంలో ఎక్కువగా వస్తున్నాయి. అందుచేత ఇంజెక్షన్లు దొరకడం చాలా కష్టంగా వుంది. ఎంత ధర అయినా సరే కొందామంటే, ఎక్కడా దొరకడం లేదు. ఆ ఇంజెక్షన్లను గవర్నమెంట్ సరఫరా చేస్తోంది. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్లే ఇస్తున్నారు. కానీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పటికే చాలామంది బ్లాక్ ఫంగస్ రోగులున్నారు. వాళ్ళకే గవర్నమెంట్ సరఫరా చేసే ఇంజెక్షన్లు సరిపోవడం లేదన్నారు. ఇటువంటి స్థితిలో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మేము, "బాబా! ఇప్పుడు ఏమి చేయాలో మాకేమీ అర్థం కావడం లేదు. నాన్నను మీరే కాపాడాలి బాబా" అని బాబాను ప్రార్థించసాగాము. అలా బాబాను వేడుకుంటూ ఆయనే ఏదో ఒక విధంగా మాకు సహాయం చేస్తారని అనుకుంటూ ఉండగా కర్నూల్ నుండి మా వదిన ఫోన్ చేసింది. మేము తనకి పరిస్థితి ఇలా ఉందని చెప్పాము. అప్పుడు ఆమె, "మీరు భయపడకండి. కర్నూల్ హాస్పిటల్లో నాకు తెలిసినవాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ ఇంజెక్షన్ వేస్తారేమో కనుక్కుని చెప్తాను" అని చెప్పింది. బాబా దయవల్ల అక్కడ హాస్పిటల్ వాళ్ళు, "ఇంజెక్షన్లు వేస్తున్నాము. అవసరమున్నవారిని హాస్పిటల్లో జాయిన్ చేయమ"ని చెప్పారు. వెంటనే మేము నాన్నను తీసుకొని కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాం. బాబా దయవల్ల వాళ్ళు నాన్నని అడ్మిట్ చేసుకొని ఎన్ని ఇంజెక్షన్లు అవసరమో అన్ని ఇంజెక్షన్లూ ఇచ్చారు. సమయానికి ఇంజెక్షన్లు వేయడం వలన బ్లాక్ ఫంగస్ విస్తరించలేదు. నిజానికి బ్లాక్ ఫంగస్ చాలా త్వరగా విస్తరిస్తుందట. కళ్ళకి, బ్రెయిన్‌కి విస్తరించినట్లైతే ఆ భాగాలు తీసి సర్జరీ చేయాల్సి ఉంటుందట. పైగా మా నాన్నకి షుగర్ కూడా ఉంది. షుగర్ వల్ల అది ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందట. కానీ బాబా దయవలన నాన్న కళ్ళకు, బ్రెయిన్‍కి ఫంగస్ విస్తరించకుండా కేవలం ముక్కువరకు మాత్రమే ఇన్ఫెక్ట్ అయింది. అంతవరకు సర్జరీ చేసి తీసివేశారు. బాబా కృపతో ఇప్పుడు నాన్నకి తగ్గిపోయి నార్మల్ అయింది. మందులు వాడుతున్నారు. ఈవిధంగా మా కుటుంబానికి రక్షణనిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్న బాబాకి శతసహస్ర ప్రణామాలు.


