సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 857వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయికృప
2. వైద్యులకే వైద్యుడు, అతిపెద్ద వైద్యుడు సాయినాథుడు
౩. బాబా చేసిన ధనసహాయం
4. బాబా అనుగ్రహానికి లేదు ఆలస్యం

శ్రీసాయికృప


నా పేరు రాధాకృష్ణ. మాది రాజమండ్రి. సాయిభక్తుల అనుభవమాలిక 652 మరియు 758 భాగాలలో నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. మరికొన్ని అనుభవాలను తెలియపరచాలన్న కోరికతో ఈ దిగువన విశదపరుస్తున్నాను. ఈ అనుభవాలను, సాయిలీలలను ప్రచురిస్తున్న 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు.


బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న మా అల్లుడుగారి ఆఫీసులో ఇటీవల కరోనా రావడంతో తను ఇక్కడకు వచ్చి టెస్ట్ చేయించుకున్నారు. బాబా దయవల్ల తనకి కరోనా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ 15 రోజులు గృహనిర్బంధంలో ఉండి చిన్న చిన్న సమస్యలను బాబా అనుగ్రహంతో అధిగమించి తిరిగి బెంగళూరు వెళ్లి తన విధుల్లో జాయిన్ అయ్యారు. ఇదంతా బాబా దయ. ఎందుకంటే, ఇంతకుముందు మా అల్లుడు ఒరిస్సాలో పనిచేస్తుండేవారు. సాయికృపతో తను బెంగళూరుకి రావడం వల్లే ఈ సమస్యను తేలికగా జయించగలిగారు.


తర్వాత మా పాపకు కరోనా లక్షణాలు కనిపించాయి. నిజానికి కొద్దిరోజుల ముందే తనను 5 నెలల చంటిబిడ్డతో అత్తవారింట్లో దించాను. అయితే, అక్కడ కరోనా ఎక్కువగా ఉండటంతో మూడవరోజున తిరిగి మా ఇంటికి తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక తనకి కరోనా లక్షణాలు కనిపించాయి. అసలే తను చంటిబిడ్డకు పాలు ఇవ్వాల్సివున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఇప్పుడెలా అని మధనపడ్డాము. కానీ బాబా దయవలన వైద్యుడైన మా బంధువు సలహామేరకు మందులు వాడుతూ తను చంటిబిడ్డతో గృహనిర్బంధంలో ఉండసాగింది. అయితే ఇంటిలో వయసు పైబడిన మా అమ్మగారు ఉన్నారు. అందువలన ఆందోళనపడ్డ నేను 'సాయి రక్షాకవచం', 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః', 'ధర్మో రక్షతి రక్షితః' అని నిత్యమూ స్మరిస్తూ సాయిని వేడుకుంటూ ఉండేవాడిని. సాయికృపతో చిన్న చిన్న ఇబ్బందులు మినహా అందరమూ క్షేమంగా ఉన్నాము.


ఈమధ్యకాలంలో మా అబ్బాయి వివాహం నిశ్చయమైంది. కరోనా కారణంగా ముందు నిశ్చితార్థం వాయిదాపడినప్పటికీ సాయికృపతో 2021, జూన్ 26న ఆ కార్యక్రమం పూర్తయింది. ఇలాగే సాయికృపతో వివాహ మహోత్సవం ఆగస్టు నెలలో ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందన్న ఆత్మవిశ్వాసంతో సాయిని తలచుకుంటున్నాను. ఈ పై అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటానని చెప్పుకోవడం ద్వారా మాకొక మార్గం చూపి సమస్యలు తొలగించిన సాయికి మనఃపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఆగస్టులో మా అబ్బాయి వివాహమయ్యాక బాబా కృపను ఈ బ్లాగులో మళ్ళీ పంచుకుంటాను. "ధన్యవాదాలు సాయీ".


వైద్యులకే వైద్యుడు, అతిపెద్ద వైద్యుడు సాయినాథుడు


సాయిబాబా... సాయిబాబా...


నా పేరు చక్రవర్తి. నేను భట్టిప్రోలు నివాసిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అద్భుత అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను 2000 సంవత్సరం నుండి బాబాను సేవించుకుంటున్నాను. నేనీరోజు బ్రతికి ఉన్నానంటే అందుకు కారణం నా తండ్రి సాయినాథుడే. 2009వ సంవత్సరంలో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. పెద్దప్రేగుకి పూతలా వచ్చి చాలా బాధను అనుభవించాను. రోజుకు 4, 5 సార్లు బాత్రూంకి వెళ్ళడం, ఉన్నట్టుండి కడుపులో నొప్పి. ఆవిధంగా నేను పడిన నరకం పగవాడు కూడా పడకూడదు. నేను తిరగని హాస్పిటల్ లేదు. చెరుకుపల్లి, రేపల్లె, తెనాలి, విజయవాడ, నెల్లూరు.. ఇలా అన్ని ఊర్లూ తిరిగాను. పెద్దపెద్ద MD డాక్టర్లను సంప్రదించాను. కానీ నా సమస్యను తీర్చే డాక్టరు కనిపించలేదు. ఆయుర్వేదం, హోమియో, ఇంగ్లీష్ మందులు, ఇంటివైద్యం.. ఇలా అన్ని రకాల వైద్యాలు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. సుమారు రెండు లక్షల వరకు ఖర్చయినప్పటికీ నా ఆరోగ్య సమస్య మాత్రం తగ్గలేదు. ఈ బాధ భరించేకంటే చనిపోవటమే మేలు అనుకున్నాను. నేను అప్పటికి నాలుగుసార్లు శిరిడీ వెళ్లి ఉన్నాను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే ఎవరూ శిరిడీ వెళ్ళలేరు. ఆయన పది సంవత్సరాల వరకు మళ్ళీ నన్ను శిరిడీకి పిలవలేదు. నేను 10 సంవత్సరాలపాటు ఆయన సేవకు దూరమయ్యాను. చివరికి పది సంవత్సరాల తరువాత బాధను తట్టుకోలేక నా బాధను బాబాకు చెప్పుకుందామని శిరిడీ వెళ్ళాను. బాబాను దర్శించి ఆర్తిగా నా బాధను ఆయనతో చెప్పుకున్నాను. అయితే శిరిడీ నుంచి వచ్చిన తరువాత కూడా నా బాధ తగ్గలేదు. మళ్ళీ మూడు నెలలకు బాబా నన్ను శిరిడీకి రప్పించుకున్నారు. నేను సమాధిమందిరంలో బాబాను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, "బాబా! నేను ఈ బాధ భరించలేకపోతున్నాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఈసారి నా తండ్రి కరుణించాడు. పెద్ద పెద్ద MD డాక్టర్ల వల్ల కూడా తగ్గని నా బాధను బాబా ఇట్టే తీసేశారు. వైద్యులకే వైద్యుడు, అతిపెద్ద వైద్యుడు నా తండ్రి సాయినాథుడు. కేవలం దర్శించినంత మాత్రమునే ప్రేగుకు పుండ్లు తగ్గడం ఏమిటి? బాబా కరుణ అలా ఉంటుంది. బాబా నాపై కురిపించిన అపారమైన కరుణను ఇలా మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. "బాబా! మీ పాదధూళిలోని దుమ్ముకణాన్నైన నన్ను ఆ బాధనుండి రక్షించినందుకు చాలా చాలా ధన్యవాదాలు".


బాబా చేసిన ధనసహాయం: ఆర్థికంగా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి మా ఊరు వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేను, "బాబా! ఊరికి వెళ్ళడానికి నాకున్న డబ్బుల కొరత తీర్చు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. అంతేకాదు, 'సమయానికి డబ్బులు అందితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని మనసులోనే అనుకున్నాను. బాబా నా ప్రార్థన విన్నారు. నేను ఊరికి వెళ్ళే సమయానికి నాకు డబ్బులు అందేలా ఏర్పాటు చేశారు. "ధన్యవాదాలు బాబా".


మరోసారి, నేను ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేక, "నాకు కొంత సమయం ఇప్పించండి బాబా" అని బాబాను ప్రార్థించాను. నేను కోరుకున్నట్లే ఆ విషయంలో కూడా బాబా నాకు సహాయం చేశారు. నేను ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను: 'ఏ సమస్య వచ్చినా బాబాను మనస్ఫూర్తిగా పిలవండి. బాబా మన పిలుపును వింటూనే ఉంటారు, ఎటువంటి సమస్యనైనా కల్పవృక్షంలా తీరుస్తారు. 'సాయి వంటి దైవము లేడు' అని శ్రీసాయినాథుని శరత్‌బాబూజీ చెప్పారు. అది ముమ్మాటికీ నిజం'.


బాబా అనుగ్రహానికి లేదు ఆలస్యం


బాబా ప్రసాదించిన అనుభవాలను ఇంతకుముందు ఎప్పుడూ ఇట్లాంటి వేదికలో పంచుకున్న అనుభవం నాకు లేదు. ఈరోజు తొలిసారి శ్రీసాయినాథుడు నాపై చూపిన అనుగ్రహం గురించి మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. నా పేరు రేఖ. మావారు 23 సంత్సరాలుగా అత్యున్నతమైన ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. 8 సంవత్సరాల క్రిందట తన నిజాయితీని, అంకితభావాన్ని, తనకు వస్తున్న మంచిపేరుని చూసి ఓర్వలేక ఈర్ష్య, అసూయలతో తనతోపాటు పనిచేసేవాళ్ళు మావారికి చాలా ఇబ్బంది కలిగించారు. నిజం నెమ్మదిగా నిలబడుతుంది. కానీ ఈలోపు మేము చాలా ఇబ్బందిపడ్డాం. మావారు ఉద్యోగం వదులుకోలేక ఉన్నచోటును వదులుకుని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అదే సంస్థ యొక్క మెయిన్ ఆఫీసుకి వెళ్లిరావడం మొదలుపెట్టారు. అది మాకు చాలా కష్టం అయింది. మావారు మాత్రం దాన్ని కష్టం అనుకోలేదు. అది ఇంకా మంచిదే అయింది. ఆయన హెడ్ ఆఫీసులో కూడా మంచిపేరు తెచ్చుకున్నారు. అక్కడివారికి దగ్గరగా పనిచేయటం వల్ల తన నిజాయితీ, వ్యక్తిత్వం సంస్థలో అందరూ గుర్తించారు. 8 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ కాలమంతా మావారు అంత దూరప్రయాణం చేసి ఆఫీసుకి వెళ్లివస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా మానలేదు. నాకు తన ఆరోగ్యం గురించి చాలా భయంగా, ఆందోళనగా ఉండేది. మాకు ఒకే పాప. తను కూడా ఇటువంటి పరిస్థితుల్లో ‘నాన్నగారి ఆరోగ్యం ఎలా?’ అని బాధపడేది.


పెళ్లికి ముందునుండి నాకు బాబా అంటే ఎంతో భక్తి, నమ్మకం. 2021, జూన్ 23, బుధవారంనాడు నా మనసుకి ‘నవ గురువార వ్రతం’ చేయమని ఎవరో చెప్తున్నట్లు అనిపించింది. ‘నా బాబానే నాకు చెప్తున్నారనీ, వ్రతం చేయమని ప్రేరణ ఇస్తున్నార’నీ అనుకున్నాను. ఆరోజు మధ్యాహ్నం మావారితో ‘నవ గురువార వ్రతం చేసుకుంటాన’ని చెప్పాను. తను నాతో ఎప్పుడు బాబా గురించి చెప్పినా, 'నీ బాబా' అంటారు. మరి తను బాబాను నమ్ముతారో, లేదో నాకు తెలియదు. కానీ నేను చెప్పిన వెంటనే ఆయన నేను అడిగినదానికంటే ఎంతో ఘనంగా పూజకి అన్నీ ఏర్పాటు చేశారు. నేను గురువారం సంకల్పం చెప్పుకుని, 'మావారిని ఉన్నచోటుకే, అంటే ఇంతకుముందు తను పనిచేసిన బ్రాంచికి రప్పించి మంచి ఉన్నత స్థానం కల్పించమ'ని సాయినాథుని వేడుకున్నాను. బాబా మహత్యం నేను చెప్పగలనా? సాయిలీలలు నేను వ్రాయగలనా? నాకు మాటలు రావట్లేదు. నేను వ్రతం చేసిన తరువాత సరిగ్గా 4 రోజుల్లో, అంటే సోమవారంనాడు హఠాత్తుగా రెండుచోట్ల, అంటే రెండు బ్రాంచీలకి జనరల్ మేనేజరుగా మావారికి ప్రమోషన్ ఇచ్చి, మంగళవారంనాడు జాయినింగ్ ఆర్డర్ కూడా ఇప్పించి మా ఊహకి అందనంత ఆనందాన్ని బాబా మాకు ప్రసాదించారు. 2021, జూలై 1న నేను రెండవవారం పూజ చేసే సమయానికి మావారు జనరల్ మేనేజర్ సీటులో కూర్చున్నారు. ఆయన ఆరోజు తాను రోజూ వెళ్ళే గుళ్ళతోపాటు బాబా మందిరానికి కూడా వెళ్ళి బాబా ఆశీర్వాదం తీసుకుని తన సీటులో కూర్చున్నారు. 8 సంత్సరాలుగా పడ్డ కష్టం, బాధ దూదిపింజలాగా ఎగిరిపోయింది. ఇది బాబా మహత్యమని కాక ఇంకేమని చెప్పగలను? ఇదంతా నా చేతులు వ్రాస్తున్నా, నా కళ్ళనిండా నీళ్లు కమ్ముకుంటున్నాయి. ఆనందభాష్పాలు అంటే ఇవేనేమో! ఇదంతా మీతో ఇలా పంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని కల్గించింది. "సాయిదేవా! మమ్మల్ని ఎప్పుడూ ఇదే ప్రేమతో, కరుణతో కాపాడు తండ్రీ. నాకు అమ్మ, నాన్న, గురువు, దైవం అంతా మీరే సాయీ". 


లోకాః సమస్తాః సుఖినోభవంతు.


13 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram today's sai leelas are nice with udi all health issues are sloved. There is no doubt in it. ❤������

    ReplyDelete
  4. Om sai ram ❤❤❤❤

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌼

    ReplyDelete
  7. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  8. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  9. Baba santosh health bagundali thandri

    ReplyDelete
  10. Baba karthik ki thyroid taggipovali thandri please

    ReplyDelete
  11. 🌺🏵🙏Om Sri SaiRam🙏🏵🌺

    ReplyDelete
  12. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo