1. కోరిక తీర్చిన బాబా2. బాబా కరుణ
కోరిక తీర్చిన బాబా
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. మాది నెల్లూరు. నేను బాబాకి సాధారణ భక్తురాలిని. నా స్నేహితురాలు కల్పన నాకు బాబాని పరిచయం చేసింది అందరూ 'పిలిస్తే పలికే దైవం బాబా' అని అంటుంటే నేను అంతగా పట్టించు కోలేదు. ఏదో మామూలుగా గుడికి వెళ్లేదాన్ని ఆంతే. అలా ఉండగా మొదటిసారి నేను గర్భవతినని నిర్ధారణ అయ్యాక, "బాబా! నాకు కొడుకు పుట్టాలి, నార్మలా డెలివరీ అవ్వాలి" అని బాబాను కోరుకున్నాను. నేను కోరుకున్నట్టే నాకు నార్మల్ డెలివరీ అయి బాబు పుట్టాడు. తర్వాత నేను రెండోసారి గర్భవతినని నిర్ధారణ అయినప్పుడు నేను, 'బాబా నాకు కూతుర్ని ఇస్తారని మానసికంగా నిర్థారించుకున్నాను. నా భర్తకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. కాబట్టి తను కూడా సంతోషంగా ఉంటారని అనుకున్నాను. రోజూ, "సాయీ! నాకు పాప కావాలి. పాప పుడితే తనని 5వ నెలలో శిరిడీ తీసుకొస్తాను" అని మొక్కుకున్నాను. ఇంకా చెకప్‌కి వెళ్ళినప్పుడల్లా బాబా గుడికి వెళ్లి మరి హాస్పిటల్‌కి వెళ్తుండేదాన్ని. అలా నెలలు నిండి 9వ నెల వచ్చింది. అప్పుడు నాకు శ్రీమంతం చేసారు. నేను అందరి చేత కూతురు పుట్టాలని ఆశీస్సులు తీసుకున్నాను. కానీ అందరూ, "నీకు కూతురు కాదు, కొడుకు పుడతాడ"ని అన్నారు. బాబా మీద నమ్మకం ఉన్నప్పటికీ వాళ్ళు అందరూ అలా 'పాప కాదు బాబు' అంటుంటే నాకు కొంచెం బాధేసింది. తర్వాత డెలివరీ డేట్ ఇచ్చారు. ఆరోజు నేను బాబా గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని, అపై హాస్పిటల్‌కి వెళ్లి అడ్మిట్ అయ్యాను. అక్కడ సిస్టర్స్ నన్ను చూడగానే, "నీకు బాబు" అని అన్నారు. నేను మాత్రం ఎవరి మాటలు వినకుండా ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళాను. అక్కడ బాబాని తలచుకుంటూ, "బాబా! నాకు కూతురు పుట్టకపోతే నిన్ను నమ్మను" అని అనుకున్నాను. అంతలో డాక్టర్ ఆపరేషన్ చేసి, "కంగ్రాట్స్ నీకు పాప" అని చెప్పింది. అది విని నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నాకు కొడుకన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఇలా బాబా ఎప్పుడూ నాతోనే ఉంటారు. బాబాని నమ్మినవాళ్లు ఎప్పుడూ ఓడిపోరు. ఇది నిజం. “లవ్ యు బాబా”.
ఈమధ్య మేము తిరుమల వెళ్ళాము. అక్కడ నేను, "బాబా! నువ్వు నాతోనే ఉంటే నాకు కనిపించు" అని మనసులో అనుకుంటున్నంతలో ఒక కారు వెనుక బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. నాకు చాలా సంతోషమేసి, "తొందరగా దర్శనమయ్యేలా చూడు బాబా. ఒక సంవత్సరం పాప, ఇంకా చిన్న బాబు ఉన్నారు. వీళ్ళతో క్యూలైన్‌లో ఎక్కువసేపు ఉండలేను. 2 గంటలలో దర్శనమయ్యేలా చూడు బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల చిన్నపిల్లలు ఉన్నవాళ్ళకి ప్రత్యేక లైన్ ఉందని తెలిసి దాంట్లో వెళ్ళాము. గంటలో దర్శనం అయిపోయింది. దైవ దర్శనం చాలా బాగా జరిగింది. అంతకుముందు నాలుగైదు సార్లు వెళ్ళినపుడు స్మామిని ఇంత బాగా చూడలేదు. పిల్లలు కూడా విసిగించకుండా ఉన్నారు. ఇకపోతే, తిరుపతిలో పొంగలి చాలా బాగుంటుందని అందరూ అంటారు. కానీ నాకు ఒక్కసారి కూడా దొరకలేదు. ఎప్పుడూ లడ్డునే ఇచ్చేవారు. అందువల్ల నేను, "నాకు లడ్డు వద్దు. పొంగలి కావాలి బాబా" అని అనుకున్నాను. తర్వాత మావారితో నాకు, "నాకు లడ్డు వద్దు అండి. పొంగలి కావాలి" అని అన్నాను. అందుకు మావారు, "అంతా నీ ఇష్టమా? ఇక్కడ లడ్డు ఒక్కటే ఇస్తారు. పులిహోర, పొంగలి వంటివి ఎప్పుడో పండగలప్పుడు ఇస్తారు" అన్నారు. అంతలో మా వంతు రానే వచ్చింది. బాబా చేసిన అద్భుతం చూడండి! నేను కోరుకున్నట్లే మాకు పొంగలి ప్రసాదం పెట్టారు. అది చూసి మావారు ఆశ్చర్యపోయారు. ఇలా ఉంటాయి బాబా అద్భుతాలు. "ధన్యవాదాలు బాబా. మీరు ఉండగా దేనికి భయం బాబా? మై సూపర్ హీరో మీరు. నా తల్లివి, ఇంకా అన్నీ నువ్వే బాబా. నా జీవితంలో నేను ఇంకా ఎన్నో అద్భుతాలు చూడాలి బాబా".
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
బాబా కరుణ
నేను ఒక సాయిభక్తురాలిని. భక్తులందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నా అనుభవాలు పంచుకుంటున్నాను. నా ల్యాప్‌టాప్ కొని 2 సంవత్సరాల 5 నెలలైంది. కానీ ఎక్కువగా వాడలేదు. అలాంటిది ఒకరోజు హఠాత్తుగా మౌస్ సెన్సార్ పని చేయడం మానేసింది. ఎంత ప్రయత్నించినా పని చేయలేదు. అప్పుడు బాబాను వేడుకొని ఊదీ పెట్టాను. కానీ ఆ సాయంత్రం కూడా పని చేయలేదు. వారంటీ ఉందేమోనని బిల్లు తీసి చూస్తే, వారంటీ ఉంది. దాంతో మనసు కుదుటపడింది. అయినా, "బాబా! నా ల్యాప్‌టాప్ సెన్సార్ పని చేసేలా చూడండి" అని బాబాని అడిగాను. అయితే మరుసటిరోజు ఉదయం కూడా ఆ సెన్సార్ పని చేయలేదు. ఇక అప్పుడు ఎక్స్టర్నల్ మౌస్ కనెక్ట్ చేసుకొని వాడుదామని కనెక్ట్ చేసి వాడుతుంటే, ఆశ్చర్యంగా సెన్సార్ కూడా పని చేసింది. ఇదంతా బాబా లీల. బాబా ఊదీకి సాటి మరోకటి లేదు.
2023, అక్టోబర్‌లో నా తమ్ముడు వివాహం నిశ్చయమై నిశ్చితార్థం, వివాహం తేదిలు నిర్ణయించారు. తర్వాత అమ్మాయి తరుపువాళ్ళ పంతులు నిశ్చితార్థం ముహూర్తం బాగాలేదని చెప్పటంతో మళ్లీ చూపించి నిశ్చితార్థం ముహూర్తం మార్చారు. ఆ సమయంలో నేను బాబాను, "తమ్ముడి పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిపించు తండ్రీ" అని వేడుకున్నాను. బాబా దయవల్ల తమ్ముడి పెళ్లి ఏ ఆటంకమూ లేకుండా బాగా జరిగింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మనసులో ఎల్లప్పుడు మీ నామస్మరణ చేసేలా, అలాగే ప్రతిరోజూ సచ్చరిత్ర చదివేలా బుద్ధిని ప్రసాదించు తండ్రీ".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi
ReplyDeleteBaba antha me Daya thandri. Meere sari ayina daarilo nadichela chudandi. Nenu me nama smarana chesthune undela nannu anugrahinchandi thandri. Om Sairam!!
ReplyDeleteOm Sai Ram 🙏 Please bless my wife to get job soon
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram anta manchiga unde la chudu tandri, amma nannalani kshamam ga chudu tandri
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba please take care of my child 🙏🌺🙏
ReplyDelete🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba please na inti mundu vunna avida flat vacent chesela chudu tandri twaraga ame valla maku manasanthi ledu baba please mire cheyagalaru 😔🙏🙏🙏baba
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba na problems anni clear avvadaniki yemi cheyyalo naku telisela cheyyi baba please
ReplyDeleteNa problems anni clear cheyyi baba please
ReplyDeleteOmsairam
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteBaba naa cheyyi vadalakandi please 🥺🥺🥺🥺🥺🥺....mere naku dikku mammalni mere kadapadali....Mee padale naku dikku 🙏🙏🙏🙏🙏....nenu korukunnattu process Thursday complete ayyela chesaru alane amount kuda 23 Rd April 2024 Tuesday vachela chudandi baba...naku mee padale dikku nannu anugrahinchandi please 🥺🥺🥺🥺🥺🥺 ....nenu chala thappulu chesi vuntanu kashaminchandi baba mammalni kapadi elanti addanki lekunda pending vunnavi antha clear ayyela chudandi baba please.....naa valla Kiran bro shaik vallu ebbandi padakunda chudandi please 🥺🥺🥺🥺🥺....vallubnaa meda nammakam tho vachi ebbandi padipothunnaru deniki ela ayina oka solution chupinchandi please vallaki elanti ebbandi rakunda kapadandi.... Seshu health kuda set ayyela chudandi
ReplyDeleteplease.... Baba naa valla evaru ebbandi padakunda chudandi please 🥺🥺🥺🥺
Baba please take care of my child 🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteBaba, Maa sai madava ki repu progress card estaru. 75% above vachhelaga chudandi baba. madava ni vere school lo join cheddamu ani maa varu anelaga cheyandi baba.
ReplyDelete