సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1833వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పలు సందర్భాల్లో బాబా దయ
2. బాబా కృప ఉంటే కష్టమైన పనైన సులభంగా పరిష్కారమవుతుంది

పలు సందర్భాల్లో బాబా దయ

సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మా బాబుకి 6 సంవత్సరాలు. ఒకసారి తను, ‘మూత్ర విసర్జన చేస్తుంటే రక్తం వచ్చిందని, నొప్పిగా ఉందని’ చెప్పాడు.  అప్పుడు మేము తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళితే, "యూరిన్ టెస్ట్ చేయించమ"ని డాక్టరు చెప్పారు. ఆ టెస్టు చేయిస్తే చీము కణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని రిపోర్టు వచ్చింది. అందుకని డాక్టర్ ఆలస్యం చేయకుండా యాంటీబయాటిక్స్ వాడాలని చెప్పి, సిరప్ ఇచ్చారు. ఇంకా, "బాక్టీరియా వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో! అది తెలుసుకోవడానికి యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించండి. రిపోర్టు రావడానికి 5 రోజులు పడుతుంది. అది వచ్చాక ఇంకా కొన్ని మందులు ఇస్తాన"ని అన్నారు. నేను ఇంటికి వచ్చాక బాబాని తలుచుకొని, "బాబుకి ఇన్ఫెక్షన్ తగ్గాలి" అని అనుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించాను. బాబా దయవల్ల యూరిన్ కల్చర్ టెస్టులో బాబుకి ఇన్ఫెక్షన్ లేదని వచ్చింది. ఇంకా బాబుకి మూత్రవిసర్జన చేసేటప్పుడు రక్తం రావడం, నొప్పి తగ్గాయి. 

ఒకసారి నాకు, నా భర్తకి మధ్య గొడవ జరిగింది. నేను, "రేపటివరకు నా భర్త మామూలు అవ్వాల"ని బాబాకి చెప్పుకొని ఊదీ పెట్టుకున్నాను. ఎప్పుడు గొడవైనా 2-3 రోజులవరకు విసిగించే నా భర్త ఈసారి బాబా దయవల్ల మరుసటిరోజుకే శాంతించారు. 

2024, మార్చిలో మాకు నీటి సమస్య వచ్చింది. మా ఇంటి ఓనర్స్ రోజుకు ఒకసారి 20 నిముషాలు మాత్రమే నీళ్ళు విడిచిపెట్టసాగారు. ఒకరోజు నేను నీళ్లు రావటం ఆగిపోయాక కొళాయి కట్టడం మార్చిపోయి మా అన్నయ వాళ్ళింటికి వెళ్ళాను. దారిలో కొళాయి కట్టలేదని నాకు గుర్తు వచ్చిందిగాని, వెనుతిరిగి వెళ్లకుండా అలాగే అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళిపోయాను. ఆ  రాత్రి మేము వాళ్ళింట్లోనే ఉండిపోవాల్సి వచ్చి ఉండిపోయాము. కానీ నేను కొళాయి కట్టలేదని ఓనర్స్‌కి తెలిస్తే, వాళ్ళు ఊరుకోరని భయమేసి, "బాబా! నేను ఇంటికి వెళ్ళేవరకు నీళ్ళు విడిచిపెట్టకూడదు. నేను కొళాయి కట్టని విషయం వాళ్ళకి తెలియకూడదు" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం మేము మా ఇంటికి వెళ్ళిన తర్వాతే ఓనర్స్ నీళ్లు విడిచిపెట్టారు. ఇది చిన్న విషయమేకానీ, ఇలాంటి విషయాల్లో కూడా బాబా ఎలా అండగా ఉంటారో చెప్పడానికి ఈ అనుభవం మీతో పంచుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా”.


బాబా కృప ఉంటే కష్టమైన పనైన సులభంగా పరిష్కారమవుతుంది


సాయిబందువులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. నేను ఒక సాయిభక్తురాలిని. నా వయసు 42 సంవత్సరాలు. ఈ మద్య నాకు నెలసరి 2 నెలలు ఆలస్యం అయింది. నేను మొదట వయసురీత్యా అనుకొని అంతగా పట్టించుకోలేదు. కానీ తర్వాత నేను ఇంకా ఫామిలీ ప్లానింగ్ చేయించుకోలేదని గుర్తొచ్చి అనుమానంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ మెడికల్ షాపు నుండి తెచ్చుకొని టెస్ట్ చేసుకుంటే, 'పాజిటివ్' వచ్చింది. "అయ్యో.. సాయీ! ఇలా అయిందేంటి? మీరే నాకు ఎలాంటి యిబ్బంది లేకుండా టాబ్లెట్స్‌తో ఈ సమస్య తొలగిపోయేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. ఎందుకలా వేడుకున్నానంటే, సర్జరీ సమయంలో ఇచ్చే మత్తు నాకు అస్సలు పడదు. బాబా దయతో సర్జరీ అవసరం లేకుండా టాబ్లెట్స్‌తో ఆ సమస్యను తొలగించేసారు.


మా చెల్లి కూడా బాబా భక్తురాలు. ఒకసారి తనకి మెడనొప్పి వచ్చి నడవడానికి కూడా రాక చాలా ఇబ్బందిపడింది. అప్పుడు నేను తనకి ఆ నొప్పి బాధనుండి ఉపశమనం కలిగించమని బాబాని వేడుకున్నాను. 3 రోజుల తరువాత చెల్లి ఫీజియోదేరఫి చేయించుకుంటే, నొప్పి నుండి ఉపశమనం లభించింది. ఇప్పుడు నాకేనా ఆ నొప్పి వచ్చింది అన్నంతగా తను ఆ సమస్య గురించి మర్చిపోయింది. ఇలా బాబా చాలా విషయాల్లో మమ్మల్ని ఆదుకున్నారు. బాబా కృప ఉంటే ఎంతటి కష్టమైన పనైన సులభంగా పరిష్కారమవుతుంది. "ధన్యవాదాలు బాబా".


21 comments:

  1. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  2. Om sai ram, nenu korukunnadi jarige la chudandi tandri pls, amma nannalani kshamam ga chudandi tandri

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. baba eeroju madava pakkana kurchoni social studies exam rainchandi baba, madava bharam antha meede baba.

    ReplyDelete
  7. Baba please take care of my child🙏🙏

    ReplyDelete
  8. Baba please ma bruno manchiga vundali 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  10. Baba ,mere elanti addanki lekunda pending vunnavi vachela chudandi thandri....mere naku dikku ....Mee padale naku dikku.... mammalni kapadi elanti ebbandi rakunda chudandi baba,naa valla evariki ebbandi rakunda chudandi baba please 🥺🥺🥺🥺🥺..... Mammalni anugrahinchandi please 🥺🥺🥺🥺....Mere nannu kadapadagalaru....mee padale naku dikku 🙏🙏🙏🙏🙏....eroju elanti ebbandi lekunda payments ki vellelaga chudandi baba 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
    Replies
    1. Chala thanks Baba 🙏🙏🙏🙏🙏😭😭😭

      Delete
  11. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  12. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  13. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  14. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  15. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  16. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  17. Sri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo