1. ‘ఇదంతా బాబా లీల’
2. ఎంతటి కష్టంలోనైనా పిలిస్తే, సాయి పలుకుతాడు, ఆదుకుంటాడు3. బాబా కృపతో తగ్గిన కడుపునొప్పి
‘ఇదంతా బాబా లీల’
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయితండ్రికి నా శతకోటి సాష్టాంగ నమస్కారాలు. నా పేరు సాయిశ్రీ. నేను బాబాకు చిరుభక్తురాలిని. నేను 2020, అక్టోబరు నుండి ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నాను. ఇది ఒక ‘ఆధునిక సచ్చరిత్ర’లాగా నాకు అనిపిస్తుంది. ఇది చదువుతున్నప్పటినుండి, బాబా అనుగ్రహంతో నాకు కలిగిన అనుభవాలను కూడా బ్లాగులో పంచుకోవాలనిపించేది. కానీ ఎలా పంచుకోవాలో కొన్నాళ్ళవరకు తెలియలేదు. తెలిసిన తరువాత కూడా ధైర్యం చాలలేదు. చివరికి, 2021, గురుపూర్ణిమ పర్వదినాన ధైర్యం చేసి నా అనుభవాన్ని మొట్టమొదటిసారిగా రాయడం మొదలుపెట్టాను. 30 సంవత్సరాల క్రితం (నా డిగ్రీ అయిపోతుండగా) బాబా నాకు పరిచయమయ్యారు. మా ఊరిలోవాళ్ళు ఒక చిన్న గదిలో సాయిబాబా ఫోటో పెట్టి పూజించేవారు. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి సాయిని దర్శించుకున్నాను. అదే మొదటిసారి నేను సాయిని చూడటం. ఆ తరువాత నేను పీజీ చేయడం కోసం యూనివర్సిటీ క్యాంపస్‌కి వెళ్ళిపోయాను. నేను యూనివర్సిటీకి వెళ్ళిన తరువాత మా ఊరిలో అంతకుముందు బాబా ఫోటో పెట్టి పూజించిన చోటనే మందిరాన్ని నిర్మించి బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారని తెలిసింది. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. ఆ తరువాత నేను హాస్టల్లో ఉంటున్నప్పుడు మా రూమ్‌మేట్ సాయిభక్తురాలని తెలిసింది. తన దగ్గర ‘శ్రీసాయిలీలామృతం’ పుస్తకం ఉండేది. ఒకరోజు అనుకోకుండా నేను ఆ పుస్తకం కొంచెం చదివాను. సాయిలీలలు నాకు చాలా బాగా నచ్చాయి. అందులో ఉన్న ప్రార్థనాష్టకం నేర్చుకుని రోజూ పాడుకునేదాన్ని. అలా మా రూమ్‌మేట్ వల్ల నేను సాయిభక్తురాలినయ్యాను. నా పీజీ అయిపోయి మా ఊరికి వచ్చిన తరువాత నాకు బాబా దయవల్ల గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అప్పటినుండి బాబాను నమ్మడం మొదలుపెట్టాను. ప్రతి గురువారం మా ఊరిలోని బాబా మందిరానికి వెళ్ళేదాన్ని. ఆ తరువాత బాబా దయవల్ల నాకు మంచి సంబంధం దొరికి వివాహం జరిగింది. నాతోపాటు మావారు కూడా ప్రతివారం బాబా మందిరానికి వచ్చేవారు. వివాహమైన రెండున్నర సంవత్సరాల తరువాత నేను గర్భవతినయ్యాను. ఏడవ నెల వచ్చేవరకు అంతా బాగానే ఉంది. ఆ తరువాత నాకు బీపీ ఎక్కువ అయింది. కడుపులో బిడ్డ సరిగా తిరుగుతున్నట్టు అనిపించక డాక్టర్ దగ్గరకు వెళితే, “ఉమ్మనీరు తగ్గింది. ఇకనుంచి వారానికి ఒకసారి ఐవి ఫ్లూయిడ్లను సెలైన్‌తో పాటు ఎక్కించాలి” అని చెప్పి డెలివరీ వరకు ఫ్లూయిడ్లు ఎక్కించారు. బాబాపై నమ్మకం ఉంచి మందులు వాడసాగాను.
ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. నా డెలివరీ డేట్‌కి 5 రోజుల ముందు మా డాక్టర్ నాతో, “నాకు ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉంది, రావడానికి వారంరోజులు అవుతుంది” అని చెప్పి, నాకు డెలివరీ చేయమని వేరే డాక్టరుకు చెప్పింది. కానీ, నాకేమో మా డాక్టరే డెలివరీ చేస్తే బాగుంటుందని కోరిక. మావారు కూడా ‘మన డాక్టర్ చేస్తేనే బాగుంటుంద’న్నారు. అందువల్ల మా డాక్టర్ వచ్చేవరకు వెయిట్ చేస్తానని ఈ డాక్టరుతో చెబితే, “ఆ డాక్టర్ వచ్చేవరకు ఆగితే బిడ్డ వెయిట్ తగ్గే అవకాశం ఉండవచ్చు” అని చెప్పింది. అయినప్పటికీ నేను బాబా మీదనే నమ్మకం ఉంచి ప్రతిరోజూ చెకప్ చేయించుకుంటూ మా డాక్టర్ వచ్చేవరకు వేచివున్నాను. వారం రోజుల తరువాత మా డాక్టర్ వచ్చాక డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. కానీ, ‘నాకు ఆపరేషన్ అంటే చాలా భయమనీ, నార్మల్ డెలివరీకి అవకాశముంటే చెయ్యమనీ’ చెప్పాను. ఆ సమయంలో డాక్టర్లు నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయకుండా దాదాపు అందరికీ సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. పైగా నాకు నొప్పులు కూడా రావట్లేదు. అందువల్ల, ‘ఆపరేషన్ అయితేనే బెటర్’ అని డాక్టర్ చెప్పారు. కానీ నేను బాబాపై భారం వేసి నొప్పులు రావడం కోసం ఇంజక్షన్ తీసుకున్నాను. నాతోపాటు ఇంకో పేషంట్ కూడా నొప్పులు రావడానికి ఇంజక్షన్ తీసుకున్నారు. కానీ ఆమె నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్ చేయించుకుంది. నాకు మరుసటిరోజు నొప్పులు మొదలయ్యాయి. ఈలోపు డాక్టర్ ప్రతి రెండు గంటలకు ఒకసారి వచ్చి, “కాసేపు చూసి ఆపరేషన్ చేస్తాను” అంటుండేవారు. కానీ నేను బాబాపై భారంవేసి, బాబా ఊదీని నుదుటికి పెట్టుకుని, ఊదీ ప్యాకెట్టుని తలక్రింద పెట్టుకుని నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేశాను. మా అమ్మావాళ్ళు కూడా “ఇంత మొండితనం వద్దు, ఆపరేషన్ చేయించుకో!” అన్నారు. కానీ, నేను బాబాపై నమ్మకముంచి ఎవరిమాటా వినలేదు. ఆరోజు అర్థరాత్రిపూట నొప్పులు ఎక్కువై నాకు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది అయింది. ఆ సమయంలో డాక్టర్ హాస్పిటల్ పైనే ఉన్న తన ఇంట్లో నిద్రపోతున్నారు. నా పరిస్థితి చూసి నర్సులు హడావిడిగా నన్ను లేబర్ రూములోకి తీసుకెళ్ళి, వెంటనే ఆక్సిజన్ పెట్టారు. బిపి 240కి చేరింది. మావాళ్ళందరూ చాలా భయపడ్డారు. నేను బాబాను తలచుకుంటూ ఉన్నాను. కాసేపట్లో నర్సులు నాకు నార్మల్ డెలివరీ చేశారు. బాబానే ఆ నర్సుల రూపంలో వచ్చి నన్ను కాపాడారు. ఇంతలో మా డాక్టరుకి సమాచారం అందటంతో క్రిందికి వచ్చి, తనను ముందుగానే లేపనందుకు నర్సులను కోప్పడ్డారు. ఏదైతేనేమి, క్రిటికల్‌గా ఉన్న డెలివరీ సక్సెస్ అయింది. బాబు వెయిట్ కొంచెం తక్కువైనా బాబా దయవల్ల ఆరోగ్యంగా పుట్టాడు. డాక్టర్ నన్నేమో మొండిదానిననీ, బాబునేమో గట్టివాడనీ మెచ్చుకున్నారు. నేనైతే ‘ఇదంతా బాబా లీల’ అనుకున్నాను. ఇప్పటికీ ఈ బాబా లీల నా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. “థాంక్యూ వెరీ మచ్ బాబా. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను”. సుదీర్ఘమైన నా అనుభవాన్ని చదివినందుకు సాయిబంధువులకు నమస్కారాలు.
ఎంతటి కష్టంలోనైనా పిలిస్తే, సాయి పలుకుతాడు, ఆదుకుంటాడు
నేను ఒక సాయి భక్తుడిని. ప్రతీ మనిషికి తొలి గురువులు తల్లిదండ్రులే. వాళ్లు నేర్పిన అనేక విషయాలు చిన్నప్పుడే నా మనసులో బలంగా నాటుకుపోయాయి. వాటిలో, సాయిపై అపార నమ్మకం, భక్తి ఒకటి. ఇవి నా తల్లి నాకు నేర్పిన పాఠాలు. సాయి వల్లనే చిన్నప్పటినుండి నేను అనేక అపాయాల నుంచి బయటపడ్డాను. అందులో ఒకటి జలగండం. దానినుంచి నేను మూడుసార్లు సాయి దయతో తప్పించుకుని క్షేమంగా తిరిగి వచ్చాను. చిన్నప్పుడు నేను చదివే స్కూలు మా గ్రామం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఒక ఆదివారంనాడు ప్రైవేట్ క్లాసుకని స్కూలుకు వెళ్ళాను. క్లాసు పూర్తయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లకుండా అక్కడికి దగ్గరలో ఉన్న వాగులో స్నానం చేసేందుకు నా స్నేహితులతో పాటు దిగాను. కొద్దిసేపటికి ఈత రాని నేను నీళ్ళలో మునిగిపోసాగాను. మునుగుతు, తేలుతూ కొంత లోతుల్లోకి వెళ్తున్నాను. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతోంది. తక్షణమే, "ఎంతటి కష్టంలోనైనా పిలిస్తే, సాయి పలుకుతాడు, ఆదుకుంటాడు" అని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే నేను బాబా స్మరణ చేయడం మొదలుపెట్టాను. ఇంతలో ప్రక్కనే ఉన్న ఒక పెద్దాయన వచ్చి నన్ను బయటకు లాగి ఒడ్డుకు చేర్చాడు. అంతేకాదు, ఈత రాకపోయినా నీళ్లలో దిగినందుకు నా చెంపమీద కొట్టాడు. అలా బాబా దయవల్ల ఆనాడు నేను రక్షించబడ్డాను. బాబా స్మరణ మరణాన్ని తప్పిస్తుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా కృపతో తగ్గిన కడుపునొప్పి
నేనొక బాబా భక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నాకు ఒకరోజు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. సమయానికి ఇంట్లో టాబ్లెట్లు కూడా లేవు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. అయినా సరే నొప్పి తగ్గలేదు. రోజంతా నొప్పితో బాధపడుతూనే ఉన్నాను. దాంతో మరోసారి బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని మరికొన్ని ఊదీనీళ్లు త్రాగి, "బాబా! ఈ కడుపునొప్పి తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. అద్భుతం! ఐదు నిమిషాల్లో కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా! మమ్మల్ని ఎప్పుడూ ఇలానే రక్షిస్తూ ఉండండి తండ్రీ. ఎప్పటినుంచో నేను అనుభవిస్తున్న మానసిక వేదన నుంచి నాకు విముక్తి కలిగించి, నా మనస్సుకు ప్రశాంతతను చేకూర్చు తండ్రీ. నిన్నే నమ్ముకుని జీవిస్తున్న మాకు అడుగడుగునా మనోధైర్యాన్ని ప్రసాదించు తండ్రీ. తప్పకుండా మీరు నా సమస్యను పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తండ్రీ".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤🌹😊🌼
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteBaba naku menalludu ni prasadinchu thandri
ReplyDeleteBaba na badha teerchu thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteBaba chandana mental health bagu cheyyi tandri
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi sai building mede dani badya tha meka appa gistunnanu pl baba
ReplyDelete