1. బాబా కరుణ - ఆయనిచ్చిన సమాధానం
2. చెప్పినట్లే ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. బాబా చూపుతున్న దయ
బాబా కరుణ - ఆయనిచ్చిన సమాధానం
అందరికీ నమస్కారం. నా పేరు సత్యసాయి. నేను ఇప్పటికే నా జీవితంలో బాబా దయవలన చాలా పొందాను. వాటిని బాబా భక్తులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను ఈ బ్లాగుకు పరిచయం చేసిన మా రేవతి అక్కకి, ఈ బ్లాగ్ నిర్వాహకులకు, అలాగే మా అమ్మానాన్నలకు బాబా అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. బాబా తమ అనుగ్రహంతో కరోనా మొదటి వేవ్‌లో నాకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్‌లో ఒక సమస్య వచ్చింది. మా ఇంటి సమీపంలో కొన్ని కరోనా మరణాలు సంభవించాయి. అందువలన మేము చాలా భయపడ్డాము. మరణాలు ఎక్కువగా ఉన్నందున మా వీధిలో అందరికీ కరోనా రాపిడ్ టెస్ట్ చేశారు. అందరితోపాటు మా ఇంట్లో కూడా అందరికీ టెస్ట్ చేశారు. అక్కడికి రెండురోజుల ముందు వర్షంలో కొంచెం తడవడం వలన నాకు, మా చిన్నక్కకి కొంచెం నలతగా అనిపించింది. నాకు వెంటనే తగ్గింది, కానీ అక్కకి అలానే ఉంది. అందువలన మా అమ్మ మా ఇద్దరికీ పాజిటివ్ వస్తుందని చాలా భయపడి, 'మాలో ఎవరికీ కరోనా పాజిటివ్ రాకూడద'ని బాబాను ఎంతగానో వేడుకుంది. అయితే అమ్మ భయపడినట్లే అక్కకి పాజిటివ్ వచ్చింది. బాబా దయవల్ల నాకు మాత్రం రాలేదు. ఒకవేళ నాకు కూడా వచ్చి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. మా అమ్మానాన్నలకి బాగా ఇబ్బంది అయ్యేది. మా ఇద్దరికీ అన్నీ అందిస్తూ చిన్నబాబుని కూడా చూసుకోవడం వాళ్ళకి చాలా కష్టం అయ్యేది. అంతటి కష్టం వాళ్ళకు రాకుండా బాబానే కరుణించారు. అంతేకాదు, బాబా ఎంతో దయతో మాకు ధైర్యాన్నిచ్చి ఆ సమస్య నుంచి గట్టెక్కించారు. "ధన్యవాదాలు బాబా!"
మరొక అనుభవం:
శ్రీసాయిసచ్చరిత్రలోని అనుభవాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు దొరకడం మనం చాలా చూశాము. అయితే, ఇప్పుడు ఈ బ్లాగ్ ద్వారా బాబా మాకు ఒక పరిష్కారం చూపించారు. మా అమ్మకి గత 8 సంవత్సరాలుగా కీళ్లనొప్పులు వేధిస్తున్నాయి. అమ్మ వాడని మందు లేదు. ఎన్ని మందులు వాడినా రాత్రి పడుకునే సమయంలో కీళ్లనొప్పి ఉంటుంది. ఏదైనా క్రీం రాస్తేగానీ నిద్రపట్టదు. ఒకరోజు కీళ్లకు రాసుకునే క్రీం అయిపోయింది. అయితే అమ్మ ఆ విషయం మాకు చెప్పకుండా ఆ రాత్రంతా నిద్రపోకుండా బాబాను ధ్యానిస్తూ మెలకువగా ఉంది. మరుసటిరోజు ఉదయం ఈ బ్లాగ్ ద్వారా బాబా సమాధానం ఇచ్చారు. ఆరోజు బ్లాగులోని ఒక అనుభవంలో, 'కీళ్లనొప్పులతో బాధపడుతున్న తను బాబాను తలచుకుంటూ ఊదీని కాళ్ళకు రాసుకున్నాననీ, అలా చేయటం వలన కీళ్ళనొప్పులు తగ్గాయ'నీ వ్రాశారు. అది చదివిన అమ్మ అది బాబా తనకే ఇస్తున్న సమాధానం అనుకుని బాబా ఊదీని తన మోకాళ్లకు రాసుకుంది. ఆరోజు పనులన్నీ ముగించుకున్నాక రాత్రి మరొకసారి ఊదీ రాసుకుని పడుకుంది. అంతే, ఆరోజు అమ్మకు నొప్పులు రాలేదు. తర్వాత ఎప్పుడైనా నొప్పి వస్తే, ఊదీ రాసుకుని, కొద్దిగా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగడం చేస్తోంది అమ్మ. "బాబా! మనసులో ఒక సమస్యతో అమ్మ సతమతమవుతోంది. ఆ సమస్యను తొలగించి ఆశీర్వదించండి సాయీ. ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత దానిని బ్లాగులో పంచుకుంటాను".
చెప్పినట్లే ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః
నా పేరు కృష్ణ. నా పరాత్పర గురువైన శ్రీ సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ వారు చూపిన మరొక లీలామహత్యాన్ని వివరిస్తున్నాను. ఈమధ్య మా అమ్మగారి శరీరానికి నీరు పట్టినప్పుడు శరీరంలోని ప్రధాన అవయవాలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా, అమ్మకి పెద్దగా కష్టం లేకుండా కేవలం యూరిన్ ఇన్ఫెక్షన్ అనే చిన్నదానితో ఆ కర్మను పూర్తిగా తొలగించిన బాబా లీలామహత్యాన్ని ఇదివరకు పంచుకున్నాను. తరువాత సాయినాథుని దయవల్ల అమ్మ పూర్తిగా కోలుకుంది. అయితే కొద్దిరోజులకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఇంకా కొద్దిగా ఉన్నట్లు బయటపడింది. దాంతో రివర్స్ పెరిస్టల్సిస్ వల్ల అమ్మ వాంతులతో బాధపడింది. అంతేకాక, అమ్మ నడవలేకపోయేది. అమ్మ పడుతున్న బాధ చూడలేక నేను బాబా దగ్గర ఏడ్చేశాను. "అమ్మకు త్వరగా నయం చేయమ"ని బాబాను అడిగి శ్రీసాయిసచ్చరిత్ర పుస్తకం తెరిచాను. సచ్చరిత్ర ద్వారా, "ఆందోళన వద్దు. రేపు ఉదయం నుండి ఈ రోగం నయమగుట మొదలై ఒక వారంలో నడుస్తారు" అని బాబా చెప్పారు. దాంతో నేను ధైర్యంగా ఉండసాగాను. ఆ మరునాడు శిరిడీ సాయిబాబా సంస్థాన్ నుండి ఊదీ ప్రసాదం నాకు పోస్టులో అందింది. నాకు ఇంకా ధైర్యం పెరిగింది. ఆ మరునాటి ఉదయం నుండి అమ్మ నిదానంగా కోలుకుంటూ ఒక్క వారం రోజుల్లో చక్కగా నడవసాగింది. బాబా ఏదైతే సచ్చరిత్ర ద్వారా చెప్పారో సరిగ్గా అదేవిధంగా వారంలో అమ్మ నడిచింది. ఇప్పుడు అమ్మ చాలా ఆరోగ్యంగా ఉంది. అమ్మకున్న ఎన్నో రకాల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలన్నీ ఇప్పుడు పూర్తిగా సమసిపోయాయి. ఈ ప్రక్రియలో స్వయంగా బాబానే వైద్యం చేస్తున్నారనే నిదర్శనాన్ని నేను చాలాసార్లు అనుభూతి చెందాను. సాయినాథుడే మా కుటుంబసభ్యులందరినీ వెన్నంటి ఉండి కాపాడుతున్నారు. "ధన్యవాదాలు బాబా".
సర్వేజనాః సుఖినోభవంతు.
బాబా చూపుతున్న దయ
నేనొక సాయిభక్తురాలిని. సాయిబంధువులందరికీ మరియు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకి నమస్తే. నేను చాలారోజుల తర్వాత నా అనుభవాలు వ్రాస్తున్నాను. మావారు లాక్‌డౌన్ ముందు కురుంగడ్డ వెళ్లారు. ఆయనతో ఉన్న వ్యక్తికి కోవిడ్ వచ్చింది. నేను భయపడి, "బాబా! మావారికి నెగిటివ్ వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల మావారికి నెగిటివ్ వచ్చింది. ఒకరోజు మా పాప స్విమ్మింగ్ పూల్ దగ్గర తన కాలి పట్టీ పోగొట్టుకుంది. కొంతదూరం వెళ్ళాక మేము అది గమనించి వెనక్కి వెళ్ళాం. బాబా దయవల్ల స్విమ్మింగ్ పూల్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఆ పట్టీని వెతికి ఇచ్చారు. నిజంగా నేను చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నాను. అయితే ఎన్ని బాధలున్నా బాబా తాము తోడుగా ఉన్నామని నిదర్శనమిస్తున్నారు. ఉన్న పనుల్లో భయపడిన ప్రతిసారీ ఇబ్బందులు లేకుండా జరుగుబాటు అయ్యేలా చూస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పుకోలేని బాధలోనే ఉన్నాను. అయినా బాబా తప్పక నాకు తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాను. "బాబా! ఆలస్యంగా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నందుకు, మ్రొక్కులు మ్రొక్కుకొని కూడా వాటిని తీర్చలేని నా నిస్సహాయతకు మన్నించండి".
లోకాః సమస్తాః సుఖినోభవంతు.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
823 days
ReplyDeletesairam
Om sai ram ❤❤❤
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteBaba nannu kapadu thandri
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ❤🙏🕉😊🌼😀
ReplyDelete🌺🙏🙏🙏🙏🙏🌺Om Sri SaiRam🌺🙏🙏🙏🙏🙏🌺
ReplyDelete