సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 883వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాలో ఐక్యం
2. ఎల్లప్పుడూ మా వెంట ఉండి మమ్మల్ని నడిపించే బాబా
3. బాబా కృపతో తగ్గిన నొప్పి

బాబాలో ఐక్యం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ, సచ్చిదానంద సద్గురు సాయినాథునికి, భక్తవత్సలుడైన నా సాయితండ్రికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటోంది. ‘నా సాయితండ్రి ఎంతటి దయామయుడు!’ అని కళ్ళవెంట ఆనందభాష్పాలు వర్షిస్తున్నాయి. నేను ఇంతకుముందు నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. బాబా మళ్ళీ మళ్ళీ తమ అనుగ్రహాన్ని కురిపించి, తమ లీలలను చూపించి ఆ అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిబంధువులందరితో పంచుకోవటానికి అవకాశమిస్తున్నారు. 2021, జులై 20, మంగళవారం, తొలి ఏకాదశి పండుగరోజు సాయంత్రం 7 గంటలకు మా అమ్మమ్మగారు బాబాలో ఐక్యమయ్యారు. ఆ బాబా లీలను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను.


మా అమ్మమ్మ వయస్సు 94 సంవత్సరాలు. అంత వయస్సున్నప్పటికీ మా అమ్మమ్మ చాలా ఆరోగ్యంగా ఉండేవారు. జులై 19వ తేదీ, సోమవారం ఉదయం నేను ‘శ్రీగురుచరిత్ర’ పారాయణ మొదలుపెట్టాను. శనివారం గురుపౌర్ణమినాటికి పారాయణ పూర్తిచేద్దామనుకున్నాను. సోమవారం ఉదయం పూజ చేసుకుని, శ్రీగురుచరిత్రలో కొన్ని అధ్యాయాలు పారాయణ చేసి, బాబాకు ఆరతి ఇచ్చాను. ఆ మధ్యాహ్నం 12 గంటల నుండి మా అమ్మమ్మ ‘తనకు గుండెల్లో మంటగా ఉందనీ, తాను ఇక బ్రతకన’నీ నాతో చెప్పి బాధపడింది. మేము తనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనుకుని, మంగళవారం సాయంత్రం వరకు తనకు టాబ్లెట్లు, సిరప్ ఇస్తూ, ఎలక్ట్రాల్ నీళ్ళు పడుతూ ఉన్నాము. కానీ ఆమె బాధ మాత్రం తగ్గలేదు. మంగళవారం సాయంత్రం నేను గురుచరిత్ర ఒక్క పేజీ చదువుకుని, బాబాకు నమస్కరించుకుని మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి కూర్చున్నాను. అప్పుడు కూడా అమ్మమ్మ బాగా బాధపడుతూ, “నేనీ బాధ భరించలేకపోతున్నాను. నాకు చనిపోవటానికి ఏదైనా మందు ఇవ్వు. లేకపోతే, నన్ను పైకి తీసుకెళ్ళమని బాబాతో చెప్పు” అంటూ బాధతో నావైపు చూస్తూ అడిగింది. నాకు చాలా బాధ కలిగి, పూజగదికి వెళ్ళి బాబా దగ్గర కూర్చుని, “బాబా! అమ్మమ్మ బాధ చూడలేకపోతున్నాను. తను ఏదైనా పుణ్యం చేసుకునివుంటే తనకు ఈ బాధనుండి విముక్తిని కలిగించు. ఈ పవిత్రమైన ఏకాదశిరోజున అమ్మమ్మని తీసుకెళ్ళు. తన పాపపుణ్యాల లెక్క నీకు మాత్రమే తెలుసు. తనకు ఏది మంచిదైతే అదే చెయ్యి” అనుకుని, బాబాకు నమస్కరించుకుని, శిరిడీ నుండి తెచ్చిన ఊదీని నీళ్ళలో కలుపుకుని, కొంత ఊదీని చేతిలోకి తీసుకుని అమ్మమ్మ దగ్గర కూర్చున్నాను. అప్పటికి అమ్మమ్మ కొంచెం ప్రక్కకు తిరిగి పడుకుంది. ‘అమ్మమ్మా’ అని పిలిచి, ‘బాబా ఊదీ పెట్టనా?’ అని అడుగుతూ తనను నావైపుకి త్రిప్పాను. అప్పుడు అమ్మమ్మ ఊదీ పెట్టమన్నట్టుగా నావైపు చూసింది. నేను అమ్మమ్మ నుదుటన కొద్దిగా బాబా ఊదీని పెట్టాను. “ఊదీనీళ్ళు త్రాగుతావా?” అని అడిగితే తను నోరు తెరిచింది. అమ్మమ్మ నోట్లో కొంచెం ఊదీనీళ్ళు పోసి, “మళ్ళీ త్రాగుతావా?” అని అడిగాను. తను మళ్ళీ నోరు తెరిచింది. ఇంకొంచెం ఊదీనీళ్ళు తన నోట్లో పోసిన తరువాత అమ్మమ్మ నన్ను అలాగే చూస్తున్నట్లుగా అనిపించేసరికి ఎందుకో భయంగా అనిపించి మా అత్తగారిని పిలిచాను. మా అత్తయ్య నాతో, “అమ్మమ్మ నరాలు లాగేస్తున్నాయి, తన ప్రాణం వెళ్ళిపోతోంది” అని అన్నది. తరువాత మిగతా ఊదీనీళ్ళను మా అత్తయ్య, మా చిన్నమామయ్య, మా కుటుంబసభ్యులందరూ తలా కొంచెం అమ్మమ్మ నోట్లో పోశారు. అప్పుడు అమ్మమ్మ తుదిశ్వాస విడిచింది. బాబా దయవలన అమ్మమ్మ కేవలం రెండు రోజులు స్వల్పమైన బాధను అనుభవించి, బాబా ఊదీని ధరించి, ఊదీతీర్థాన్ని సేవించి బాబాలో ఐక్యమైంది. బాబాలో లీనమైందని ఎలా చెప్తున్నానంటే, బాబా ఊదీకి మించి పవిత్రమైనది ఏముంది? ఏకాదశి లాంటి పవిత్రమైనరోజున, పరమ పవిత్రమైన బాబా ఊదీని ధరించి ఈ లోకాన్ని వీడటం కన్నా గొప్ప  విశేషమేముంటుంది? తను వెళ్ళిపోయేముందు అమ్మమ్మ చేత కొంచెంసేపు సాయినామం చేయించాను. అమ్మమ్మకు అది అంతిమ సమయమని తెలిసిన బాబా, ‘ఊదీ పెట్టి, తీర్థమివ్వు’ అనే ప్రేరణను నాలో కలిగించి, అమ్మమ్మకు ముక్తిని ప్రసాదించారు.


“బాబా! మేము నీ బిడ్డలం. నీ అనుగ్రహమనే నీడలో మమ్ము చల్లగా ఉంచు. మా చేయి పట్టుకుని మమ్ము నడిపించు. మాకు నీవే దిక్కు. నీవే మా ధైర్యం. నీవే మాకు ఆధారం. బాబా మమ్ములను నీ పాదాల దగ్గర ఉంచు. మా మనసెప్పుడూ నీయందే లగ్నమయ్యేలా అనుగ్రహించు”.


ఎల్లప్పుడూ మా వెంట ఉండి మమ్మల్ని నడిపించే బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ముందుగా, సాయిభక్తులకు మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంగీత. మేము నిజామాబాద్‌లో నివసిస్తున్నాము. ఈ బ్లాగులో ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలు చదువుతూ నేను ఎంతో ఆనందం పొందుతున్నాను. వాటిని చదివాక నేను కూడా ఇదివరకు ఒక అనుభవాన్ని పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మావారికి రోజూ రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టేది కాదు. ఆయన నిద్రపోయేసరికి రాత్రి రెండు, మూడు, ఒక్కోసారి నాలుగు గంటలు కూడా అవుతుండేది. ఈ విషయమై నేను, "బాబా! మీ దయవల్ల మావారికి మంచిగా నిద్రపడితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు మావారికి బాగా నిద్రపడుతోంది. "థాంక్యూ బాబా".


మరో అనుభవం: ఒకసారి నా అరచేయి బొటనవేలు దగ్గర చాలా నొప్పి చేసింది. అందువల్ల ఏ పని చేయాలన్నా నాకు ఇబ్బందిగా ఉండేది. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల నా చెయ్యినొప్పి పూర్తిగా తగ్గిపోతే నా ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. అంతే, బాబా కృపవల్ల నా చెయ్యినొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".

శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా కృపతో తగ్గిన నొప్పి

నేనొక సాయిభక్తురాలిని. కొన్నిరోజుల క్రితం నోరు తెరిస్తే కుడివైపంతా (అంటే దంతాల మూలన) నాకు నొప్పిగా ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇష్టంలేక, కొద్దిగా బాబా ఊదీని తీసుకుని, "బాబా! ఈ ఊదీని నొప్పి ఉన్న చోట పెడుతున్నాను. మీ కృపతో నొప్పి తగ్గితే, ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అలా రోజూ బాబా ఊదీ పెట్టుకునేసరికి మూడు రోజుల్లో నొప్పి తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా. మీ దయవల్ల వ్యాక్సిన్ రెండు డోసులూ వేయించుకున్నాను. అందుకు కూడా మీకు ధన్యవాదాలు బాబా".

12 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌸😃🌺🌼😊🌹❤😀

    ReplyDelete
  3. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  4. Namaskaram to all sai devotees, Please pray for my job. If, I got permanent job. I will post my experience in this blog.
    Thank you all.
    Om sri sainadhaya namah.

    ReplyDelete
  5. Om sai ram baba Amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Baab karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  7. షిరిడి సాయి నాథ నీవే కలవు నీవు తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో.. నీ కరుణా కటాక్ష వీక్షణాలతో నే మేము ఇలా మంచిగా ఉన్నాము

    ReplyDelete
  8. సాయి దేవా నమస్కారాలు నీవే కలవు నీవు తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో నీ కరుణ తోనే నా అనారోగ్యం రూపుమాపి నిర్మూలించ బడి నందుకు వేల కోట్ల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బాబా..

    ReplyDelete
  9. సాయి బాబా.. శరణం.. నీవే కలవు నీవే తప్ప మాకు ఎవరు లేరు ఈ లోకంలో.. నీ ప్రసాదం.. నీ వరప్రసాదం. నీ బిడ్డ.. మీ వరం చేత పుట్టిన సాయి చరణ్ తేజ్ అనారోగ్యం రూపుమాపి నందుకు, నిర్మూలించ బడి నందుకు మీకు శతకోటి వందనాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సాయీశ్వర.

    ReplyDelete
  10. సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
    మా చెల్లమ్మ రాధికా సిరి కి పండంటి కొడుకు పుట్టినందుకు అందరకి మంచి ఆరోగ్యం బాగున్నందుకు శత కోటి నమస్కారాలు సాయిశ్వరా..

    ReplyDelete
  11. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo