సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1990వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కుక్కల బారినుండి కాపాడిన బాబా
2. బాబా దయవల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పరిష్కారం
3. అతి తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా దయచూపిన బాబా



అతి తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా దయచూపిన బాబా

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. బాబా ఎన్నోసార్లు నన్ను రక్షించారు, స్వప్నదర్శన భాగ్యం అనుగ్రహించారు. అందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో 2025, సంక్రాంతి సెలవుల తరువాత ఒకరోజు రాత్రి బండిపై వస్తుంటే నా జేబులో ఉన్న ఫోన్ కింద పడిపోయి పగిలింది. ఇంటికి వచ్చి 'ఫోన్ లేకుండా ఉద్యోగానికి వెళ్ళలేను, ఫోన్ చూస్తే పగిలిపోయింది, కొత్త ఫోన్ కొనగలిగే స్తోమత లేదు' అని ఆ రాత్రంతా చాలా బాధపడ్డాను. బాబాను తలుచుకుని, "బాబా! నాకు ఎందుకు ఇలా జరిగింది? అసలే ఆర్థికంగా చాలా ఇబ్బందిపడుతున్నాను. ఇప్పుడు ఈ మొబైల్ పనిచేయకపోతే ఎలా?" అంటూ బాబా ఫోటో ముందు కూర్చుని దుఃఖించాను. "తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా చూడు తండ్రీ" అని వేడుకొని భారం బాబా మీద వేసాను. మరుసటిరోజు బాబాకి చెప్పుకొని హైదరాబాద్‌లోని జగదీష్ మార్కెట్‌కి వెళ్లి నా మొబైల్ చూపిస్తే, "ఏం కాలేదు. కెమెరా గ్లాసు ఒక్కటే పోయింది" అని చెప్పి, కేవలం 350 రూపాయలకే ఫోన్ బాగు చేసి ఇచ్చారు. నా బాబా, నా తండ్రి అంత తక్కువ ఖర్చుతో మొబైల్ రిపేర్ చేయించిచ్చారని చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo