సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1823వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృప
2. బాబా ఉన్నారుగా - రక్షిస్తారు

బాబా కృప


సాయిబంధువులకు నమస్కారాలు. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. మూడు సంవత్సరాల నుంచి నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను. ఆ కంపెనీలో ఎదుగుదల కనపడక కంపెనీ మారుదామని ప్రయత్నాలు చేసినా మొదట్లో ఫలితం కనిపించలేదు. చివరికి 2023, డిసెంబర్ నెలలో ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చి, అందులో సెలెక్ట్ అయితే బాగుంటుందని మా అమ్మతో చెప్పాను. కానీ ఒక వారం రోజులైనా ఆ కంపెనీ నుండి నాకు ఏ సమాచారం తెలియలేదు. అప్పుడొక గురువారం నాడు మా అమ్మ తన మనసులో బాబాని తలుచుకొని, "బాబా! ఒక వారం అయిందికానీ, ఏ విషయమూ తెలియలేదు. ఏమైందో! ఏదో ఒక విషయం తెలియజేయండి తండ్రీ" అని ప్రార్థించింది. అదేరోజు నాకు, 'ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యానని, రెండో రౌండ్‌కి సిద్ధంగా ఉండమ'ని నాకు మెయిల్ వచ్చింది. వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి విషయం చెపితే, "ఈ ఇంటర్వ్యూ కూడా సెలక్ట్ అయితే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో మీ అనుగ్రహాన్ని పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకోమ"ని చెప్పింది. నేను అమ్మ చెప్పిన విధంగా బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల రెండో రౌండ్, హెచ్‌ఆర్ రౌండు అన్ని విజయవంతంగా పూర్తై నాకు ఉద్యోగం వచ్చింది. మే నెలలో జాయిన్ అవ్వమని చెప్పారు. "శతకోటి ధన్యవాదాలు సాయితండ్రి. ఇలాగే మీ కరుణ మాపై చూపు తండ్రీ".


ఇప్పుడు మా అమ్మ అనుభవం ఆమె మాటల్లో: 2024, జనవరిలో నేను బెంగళూరులో మా అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు హఠాత్తుగా నాకు గొంతునొప్పి, జలుబు, కొద్దిగా జ్వరం వచ్చాయి. అప్పుడు నేను, "బాబా! ఇక్కడ ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలో నాకు తెలియదు. నాకు నయమయ్యేలా మీరే చూడండి" అని బాబాను ప్రార్థిస్తూ టాబ్లెట్ వేసుకొని ఊదీ ధరించాను. బాబా నామీద కరుణ చూపించారు. రెండు రోజుల్లోనే నాకు తగ్గింది. కానీ మా అమ్మాయికి మొదలైంది. అప్పుడు నేను, "బాబా! నాకు వచ్చిన పర్వాలేదుకానీ, తనకి ఏదైనా వస్తే తొందరగా తగ్గదు. ఎక్కువ కాకుండా చూడండి" అని వేడుకున్నాను. తనకి జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువగానే ఉండటంతో మెడికల్ షాపుకు వెళ్లి టాబ్లెట్స్ తెచ్చి అమ్మాయికి వేసి, "తండ్రీ! ఈ టాబ్లెట్లతో తనకి నయం చేయండి" అని రాత్రంతా బాబాని ప్రార్థించాను. సాయితండ్రి నా మొర ఆలకించారు. మరుసటిరోజుకి జ్వరం తగ్గటం ప్రారంభించి తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".


2024, భోగి రోజున నేను, మా బాబు, మా అమ్మాయి, తన స్నేహితులు అందరం కలిసి బయటకు వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు బస్సు దిగుతుంటే మా అమ్మాయి కాలు జారింది. అలా మూడుసార్లు జరగడంతో కాలు బెణికి చిన్నగా వాపు వచ్చింది. వెంటనే నేను, "బాబా! మీరే తనని రక్షించాలి. తనకి ఏమీ కాకుండా చూడు తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. మూడు, నాలుగు రోజులకి అమ్మాయికి తగ్గింది. బాబా కృపవలనే ఏమీ కాలేదు. ఆ మరుసటిరోజు ఉదయం నేను స్నానం చేద్దామని బాత్రూంకి వెళ్ళినప్పుడు కాలివేళ్ళు మలబడి కిందపడిపోయాను. బాబా దయవలన ఏమీ కాకుండా చిన్నచిన్న నొప్పులతో బయటపడ్డాను. "ఇలానే మమ్మల్ని కనిపెట్టుకొని ఉండండి సాయితండ్రీ".


బాబా ఉన్నారుగా - రక్షిస్తారు

అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. నేను చిన్నప్పటినుండి బాబా భక్తురాలిని. నాకు ముగ్గురు పిల్లలు. ఒక బాబు, ఇద్దరు పాపలు. బాబుకి మూడేళ్లు. వాడు అస్సలు కుదురుగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా తన తలకి ఆపరేషన్ జరిగింది. అందువలన తన తలకి దెబ్బ తగిలితే చాలా ప్రమాదం. వాడు 2024, ఫిబ్రవరి 28న ఆడుకుంటూ టేబుల్ మీద నుంచి కింద పడిపోయి నొప్పికి బాగా ఏడ్చాడు. రక్తం అయితే రాలేదుగానీ, చెవిపై బాగా వాచిపోయింది. 2, 3 రోజులైనా తగ్గలేదు. రాత్రి నిద్రలో లేచి దెబ్బ తగిలిన చోట చేయి పెట్టి బాగా ఏడుస్తూ ఉండేవాడు. మేము చాలా కంగారు పడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఎంఆర్ఐ స్కాన్ తీయించమన్నారు. సరేనని స్కాన్ తీయిస్తే, బ్రెయిన్ దగ్గర బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని వచ్చింది. నేను చాలా బాధపడి, "ఇలా అయింది ఏంటి బాబా?" అని ఏడ్చాను. డాక్టర్, "ఆ క్లాట్స్ పెరగకుండా ఉంటే ఒక 2 నెలల్లో వాటంతటవే కరిగిపోతాయి. ప్రమాదమేమీ లేదు.  కానీ మీరు ఒక 2 నెలలు బాబుని గమనిస్తూ ఉండండి. వాంతులైనా, బాబు ప్రవర్తనలో ఏమైనా తేడా కనిపించినా వెంటనే తీసుకొని రండి. ఈ 2 నెలల్లో ఏం తేడా లేకుంటే క్లాట్స్ కరిగిపోయినట్టే” అన్నారు. బాబు ఒక వారం రోజులు నొప్పికి నిద్రపోయేవాడు కాదు. నేను, “బాబా! వాడికి నొప్పి తగ్గి చక్కగా నిద్రపోవాలి” అని బాబా దగ్గర ఏడ్చాను. బాబా నా మొర విన్నారు. ఇప్పుడు బాబుకి నొప్పి బాగా తగ్గి హాయిగా నిద్రపోతున్నాడు. ఇక వాడికి ఏ సమస్యా ఉండదన్న నమ్మకం నాకొచ్చింది. బాబా ఉన్నారుగా వాడిని రక్షిస్తారు. క్లాట్స్ కరిగిపోతాయి. "ధన్యవాదాలు సాయితండ్రీ! బాబుని ఇలాగే కాపాడుతూ ఉండండి".


19 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Jai Sai Ram kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  8. baba eeroju madavaki hindi exam. meeru daggara vundi exam rainchandi baba

    ReplyDelete
  9. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. ఓం సాయిరామ్

    ReplyDelete
  12. Please take care of my child baba 🙏

    ReplyDelete
  13. Baba please na chelellu nato matladali baba 🙏 🙌

    ReplyDelete
  14. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  15. Baba ,maa thappu emina vunte kashaminchandi....maa valla migatha andaru kuda ebbandi paduthunnaru....chala bayam gaa vundi Baba....Please mammalni mere ee kastam nundi gattu ekkinchandi please 🥺🥺🥺🥺🥺

    ReplyDelete
    Replies
    1. Okavipu pelli ki money arrange cheyali inko vipu Seshu ki situation tough ayipothundi....inko vipu Kiran bro ebbandi paduthunnadu....ee problems annitiki oka solution vachela chudandi ,naku mere dikku baba 🙏🙏🙏🙏🙏 mammalni kapadi elanti addanki lekunda pending vunnavi antha clear ayyela cheyandi Baba 🥺🥺🥺🥺 🥺

      Delete
  16. Financial problems baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo