- బాబా అనుగ్రహచిహ్నాలు
- అన్ని ఆరోగ్య సమస్యలను తొలగించిన బాబా
బాబా అనుగ్రహచిహ్నాలు
నా పేరు శేఖర్. నేను మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోబోతున్నాను.
1) 2021, జూన్ 6వ తేదీ ఉదయం నేను నీళ్లు తాగడానికి వెళ్తున్నాను. అకస్మాత్తుగా నా మనసుకి ‘ఇప్పుడు నీళ్లు తాగొద్దు’ అని బాబా చెప్తున్నట్లు అనిపించింది. తరువాత యూట్యూబ్‌లో, 'గురువు యొక్క ఆదేశం పాటిస్తే, నువ్వు ఊహించనిది అందిస్తాను' అనే మెసేజ్ వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించింది.
2) నాకు ఒక చెల్లెలు ఉంది. నాకు, తనకి పడదు. ఒకరోజు తను మా ఇంటికి వచ్చింది. దాంతో నేను మా అత్తమ్మ వాళ్ళింటికి వెళదామని అనుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు నన్ను వెళ్లనివ్వలేదు. ఆ మరుసటిరోజు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో "నీవు ఎక్కడికీ పారిపోనక్కరలేదు. నేను ఉన్నంతవరకు నీకు ఏ ప్రమాదం లేదు" అన్న మెసేజ్ నాకు కనిపించింది. అది చూసి నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అయినప్పటికీ నాకు, మా చెల్లికి గొడవ అవుతుందేమోనని, "బాబా! ఏ గొడవా జరగకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. నాలుగు రోజుల తరువాత మా చెల్లి ఊరికి వెళ్ళింది. బాబా దయవల్ల తను ఉన్న నాలుగురోజుల్లో ఎటువంటి గొడవా జరగలేదు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా".
3) నా భార్య వేరే ఊరిలో ఉంటుంది. 2021, జూన్ నెలలో తను సరిగా ఆహారం తీసుకోలేదు. కారణమడిగితే, ‘నువ్వు ఇక్కడికి వస్తే తింటాన’ని చెప్పింది. అదలా ఉంచితే, సరైన ఆహారం లేకపోవడంతో తన ఆరోగ్యం దెబ్బతింది. అంతేకాక, తను తినకపోతే నేనూ తిననని వాళ్ళమ్మ కూడా తినడం మానేసింది. అప్పుడు నేను నమ్ముకున్న సాయిబాబాని ప్రార్థించి, "నా భార్యకి, అత్తమ్మకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బాగుండాలి. వాళ్ళు వేళకి ఆహారం తీసుకుంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. కొద్దిరోజులకే బాబా అంతా సరిచేశారు. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా తింటూ ఆరోగ్యంగా ఉన్నారు. "ఎల్లప్పుడూ ఇలాగే మమ్మల్ని సంరక్షించండి బాబా".
4) 2021, జూన్ 10న నేను సెలూన్‌కి వెళదామని బయలుదేరాను. ఎందుకో, ‘ఇంటికి దగ్గర్లో ఉన్న సెలూన్‌కి వెళ్ళమ’ని నా మనసుకి అనిపించి అదివరకు వెళ్లే సెలూన్‌కి కాకుండా సమీపంలో ఉన్న వేరే సెలూన్‌కి సాయి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాను. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా భయపడి, "నాకెటువంటి ఆరోగ్య సమస్యలు రానట్లయితే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవలన నాకు కరోనాగానీ, మరే ఈ ఇతర ఆరోగ్య సమస్యలుగానీ రాలేదు. "బాబా! మీకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు".
5) 2021, జూన్ 25న నేను నా లాప్టాప్‌కి ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను. అయితే డిస్క్ ఓపెన్ కాలేదు. ఎంతలా ప్రయత్నించినా ఓపెన్ కాకపోయేసరికి నేను బాబాను ప్రార్థించి, "ఎలాగైనా డిస్క్ ఓపెన్ అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. అప్పుడు నా దగ్గర ఊదీ లేకపోయేసరికి మట్టినే బాబా ఊదీగా భావించి హార్డ్ డిస్క్‌కి పెట్టి మరుసటిరోజు మళ్లీ ప్రయత్నిస్తే బాబా దయవల్ల డిస్క్ ఓపెన్ అయ్యింది. "ధన్యవాదాలు బాబా".
6) 2021, జూన్ 26న ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ ఓపెన్ అయ్యాక నేను నా లాప్టాప్‌లో sai05 అనే పేరుతో ఉన్న ఒక ఖాళీ ఫోల్డర్‌ని డిలీట్ చేశాను. అయితే, అనుకోకుండా దాంతోపాటు మూవీస్ ఉన్న మరో ఫోల్డర్ కూడా డిలీట్ అయ్యింది. అయ్యో అని కంగారుపడి, రీసైకిల్ బిన్‌లో ఉంటుంది కదా అని చూస్తే, అందులో ఏమీ లేవు. నాకు చాలా బాధేసింది. అప్పుడు బాబాతో చెప్పుకుని మరోసారి చూస్తే, ఫోల్డర్ ఉంది. ఇదెలా జరిగిందా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అంతా బాబా దయ.
7) 2021, జులై 4న నా పుట్టినరోజు. మా అమ్మ నాకోసం గారెలు చేయాలనుకుంది. గారెలపిండి రెడీ అయి, గారెలు వేయాల్సి ఉంది. అయితే అమ్మ చేయి వణుకుతూ ఉంది. అందువలన నేను అమ్మకి సహాయం చేస్తున్నాను. గారెలు వేయడం నాకు అదే మొదటిసారి. అందువలన, "చేతులు కాలకుండా గారెలు వేయగలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా ఎంతో దయతో పుట్టినరోజునాడు నా చేతులు కాలకుండా నాతో గారెలు చేయించారు. "ధన్యవాదాలు బాబా".
8) 2021, జులై 5న నాకు గొంతునొప్పి, దాంతోపాటు దగ్గు వచ్చాయి. నాకెప్పుడూ ముందుగా గొంతునొప్పి వస్తుంది. నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! గొంతునొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకల్లా గొంతునొప్పి తగ్గిపోయింది. "థాంక్యూ బాబా".
9) 2021, జులై 5న నేను నా లాప్టాప్‌లో గూగుల్ డ్రైవ్ యాప్ ఇన్స్టాల్ చేసేందుకు చాలా ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను, "సక్సెస్‌ఫుల్‌గా యాప్ ఇన్స్టాల్ అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకుని మరుసటిరోజు మరోసారి ప్రయత్నించాను. సాయి దయవల్ల ఈసారి యాప్ ఇన్స్టాల్ అయింది. "థాంక్యూ సో మచ్ బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మాకు మీ సహాయాన్ని అందిస్తూ ఉండండి బాబా". అందరూ సచ్చరిత్ర చదివి బాబా అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను.
అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.
అన్ని ఆరోగ్య సమస్యలను తొలగించిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే అది బాబా నాకు పెట్టిన ప్రాణభిక్షగా భావిస్తాను. ఎందుకంటే, బాబా ఇటీవల కరోనా వల్ల విషమించిన పరిస్థితి నుండి నన్ను కాపాడారు. అయితే కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు వస్తుంటే, ‘సచ్చరిత్ర చదువుతాననీ, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’నీ బాబాకు మ్రొక్కుకున్నాను. తరువాత నా శరీరంలో ఏ భాగంలో ఇబ్బంది అనిపిస్తే ఆ భాగంలో ఊదీ పెట్టుకుంటుండేదాన్ని. వెంటనే బాబా దయవల్ల నాకు ఆ ఇబ్బంది నుండి ఉపశమనం కలిగేది. బాబా నాపై అంత దయ చూపేవారు. ఇంతటి దయగల బాబాను పూజించి, వారి చరిత్ర పారాయణ చేసే అదృష్టం కలిగినందుకు బాబాకు శతకోటి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. భక్తితో బాబాను తలిస్తే, ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా పూర్తిగా నయమవుతాయి. "ధన్యవాదాలు సాయీ. నాకు పూర్తిగా నయంచేసిన మీకు ఎప్పటికీ ఋణపడివుంటాను. ఇదేవిధంగా మీ రక్షణ ఎప్పుడూ మా కుటుంబానికి ఉండాలి. మేమంతా మీ దయతో సదా ఆరోగ్యంగా ఉండాలి బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDelete🌼🌷🌼Om Sri Sairam🌼🌷🌼
ReplyDelete🙏🙏🙏🙏🙏
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🥰❤😀😊👌🌼
ReplyDelete