1. కనీసం చికిత్స అవసరం లేకుండా కరోనా నుండి కాపాడిన బాబా
2. పెద్ద కష్టమేమీ లేకుండా కాపాడిన బాబా3. బాబా మన్నించిన నా ప్రార్థనలు
కనీసం చికిత్స అవసరం లేకుండా కరోనా నుండి కాపాడిన బాబా
ముందుగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ స్వరూపం అయిన సమర్థ సద్గురు శ్రీసాయినాథ మహరాజుకి మనస్ఫూర్తిగా శతసహస్రకోటి వందనాలు. సాయిబంధువులందరికీ మరియు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా వందనాలు. నా పేరు రవి. మాది విజయవాడ. ప్రతిరోజూ ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం మార్చిలో నేను కంపెనీ మీటింగ్ కోసం బెంగళూరు వెళ్లి అక్కడ మూడురోజులున్నాను. మా బావమరిది కూడా నాతో మీటింగుకి వచ్చాడు. మా కంపెనీవాళ్ళు ముగ్గురు వ్యక్తులకు ఒక రూమ్ చొప్పున మాకు హోటల్లో రూములు ఏర్పాటు చేశారు. అందువలన మా ఇద్దరితోపాటు ఇంకొకరు మా రూములో ఉన్నారు. రెండురోజుల తర్వాత మా బావమరిది నాకు ఏదో చెప్పాలని నా దగ్గరికి వచ్చాడు. కానీ భయంతో చెప్పడానికి మొహమాటపడుతున్నాడు. నేను చెప్పమని అడిగితే, "బావా, నాకు కరోనా ఉంది" అని చెప్పాడు. అప్పటికే రెండురోజుల నుండి ఒకే గదిలో కలిసి ఉంటున్నందువల్ల నేను చాలా భయపడ్డాను. మరుసటిరోజు నాకు ఒంట్లో ఏదో తేడాగా అనిపించింది. మాతో ఉన్న మూడో వ్యక్తికి కూడా అలాగే అనిపించిందట. ముందుగా ఒక్కమాట చెప్తే జాగ్రత్తగా ఉండేవాడిని. కానీ అప్పుడు చేయగలిగింది ఏమీలేదు. అందువల్ల నేను కన్నీళ్లతో బాబాను, "బాబా! నన్ను కాపాడు. నేను సురక్షితంగా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకుని భారం ఆయన మీదే వేశాను. మరుసటిరోజు నేను ఇంటికి వచ్చాక నాకు జ్వరం వచ్చింది. దానికి తోడు ఒళ్ళంతా నొప్పులతో చాలా నీరసంగా ఉంది. నా భార్యకు, ఇద్దరు పిల్లలకు కూడా కరోనా వస్తుందేమోనని భయమేసి బాబాను ప్రార్థించి కొద్దిగా ఊదీని నుదుటన ధరించి, మరికొంత ఊదీని నీటిలో కలుపుకుని త్రాగాను. ఆరోజు, మరుసటిరోజు జ్వరం తగ్గలేదు. నేను టాబ్లెట్లు వేసుకుంటూ, సాయినామం నిరంతరమూ చేస్తూ బాబాను వేడుకుంటునే ఉన్నాను. మూడోరోజు ఉదయానికి జ్వరం పూర్తిగా తగ్గింది. ఒళ్ళునొప్పులు, నీరసం కూడా తగ్గాయి. నా భయమంతా పోయింది. కనీసం ట్రీట్మెంట్ అయినా తీసుకోకుండా నా బంగారుతండ్రి, సకల దేవతా స్వరూపం, పిలిచిన పలికే కన్నయ్య, నా సాయిరాముడు, పరబ్రహ్మ స్వరూపం, పేదల పాలిట కొంగుబంగారం, దీనబంధు, దయాసింధు, పరుసవేది, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అయిన సాయి నన్ను పెద్ద మహమ్మారి నుండి కాపాడారు. నేను పూర్తిగా కోలుకున్నాను. సాయిబంధువులారా! అప్పుడు నేను ఎంత ఆనందపడివుంటానో మీరే ఊహించండి. నేను సాయితండ్రికి ఎంతో ఋణపడ్డాను. నేను మా ఇంట్లో ఉన్న బాబా ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆనందపారవశ్యంతో ఆనందభాష్పాలు రాల్చుతూ మనస్ఫూర్తిగా ఆయన చేసిన మేలుకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆనాడు సాయి సశరీరులుగా శిరిడీలో ఉన్నప్పుడు ప్లేగు మహమ్మారి నుండి ఎంతోమంది భక్తులను కాపాడారు. ఈనాడు కరోనా మహమ్మారి నుండి నాలాంటి ఎంతోమంది భక్తులను కాపాడుతున్నారు ఆ ప్రేమమూర్తి.
.
మరొక అనుభవం: కరోనా నుండి కోలుకున్న కొన్నిరోజులకి నా కంటిపై పెద్ద కురుపు లేచింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. దాదాపు నెలరోజులైన తర్వాత కూడా తగ్గలేదు. కొంతమంది దాన్ని బ్లాక్ ఫంగస్ అన్నారు. నేను మాత్రం సాయిబాబా మీద నమ్మకంతో "బాబా! ఈ కురుపు తగ్గితే, ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించి మూడురోజుల్లో ఆ కంటికురుపును పూర్తిగా తగ్గించారు. అంతేకాదు, నా భార్యాబిడ్డలకు కరోనా రాకుండా కాపాడారు. సద్గురు సాయికి నేను ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను, ఆయన చేసిన మేలును గుర్తుంచుకుని కృతజ్ఞతను వ్యక్తపరచడం తప్ప? ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి బారినపడి నా ప్రాణం పోకుండా ఆ సాయీశ్వరుడు నన్ను, మా కుటుంబసభ్యులను కాపాడారు. సాయిబాబాకి మనస్ఫూర్తిగా శతసహస్రకోటి వందనాలు.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
పెద్ద కష్టమేమీ లేకుండా కాపాడిన బాబా
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
నమస్తే! నా పేరు రాము. మాది ఏలూరు. ముందుగా, ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకోవడానికి అవకాశం కల్పించిన బాబాకు, అలాగే మీ అందరికీ నా ధన్యవాదాలు. బాబాతో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాటిలోనుండి గత సంవత్సరంలో జరిగిన ఒక గొప్ప అనుభవం గురించి ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2020వ సంవత్సరం ఆగస్టు నెలలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో మా స్నేహితులతో కలిసి నేను హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ నుంచి తిరిగి ఏలూరు వచ్చిన నాలుగు రోజులకు మాతోపాటు వచ్చిన ఒకరికి కరోనా వచ్చింది. నాకు కూడా ఆ సమయంలో వాసన తెలియలేదు. దాంతో నాకు చాలా భయమేసి, "బాబా! ఎటువంటి సమస్యా రాకుండా నీవే చూడాలి" అని బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యంగా, నాలుగైదు రోజుల్లోనే నాకు వాసన తెలియటం మొదలైంది. నిజంగా అది బాబా ఆశీర్వాదం. ఇలాగే నా జీవితంలో ఎన్నో విషయాలలో నాకు తోడుగా ఉండి నడిపిస్తున్న బాబాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
బాబా మన్నించిన నా ప్రార్థనలు
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిబంధువులకు నమస్కారం. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. చాలా రోజుల నుంచి నేను ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఆలస్యం అయింది. నా పేరు స్వరూపరాణి. నేను నెల్లూరు నివాసిని. ఇక్కడ రోజూ గూగుల్ మీట్‌లో సత్సంగాలు జరుగుతున్నాయి. మా సత్సంగంలోని ఒక అమ్మాయికి కోవిడ్ అటాక్ అయ్యింది. ఆ అమ్మాయి చాలా మంచిది. మేమంతా చాలా బాధపడి తనకోసం బాబాను వేడుకున్నాము. బాబా ఆశీస్సులతో తను కోవిడ్ నుండి బయటపడింది.
జూన్ నెల చివరిలో మా బంధువులలో ఒక అమ్మాయికి తీవ్రంగా స్కిన్ అలర్జీ వచ్చి, చాలా బాధపడింది. తనకోసం కూడా నేను బాబాను ప్రార్థించాను. బాబా ప్రేమతో తన అలర్జీ తగ్గించారు. "థాంక్యూ సో మచ్ బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDelete820 days
ReplyDeletesairam
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼😀
ReplyDeleteBaba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteBaba santosh ki chest pain gas valla ayyi vundali thandri enka ee problems vunda kudadu sainatha thandri kapadu baba
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteHello Swaroopa Rani medam
ReplyDeleteCan you please share Satsang link and timing so that we can also attend.