స్వచ్ఛమైన మనసుతో అడిగితే బాబా ఎన్నడూ లేదనరు


మన ఈ సాయి బ్లాగును నిర్వహిస్తున్నవారికి, బ్లాగులోని సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేనొక సాయిభక్తుడిని. ఎంతోకాలంగా బాబా నాకు ఎన్నో సహకారాలు అందిస్తూ, నన్ను అడుగడుగునా కాపాడుతూ వస్తున్నారు. కానీ మానవజన్మలో, పుట్టిన దగ్గరనుండి ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. మన సాయితండ్రి మనలను ఆ సమస్యల నుండి కాపాడి బయటకు చేరుస్తూనే ఉంటారు. ఈమధ్య నేను అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నాను. ఇంట్లో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇటీవల మా అమ్మాయి నాపై కోపంగా ఉంటూ 4 రోజుల పాటు మందులు వేసుకోవటం మానేసింది. మందులు వేసుకోకపోతే తన ఆరోగ్యం పాడవుతుందని నాకు చాలా భయమేసింది. నయాన చెప్పినా, భయాన చెప్పినా తను ససేమిరా మాట వినకుండా, ‘నేను మందులు వేసుకోనంటే వేసుకోను’ అని మొండికేసింది. నేను ప్రతిదానికీ బాబాను ఇబ్బందిపెట్టను. కోరికలు కూడా (అంటే గొంతెమ్మ కోరికలు) ఎక్కువగా ఏమీ కోరను. ‘అంతా బాబానే చూసుకుంటారులే’ అని మనస్సులో అనుకొని ఊరుకుంటాను. కానీ ఆరోజు గురువారం బాబాకు పూజ చేసుకుంటూ, “బాబా, ఈరోజు మా అమ్మాయి మందులు వేసుకునేలా చెయ్యి తండ్రీ” అని కోరుకుని, “నా కోరిక నెరవేరితే, సాటి సాయిభక్తులంతా సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో తమ అనుభవాలు పంచుకున్నట్లు నేను కూడా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. నీ మహిమ చూపు తండ్రీ” అని ప్రార్థించాను. ఆరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మా అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాను, తను మందులు వేసుకోలేదు. తరువాత నేను బెడ్రూంలో ఉన్నప్పుడు మా అమ్మాయి మాటలు వినబడ్డాయి. తనేం మాట్లాడుతుందా అని నేను అక్కడినుండే వింటున్నాను. మా అమ్మాయి వాళ్ళ అమ్మతో ఇలా అంటోంది, “అమ్మా, నాకు ఒక రొట్టె చెయ్యి, అది తిని మందులు వేసుకుంటాను” అని. ఒక గంటసేపటి తర్వాత నేను నా భార్యని, “అమ్మాయి నీతో ఏమన్నది?” అని అడిగాను. “రొట్టె తిని మందులు వేసుకుంటాను, రొట్టె చెయ్యమన్నది” అని చెప్పింది. దానితో నా గుండెదడ అదుపులోకి వచ్చింది. బాబా దయవల్ల మా అమ్మాయి మందులు వేసుకుంది. అది చూసి ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇకపై కూడా బాబా దయవలన ఏ సమస్యలూ లేకుండా తను మందులు వేసుకోవడం కంటిన్యూ చేస్తుందని ఆశిస్తున్నాను.


ఏ విషయమైనా సరే స్వచ్ఛమైన మనసుతో అడిగితే బాబా ఎన్నడూ లేదని చెప్పరు. దానిని మనకు ప్రసాదించే తీరుతారు బాబా. అందుకు పై అనుభవం ఒక చిన్న ఉదాహరణ. నా జీవితంలో బాబా నాకు ప్రసాదించిన, ప్రసాదించబోతున్న అనుభవాలను ఇక ముందు ముందు మీతో పంచుకుంటాను.


సాయి కృప


నేనొక సాయిభక్తురాలిని. కొన్ని కారణాల వల్ల రెండు సంవత్సరాలుగా మావారు మా పిల్లలని మా అమ్మావాళ్ల ఇంటికి పంపటం లేదు. ఈమధ్య పిల్లలకి ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాక నేను మా అమ్మావాళ్ల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. నేను అక్కడికి వెళ్తానంటేనే మావారు, మా అత్తగారు గొడవ చేస్తారు. అలాంటిది మా పాపను తీసుకెళ్తానంటే అస్సలు ఊరుకోరు. కానీ మా అమ్మ రమ్మని ఫోన్ మీద ఫోన్ చేస్తుండటంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు, "బాబా! మీ దయతో పాపను తీసుకుని అమ్మావాళ్ల ఇంటికి వెళ్లగలిగితే, నా అనుభవాన్ని  బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల నేను ఊరు వెళదామనుకున్నరోజే మావారు కొన్ని పరిస్థితుల కారణంగా వేరే ఊరు వెళ్లారు. ఆయన అటు వెళ్ళాక నేను పాపను తీసుకుని బయలుదేరాను. తరువాత ఫోన్ చేసి చెప్తే, కొంచెం కోప్పడ్డారు. కానీ పెద్ద గొడవ చేయలేదు. అయితే తను నాతో మాట్లాడటం లేదు. "బాబా! నా పాపకర్మఫలం ఏమన్నా ఉంటే దానిని తొలగించి, నా వైవాహిక జీవితం బాగుండేలా అనుగ్రహించండి సాయీ".


7 comments:

  1. Sairam ammaki Tammudu ki
    manasanthi lekunda unnaru tandri
    vallaki sarina dari chupinchu tandri

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼😀❤

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundela chudu thandri sainatha

    ReplyDelete
  4. Baba santosh ki gas problem ayyi vundali enka etuvanti problem vundakudadu thandri

    ReplyDelete
  5. Baba santosh life bagundali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo