1. సమస్య ఏదైనా బాబా అండగా ఉన్నారు
2. దయతో భయాన్ని పోగొట్టిన బాబా
3. సాయి దయవల్లే తొందరగా కోలుకున్న అమ్మానాన్నలు
సమస్య ఏదైనా బాబా అండగా ఉన్నారు
ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నా నిజజీవితంలో సాయితో నాకు చాలా అనుబంధం ఉంది. నాకు ఏ సమస్య వచ్చినా నాలో నేను, 'ఏమిటి సాయీ? ఎందుకిలా చేశావు? నన్ను ఎందుకిలా పరీక్షిస్తున్నావు?' అని సాయిని ప్రశ్నించి, వాదిస్తుంటాను. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఇదివరకు మూడుసార్లు నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోబోతున్నాను. అక్టోబరు నెలలో దసరా పండుగరోజు మావారు షాపు నుండి వస్తుంటే, బండి స్లిప్ అయి క్రింద పడిపోయారు. ఆ ప్రమాదంలో ఆయన కాలు మడతబడిపోయింది. ఎవరో వచ్చి బండిని లేపి, మావారిని నిలబెడితే తానే నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. అయితే, ఆ తరువాత మావారి కాలు బాగా నొప్పిపెట్టసాగింది. డాక్టరుని సంప్రదిస్తే ఇంజక్షన్, టాబ్లెట్లు ఇచ్చారు. అయినా ఎందుకైనా మంచిదని ఖమ్మం వెళ్లి ఆర్థోపెడిక్ డాక్టరుని సంప్రదించాము. డాక్టరు ఎక్స్-రే తీస్తే అందులో ఏమీ కనిపించలేదు. దాంతో MRI టెస్ట్ చేశారు. అప్పుడు రిపోర్టులో రెండువైపులా 'లిగ్మెంట్స్' కట్ అయ్యాయని చెప్పి, "సర్జరీ చేయాలి, రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుంద"ని చెప్పారు. అప్పుడు నేను, "ఏమిటయ్యా బాబా? నేనిప్పుడు ఏం చేసేది? పిల్లలిద్దరూ యు.ఎస్ లో ఉన్నారు. ఇప్పుడిలా ఆయనకు ఆపరేషన్ అంటే ఎలా సాయీ?" అని చాలా బాధపడి భారం బాబా మీద వేశాను. తరువాత రెండో అభిప్రాయం కోసం విజయవాడలోని ఎమ్.జె.నాయుడు హాస్పిటల్‌కి వెళ్లాలని అనుకున్నాము. వెళ్ళేముందు నేను నా మనస్సులో, "బాబా! ఇది నిజం, నాకు చాలా బాధగా ఉంది. మన బ్లాగులో అందరూ 'బాబా మాకు దర్శనం ఇచ్చార'ని తమ అనుభవాల్లో చెప్తున్నారు కదా! నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఏదోరకంగా నాకు దర్శనమిచ్చి నన్ను ఈ ఆపద నుండి కాపాడండి" అని మనసులోనే బాబాతో చెప్పుకుని బయలుదేరాను. నేను అప్పటికే సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి ఉన్నందున ఆరోజు పారాయణ కారులోనే పూర్తిచేశాను. విజయవాడ చేరుకున్నాక డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. అక్కడ రిసెప్షన్ వద్ద కూర్చునివున్న ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చారు. ఆయన ఎంతో అందంగా ఉన్నారు, నవ్వుతూ నావైపే చూస్తున్నారు. ఆయన ప్రేమకు ఆనందం పట్టలేకపోయాను. ఆ స్వామి మూర్తిని మనసులో నింపుకుని డాక్టరుని కలిశాము. డాక్టరు ఖమ్మంలో తీసిన రిపోర్టులు, MRI చూసి, "ఏమీ లేదమ్మా, నెలకు ఒకటి చొప్పున మూడు ఇంజెక్షన్లు (PRP) చేయించి, వ్యాయామం చేసేలా చూడండి. ఆపరేషన్ అవసరమనిపిస్తే తరువాత చూద్దాం" అన్నారు. బాబా మాపై చూపిన ప్రేమకు, "మీకు ఋణపడి ఉంటాం బాబా" అని ఏడ్చేశాను. ఆ తరువాత మావారికి మొత్తం రెండు ఇంజెక్షన్లు చేయించాము. బాబా దయవలన మావారి కాలు పూర్తిగా సెట్ అయింది. ఇప్పుడు మావారు రోజూ యోగా చేస్తారు, వజ్రాసనం వేసి సూర్యనమస్కారాలు కూడా చేస్తారు. ఇప్పుడు మీరే చెప్పండి, బాబా నాకు ఎంత అండగా ఉన్నారో!
ఒకసారి అనుకోకుండా నా చేయి తగిలి వాటర్ ప్యూరిఫైయర్ విరిగిపోయింది. ఆ సమయంలో నేను గమనించలేదుగానీ తరువాత చూస్తే అది పనిచేయడంలేదు. 15 వేల రూపాయలు పెట్టి కొన్నది అలా అయ్యేసరికి, 'ఇలా అయిందేమిటి బాబా? కంపెనీ నుంచి మెకానిక్ రావాలి, దీన్ని చూడాలి' అని బాధపడి, "పెద్దగా సమస్య లేకుండా ఉంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని చెప్పుకుని భారం బాబాపై వేశాను. తరువాత కంప్లైంట్ పెడితే, నాలుగు రోజుల్లో మెకానిక్ వచ్చి చూసి, "ఏమీ లేదు, చిన్న సమస్యే" అని చెప్పి రిపేర్ చేసి వెళ్లారు. ఇక చూడండి నా ఆనందం. ఇదేవిధంగా మరెన్నో అనుభవాలు బాబా నాకు ప్రసాదించారు. కాకపోతే, నా అనుభవాలను చాలా ఆలస్యంగా మీతో పంచుకుంటున్నందుకు బాబాకి నాపై కోపం వస్తుందేమో! "బాబా! దయచేసి నన్ను క్షమించండి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
దయతో భయాన్ని పోగొట్టిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నేనొక సాయిబిడ్డని. బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవాన్ని ఈరోజు మీతో పంచుకునేందుకు బాబా ఆశీర్వాదం లభించింది. నాకు గత సంవత్సరంలో షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ కంట్రోల్లో ఉంటున్నప్పటికీ తరచూ నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుండేది. గత సంవత్సరం అక్టోబరు నెలలో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అవడంవల్ల స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. దాంతో నా ఆరోగ్యం కుదుటపడినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఆ సమస్య వస్తూ యూరిన్‌కి వెళ్ళినప్పుడు మంటగా ఉంటుండేది. అది తట్టుకోలేక మళ్లీ డాక్టరు దగ్గరకు వెళ్ళాను. ఆవిడ యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించారు. రిపోర్టులో 'నో బాక్టీరియా గ్రోత్' అని వచ్చింది, కానీ 'rbc 10-15 ట్రేస్' అవుతున్నట్లు వచ్చింది. 'యూరిన్‌లో rbc ట్రేస్ కావడం ప్రమాదానికి సంకేతమ'ని నేను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని చాలా భయపడ్డాను. అయితే, యూరిన్ టెస్టుకి శాంపిల్ ఇచ్చిన రెండురోజుల తర్వాత నాకు నెలసరి వచ్చింది. దాంతో డాక్టరు, "ఏం భయపడకండి. బహుశా నెలసరికి రెండురోజుల ముందు యూరిన్ టెస్టుకి శాంపిల్ ఇచ్చినందువల్ల rbc ట్రేస్ అయుండొచ్చు" అన్నారు. కానీ rbc ట్రేస్ అవడం వల్ల కలిగిన భయం నాలో అలానే ఉండిపోయింది. అందుచేత 15 రోజుల తర్వాత మరోసారి యూరిన్ టెస్టు కోసం వెళ్ళేముందు బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! ఈ గండాన్ని తప్పించు, ఈసారి యూరిన్ టెస్టులో rbc నార్మల్ ఉండేలా చూడు తండ్రీ" అని వేడుకుని హాస్పిటల్‌కి వెళ్ళాను. బాబా దయవల్ల rbc నార్మల్ అని వచ్చింది. అది తెలిసి చాలా సంతోషించాను. కానీ యూరిన్‌కి వెళ్ళేటప్పుడు మంట సమస్య మాత్రం అలానే ఉంది. "బాబా! నా ఆరోగ్యం బాగుండేలా చూడు. ఈ ఆరోగ్య సమస్యలను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు బాబా. మీ ముందు ప్రశాంతంగా దణ్ణం పెట్టుకునే రోజులు నాకు ప్రసాదించు బాబా. ప్రతిక్షణం నాతోనే ఉంటూ నన్ను నడిపిస్తున్న మీకు నా ధన్యవాదాలు బాబా".
సాయి దయవల్లే తొందరగా కోలుకున్న అమ్మానాన్నలు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు సంధ్య. కొంచెం ఆలస్యమైనా నా అనుభవాన్ని పంచుకునే అవకాశమిచ్చిన బాబాకు నా ధన్యవాదాలు. 2021, మే నెలలో మా నాన్నగారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. తరువాత మూడు రోజులకి మా అమ్మకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నాకు చాలా భయమేసి, "అమ్మానాన్నలకు వారంరోజుల్లో నయమైతే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే అమ్మానాన్నలు కోలుకున్నారు. 60 ఏళ్లు పైబడిన అమ్మానాన్నలు అంత త్వరగా కోలుకున్నారంటే అది బాబా దయవల్లే. ఇదేవిధంగా బాబా నా ప్రతీ విషయంలో తోడుగా ఉండి నడిపిస్తున్నారు. "ధన్యవాదాలు బాబా".
శ్రీసాయినాథం శిరసా నమామి.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDelete833 days
ReplyDeletesairam
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌼❤
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri sainatha
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba karthik ki thyroid taggipovali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete