ఈ భాగంలో అనుభవాలు:
1. అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తారు సాయి
2. ఊదీతో బాబా చేసిన అద్భుతం
3. మనసు మార్చి కోరిక తీర్చిన బాబా
అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తారు సాయి
ఓం శ్రీసాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మనస్ఫూర్తిగా కోరుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తారు నా సాయి. అందుకు సంబంధించి నాకు చాలా అనుభవాలున్నాయి. అందులో నుండి ఒకటి పంచుకుంటాను. మా బాబుకి ఆరేళ్ళ వయసప్పుడు ఒక చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది. అది చిన్నదే అయినప్పటికీ బాబు మంచిగా ఎత్తు పెరగకపోవడానికి కారణమైంది. ఒక సంవత్సరంకి 3-4 సెంటీమీటర్లు మాత్రమే పెరిగేవాడు. నాకు చాలా బాధసింది. మేము చాలా మంచి డాక్టరుకి చూపించాము. ఆ డాక్టర్ "ఇది చాలా చిన్న సమస్య" అని చెప్పారు. నేను నా భర్తతో వేరే డాక్టరుకి చూపిద్దామంటే ఆయన, "ఇది చిన్న సమస్యే. ఈ డాక్టర్ సిటీలో పేరున్న డాక్టరు. వేరే డాక్టర్ల దగ్గరకి బాబుని తీసుకెళితే అనవసర హంగామా చేస్తారు. వాడే ఎత్తు పెరుగుతాడు" అని అనేవారు. అలా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను మా బాబు ఎత్తు పెరగాలని సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేసి రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అనూహ్యంగా బాబా మాకు ఒక డాక్టరుని చూపించారు. ఆమె మా బాబు సమస్యనిగా సరిగా గుర్తించి, "మన ప్రయత్నం మనం చేద్దామ"ని చెప్పి చికిత్స మొదలుపెట్టారు. నేను బాబాని ఒకటే కోరుకున్నాను: "బాబా! తెలియక బాబు 6 సంవత్సరాల కాలాన్ని వృధా చేసాము. వాడు ఈ ఆరోగ్య సమస్య లేకుండా ఉంటే ఎంత ఎత్తు పెరుగుతాడో అంత ఎత్తు పెరిగేలా చూడు తండ్రీ" అని. అది అసాధ్యమని తెలిసినా నేను బాబాని ప్రార్థించాను. ఆశ్చర్యం! రెండు సంవత్సరాల చికిత్సతో మా బాబు చాలా ఎత్తు పెరిగాడు. చివరిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఒకటే చెప్పారు: "ఇంత మంచి ఫలితాలు వస్తాయని నేను అనుకోలేదు. ఇది నా చికిత్స వల్లనో, మీ ప్రయత్నాల వల్లనో కాదు. మీ బాబుపై ఆ దేవుడి దయ మెండుగా ఉంద"ని. అది విన్న నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి మనసులో బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! మా బాబు ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు చూడండి".
ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః.
ఊదీతో బాబా చేసిన అద్భుతం
నా పేరు పద్మజ. మా చెల్లి కొడుకుకి మూడు సంవత్సరాల వయసు. 5 నెలల ముందు బాబుకి మూత్ర విసర్జన చేసే చోట ఒక చిన్న చీము గడ్డలా ఏర్పడింది. నేను అది చూసి మా చెల్లితో చెప్తే, "వాడు పుట్టినప్పటినుంచి అలాగే ఉంది" అని అంది తను. కానీ తన భర్త చూసి, "లేదు, ఇది గడ్డలా ఉంది. డాక్టరుకి చూపించాలి" అన్నారు. అలాగే బాబుని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే, డాక్టర్ చూసి, "చిన్న సర్జరీ చేయాలి" అని చెప్పారు. అంత చిన్నబాబుకి సర్జరీ అంటే మాకు భయమేసింది. తర్వాత ఒకరోజు నా స్నేహితురాలు బాబుని ఒక డాక్టరుకి చూపించమని సలహా ఇచ్చింది. మేము సరేనని, బాబుని ఆ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాము. ఆ డాక్టర్ చూసి, "చాలామంది పిల్లలకు ఇలాగే వస్తుంది. ఎదిగేకొద్దీ కొంచెంకొంచెంగా పెద్దదవుతుంది. మీరేం భయపడకండి. దానికి సర్జరీ అవసరం లేదు. దానివల్ల ఏ ఇబ్బంది లేదు, పట్టించుకోకండి" అన్నారు. కానీ మాకు భయంగానే ఉండేది. నేను బాబా గుడికెళ్లి, "బాబుకి తగ్గిపోతే, వాడిని తీసుకొచ్చి 9 ప్రదక్షిణాలు చేయిస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. తర్వాత బాబుకి ఆ భాగంలో ఊదీ పూయొచ్చా, పూయకూడదా అని బాబా దగ్గర చీటీలు వేస్తే, 'పూయొచ్చు' అని వచ్చింది. దాంతో నేను ప్రతిరోజూ స్నానం చేసిన బాబుకున్న ఆ గడ్డ మీద ఊదీ పూయడం మొదలుపెట్టాను. నిజంగా బాబా చాలా అద్భుతం చేసారు. వారం రోజులకి మేము ఏ డాక్టరుని సంప్రదించకుండా, ఏ మందులూ వాడకుండానే ఆ చీము గడ్డ నుండి నీరులా చీము బయటకు వచ్చేసి ఐదు నెలలుగా ఉన్న గడ్డ పూర్తిగా తగ్గిపోయింది. నేను బాబును బాబా గుడికి తీసుకెళ్లి నా మొక్కు చెల్లించుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
మనసు మార్చి కోరిక తీర్చిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారాలు. నా పేరు కోమలవల్లి. నేను ఒక ప్రైవేటు స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాను. మా అమ్మవాళ్ళ ఊరు, మా పాపవాళ్ళ ఊరు ఒకటే, ఒకే వీధి కూడా. నేను ఎప్పుడు ఆ ఊరు వెళ్లినా ఉదయం వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేస్తాను. అలాంటిది సంక్రాంతి సెలవులు ఇచ్చాక ఈసారైనా మా అమ్మవాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉండాలని కోరిక కలిగింది. ఆ సమయంలో మా అమ్మాయి పుట్టినరోజు కూడా ఉంది. కానీ మావారు ఒప్పుకోరని, "నా భర్త ఒప్పుకునేలా చేయమ"ని బాబాను ప్రార్ధించాను. తర్వాత తిడతారని భయపడుతూనే మావారితో, "నేను ఊరెళ్ళి, ఒకరోజు అక్కడుండి అమ్మాయి పుట్టినరోజు చూసుకొని వస్తాను" అని అన్నాను. దానికి మావారు, "సరే, రేపు(2025, జనవరి 17) వెళ్లి జనవరి 18న వచ్చేయి" అని అన్నారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. నిజంగా బాబా నా భర్త మనసు మార్చి నా కోరిక తీర్చారు. "ధన్యవాదాలు బాబా".
Om Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sai AMMA samasyaki edo oka pariskaram chupinchu tandri
ReplyDeleteedina paravaledu , kani alla vadileya vaddu
Naaku emi cheyalo teliyadam ledu
Omsairam 🙏
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete