1. ఏ ఇబ్బందినైనా తీర్చేది బాబానే
2. కరోనా భయం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా3. భరించలేని నొప్పిని తగ్గించిన బాబా
ఏ ఇబ్బందినైనా తీర్చేది బాబానే
సాయినాన్నకి శతకోటి వందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. ఈమధ్య ఒకసారి మా డ్రైవరు ఊరికి వెళ్ళొచ్చాడు. బహుశా బస్సు ప్రయాణం వల్లనేమో, తను జలుబుతో ఇబ్బందిపడుతూ నీరసంగా ఉన్నాడు. అప్పుడు నేను, "బాబా! తను ఆరోగ్యంగా ఉండి, మా అందరికీ ఏ ఇబ్బందీ లేకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన తను క్షేమంగా ఉన్నాడు. ఏ ఇబ్బందీ కలగలేదు. "ధన్యవాదాలు బాబా".
ఈమధ్యకాలంలో నా చెక్‌బుక్ కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! చెక్‌బుక్ ఎక్కడ పెట్టానో తెలియడం లేదు. ఏమైనా సంతకం చేసిన చెక్కులు ఉంటే, సమస్య అవుతుంది. మీరే ఎలాగైనా అది కనిపించేలా చేయండి నాన్నా. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. చాలారోజులు టెన్షన్ పడ్డాక 2021, జూలై 20న ఆ చెక్‌బుక్ నేను ఎప్పుడూ పెట్టని చోట కనిపించింది. బాబాను నమ్మితే సాధ్యం కానిది ఏముంది? "ధన్యవాదాలు బాబా".
ఈమధ్య మా అబ్బాయి అమెరికా వెళ్లాడు. కరోనా వలన చాలా చెక్ చేస్తున్నందువల్ల నేను, "బాబా! ఇమ్మిగ్రేషన్ తదితర ఏ ఇబ్బందులు లేకుండా తను క్షేమంగా అమెరికా చేరుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. మా అబ్బాయికి ఏ ఇబ్బందీ లేకుండా బాబా అన్నీ చూసుకున్నారు. "ధన్యవాదాలు బాబా".
చివరిగా ఒక విషయం.. నేను ఈ అనుభవాలను పంచుకోవటానికి ముందు ఒక డాక్యుమెంట్ కనపడని కారణంగా ఒక గంటసేపు చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకిలా జరుగుతోందని ఆలోచిస్తే, నా అనుభవాలను ఇంకా పంచుకోలేదని అర్థమైంది. వెంటనే బాబాతో చెప్పుకున్నాను. మరుక్షణంలో ఒకచోట చూడమన్న ప్రేరణ కలిగి అక్కడ చూస్తే నాకు కావాల్సిన డాక్యుమెంట్ కనిపించింది. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
కరోనా భయం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులైన సాయికి నా నమస్కారం. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోబోతున్నాను. 2021, జులై 19న మా అమ్మాయికి కొంచెం జ్వరంగా అనిపించి పని మధ్యలో కాసేపు పడుకుంది. నేను భయపడి టెంపరేచర్ చెక్ చేస్తే, థర్మామీటరులో 100.7 డిగ్రీలు చూపించింది. అయితే, ఆ థర్మామీటర్ నుండి రావాల్సిన శబ్దం రాలేదు. అది అంతకుముందు ఒకసారి క్రింద పడిపోయింది. అందువల్ల, "అది సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా, వేరే థర్మామీటరుతో చెక్ చేయి" అన్నారు మావారు. సరేనని, వేరే థర్మామీటరుతో చెక్ చేస్తే, నార్మల్ వచ్చింది. మా అమ్మాయికి కూడా ఇంకేం సమస్యలున్నట్లు అనిపించలేదు. కానీ నా గత అనుభవాల దృష్ట్యా ఒకసారి తనకి కోవిడ్ టెస్ట్ చేయిస్తే మంచిదని నాకు అనిపించింది. దాంతో ముందుగా బాబాకు నమస్కరించుకుని, "నెగెటివ్ రావాల"ని చెప్పుకుని టెస్ట్ చేసేవాళ్లని సంప్రదిస్తే, "ఈరోజుకి టెస్టులు అయిపోయాయి. మళ్ళీ రేపే చేస్తాం" అన్నారు. దాంతో మా అమ్మాయి ఐసోలేషన్‌లో ఉండడం మొదలుపెట్టింది. అయితే తప్పనిసరై నేను, మావారు దేనికో ఒకదానికి ఆ గదిలోకి వెళ్ళొస్తుండేవాళ్ళం. ఎందుకంటే, 'తనకు కోవిడ్ ఏమీ ఉండద'ని మా ఇద్దరి నమ్మకం. కానీ మా అమ్మాయి మాత్రం 'పదేపదే లోపలికి ఎందుకు వస్తున్నార'ని మమ్మల్ని కోప్పడేది. మరుసటిరోజు మా అమ్మాయిని కోవిడ్ టెస్టుకి తీసుకెళ్తే, అక్కడ రాపిడ్ టెస్ట్ చేయట్లేదు. ‘RTPCR మాత్రమే చేస్తామ’న్నారు. ఆ టెస్ట్ రిపోర్ట్ వెంటనే రాదు. ‘అప్పటివరకు ఈ టెన్షన్ భరించాలా దేవుడా’ అనుకున్నాం. ఇకపోతే, కోవిడ్ టెస్ట్ చేసే వ్యక్తి కొంచెం తలతిక్కగా మాట్లాడుతూ నన్ను కూడా టెస్ట్ చేయించుకోమన్నాడు. బాబా దయవల్ల మా అమ్మాయికి కరోనా ఉండదనే నమ్మకంతో నేను నాకేమీ వద్దని టెస్ట్ చేయించుకోడానికి నిరాకరించాను. అతను మా అమ్మాయికి టెస్ట్ చేసి తనతో, "కొంచెం అనుమానమే. జాగ్రత్త, ఐసోలేషన్‌లో ఉండు" అని చెప్పాడు. అసలే ఏ విషయంలో అయినా ఖచ్చితంగానూ, కఠినంగానూ ఉండే మా అమ్మాయి అతని మాటలకు మరింత అనుమానంతో గదిలో సిన్సియర్‌గా ఉండడం మొదలుపెట్టింది. బాబా దయవల్ల తనకి ఎలాంటి లక్షణాలూ లేవని, ఏ సమస్యా ఉండదని మాకు తెలిసినా తను మాత్రం టెన్షన్ పడుతూ ఉండేది. ఆ రాత్రి 9.30, 10 గంటల మధ్యలో వస్తుందన్న రిపోర్ట్ రాలేదు సరికదా, మరుసటిరోజు (జూలై, 21) ఉదయానికి కూడా దానికి సంబంధించిన మెసేజైనా రాలేదు. 'ఈ గవర్నమెంట్ మెసేజీలు సరిగ్గా రావట్లేదు. అది వచ్చేవరకూ తనీ టెన్షన్ పడుతూనే ఉంటుంది. అది ఎప్పటికి వస్తుందో?' అనుకున్నాం. కానీ అదృష్టవశాత్తూ సాయినాథుని దయవల్ల మా అమ్మాయికి ప్రేరణ కలిగి వెబ్సైట్‌లో చూస్తే, తనకి 'నెగిటివ్' అని కనిపించింది. అంతే, చాలా ఉపశమనంగా అనిపించి బాబాకు ధన్యవాదాలు తెలుపుకుని, నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకోవడానికి వ్రాయడం కూడా మొదలుపెట్టాను. "ధన్యవాదాలు బాబా. నా మనసులో ఉన్న మరొక్క కోరిక కూడా తీరేలా చూడండి సాయీ. ఎల్లప్పుడూ మాతోనే ఉంటూ మమ్మల్ని అనుగ్రహించు సాయితండ్రీ. తల్లివి, తండ్రివి అన్నీ అయిన మీకు తప్ప ఎంత దగ్గరివాళ్ళైనా ఇతరులతో కొన్ని విషయాలు పంచుకోకూడదని తెలిసింది. ఇక నువ్వే మాకు దిక్కు అయి అన్ని విషయాలలో నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతూ ఉండు స్వామీ. కరోనాని పూర్తిగా ప్రపంచం నుండి తరిమేయండి సాయీ".
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు!
భరించలేని నొప్పిని తగ్గించిన బాబా
'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ప్రతిరోజూ ఈ బ్లాగ్ ద్వారా బాబా సందేశాన్ని ఆయన భక్తులకు చేరుస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు. ఇకపోతే, ఇటీవల బాబా నాపై చూపిన దయను బాబా అనుమతితో మీతో పంచుకుంటున్నాను. నా పేరు సాయి. తొలి ఏకాదశి సందర్భంగా ముందురోజు ఇంట్లో ఎక్కువ పని ఉండడంవల్ల నేను ఎక్కువ సమయం శ్రమించాల్సి వచ్చింది. రాత్రి నిద్రకుపక్రమించే సమయానికి నా రెండు చేతులు భరింపలేనంతగా నొప్పి పెట్టసాగాయి. దాంతో నేను బాబా ఊదీని నా రెండు చేతులకు పెట్టుకుని, "నొప్పిని తగ్గించమ"ని బాబాను వేడుకున్నాను. అయితే నొప్పి తగ్గలేదు సరిగదా, కొంచెం కొంచెంగా పెరుగుతూ నేను అసలు తట్టుకోలేని స్థితికి చేరుకుంది. అంతటి నొప్పిని నేను ఇంతకుముందు ఎన్నడూ అనుభవించలేదు. బాధతో గట్టిగా అరిచి ఏడవాలని అనిపించింది నాకు. నొప్పితో అర్ధరాత్రి ఒంటిగంట వరకు నాకు నిద్రలేకపోయేసరికి, 'తెల్లవారితే ఏకాదశి ఉపవాసం ఉండాలి, ఈ నొప్పితో ఎలా చేసుకోగలను?' అని ప్రశాంతంగా ఉండలేక చాలా బాధపడ్డాను. నా బాధ చూడలేక మా అమ్మ కూడా నిద్రపోలేదు. అర్థరాత్రి నాకోసం ఒక బట్టముక్కని వేడి చేసి రెండు చేతులకు కాపడం పెట్టింది. అయినా నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను, "ఇక నా వల్ల కావట్లేదు తండ్రీ. ఈ నొప్పి తగ్గి, నేను నిద్రపోవాలి. అలా జరిగితే నా ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత కాసేపటికి నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. ఉదయం లేచేసరికి 80% నొప్పి తగ్గిపోయింది. ఇది నిజంగా బాబా దయ. అసలు అంత నొప్పి తగ్గిందంటే అది కేవలం బాబా కృపే. "థాంక్యూ బాబా. నా తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించు తండ్రీ".
జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
834 days
ReplyDeletesairam
Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete