సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలు పంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు:-

సాయిభక్తులంతా దయచేసి ఒకసారి ఈ సమాచారాన్ని చదవమని మనవి:


బాబా ప్రేమ అనంతం. దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అది మన నిత్య అనుభవం. కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలో, శారీరక, మానసిక రుగ్మతలను తొలగించడంలో, అనుకోని ఆపదల నుండి ఆదుకోవడంలో... ఇలా చెప్పుకుంటూపోతే బాబా ప్రేమ ఎన్నోవిధాల మనకు అనుక్షణం అనుభవమవుతూనే ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం, ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కావు. మన అనుభవాలను తోటి భక్తులతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని, ప్రేమను ఆస్వాదిస్తారు. అంతేకాదు, బాబాపట్ల భక్తి, శ్రద్ధ, సబూరీలు దృఢమవుతాయి. కొన్నిసార్లు భక్తులు ఉండే స్థితిని బట్టి వారికి 'బాబా ఉన్నారు, రక్షణనిస్తారు' అనే ధైర్యం కలుగుతుంది. ఇవి ఉదాహరణకు ప్రస్తావించిన కొన్ని ప్రయోజనాలు మాత్రమే. బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రీతిలో అనుగ్రహిస్తారో మనం ఊహించలేము. అంటే, అనుభవాల రూపంలో మనం పంచుకొనే బాబా ప్రేమ ఎన్నోవిధాల, ఎందరికో ఎంతో ఉపయుక్తం కాగలదన్న మాట.


కాబట్టి, అందరికీ మాదో చిన్న విన్నపం: అనుభవం వ్రాసేటప్పుడు కాస్త వివరంగా వ్రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే, మనం ఒక అనుభవం చదివేటప్పుడు అందులోని బాబా ప్రేమకు మనలో ఒక అనుభూతి కలుగుతుంది. అది ఆస్వాదించడమన్నది చాలా ముఖ్యమైన అంశం. అనుభవాలను క్లుప్తంగా వ్రాసినందువల్ల ఆ అనుభూతిని కోల్పోతాము. 'అలా అనుభూతి చెందేలా వ్రాయడం నాకు రాదు' అని ఎవరూ భయపడాల్సిన పని లేదు. అందులో శ్రమపడాల్సినంత ఏమీ లేదు. జరిగిన అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లు, అంటే..


  • మనకు వచ్చిన కష్టం/సమస్య;
  • ఆ సమయంలో మనం పడిన ఆందోళన;
  • కష్టం తీరడం కోసం బాబాపై ఆధారపడటం(ప్రార్థన);
  • బాబా అనుగ్రహించిన తీరు;
  • ఆ అనుభవం ద్వారా మనం పొందిన అనుభూతి;
  • బాబా మనకు ప్రసాదించే ప్రతి అనుభవం ద్వారా ఏదో ఒకటి మనకు నేర్పిస్తారు. అది గ్రహించగలిగితే, ఆ వివరాలు..


పై అంశాలను గురించి వ్రాయండి. అవి చాలు. అలా వ్రాసి చూడండి. వ్రాసేటప్పుడు మీరు కూడా బాబా ప్రేమను అనుభూతి చెందుతూ వ్రాస్తారు. తోటి భక్తులు కూడా ఎంతో ఆనందిస్తారు.


ఇకపోతే బాబా మీకు ప్రసాదించిన అనుభవాలను...


  • వీలయితే తెలుగులో టైపు చేయండి.
  • లేకుంటే ఇంగ్లీషులో, అంటే 'sai bandhuvulaku namaskaram' ఇలా టైపు చేయండి.
  • లేకుంటే స్పష్టంగా పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి పంపండి.
  • తెలుగు వ్రాయడం రానివారు ఇంగ్లీషులో టైపు చేసి పంపవచ్చు.


అలా సిద్ధం చేసిన మీ అనుభవాలను ముఖ్యంగా మీ పేరు మెన్షన్ చేయాలో, వద్దో తెలియజేస్తూ క్రింద ఇవ్వబడిన మెయిల్ఐడికి పంపించండి.

saimaharajsannidhi@gmail.com

  

మీరు పంపిన అనుభవాలలోని వాక్యనిర్మాణాలు, అక్షరదోషాలు సరిచేసి మూడు నాలుగు వారాల్లో (మాకు వచ్చే అనుభవాలను బట్టి ఈ వ్యవధి మారవచ్చు) బ్లాగులో ప్రచురించి, మీకు తెలియజేస్తాం.


చివరిగా, మనపై వర్షించే బాబా ప్రేమను అందరితో పంచుకునేందుకు 'సాయి మహరాజ్ సన్నిధి' అనే ఈ చక్కని వేదికను బాబా మనకు ప్రసాదించారు. నిజంగా ఇది బాబా 'సన్నిధి'. అందులో బాబా ప్రేమను నిక్షిప్తం చేస్తూ తోటి భక్తులకు అందుబాటులో ఉంచుదాం. ఇంతకన్నా మనం చేయగలిగింది ఏముంది?


బాబా ఆశీస్సులతో నిత్యం వారి స్మరణలో తరిద్దాం. 


- సాయి మహరాజ్ సన్నిధి బృందం.


goto Home Page....



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo