సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1820వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహలీలలు - 32వ భాగం

నా పేరు సాయిబాబు. 1995లో బాబా మాకు ఒక ఫిలిప్స్ కలర్ టీ.వీ. 16,000 రూపాయలకు ఇప్పించారు. అప్పటి మా స్థోమతకు అది ఎక్కువే. కానీ బాబా దయవలన చాలా సులువుగా మాకు ఆ టీవీ అమరింది. అప్పటినుండి ఇప్పటివరకూ ఆ టివికి ఏ రిపేరూ లేదు. అయితే ఒకరోజు నా భార్య హారతి చూస్తూ, "స్మార్ట్ టీవీ పెద్ద స్క్రీన్ మీద చూస్తే, శిరిడీలో మీకు ఎదురుగా ఉండి చూసినట్లు మీరు చాలా స్పష్టంగా కనిపిస్తారు బాబా" అని మనసులో అనుకొని హారతి అయ్యాక టీవీ ఆఫ్ చేసి తన పనుల్లో నిమగ్నమైంది. తరువాత నాలుగు రోజులకు నేను పేపరు చదువుతూ 'స్మార్ట్ టీవీలకు దసరా ఆఫర్లు ఇచ్చారు' అని ప్రక్కనే ఉన్న నా భార్యతో అన్నాను. వెంటనే ఆమెకు, 'న్యూస్ పేపరులో కొన్ని వందల వార్తలుంటే, టీవీలకు సంబంధించిన వార్తే ఎందుకు బాబా మావారితో చెప్పించారు?' అనిపించి, 'కొత్త టీవీ తీసుకోవాలా బాబా?' అని బాబాను అడిగింది. 'తీసుకోమ'ని ఆయన సమాధానం వచ్చింది. దాంతో 'చిన్న టీవీ అయినా పరవాలేదు. బాబా హారతి స్పష్టంగా కన్పిస్తే చాలులే' అని నేను, నా భార్య వెంటనే రిలయన్స్ షోరూంకు వెళ్ళాము. తీరా చూస్తే, అక్కడ చిన్న టీవీల ధరలే చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతో మేము, 'చిన్న టీవీకి ఇంత రేటా?' అని అసంతృప్తిగా 5 నిమిషాలు నిలబడి, ఇక వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాము. అనుకోకుండా ఒక ప్రక్కగా ఉన్న ఒక టీవీ మీద నా భార్య తన చేయి వేసింది. ఎందుకో మేము తీసుకోవాల్సిన టీవీ అదేనేమోననిపించి బాబాని అడిగితే, "తీసుకోమ"ని సమాధానం వచ్చింది. అయితే ఆ టీవీ చాలా పెద్దది. 42 ఇంచుల స్క్రీన్. మేము ఇది ఇంకా ఎక్కువ రేటు ఉంటుందని అనుకుంటూనే అక్కడున్న సేల్స్ బాయ్‌ని రేటు అడిగితే, చాలా చాలా తక్కువ చెప్పాడు. ఒక్క నిముషం అతను చెప్పింది మేము సరిగా వినలేదేమోననుకొని మళ్ళీ రేటు అడిగాము. అతను మళ్ళీ అదే రేటు చెప్పి, నిర్ధారణకోసం స్లిప్ తీసి చూపించాడు. మేము నమ్మలేకపోయాం. ఇదంతా బాబా అనుగ్రహమని సంతోషంగా ఆ పెద్ద టీవీ కొనుక్కొని, కారులో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఫిక్స్ చేసాము. ఇప్పుడు నాలుగు హారతులు ఆ టీవీలో చూస్తుంటే పిక్చర్ చాలా క్లియర్‌గా ఉన్నందువల్ల శిరిడీలో బాబాకి ఎదురుగా వున్న అనుభూతి మాకు కలుగుతుంది. బాబాను నమ్మితే, ఆయన దయ అలా ఉంటుంది.

ఆ టీవీ నాలుగు సంవత్సరాలు బాగా పని చేసిన తర్వాత ఒకరోజు ఉదయం కాకడ హారతి చూస్తుండగా టీవీ స్క్రీన్ ఆగిపోయి, వాయిస్ మాత్రమే వినిపించసాగింది. మెకానిక్‌ని పిలిచి టీవీ చూపిస్తే, "లోపల బ్యాక్ లైట్లు పోయాయి. బాగు చేయడానికి ఆరువేల రూపాయలవుతుంది" అని చెప్పారు. మరో ఇద్దరు మెకానిక్‌లు కూడా అదేమాట చెప్పారు. పైగా గ్యారెంటీ ఇవ్వలేమని, డబ్బులిస్తే వెంటనే అవి తెచ్చి, వేస్తామని తొందరపెట్టారు. కానీ మేము ఏ పని చేయాలన్నా బాబా అనుమతి తీసుకుంటాము. అందుకని, "టీవీ రిపేరు చేయించాలా బాబా?" అని అడిగితే, 'వద్దు' అని బదులిచ్చారు బాబా. రెండునెలల కాలంలో ఎన్నిసార్లు బాబాని అడిగినా 'వద్దు' అనే వచ్చింది. బాబా ఎందుకలా చెపుతున్నారో మాకు అర్థం కాలేదు. వారంటీ ఇస్తారేమోనని కంపెనీవాళ్ళను కూడా సంప్రదించినా ఉపయోగం లేకపోయింది. చివరికి ఒకరోజు నా భార్య బాబాని, "ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా టీవీ బాగు చేయించండి బాబా" అని ప్రార్ధించింది. ఆ తర్వాత ఒకరోజు నా భార్య ఫోన్ నెంబర్లు చెక్ చేసుకుంటుండగా ఒక టీవీ మెకానిక్ నెంబర్ కనిపించింది. అతనికి ఫోన్ చేసి విషయం చెప్తే, అతను, "నేను ఇప్పుడు ఆ పని మానేసి వేరే పని చేస్తున్నాను. నేను ఒక నెంబర్ ఇస్తాను. మాట్లాడి చూడండి" అని చెప్పాడు. నా భార్య అతని వద్ద నెంబర్ తీసుకుని, ఆ నెంబర్‌కి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతను, "4,000 అవుతుంది. మూడు నెలలు గ్యారెంటీ. కానీ మీరే టీవీ తీసుకుని షాపుకు రండి" అని చెప్పాడు. అంతపెద్ద టీవీ తీసుకుని వెళ్లాలంటే రిస్క్ అని బాబాని అడిగితే, 'తీసుకెళ్ళమ'ని సమాధానం వచ్చింది. టీవీని కదిలించడం, బయటికి తీసుకెళ్లడం మాకు ఇష్టం లేకపోయినా బాబా చెప్పిన తర్వాత తీసుకెళ్లి తీరాల్సిందేనని నా భార్య కారు వెనక సీటులో కూర్చొని, తన ఒడిలో టీవీ పెట్టుకుంటే నేను కారు డ్రైవ్ చేశాను. మనసులో 'ఏదో కారణం లేనిదే బాబా ఇదంతా జరిపించారు' అని అనుకుంటూ 15 కిలోమీటర్ల దూరంలో తెనాలిలో ఉన్న షాపుకి వెళ్లి, టీవీ రిపేర్ చేసే అతనికిచ్చి మేము వేరే పని మీద వెళ్ళాము. గంట తర్వాత ఆ షాపతను మాకు ఫోన్ చేసి, "టీవీలో ఏ రిపేరూ లేదు. చిన్న వైరు ఊడిపోయి లైట్లు వెలగడం లేదు. సరి చేసాం. ఇప్పుడు టీవీ బాగా వస్తుంది. వచ్చి తీసుకెళ్లండి" అని చెప్పాడు. వెంటనే నా భార్య బాబాకి కృతజ్ఞతలు చెప్పి, అతనికి కూడా చాలా "చాలా థాంక్స్ అండి” అని చెప్పింది. బాబా ఎన్నిసార్లు ఆడిగినా రిపేరు చేయొద్దని ఎందుకన్నారో మాకు అప్పుడు అర్థం అయింది. చూశారా! 4వేలో, 6వేలో ఖర్చు అవుతుందనుకుంటే, ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా టీవీ బాగయ్యేలా చేశారు బాబా. షాపువారికి సర్వీస్ చార్జ్ మాత్రమే ఇచ్చాము. చాలా డబ్బు ఖర్చు అవకుండా చూడడమే కాకుండా మంచి నిజాయితీపరుడైన మెకానిక్‌ని చూపించారు బాబా. ఇప్పుడు అంతకుముందు కంటే టీవీ చాలా బాగా వస్తుంది. తొందరపడకుండా బాబా చెప్పినట్లు సహనంతో వేచి వున్నందుకు చివరికి మంచే జరిగింది.

మనం బాబాని ప్రశ్న అడిగితే, వారి సమాధానం మన మనసుకు నచ్చకపోయినా సరే, బాబా చెప్పినట్లే నడుచుకోవాల్సిందే! అలా నడుచుకోవడం వల్ల మనకి తప్పక మేలు జరుగుతుంది. బాబా సమాధానం వెనక పరమార్ధమేమిటో కూడా మనకు తెలిసి వస్తుంది. అలాంటి అనుభవమే ఇది. 2021 మార్చి నెలలో మా అత్తగారు మా ఇంటికి వచ్చారు. ఆమెని చూడటానికి మా అమ్మాయి బెంగుళూరు నుండి వచ్చింది. అదేరోజు నా భార్యకు చెల్లెలు వరసయ్యే ఒకామె కూడా వచ్చింది. ఆరోజు సాయంత్రం 5 గంటల సమయంలో పోన్నురులోని హాస్పిటల్లో ఉన్న ఒకరిని పరామర్శించటానికి వెళ్ళాల్సి వచ్చి అందరం కలిసి వెళ్ళడానికి బయలుదేరాము. ఆ సమయంలో మా కారు కొంచెం ప్రాబ్లంగా ఉంది. అయినప్పటికీ బాబా అందర్నీ ఆ కారులోనే వెళ్ళమన్నారు. సరే, 17 కిలోమీటర్లే కదా! దగ్గరేనని బయలుదేరి వెళ్ళాము. మేము వెళ్లిన పనయ్యేసరికి చీకటి పడింది. మా అత్తగారికి సముద్రం అంటే చాలా ఇష్టం. పైగా అందరం ఉన్నాం. అందుకని, 'ఈ సమయంలో బాపట్ల దగ్గర సూర్యలంక వెళ్ళొచ్చా?' అని బాబాని అడిగితే, 'వెళ్ళమ'ని అనుమతి ఇచ్చారు. కానీ, 'రానూపోనూ వంద కిలోమీటర్లు. కారు వేడెక్కితే ఎలా? అదీకాక ఈ సమయంలో బీచ్‌లో అనుమతి ఉంటుందో, లేదో, ఉన్నా చాలా చీకటిగా ఉంటుంది, ఎవరూ ఉండరు, ఇబ్బందవుతుందేమో!' అని పలురకాలుగా సందేహించినప్పటికీ బాబా సెలవిచ్చారు కనుక వెళ్లాల్సిందేనని బయలుదేరాము. భయభయంగా వెళ్లినా మాకు అక్కడ అద్భుతం ఎదురైంది. బాబా ఎందుకు వెళ్ళమన్నారో అర్థమైంది. అక్కడ బీచ్ దాకా సిమెంట్ రోడ్లు, పట్టపగల్లా లైట్లు, షాపులు, పెద్ద రిసార్ట్, అందులో జనం, క్యాంటీన్, సకల సౌకర్యాలూ ఉన్నాయి. నాలుగైదు సంవత్సరాల క్రితం మేము అక్కడికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. అలాంటిది ఐదేళ్లలో చాలా మార్పు వచ్చింది. వెన్నెల్లో సముద్రం, తెల్లటి నురుగులతో చీకట్లో ఒడ్డుకు వచ్చి చల్లగా మా పాదాలను తాకే సముద్రపు అలలు, దూరంగా నౌకల్లోని లైటింగ్, చల్లటి గాలి, నిశ్శబ్ద వాతావరణం, ఆకాశంలో చంద్రుడు, చుక్కలు మాటల్లో చెప్పలేని మధుర భావనలలో ఎవరికి వారు ఎంజాయ్ చేస్తూ చాలాసేపు బీచ్‌లో మౌనంగా గడిపాము. మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది. పగటిపూట ఎన్నోసార్లు సముద్రం దగ్గరకు వెళ్ళాము కానీ. మనసారా నూటికి నూరుశాతం ప్రకృతిని ఆస్వాదించడం అదే మొదటిసారి. సముద్రం చూస్తూ జీవితంలో గొప్ప మధురానుభూతిని ఆస్వాదించేలా చేసిన బాబాకి మనసులోనే మనస్ఫుర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి వచ్చాము.

17 comments:

  1. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  7. Om sairam 🙏 🙌

    ReplyDelete
  8. 💐💐🙏🙏 Om Sai Ram 🙏🙏💐💐

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  10. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  11. ఓం సాయిరామ్

    ReplyDelete
  12. Baba ,em jaruguthundi anedi naku ardam kavatam ledu chala bayam vachesthundi....mosapothunnana anipisthundi kani meru nannu alanti situation loki velle laga vunte kachitham gaa ape vallu ani nammakam tho vunnanu....Antha manchi gaa ayipoye laga anugrahinchandi baba 🥺🥺🥺🥺🥺🥺....naku mere dikku mee padale naku raksha

    ReplyDelete
  13. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  14. sai baba maa sai madava bharam antha meede baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo