సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1818వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో తీరిన సమస్యలు
2. బాబా చెప్పుకుంటే అందిన డబ్బు

బాబా దయతో తీరిన సమస్యలు


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు కిషోర్. కొంతకాలం క్రితం నేను విపరీతమైన దగ్గుతో బాధపడ్డాను. నేను నెమ్మదిగా తగ్గుతుందిలే అనుకున్నాను కానీ, రోజురోజుకు ఎక్కువ కాసాగింది. అప్పుడు భరించలేక డాక్టర్ దగ్గరికి వెళితే, కొన్ని మందులు ఇచ్చారు. అవి వాడితున్నా ఉపశమనం కలగలేదు సరికదా దగ్గు మరింత ఎక్కువైంది. అదీకాక శ్వాస అందేది కాదు. భయంతో మళ్ళీ డాక్టర్ని సంప్రదిస్తే, "మరేం పర్వాలేద"ని కొత్త మందులు ఇచ్చారు. అయితే అవి వాడినా కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఒక్కొక్కసారి శ్వాస అందక ప్రాణం పోతున్నట్లనిపించి నాకు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. నా పరిస్థితి చూసి నా కుటుంబసభ్యులు చాలా బాధపడ్డారు. నాకు ఏం చేయాలో తెలియక బాబా ఊదీ నీళ్లలో కలిపి తాగడం మొదలుపెట్టాను. 'దగ్గు తగ్గితే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన'ని అనుకుని రోజూ సాయి నామస్మరణ చేస్తూ ఉండేవాడిని. బాబా దయవల్ల నెమ్మదిగా దగ్గు తగ్గి, శ్వాస అందుతూ ఇప్పుడు పూర్తిగా తగ్గింది. "ధన్యవాదాలు సాయిప్రభూ".


నాకు ఆటలంటే పిచ్చి. ఒకరోజు ఆడుతున్న సమయంలో నా కుడిభుజం కండరాలు, అలాగే కాళ్ల మధ్య(గజ్జల్లో)లో కండరాలు వాచిపోయి. చేయి పైకి ఎత్తలేకపోయాను, అలాగే అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. నా మనసుకి ఏదైనా ప్రమాదం జరిగిందేమోననిపించి, "బాబా! లోపల పెద్ద సమస్యేమీ లేకుండా వాపు, నొప్పి తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజులు మందులు వేసుకునే పాటికి తగ్గిపోయింది. "బాబా! మీకు అనేక కృతజ్ఞతలు".


నేను ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. మా యూనివర్సిటీలో మేము ప్రతి ఆరునెలలకు పిహెచ్‌డి స్కాలర్లను తీసుకోవాల్సి ఉండగా 2023లో సుడాన్ దేశపు విద్యార్థులు చాలామంది మా యూనివర్సిటీలో పిహెచ్‌డి చేయడానికి అప్లై చేసారు. మాపై అధికారులు మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోవాలని ఒత్తిడి చేశారు. అందరికీ కనీసం ఒక్క సుడాన్ వ్యక్తినైనా కేటాయిస్తామని కూడా అన్నారు. అయితే వేరే దేశం విద్యార్థులను నా కింద తీసుకోవడం నాకు ఇష్టం లేక "బాబా! నాకు ఏ విద్యార్థినీ కేటాయించకూడదు" అని బాబాతో చెప్పుకున్నాను. సాయినాథుని దయవల్ల నాకు విద్యార్థులను కేటాయించలేదు. "మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే బాబా. నాకున్న కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తీర్చి నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయండి సాయిదేవా". ఓపికగా చదివిన ప్రతి భక్తుడికీ నా కృతజ్ఞతలు. సాయినాథుని దివ్య ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.


బాబా చెప్పుకుంటే అందిన డబ్బు

ముందుగా అందరికీ వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో నివాసముంటున్నాను. నేను 5 సంవత్సరాల క్రితం ఒక స్నేహితునికి కొంత డబ్బు ఇచ్చాను. ఒక సంవత్సరం కిందట నాకు చాలా అవసరమై నా డబ్బు నాకు తిరిగి ఇవ్వమని తనని అడిగితే, ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తానని చెప్తూ, చివరికి నాతో గొడవ కూడా పడ్డాడు. డబ్బిచ్చి, మన అవసరాలకి తిరిగి అడిగితే ఇలా చేస్తున్నారని నాకు చాలా బాధేసి, "బాబా! మీరే ఏదో విధంగా తన నుండి డబ్బు తిరిగి వచ్చేలా చేయాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల 2024, మార్చి 24న తను నా డబ్బు నాకు పంపి, క్షమాపణ కూడా చెప్పాడు. బాబా తలచుకుంటే ఏదైనా అవుతుంది. "ధన్యవాదాలు బాబా. మీకు ఋణపడి ఉంటాను".


21 comments:

 1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

  ReplyDelete
 2. Baba, take care of my parents 🙏🙏

  ReplyDelete
 3. Baba, take care of my son 💐💐💐💐

  ReplyDelete
 4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

  ReplyDelete
 5. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  ReplyDelete
 6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

  ReplyDelete
 7. Om sri sairam 👏 🌺 🙏

  ReplyDelete
 8. Om sri sainadaya namaha 🙏 🌺

  ReplyDelete
 9. Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha

  ReplyDelete
 10. baba eeroju mee daya valana pedda pramadam nundi bayata paddamu. maa bangaru thandri madava IIT exam meere daggara undi rainchandi baba

  ReplyDelete
 11. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

  ReplyDelete
 12. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏

  ReplyDelete
 13. ఓం సాయిరామ్

  ReplyDelete
 14. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

  ReplyDelete
 15. Om Sairam. Sai always be with me

  ReplyDelete
 16. Baba ma husband sugar test normal ga vundali thandri please baba

  ReplyDelete
 17. Baba,Mee Daya valla eroju gadichindi....Dayatho evariki elanti ebbandi rakunda chudandi baba....naku chala bayam vesthundi etu poyi etu velthundo ani.... Mammalni anugrahinchandi please 🙏🙏🙏🙏🥺..... mere naku dikku 🙏🙏🙏🙏🙏..... Kapadandi Baba 🥺🥺🥺🥺🥺.....naa cheyyi vadalakandi baba 🙏🙏🙏🙏🥺❤️

  ReplyDelete
  Replies
  1. Elanti ebbandi lekunda anni vachela chudandi baba 🙏🙏🙏🙏🥺

   Delete
 18. Om Sri Sai Raksha 🙏🙏🙏

  ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo