సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 872వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. రక్షణనిచ్చే సాయి
2. కరోనా నుంచి కాపాడిన బాబా
3. తేలు మీద కాలేసినా కాపాడిన బాబా

రక్షణనిచ్చే సాయి


నమో నమో శ్రీ సాయినాథాయ నమః. నా పేరు శ్రీలత. నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్న కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 2021, ఏప్రిల్, మే, జూన్ నెలలు నాకు ఒక పరీక్షా సమయంలా గడిచాయి. అయితే, బాబా తామున్నామని నాకు అభయం ఇచ్చినందువల్ల, ‘బాబా ఉన్నారు, అంతే చాలు’ అన్న  ధైర్యంతో నేను అన్నీ తట్టుకున్నానేమో అని నాకిప్పుడు అనిపిస్తోంది. మా తమ్ముడు, అంటే మా బాబాయి కొడుకు ముంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడు ఇటీవల కనిపించకుండా పోయిన ఒక షిప్‌లో ఉండిపోయాడు. అప్పుడు మేము తనకోసం ఆందోళన చెంది, తన రక్షణ కోసం బాబాను ప్రార్థించి శ్రీసాయిసచ్చరిత్ర తెరిస్తే, కెప్టెన్ జహంగీర్ షిప్‌ను బాబా రక్షించిన లీల వచ్చింది. దాంతో మాకు కాస్త ధైర్యం వచ్చింది. మరుసటిరోజు తాను క్షేమంగా ఉన్నానని తన దగ్గరనుండి మాకు ఫోన్ వచ్చింది. దాంతో మా మనసులు శాంతించాయి. 


మా అమ్మానాన్నలు కోవిడ్ బారినపడి చెన్నైలో ఉండగా, సరిగ్గా అదే సమయంలో ఇక్కడ మా అమ్మమ్మ మంచంపట్టి చివరి రోజుల్లో ఉంది. తన తల్లి చివరిచూపు తనకు దక్కుతుందో, లేదోనని మా అమ్మ బాధపడుతుంటే, "కోవిడ్ టైంలో నువ్వు అలా బాధపడకు. ముందు నువ్వు కోలుకో. అంతా బాబా చూసుకుంటారు" అని అమ్మతో చెప్పి నేను బాబా మీద భారం వేశాను. బాబా దయవల్ల అమ్మ కోలుకుని ఇంటికి వచ్చేంతవరకు అమ్మమ్మ బాగుంది. చివరికి అందరినీ చూసుకున్నాక ఆవిడ ప్రశాంతంగా కన్నుమూసింది.


మా పిన్ని కూతురి భర్త కోవిడ్ బారినపడి రెండు నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. "చిన్నవయస్సు బాబా, అతనిని కాపాడండి" అని నేను రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చివరికి బాబా దయవలన అతను డిశ్చార్జ్ అయి క్షేమంగా ఇంటికి వచ్చాడు.


మరొక అనుభవం: వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఒకవేళ జ్వరం, ఒళ్ళునొప్పులు వంటి సమస్యలు వస్తే పారాసిటమాల్ వేసుకోవాల్సి ఉంటుంది. కానీ నా భర్తకి పారాసిటమాల్ మెడిసిన్ పడదు. అందువలన 'వ్యాక్సిన్ వేయించుకోవాలా, వద్దా?' అని బాబాను అడిగితే, బాబా ‘వేయించుకో’మన్నారు. దాంతో వెంటనే మావారు వ్యాక్సిన్ వేయించుకున్నారు. మావారికి ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. ఇదంతా సాయి మహిమ.


2021, జూలై 14న మా బాబుకి కొద్దిగా జ్వరం, జలుబు వచ్చాయి. నేను భయపడి బాబాను అడిగితే, "ఎటువంటి రోగమూ నీ గృహాన్ని సమీపించదు" అని బాబా సందేశం ఇచ్చారు. ఆ తరువాత బాబుకి వచ్చింది మామూలు జ్వరమే అని తెలిసింది. "ధన్యవాదాలు బాబా!"


