1. బాబా తలచుకుంటే జరగనిది ఏముంటుంది?
2. నా క్షేమాన్ని చూసుకుంటున్న బాబా
3. బాబా ప్రసాదించిన ఆరోగ్యం
బాబా తలచుకుంటే జరగనిది ఏముంటుంది?
ముందుగా సాయిభక్తులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను యూరప్‌లో నివసిస్తున్నాను. మేము 2021, జనవరి లేదా ఫిబ్రవరిలో ఒక సర్ఫేస్ (హైబ్రిడ్ టాబ్లెట్ కంప్యూటర్) తీసుకున్నాము. ఆ సర్ఫేస్ ఛార్జర్ ఒకరోజు హఠాత్తుగా పనిచేయలేదు. దాని ఛార్జర్ కాస్త డిఫరెంట్‌గా ఉన్నందున ఇతర ఛార్జర్లు దానికి సెట్ కావు. నేను ఛార్జ్ చేయడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మీ దయవల్ల ఛార్జర్ పనిచేయాలి" అని చెప్పుకుని, కొద్దిగా ఊదీని ఛార్జర్‌కి పెట్టాను. అయితే, అది వెంటనే పనిచేయలేదుగానీ, బాబా దయవలన కొంత సమయం గడిచాక పనిచేసింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సాయీ. నేను మీకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను".
పై అనుభవం జరిగిన నాలుగు రోజులకు మావారి మాక్ బుక్ ఛార్జర్ పనిచేయలేదు. ఆ సమయంలో మావారు మాక్ బుక్‌లో ఆన్లైన్ క్లాసులకి హాజరవుతున్నారు. ఛార్జర్ పనిచేయకపోతే ఆయన ఆ క్లాసులకు హాజరు కాలేరు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వేరే ఏదైనా ఛార్జర్ సెట్ అవుతుందేమోనని మావారు చాలా ప్రయత్నించారు. కానీ ఏవీ సెట్ కాలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల ఆ ఛార్జర్ పని చేయాలి" అని బాబాతో చెప్పుకున్నాను. కానీ ఆ రాత్రంతా కూడా ఛార్జింగ్ కాలేదు. మరుసటిరోజు ఉదయం మాత్రం బాబా అద్భుతం చేశారు. మరోసారి ప్రయత్నిస్తే ఛార్జింగ్ అయింది. ఆ ఛార్జర్ పనిచేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ బాబా తలచుకుంటే జరగనిది ఏముంటుంది? "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్!"
నేను, నా భర్త కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాము. అయితే, వ్యాక్సిన్ వేయించుకునేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పటినుంచి కొంచెం భయంగా ఉండేది. దానికి తోడు కొన్ని వార్తలు మరియు ఫ్రెండ్స్ చెప్పే విషయాలు వింటుంటే మరింత భయంగా ఉంటుండేది. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎలాంటి సమస్యలూ లేకుండా ఉండాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రెండురోజులపాటు కాస్త ఒళ్ళునొప్పులు, జ్వరం తప్ప మరే సమస్యలూ లేవు. "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్".
మాకంటే ముందే మా అత్తయ్యగారు, మావయ్యగారు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటినుండి ఒక వారంరోజులపాటు అత్తయ్య చాలా ఇబ్బందిపడ్డారు. అందువల్ల రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆమె చాలా భయపడ్డారు. అప్పుడు నేను, "బాబా! రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాక ఎటువంటి సమస్యలూ లేకుండా ఉండాలి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా చాలా సహాయం చేశారు. మొదటి డోస్ తరువాత వారంరోజులు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డ అత్తయ్యకు ఈసారి ఎలాంటి సమస్యలూ లేకుండా చేశారు. బాబాను నమ్ముకుంటే తప్పక సహాయం చేస్తారు. ఆయన తమ భక్తులకోసం అద్భుతాలు చేస్తారు. "థాంక్యూ బాబా!"
నా క్షేమాన్ని చూసుకుంటున్న బాబా
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. కరోనా కాలంలో లాక్‌డౌన్ కారణంగా నేను చాలారోజులు ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. అయితే ఒకరోజు నేను తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చి వెళ్ళాను. కానీ చాలా భయంగానూ, టెన్షన్‌గానూ అనిపించి మనసులో బాబాను స్మరించుకుంటూ, "బాబా! నేను క్షేమంగా ఇంటికి చేరుకునెలా చూడండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల నేను చాలా సురక్షితంగా ఇంటికి చేరుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. ఎప్పుడూ ఇలానే వెంట ఉంటూ నీ ఈ బిడ్డను రక్షించు తండ్రీ".
ఒకరోజు నేను గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా ఇబ్బందిపడ్డాను. చాలాసేపు వాకింగ్ చేశాను, ఇంకా ENO త్రాగాను. అయినా సరే నొప్పి ఏ మాత్రం తగ్గలేదు. చివరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. అప్పుడు నేను సాయిబాబా మీద పూర్తి విశ్వాసముంచి, "బాబా! ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుండి నాకు విముక్తిని ఇవ్వండి"అని ప్రార్థించాను. కాసేపటికే నొప్పి తగ్గి చాలా ఉపశమనంగా అనిపించింది. "థాంక్యూ సో మచ్ బాబా. మీకు శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను తండ్రీ!"
బాబా ప్రసాదించిన ఆరోగ్యం
జై సాయినాథ్! నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు 2021, మే 2న నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, బాబా దయవల్ల నాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. 16 రోజులకి మే 18న కోవిడ్ నెగిటివ్ వచ్చింది. అంతా బాగానే ఉంది అనుకుంటే, జూలై 7 తెల్లవారుఝామున హఠాత్తుగా నాకు స్వల్పంగా జ్వరం వచ్చింది. నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. పైగా నేను గర్భవతిని. నాకు చాలా భయమేసి బాబాను ఒకటే కోరుకున్నాను: "బాబా! నన్ను కాపాడు. మీ దయవల్ల నాకు ఏమీ కాకుండా ఉండాలి" అని. బాబా నాపై కరుణ చూపారు. ఆయన దయవల్ల నాకు మళ్లీ జ్వరం రాలేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. తరువాత రెండు రోజులకు మా బాబుకి వాంతులు, విరోచనాలు అవుతుంటే, నేను బాబాకు నమస్కరించుకున్నాను. ఆయన దయవల్ల బాబుకి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మమ్మల్ని సదా కాపాడు తండ్రీ".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDelete830 days
ReplyDeletesairam
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😊🌼
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri
ReplyDeleteBaba santosh ki kuda health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete