సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 858వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపాదృష్టి
2. బాబా ఊదీ మహత్యం

బాబా కృపాదృష్టి


నా పేరు లక్ష్మి. మాది హైదరాబాద్. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న బృందానికి బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నాను.


మొదటి అనుభవం: 'అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి' అని అనుకునే మనస్తత్వం నాది. దీనికి నిదర్శనంగా బాబా ఒకరోజు నాకు స్వప్నదర్శనమిచ్చి, "అందరి బాగు నువ్వు కోరుకుంటే, నీ బాగు నేను చూసుకుంటాను" అని అన్నారు. అప్పటినుండి నాకు ఏమైనా సమస్యలు, బాధలు వస్తే, "బాబా! మీరు నాకు మాట ఇచ్చారు తండ్రీ" అని బాబాతో చెప్పుకుంటాను.


రెండవ అనుభవం: ఇప్పుడు చెప్పబోయే ఈ అనుభవం నేను నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. మేము చాలారోజుల నుండి మా పెద్దమ్మాయికి తగిన పెళ్లి సంబంధం కోసం చూస్తున్నాం. కానీ ఒక్క సంబంధమూ కుదరటం లేదు. ఈ విషయమై మేము చాలా బాధపడుతుండేవాళ్ళం. తనకు త్వరగా వివాహం జరగాలని నేను సాయి దివ్యపూజ చేశాను, పారాయణ చేశాను, ఇంకా ఎవరు ఏది చెబితే అది చేశాను. మంచి సంబంధం కోసం పెళ్లిళ్ల బ్రోకరుకి డబ్బులు ఇచ్చాము, పేపర్లో యాడ్ ఇచ్చాము, చుట్టాలకి, చుట్టుప్రక్కల అందరికీ చెప్పాము. ఇది చేశాము, అది చేయలేదు అని లేదు. అన్నీ చేసి చేసి అలసిపోయాము. చుట్టాల్లో, అయినవాళ్ళతో ఎన్ని అవమానాలు పడ్డానో నాకు, నా బాబాకే తెలుసు. అయినా బాబా మమ్మల్ని ఎందుకంత కఠినంగా పరీక్షిస్తున్నారో తెలియదు. మిగతా అన్ని విషయాల్లో బాబా నాకు అనుభవాలు ఇస్తారు, కానీ మా అమ్మాయి పెళ్లి విషయంలో మాత్రం సమాధానం ఇచ్చేవారు కాదు. ఒకరోజు తెల్లవారుఝామున బాబా నా కలలో కనిపించారు. ఆ కలలో నేను, మావారు బాబా ముందు నిలబడి బాగా ఏడుస్తున్నాము. అయినా బాబా సమాధానమేమీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. చాలా బాధపడ్డాం.


ఇలా ఉండగా ఒకసారి నేను, మా చిన్నమ్మాయి మా పక్కింటి ఆంటీవాళ్ళతో కలిసి శిరిడీ ప్రయాణమయ్యాము. మేము ఆరోజు రాత్రి బస్సులో బయలుదేరి మరుసటిరోజు ఉదయానికి శిరిడీ చేరుకున్నాం. ఆ మరుసటిరోజుకి మధ్యాహ్న ఆరతికి టికెట్లు దొరికాయి. అందుకని ఆరోజు మేము బాబా దర్శనం చేసుకున్న తరువాత చుట్టుప్రక్కల ఉన్న మందిరాలన్నీ దర్శించుకుని రాత్రికి తిరిగి శిరిడీ చేరుకున్నాం. ఆ రాత్రి నాకు కలలో, 'నీ మనసుకి ఆనందం కలిగే విషయం జరుగనుంది' అని ఎవరో చెప్తున్నట్లు అనిపించింది. మా అమ్మాయి పెళ్లి విషయం గురించే ఆ కల వచ్చిందేమో అని అనుకున్నాను. అయితే ఆ తరువాత నేను ఆ కల గురించి దాదాపు మర్చిపోయాను. మరుసటిరోజు మధ్యాహ్నం ఆరతికి హాజరయ్యాము. ఆరతి ముగిశాక బాబాను చూసుకుంటూ ముందుకు కదులుతున్నాము. అప్పుడు ఒక అద్భుత సంఘటన జరిగింది. బాబా దగ్గరకు చేరుకుంటున్నప్పుడు కుడివైపు, ఎడమవైపు పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి కదా! నేను అక్కడికి చేరుకునేసరికి హఠాత్తుగా విగ్రహంలోనుంచి బాబా నా వైపు తలతిప్పి నన్ను చూస్తున్నారు. ఆయన శరీరమంతా విగ్రహంలానే ఉంది. తల ఒక్కటి మాత్రం కింద ఇచ్చిన పాత ఒరిజినల్ బాబా ఫోటోలో ఉన్నట్లు సజీవంగా ఉంది. అవే ముఖకవళికలతో బాబా నాకు ప్రత్యక్ష దర్శనమిస్తున్నారు. నేను బాబా వైపు చూస్తున్నాను, బాబా నా వైపు చూస్తున్నారు. నాకు ఏమి జరుగుతోందో అస్సలు అర్థం కావడం లేదు. క్యూ ముందుకు సాగుతూ నేను బయటకు వెళ్తున్నాను. అప్పటివరకు బాబా నా వైపే చూస్తున్నారు. నేను అంతవరకు చూసినదేంటనేది బయటికి వచ్చిన తర్వాతగానీ నాకు అర్థం కాలేదు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. వెంటనే మా అమ్మాయికి, ఆంటీవాళ్లకు జరిగిన సంఘటన గురించి చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు.

మేము ఏప్రిల్ మొదటివారంలో శిరిడీ వెళ్ళాము. ఏప్రిల్ 14న మా పెద్దమ్మాయి పుట్టినరోజు. తను బెంగళూరులో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటోంది. నేను ఏప్రిల్ 13 రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో మా అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వాట్సాప్‌లో వాయిస్ రికార్డ్ పంపించాను. తను ఆ మెసేజ్ అప్పుడు చూసుకోలేదు. మరుసటిరోజు తన పుట్టినరోజు. ఆరోజు శనివారం అయినందున ఆఫీసుకి సెలవు. అందువలన తను కాస్త ఆలస్యంగా నిద్రలేస్తుంది. ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల మధ్యలో ఉన్నట్లుండి హఠాత్తుగా తన శరీరమంతా బిగుసుకుపోయి, కాళ్లుచేతులు బరువెక్కిపోయి వాటిని కదిలించలేకపోయింది. సుమారు ఐదు, పది నిమిషాలపాటు మా అమ్మాయి పరిస్థితి అలాగే ఉంది. ఆ సమయంలో ముందురోజు రాత్రి నేను వాయిస్ రికార్డులో ఏమి మాట్లాడానో అవే మాటలు బాబా నా వాయిస్‌తో తన చెవి దగ్గర చెప్పారు. అది విని మా అమ్మాయి 'మేము హైదరాబాదు నుండి బెంగళూరులోని తన గదికి వచ్చి, తన చెవిలో విషెస్ చెప్పి తనను ఆశ్చర్యపరుస్తున్నామ'ని అనుకుంది. పది నిమిషాల తరువాత తను మామూలు స్థితికి వచ్చింది. తరువాత తను నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్పుడు నేను పొందిన ఆనందం మీ ఊహకే వదిలేస్తున్నాను. నేను శిరిడీలో ఉన్నప్పుడు 'నీ మనసుకు ఆనందం కలిగే విషయం ఒకటి జరుగుతుంది' అని కల వస్తే, మా అమ్మాయి పెళ్లికి సంబంధించినదై ఉంటుందనుకున్నాను. కానీ, బాబా మా అమ్మాయి పుట్టినరోజునాడు స్వయంగా వచ్చి విషెస్ చెప్పి తమ అనుగ్రహం మా అమ్మాయిపై అమితంగా ఉందని తెలియపరిచారు.


మూడవ అనుభవం: మా అమ్మాయికి బెంగళూరు నుండి ప్రమోషన్ మీద పూణేకి బదిలీ అయింది. అక్కడ మేనేజరు మా అమ్మాయిని అందరిముందు అవమానించడం, కించపరచడం, సతాయించడం వంటివి చేస్తూ పలురకాలుగా హింసపెడుతుండేసరికి మా అమ్మాయి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. మళ్ళీ ఒక సంవత్సరం తరువాత తనకి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. అయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి. అతికష్టం మీద ఉద్యోగం చేస్తుండేది. కొద్దిరోజులకి బాబా దయతో తనకి ఇక్కడ చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం, మంచి మేనేజ్‌మెంట్‌తో బెంగళూరులో వచ్చింది. ఇలా బాబా అన్నివిధాలా దయ చూపుతున్నారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం మేము చాలాకాలంగా బాధని అనుభవిస్తున్నాము. ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పాలి.


ఒకప్పుడు నాకు లక్ష్మీప్రసన్న అనే ఆమెతో ఫోనులో పరిచయం అయింది. ఆమె మా అమ్మాయి పెళ్లికోసం ‘సాయి దివ్యపూజ’ చేయమని చెప్పారు. నేను 5 వారాల దివ్యపూజ చేశాను. పూజ పూర్తయిన తర్వాత బాబా నాకు స్వప్నదర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో నేను, లక్ష్మీప్రసన్నగారు ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాము. బాబా మా ఇద్దరి ప్రక్కగా నడుస్తున్నారు. అప్పుడు లక్ష్మీప్రసన్నగారు (నన్ను ఉద్దేశిస్తూ) బాబాను, "తను వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయంగా చాలా నియమంగా, నిష్ఠగా దివ్యపూజ చేసింది. తనకి ఏదైనా సమాధానం చెప్పండి బాబా" అని అడిగింది. అప్పుడు బాబా, "ఇంకా సమయం ఉంది, గవర్నమెంట్!" అని సమాధానం చెప్పారు. ఈ స్వప్నం వచ్చి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతోంది. కానీ మా సమస్య అలానే ఉంది. ఈ సమస్య నుండి బాబా ఎప్పుడు బయటపడేస్తారా అని ఎదురుచూస్తున్నాను. తొందరగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నా సమస్య తీరిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను.


బాబా ఊదీ మహత్యం


ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, ఇతర సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. బాబా అనుగ్రహానికి మారుపేరు ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' అని నాకనిపిస్తుంది. ఎందుకంటే, భక్తుల అనుభవాల ద్వారా ఎంతోమందికి 'బాబా అండగా ఉన్నారని, ఎలాంటి సమస్యలైనా, ఎంతటి బాధలైనా వారి అనుగ్రహంతో తీరుతాయ'న్న పరిపూర్ణ విశ్వాసం కల్పిస్తుంది ఈ 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్'.


ఉగాది మరుసటిరోజు నేను కాలుజారి పడ్డాను. నేను పడుతున్నప్పుడు 'బాబా' అని అరుస్తూ పడిపోయాను. అప్పుడు నా పరిస్థితిని బట్టి నా కాలి ఎముక విరిగి ఉంటుందని నాకు అర్థమైంది. వెంటనే నేను బాబా ఊదీని కాలికి రాసుకుని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని ఆ ఊదీతీర్థాన్ని త్రాగాను. తర్వాత ఆర్ఎంపీ డాక్టరుకి చూపించుకున్నాను. అతను ‘కాలు బెణికింది’ అని చెప్పి, ఐదురోజులకి మందులిచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ పదిరోజులు అవుతున్నా కాలు వాపు తగ్గలేదు. దానివల్ల నేను నడవలేకపోయాను. దాంతో ఎముకల డాక్టరుకి చూపించుకుంటే, ఎక్స్-రే తీసి "గిలక దగ్గర నరం కొద్దిగా చిట్లింది. ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోమ"ని చెప్పి కాలికి బెల్టు ఇచ్చారు. అయితే రెండునెలలవుతున్నా నా కాలినొప్పి తగ్గలేదు. మళ్లీ డాక్టరు దగ్గరకు వెళదామంటే, మొదటిసారి మేము వెళ్లొచ్చిన తరువాత ఆ హాస్పిటల్లో కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారని తెలిసింది. అందుకే నేను భయపడి మళ్లీ డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు. నా కాలినొప్పిని తగ్గించమని నేను బాబాను కూడా అడగలేదు. ఎందుకంటే, ‘నేను ఏదో కర్మ చేసుంటాను. దాని ఫలితాన్ని ఈ రూపంలో అనుభవిస్తున్నాన’ని అనుకున్నాను. అయితే రెండు నెలల తర్వాత కూడా కాలినొప్పి తగ్గకపోయేసరికి నాకు భయం వేసింది. అప్పుడు ఒక గురువారం బాబా ముందు కూర్చుని, "ఎంతోమంది ఆధివ్యాధులను తగ్గించావుగా బాబా. నేను రోజూ మీ ఊదీని మాత్రమే నా కాలికి రాస్తున్నాను. ఒక వారంలో మీ ఊదీ మహత్యంతో నా కాలినొప్పి తగ్గిపోవాలి. లేకుంటే నేను హాస్పిటల్‌కి వెళ్తాను. మీ అనుగ్రహంతో కాలినొప్పి తగ్గితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా అత్యంత దయామయులు, ఆయన ఊదీ మహిమ అపారం. బాబా దయవల్ల నా కాలినొప్పి తగ్గిపోయి, నేనిప్పుడు మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను. మీకొక ముఖ్య విషయం చెప్పాలి. నేను బాబాను "హాస్పిటల్‌కి వెళ్ళనా? లేక, మీ ఊదీతో నయంచేస్తారా?" అని అడిగి, కళ్లు మూసుకుని శ్రీసాయిసచ్చరిత్రలో ఒక పేజీని తెరిచాను. అక్కడ బాబా తమ ఊదీతో ఒక భక్తుని వ్యాధిని తగ్గించిన లీల ఉంది. అందుకే నేను నమ్మకంతో బాబా ఊదీని కాలికి రాసుకున్నాను.


మరో ఊదీ మహిమ: ఒకసారి నా మేనకోడలికి స్కిన్ అలర్జీ వచ్చింది. మా వదిన తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి భయపడి ఏం చేయాలో అర్థంకాక నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్పుడు నేను తనతో, "పాపకి అలర్జీ ఉన్నచోట రోజూ బాబా ఊదీని రాసి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి తీర్థంగా పాపకి ఇవ్వమ"ని చెప్పాను. వాళ్ళు అలాగే చేయసాగారు. నేను బాబాకు నమస్కరించుకుని, "పాపకి వచ్చిన అలర్జీ మీ ఊదీతో తగ్గిపోతే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు తనకు పూర్తిగా తగ్గిపోయింది. అంతా బాబా ఊదీ మహత్యం. ఇంకా నేను మా బంధువులందరితో, ‘ఏదైనా కష్టం వస్తే బాబాను నమ్ముకుని ఊదీ రాసుకోమనీ, కష్టం తీరితే తమ అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోమ’నీ చెప్పాను.


ఓం శ్రీ సాయినాథాయ నమః.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


11 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌼

    ReplyDelete
  3. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  4. Om sai ram baba Amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba ee gadda ni tondarga karginchu thandri please

    ReplyDelete
  6. Baba santosh life bagundali thandri

    ReplyDelete
  7. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  8. 🌟🌺🏵🌺🙏🙏OM SRI SAI RAM🙏🙏🙏🌟🌺🏵🌺

    ReplyDelete
  9. Baba ,Nenu na bhartha etuvanti godavalu lekunda santhoshanga vundaali,,,,, na bhartha race lu aadatam maanukovaali,,,, Thursday ma intiki vachhi Nannu thisukellaali baba

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo