1. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సాయి
2. ఎటువంటి ఆందోళననైనా పారద్రోలేది బాబానే
3. కరోనా నుంచి రక్షించిన బాబా
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సాయి
అందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నకి నా ధన్యవాదాలు. నేనొక చిన్న సాయిభక్తురాలిని. నేను బెంగళూరులో ఉంటాను. అసలు సాధ్యం కాదు అనుకున్నదాన్ని బాబా సుసాధ్యం చేసి చూపించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అది చిన్న కంపెనీ. కానీ నేను వర్క్ చేసే క్లయింట్ కంపెనీ మాత్రం మల్టీ నేషనల్ కంపెనీ. నాకు ఎప్పటినుండో ఆ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. కానీ నాకున్న నాలెడ్జ్‌కి ఆ కంపెనీలో ఉద్యోగం రావడం కష్టం అనిపించేది. నేను బాబాతో ఎప్పుడూ చెప్పేదాన్ని, “అది నా కలల కంపెనీ, అందులో నాకు ఉద్యోగం వచ్చేలా చూడు సాయీ” అని. దాదాపు 3 సంవత్సరాల నుండి ఆ కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను. ఈమధ్య ఎందుకో ‘ఇంక ఆ కంపెనీలో ఉద్యోగం రాదులే’ అని ఆశలు వదిలేసుకున్నాను. “ఏమో బాబా, నాకు రాసిపెట్టి ఉంటే, అందులో నాకు ఉద్యోగం వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే మీరే ఒక దారి చూపిస్తారు” అనుకుని ఇంక మర్చిపోయాను. నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను. ఉన్నట్టుండి ఒకరోజు (2021, జులై 18వ తేదీన) ఆ కంపెనీ మేనేజర్ నాకు కాల్ చేసి, “నీకు మా కంపెనీలో జాబ్ ఆఫర్ చేస్తున్నాము, ఓకేనా?” అని అడిగారు. అసలు ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఆఫర్ చేస్తారని నేనస్సలు ఊహించలేదు. ఆ విషయమే అడిగితే, “3 సంవత్సరాల నుండి నీ వర్క్ చూస్తున్నాము, అందుకే ఏ ఇంటర్వ్యూ లేకుండా ఈ ఆఫర్ ఇస్తున్నాము” అని చెప్పారు. వాళ్ళు అలా చెప్పగానే బాబాకు మనసులో ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నానో నాకే తెలియదు. మనం మన కోరికలను, ఇష్టాలను మర్చిపోయినా బాబా మాత్రం మనపై ప్రేమతో వాటిని గుర్తుపెట్టుకుని సరైన సమయం వచ్చినప్పుడు మనకు ప్రసాదిస్తారు. నాకు ఆ కంపెనీలో జాబ్ వస్తే నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటానని అనుకున్నాను. అనుకున్నానే గానీ, ఇలాంటిరోజు ఒకటి వస్తుందని నేను అసలు ఊహించలేదు. “బాబా, నేను ఆ ఉద్యోగంపై దాదాపు ఆశలన్నీ వదులుకున్నాను తండ్రీ. కానీ మీరు నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకుని నా కోరిక నెరవేర్చారు. చాలా చాలా థాంక్స్ సాయీ. ఎప్పుడూ మీ నామస్మరణ నా మనసులో నడిచేలా చూడు సాయీ! మరొక్కసారి థాంక్యూ సాయీ!”
మరొక చిన్న అనుభవం: ఇటీవల మా అబ్బాయికి ఆన్లైన్ క్లాసులు జరుగుతుండటం వల్ల తను ల్యాప్‌టాప్ ముందు చాలాసేపు కూర్చోవాల్సి వస్తోంది. ఒకరోజు ఇలాగే మధ్యాహ్నం క్లాసులు అయిపోయిన తరువాత మళ్ళీ సాయంత్రం ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీ అని ల్యాప్‌టాప్ ముందు మరో రెండుగంటలసేపు కూర్చున్నాడు. దాంతో ఆరోజు రాత్రి వాడికి బాగా తలనొప్పి వచ్చి నిద్ర కూడా పోలేకపోయాడు. నేను బాబాను ప్రార్థించి, తనకు బాబా ఊదీ పెట్టి, ఒక ట్యాబ్లెట్ కూడా ఇచ్చి, “బాబా! మీ అనుగ్రహంతో తనకు త్వరగా తలనొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయానికి తన తలనొప్పి తగ్గిపోయి ఎప్పటిలాగే క్లాసులు అటెండ్ అయ్యాడు. “ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించు సాయీ! మరొక్కసారి థాంక్యూ సాయీ!”
ఎటువంటి ఆందోళననైనా పారద్రోలేది బాబానే
ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి, సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు పద్మావతి. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు, ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్న మరో రెండు అనుభవాలను పంచుకోబోతున్నాను. 2021, జులై 16 రాత్రి మావారు తాను అప్పటికే ఇన్సులిన్ చేసుకున్న విషయం మర్చిపోయి మరోసారి ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఆ మొదటి ఇంజక్షన్ విషయం నాకు గుర్తుకొచ్చింది. అప్పటికే తను ఇంజక్షన్ చేసుకుని రెండు గంటలైంది. ఆ సమయంలో ఏమి చెయ్యాలో, సహాయం కోసం ఎవరికి ఫోన్ చెయ్యాలో తెలియలేదు. మావారు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే 70కి పడిపోయి ఉంది. షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గితే కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. దాంతో నేను చాలా భయపడి బాబాను తలచుకుని, ఈ సమస్యకు పరిష్కారం కోసం గూగుల్‌లో వెతికితే, ఫ్రూట్ జ్యూస్, షుగర్ క్యాండీ మొదలైనవి తీసుకోమని అందులో ఉంది. వెంటనే మావారికి దానిమ్మపండు జ్యూస్‌తో పాటు కొద్దిగా పంచదార ఇచ్చాను. అయినా మావారి గురించి ఇంకా టెన్షన్‌గానే అనిపించింది. ఎందుకంటే, మామూలుగా రాత్రిపూట తను తీసుకునే ఇన్సులిన్ డోస్ 24 యూనిట్స్. ఆరోజు తను రెండుసార్లు ఇన్సులిన్ తీసుకున్నారు, కాబట్టి మొత్తం డోస్ 48 యూనిట్లు అయింది. దాంతోపాటు ఒక టాబ్లెట్ కూడా వేసుకున్నారు. అంతా కలిపి తనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని నాకు భయం వేసి, “బాబా, ఈ కష్టం నుండి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి” అని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. రాత్రి 12.30కి మళ్ళీ షుగర్ టెస్ట్ చేస్తే 109కి వచ్చింది. ఇన్సులిన్ ఎఫెక్ట్ ఉదయం వరకు ఉంటుంది. మళ్ళీ బాబాకు నమస్కరించుకుని, ఒంటిగంటకు పాలల్లో రెండు స్పూన్ల షుగర్, బాబా ఊదీ కలిపి మావారికి ఇచ్చాను. 2.30కి మళ్ళీ షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ లెవెల్స్ 177కి పెరిగాయి. ఇన్సులిన్ ఎఫెక్ట్ ఇంకో ఆరు గంటల పాటు ఉంటుంది, ఏమి చెయ్యాలా అని చిన్న స్పూన్ తేనె ఇచ్చి పడుకోమన్నాను. ఉదయం 7 గంటలకు షుగర్ లెవెల్స్ నార్మల్‌కి వచ్చాయి. మావారిని కాపాడినందుకు మనస్ఫూర్తిగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబాకు చెప్పినట్టుగా ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధికి పంపిస్తున్నాను. “ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి బాబా. సదా మమ్మల్ని మీరు కాపాడాలి తండ్రీ సాయీశ్వరా, పరమేశ్వరా, పాహిమాం పాహిమాం, రక్షమా రక్షమాం”.
మరొక అనుభవాన్ని కూడా ఇక్కడ పంచుకుంటున్నాను. ఇది జూన్ నెల చివరి వారంలో జరిగింది. కోవిడ్-19 ఎక్కువగా ఉన్న ఈ సమయంలో నాకు ఒళ్ళునొప్పులుగానూ, జ్వరంగానూ అనిపించింది. కొద్దిగా తలనొప్పి కూడా ఉంది. ఇవన్నీ కరోనా లక్షణాలలా అనిపించి బాబాకు నమస్కరించుకుని, డోలో-650 వేసుకుని పడుకున్నాను. ఆరోజు ఆదివారం. రోజంతా కొద్దిగా డల్‌గా అనిపించింది. సోమవారం ఉదయానికి ఆ లక్షణాలు తగ్గాయి. కానీ, 2 రోజుల తరువాత నా ఎడమకన్ను ఎర్రగా అయింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. దోమను చంపితే నా కళ్ళకు అలెర్జీ వస్తుంది. ఆ రాత్రి నిద్రలో దోమను చంపాను. కానీ చెయ్యి కడుక్కోలేదు. కాసేపటికి అదే చేత్తో నేను కన్ను నలుపుకోవడం వల్ల 10 నిమిషాలలో అలెర్జీ వచ్చి కన్ను ఎర్రగా అయింది. దోమను చంపడం వల్ల అలెర్జీ వస్తుందని తెలిసినప్పటికీ ఈ కోవిడ్ సమయంలో ఒకవేళ కరోనా ఎటాక్ అయిందేమోనని భయం వేసి బాబాకు మ్రొక్కుకుని, కంటి స్పెషలిస్టుని కలిశాను. డాక్టర్ నా కళ్ళను పరీక్షించి, “అంతా బాగుంది, ఈ అలెర్జీకి కోవిడ్‌తో ఏమీ సంబంధం లేదు” అని చెప్పి, కంటి ఎరుపుదనం తగ్గడానికి డ్రాప్స్ ఇచ్చి పంపారు. ఆ డ్రాప్స్ వాడటంతో మరుసటిరోజుకి ఎరుపుదనం తగ్గి కన్ను నార్మల్‌గా అయింది. ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “బాబా! మమ్మల్నందరినీ ఈ కోవిడ్-19 నుండి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే, నాకున్న ఈ ఆరోగ్య సమస్యల నుండి నన్ను కాపాడండి తండ్రీ!”
కరోనా నుంచి రక్షించిన బాబా
నా పేరు లలిత. 2021, జూన్ 14న నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అమ్మ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండగా, నాన్నకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని డాక్టర్లు చెప్పినందువల్ల నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నాకు చాలా భయమేసినప్పటికీ నేను సాయిబాబాను నమ్ముకున్నాను. సాయీమా ప్రతిరోజూ ఏదో ఒక మెసేజ్ రూపంలో నా సమస్యకు సమాధానం చెప్పేవారు. ఆ క్రమంలో సాయిమా ఒకసారి "ఒక వారంలో అంతా బాగుంటుంది" అని చెప్పారు. సాయీమా చెప్పినట్లే, ఒక వారంలో నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ కష్టకాలంలో శ్రీలక్ష్మిగారు అమ్మానాన్నల ఆరోగ్యం కోసం 'సాయి రక్ష' గ్రూపులో బాబాకు ప్రార్థన చేయించారు, ఇంకా ధూప్ ఆరతి కూడా చేయించారు. తోటి భక్తులందరి ప్రార్థనలు ఫలించి అమ్మానాన్నలు కరోనా మహమ్మారి నుండి బయటపడ్డారు. సాయీమా ఆశీస్సులతో ఇప్పుడు మేమంతా క్షేమంగా ఉన్నాము. "మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయీమా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌼
ReplyDelete831 days
ReplyDeletesairam
Om sai ram baba amma arogyam bagundali thandri
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete