సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1829వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీ దర్శనంతో తీరిన సమస్యలు
2. కేవలం బాబా అనుగ్రహంతో ఉపశమనం

శిరిడీ దర్శనంతో తీరిన సమస్యలు

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శంకర్. నేను హైదరాబాదు నివాసిని. నేను చాలా సంవత్సరాల నుండి సాయి భక్తుడిని. నాలో చాలా తప్పులు ఉన్నప్పటికీ అడుగడుగునా బాబా నన్ను రక్షిస్తున్నారు. నేను 2023లో దసరా సెలవులకి శిరిడీ వెళ్లాలని టికెట్లు బుక్ చేసుకున్నాను. అయితే చాలా వెయిటింగ్ లిస్టు ఉండి కన్ఫర్మ్ కాలేదు. తెలిసిన రైల్వే టీసీతో సిపారస్ చేయించినా ప్రయోజనం లేకపోయింది. అయినా బాబా మీద భారమేసి టీసీని కలిసి మాట్లాడదామని బయలుదేరి వెళ్ళాను. టీసీని కలిసి మాట్లాడితే, "దసరా సెలవులు కావడం వల్ల ట్రైనులో అస్సలు ఖాళీ లేదు. సరే, చూద్దాం. కూర్చోండి!" అని అన్నారు. కాసేపటి తర్వాత మళ్లీ టీసీని కలిస్తే, "ఖాళీ లేదు" అన్నారు. ఇక చేసేదిలేక బాబాని తలుచుకొని స్లీపర్ కోచ్‌లో కింద కూర్చొని శిరిడీ వెళ్లాను. శిరిడీలో నాలుగు రోజులు గడిపి ఎంతో అనుభూతి పొందాను.

ఇకపోతే, నా వయసు 40 సంవత్సరాలు. నాకు పని ఎక్కువైనప్పుడు మోకాలు కింద బాగా నొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో బండి కిక్ కొట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను ఆ నొప్పి తగ్గడానికి పెయిన్ ఆయిల్ వాడుతుండేవాడిని. ఆ ఆయిల్ వాడినప్పుడు నొప్పి తగ్గుతుండేది. శిరిడీ వెళ్ళక ముందు కూడా నొప్పి బాగా వచ్చింది. ఈసారి ఆ ఆయిల్ వాడినా నొప్పి తగ్గలేదు. డాక్టర్ని కలిసి టాబ్లెట్లు తెచ్చుకొంటే కొంత ఉపశమనం లభించింది కానీ, పూర్తిగా తగ్గలేదు. అలాగే శిరిడీ వెళ్ళాను. శిరిడీలో, నాసిక్ వి తిరిగేసరికి సాయంత్రానికి నొప్పి ఎక్కువగా వచ్చింది. నాకు చాలా బాధ, భయం కలిగాయి. నేను, "బాబా! నా కాలి నొప్పి పూర్తిగా తగ్గేలా దయ చూపండి” అని అనుకున్నాను. అలా అనుకొని శిరిడీ నుండి తిరుగు ప్రయాణానికి బయలుదేరాను. బాబా దయవల్ల రిటర్న్ టికెట్ ఆర్ఏసి వచ్చి కన్ఫర్మ్ అయింది. నేను చాలా సంతోషంగా ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చాను. రెండు రోజుల తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బండి స్టార్ట్ చేయడానికి కూడా ఇబ్బంది అనిపించలేదు(అదివరకు బండి కిక్కు కొట్టాలంటే భయపడిపోయేవాడిని). అంతేకాదు, మళ్ళీ ఇప్పటివరకు ఆ నొప్పి కనిపించలేదు. అంతా బాబా దయ. 

ఇంకో విషయం నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. శిరిడీలో ఉండగా, "బాబా! నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి" అని అనుకున్నాను. శిరిడీ నుండి వచ్చిన తర్వాత  రెండు నెలల్లో ఒక వ్యక్తి ద్వారా నేను చేసిన పనికి 3 లక్షల వరకు అందించారు బాబా. దాంతో చాలావరకు అప్పుల నుండి బయటపడ్డాను. ఇదంతా బాబా దయతోనే జరిగిందని భావిస్తున్నాను. మిగతా ఋణ భారాన్ని కూడా బాబా ఏదో రూపంలో తొలగిస్తారని ఎదురు చూస్తున్నాను. బాబా తన భక్తులను ఎన్నడూ వదిలిపెట్టరు. బాబా తోడుంటే జీవితంలో అన్నీ ఉన్నట్లే. నా తప్పులు మన్నించి బాబా నన్ను నా జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంచుతారని భావిస్తూ.. 

ఓం శ్రీసాయినాథాయ నమః!!!


కేవలం బాబా అనుగ్రహంతో ఉపశమనం


సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఈ మధ్యకాలంలో ఆఫీస్ పని ఎక్కువగా చేయడం వల్ల నాకు మెడనొప్పి బాగా ఉండింది. దానివల్ల తలనొప్పి కూడా ఎక్కువగా వచ్చింది. కొద్దిరోజులు నొప్పి ఎందుకు వస్తుందో అని ఎంత ఆలోచించినా కారణం తెలీలేదు. ఇక చివిరికి బాబాను తలచుకొని ఆయనను ప్రార్థించానో, లేదో నొప్పి తగ్గిపోయింది. ఇంకోరోజు అకారణంగా నా ఒళ్లంతా దురద పెట్టడం మొదలయ్యింది. చాలాసేపు ఇబ్బందిపడ్డాక బాబాను తలచుకొని దురద అనిపించిన చోట ఊదీ రాసుకుంటే, వెంటనే దురద తగ్గింది. మరోసారి తల భాగమంతా ఎవరో ఊపేసినట్టుగా ఉండింది. అప్పుడు బాబాను మనస్పూర్తిగా తలచుకోగానే అంతా బాగైపోయింది. పై ఏ సందర్భంలోనూ నేను డాక్టరుని సంప్రదించడం, మందులు వాడటం చేయలేదు. కేవలం బాబా అనుగ్రహంతో ఉపశమనం పొందాను. "ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ మీ దయ మాపై ఇలాగే వుంచి మేము ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించు బాబా".


18 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Om sai ram, intlo ye discussion raani daani batti chala thanks tandri, ika mundu kuda na manasuki nachanidu yedi jargakunda chudu tandri, meere naaku dikku, na badha ni ardam chesukune vaaru, om sai ram

    ReplyDelete
  7. ఓం సాయిరామ్

    ReplyDelete
  8. Baba na chelli vallu nato matladetatlu chesav tandri adi kuda Thursday roju...niku nenu emi ichi runam tirchukogalanu tandri...alage na ofc files kuda problem lekunda reverse cheyinchu tandri avi clear ayte miku poola danda samarpistanu tandri 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  10. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  11. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  12. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  13. Baba,Mee dayatho chala ebbandi avuthadi anukunna amount adjust ayyindi.....alane maku pending vunnavi kuda elanti ebbandi rakuda vachela cheyandi Baba....aa bills process Thursday ne jarigindi ante mee anumathithone ayyindi Ani nenu manasu purthiga nammuthunna..... evariki ebbandi kalagakunda aa amount vachesthe, meku mata ichinattu evariki istha anukunna fixed amount vallaki ichesthanu baba....meru adesinchinattu anugrahinchinattu okati tharuvatha inko mokku lu kuda therchesukunta....Naku mee padale dikku mere mammalni kapadali 🙏🙏🥺🥺🥺🥺❤️ maa cheyyi vadalakandi baba elane mammalni anugrahinchandi 🙏🙏🙏🙏🙏 Mee meda eppudu manasu purthiga laganam ayyela ,Mee padalu naa manasu lo mudrinchukune laga anugrahinchandi .....om Sai Ram Jai sai ram 🙏🙏🙏🙏

    ReplyDelete
    Replies
    1. 1.5 and 3 vallu iddariki ichesthanu meru anumathisthe.... marchamante mere cheppandi entha ivvamantaro....em vachina adi Mee daya Valle avuthadi

      Delete
  14. ॐ श्री साईं राम 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  15. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏

    ReplyDelete
  16. Sri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo