ఈ భాగంలో అనుభవాలు:
1. సాయిమహరాజ్ ఆశీర్వాదం
2. ఏం పుణ్యం చేసుకుంటే సాయినాన్న తోడు లభిస్తుంది?
సాయిమహరాజ్ ఆశీర్వాదం
ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు కృష్ణ. మా కులదైవం బాలాజీ ఆశీస్సులతో సుమారు 20 ఏళ్ల క్రితం నా స్నేహితుడి ద్వారా 'సాయిమహరాజ్' నాకు గురువుగా లభించారు. అప్పటినుండి వారు నా జీవితానికి మార్గనిర్ధేశం చేస్తున్నారు. మా అమ్మాయి ఇంటర్ చదివేటప్పుడు బైపీసీ ఇష్టం లేదని చదువును నిర్లక్ష్యం చేసింది. కాలేజీకి కూడా సరిగా వెళ్లలేదు. అందువల్ల నేను తను పరీక్షలు ఎలా వ్రాస్తుందోనని చాలా ఆందోళన చెంది మా కులదైవం, ఆయన ప్రసాదించిన నా గురువు బాబాల మీద విశ్వాసముంచాను. బాబా అద్భుతం చేశారు. మా అమ్మాయి పరీక్షల ముందు శ్రద్ధగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. తర్వాత తను నీట్ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు వెబ్సైట్లో ఎంతసేపటికీ ఫింగర్ ప్రింట్లు, ఫోటోలు అప్లోడ్ కాకుండా ఇబ్బందిపెట్టాయి. మరోపక్క దరఖాస్తు చేయాల్సిన గడువు సమయం ముగియనుంది. అందువల్ల నాలో ఆందోళన పెరగసాగింది. ఆ సమయంలో అకస్మాత్తుగా "నా భక్తులు ఎక్కడున్నా, వారు తలచుకున్న వెంటనే పలుకుతాను, రక్షణనిస్తాను" అన్న సాయి వాగ్దానం గుర్తుకు వచ్చింది. వెంటనే, "వెబ్సైట్లో ఫింగర్ ప్రింట్లు, ఫోటోలు ఇబ్బంది లేకుండా అప్లోడ్ అయ్యేలా చూడమ"ని బాబాను ప్రార్ధించాను. ఆంతే, అద్భుతం జరిగింది. అప్పటివరకు అప్లోడ్ కాకుండా ఇబ్బందిపెట్టినా, అప్పుడు మాత్రం వెంటనే అప్లోడ్ అయి దరఖాస్తు ప్రక్రియ పూర్తైంది. బాబా దయ, ఆశీర్వాదంతో మాత్రమే ఇది సాధ్యమైంది. "మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇదేవిధంగా అమ్మాయి నీట్ పరీక్ష ఎటువంటి ఇబ్బంది, ఆందోళన లేకుండా వ్రాసేటట్లు చేసి మంచి ర్యాంక్ ప్రసాదించి, కోరుకున్న కాలేజీలో ఫ్రీ మెడికల్ సీటు వచ్చేలా చేయండి బాబా. ఎల్లప్పుడూ మీపై భక్తిప్రపత్తులు కలిగి ఉండేలా అనుగ్రహించండి బాబా. మీ భక్తులను, సాధు జనులను ఎల్లప్పుడూ కాపాడండి బాబా".
ఏం పుణ్యం చేసుకుంటే సాయినాన్న తోడు లభిస్తుంది?
సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మేము ఉగాది రోజు గుడిలో బాబా అభిషేకంకి వెళదామని అనుకున్నాము కానీ, కుదరలేదు. అందువల్ల నేను దిగులుతో వంట చేస్తుంటే, గుడి మేనేజర్ వీడియో కాల్ చేసి అభిషేకం చూపించారు. ఇంక నా ఆనందం ఏమని చెప్పను? అదేరోజు పూజ గదిలో ఒక చిన్న పురుగు కనిపించింది. బాబానే ఆ పురుగు రూపంలో వచ్చారని నాకనిపించింది. అయినా మనసు సమాధానపడక, "సాయీ! నిజంగా మీరే ఆ పురుగు రూపంలో వచ్చుంటే, ఇంకో పురుగు కూడా కనబడేలా చేయండి" అని అనుకుంటూ ఉన్నాను. అంతలోనే ఆశ్చర్యంగా ఇంకో పురుగు కనిపించింది. దాంతో నా ఆనందానికి అవధులు లేవు.
మేము ఇంట్లో మా పెద్దపాపకి సంబంధించిన ఒక ఫంక్షన్ పెట్టుకున్నాము. నేను సాయినాన్నని, "ఫంక్షన్‌కి వచ్చి పాపని, మా కుటుంబాన్ని ఆశీర్వదించమ"ని వేడుకున్నాను. తెలిసిన ఆంటీ ఒకరు బాబా ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. అంతేకాదు, సాయంత్రం గిఫ్టులు ఓపెన్ చేస్తుంటే, ఒక బ్యాగులో పెద్ధ బాబా ఫోటో వుంది. ఆ బ్యాగ్ మీద పేరు లేదు. అలా సాయినాన్న రెండు ఫోటోల రూపంలో వచ్చారు. ఆ ముందురోజు నా బంగారు గాజు ఒకటి కనపడలేదు. నేను చాలా టెన్షన్ పడ్డానుకాని, బాబా మీద భారమేసి మౌనంగా వున్నాను. బాబా దయవల్ల ఫంక్షన్ సమయానికి ఆ గాజు దొరికింది. ముందురోజు వేసుకున్న కంకణంలో ఆ గాజు ఇరుక్కుపోయి ఉంటే నా స్నేహితురాలు తీసి ఇచ్చింది. ఫంక్షన్లో నేను బాధపడకుండా ఉండాలని ముందుగానే కనబడేలా చేశారు సాయినాన్నా. ఇకపోతే, ఫంక్షన్ ఫొటోలున్న మెమరీ కార్డు కనపడకుండా పోయింది. ఆ కార్డు వేరే వాళ్ళది అయినందున నేను పడిన టెన్షన్ అంతాఇంతా కాదు. అప్పుడు, 'ఓం సాయి సూక్ష్మాయ నమః' అని అనుకుంటూ వుంటే, ముందురోజు ఒక ఆంటీకి ఇచ్చిన చీర కవరులో వుందని గుర్తొచ్చింది. వెంటనే ఆమెకి ఫోన్ చేసి అడిగితే, ఆమె చూసి కార్డు వుందని చెప్పారు. నేను, "ఫంక్షన్ సమయానికల్లా నా బరువు తగ్గించు సాయీ" అని వేడుకున్నాను. సాయినాన్నా నా మొర ఆలకించి నా శరీర బరువు తగ్గించారు. ఆయన ఆ ఫంక్షన్ మూడు రోజులు నా వెంట ఉండి నన్ను అనుక్షణం కాపాడారు. ఆయన నా జీవితంలోని చాలా విభేదాలకు పరిష్కారం చూపారు.
ఏం పుణ్యం చేసుకుంటే సాయినాన్న తోడు లభిస్తుంది? "బాబా! తోటి సాయిబంధువుల ముందు మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నేను తెలియకుండానే ఒక చెడు మార్గం వైపు అడుగు వేసాను. దయచేసి ఆ చెడు నుండి బయటకు లాగి నన్ను కాపాడు బాబా".
Om sairam_🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl e intlo portion rent ippinchu thandri pl
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteBaba, nenu ishtadtuna vyakthi tho na vivaham jarigela chudu thandri. Anantha koti Bramhanda nayaka, rajadhi raja yogi raja, parabramha , sri sachithanda sadhguru sai nath maha raj ki jai
ReplyDelete