కరోనా నుంచి కాపాడిన బాబా


నేనొక సాయిభక్తురాలిని. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి మరియు సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఎంతో దయతో బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగు ద్వారా పంచుకోవడం ఇది రెండవసారి. ఒకరోజు సాయంత్రం మావారు తనకు ఒళ్లునొప్పులతోపాటు కాస్త జ్వరంగా ఉందని అన్నారు. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఆయనకలా ఉందేమోనని మేము అనుకున్నాము. అయితే, మరుసటిరోజు ఉదయం కూడా తనకు అలాగే ఉండేసరికి మాకు తెలిసిన డాక్టరుకి ఫోన్ చేసి, అతను సూచించిన మందులు వాడారు. వాటితోపాటు నేను బాబా నామస్మరణ చేస్తూ, మావారికి బాబా ఊదీ పెడుతూ ఉండేదాన్ని. అయినా కూడా రెండురోజుల వరకూ అవే లక్షణాలు కొనసాగడంతో మావారికి అనుమానమొచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. మరుసటిరోజు ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. కానీ అప్పటికే బాబా దయతో తనకు జ్వరం తగ్గింది. వెంటనే డాక్టరు చెప్పిన కోర్స్ వాడటం మొదలుపెట్టారు. ఇంకో రెండురోజుల తర్వాత నాకు కూడా కోవిడ్ లక్షణాలు మొదలయ్యాయి. నేను కూడా టెస్ట్ చేయించుకుంటే, నాకు కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో నేను కూడా కోర్స్ వాడటం మొదలుపెట్టాను. మా పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. వాళ్ళకు కూడా కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించాము. బాబా దయవల్ల వాళ్ళిద్దరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అయితే వాళ్ళకున్న లక్షణాలను బట్టి పారాసిటమాల్, యాంటీబయాటిక్ సిరప్ వాడాము. మా నుంచి మా పేరెంట్స్‌కి, మా ప్రక్కింటివాళ్ళకి (ప్రక్కింటావిడ గర్భవతి) కూడా కోవిడ్ వ్యాపిస్తుందేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ బాబా దయవలన అలాంటిదేమీ జరగలేదు. మా అన్నయ్యకు మాత్రం కోవిడ్ వ్యాపించింది. అయితే బాబా ఆశీస్సులతో తను త్వరగానే కోలుకున్నాడు. ఆ కష్టసమయంలో నేను రోజూ, "ఈ కోవిడ్ నుంచి అందరినీ త్వరగా కాపాడు తండ్రీ" అని బాబాను వేడుకుంటూ ఉండేదాన్ని. బాబా నామస్మరణతో, బాబా ఊదీతో మేమంతా పెద్ద సమస్యలేమీ లేకుండా త్వరగానే కోలుకున్నాము. బాబా అందరినీ కాపాడుతారని తెలిసినా కూడా ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ, "నేను ఉండగా మీకు భయం ఎందుకు?" అని అభయమిచ్చి అందరినీ కాపాడారు బాబా. "కోటి కోటి ధన్యవాదాలు బాబా. ఈ కోవిడ్ వలన ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు, దయచేసి వాళ్లందరినీ నువ్వే కాపాడు తండ్రీ. అలాగే ఈ మహమ్మారిని శాశ్వతంగా అంతమొందించి మానవాళిని రక్షించు తండ్రీ. ప్రతి ఒక్కరమూ ఎప్పటికీ మీ పాదాలను విడువకుండా మీ నామాన్ని భక్తి, ప్రేమలతో స్మరిస్తూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు బాబా". మరోసారి ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి, ఈ అనుభవాన్ని చదివిన మీకు ధన్యవాదాలు.


లోకాః సమస్తాః సుఖినోభవంతు. 

శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


తేలు మీద కాలేసినా కాపాడిన బాబా


సాయికుటుంబానికి నా నమస్కారాలు. నా పేరు లలిత. నా జీవితంలో ఎన్నో అనుభవాలు ప్రసాదించిన బాబా ఇటీవల ఒక పెద్ద ప్రమాదం నుండి నన్ను కాపాడారు. ఆ అనుభవాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇటీవల ఒకరోజు రాత్రి మా ఇంటి బయట నేను చీకట్లో చూసుకోకుండా ఒక తేలు మీద కాలు వేసినా అది నన్ను కుట్టకుండా బాబా కాపాడారు. మామూలుగా తేలు సమీపంలోకి వెళితే చాలు, అది చటుక్కున కుట్టేస్తుంది. అలాంటిది నేను ఏకంగా దానిమీద కాలు వేశాను. నా పాదాలకి ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది, కానీ రక్తం ఏమీ కనపడలేదు. తేలుకి తోకలోనే విషముంటుంది. నేను దానిమీద కాలు వేసినప్పుడు దాని తోక నా పాదాలకు కొద్దిగా తగిలి కొంచెం నొప్పి అనిపించింది. నాకు ఏమవుతుందో, ఏమోనని చాలా భయమేసి, కొద్దిగా బాబా ఊదీని తీసుకుని నొప్పి ఉన్న చోట రాసి, మరికొంత ఊదీని నీటిలో కలుపుకుని త్రాగి, "బాబా! నువ్వే దిక్కు. నాకు ఏ ప్రమాదం లేకుండా చూడు తండ్రీ. నాకు ఏ సమస్యా లేనట్లయితే, ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. ఇంకా ఒక కొబ్బరికాయ మీ గుడిలో కొడతాన"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల నాకు ఏ సమస్యా రాలేదు. "ధన్యవాదాలు బాబా. నా వల్ల ఏవైనా తప్పులు జరిగి ఉంటే నన్ను మన్నించండి".


9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Today is vara lakshmi vrat. Very nice day.sai please bless my family. Bless my son, daughter, husband with long life. Be with them and bless. Om sai baba❤❤❤❤

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌼

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Om sai ram baba amma infections taggipovali thandri

    ReplyDelete
  6. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh health bagundali thandri

    ReplyDelete
  8. Baba next week kalla na samasya povali thandri

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo