- అటు తిప్పి, ఇటు తిప్పి చివరికి మధుర జ్ఞాపకంగా శ్రీసాయి ఇచ్చిన ఆశీర్వాదం
శ్రీసాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రాజేశ్వరి. మా కుటుంబమంతా సాయిబాబా మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇలా చెప్తుంటే నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపిస్తుంది. బాబా దయవల్ల మా పెద్దబ్బాయి మెడిసిన్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ హోల్డ్‌లో పెట్టి ఒక ఎనిమిది నెలలు USMLE(United States Medical Licensing Examination) స్టెప్ 1కి ఇంట్లోనే చాలా కష్టపడి చదివాడు. తను 2024, ఫిబ్రవరి 14న పరీక్ష వ్రాసి, "పరీక్ష చాలా కష్టంగా ఉంద"ని చెప్పాడు. మేము మా అబ్బాయితో, "బాబా ఆజ్ఞతో, ఆయన ఇచ్చిన ప్రేరణతో నువ్వు ఈ చదువు చదువుతున్నావు, ఈ పరీక్ష వ్రాసావు. కాబట్టి అంతా బాబా చూసుకుంటారు. నువ్వు ఏమీ కంగారుపడకు" అని చెప్పాము. ఆ పరీక్ష ఫలితాలు రెండు నుండి నాలుగు వారాలు మధ్యలో వస్తాయనగా రెండు వారాలు తర్వాత మా అబ్బాయి చాలా కంగారుగా మా వారికి, నాకు ఫోన్ చేసి, "నాతోపాటు ఆరోజు ఆ పరీక్ష వ్రాసిన ఒక ఫ్రెండ్ రిజల్ట్ వచ్చింది. తను ఫెయిల్ అయ్యాడు. నా రిజల్ట్ రాలేదు. నాకు భయంగా ఉంది" అని చెప్పాడు. మాకు కూడా కొంచెం కంగారుగా అనిపించినప్పటికీ, "బాబా ఆజ్ఞతో అంతా జరుగుతుంది. కాబట్టి నువ్వు భయపడాల్సినవసరం లేదు" అని మా అబ్బాయితో చెప్పాము. తర్వాత రెండు వారాలు గడిచినా మా అబ్బాయి రిజల్ట్ వెబ్సైట్లో పెట్టలేదు. మేము, "బాబా ఏంటి మీ పరీక్ష? అసలు ఏం జరుగుతుంది? ఏది జరిగినా మీ ఇష్టం" అని ప్రార్థించసాగాము. ఐదో వారంలో మా అబ్బాయికి ఒక సీనియర్, "USMLE వెబ్సైట్ కాకుండా ఇంకో వెబ్సైట్ ఉంది. దానిలో చూడమ"ని చెప్పాడు(అప్పటివరకు ఇంకో వెబ్సైట్ ఉందని మాకు తెలియదు). దాంతో మా అబ్బాయి ఆ వెబ్సైటులో చూస్తే, 15 రోజులు క్రితమే మా అబ్బాయి పాస్ అయ్యాడని పెట్టుంది. కానీ అసలు వెబ్సైట్లో పెట్టలేదు. అలా మా అబ్బాయి పాస్ అయ్యాడని సంతోషపడాలో, ఒరిజినల్ వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని దుఃఖించాలో అర్థంకాని సందిగ్ధంలో బాబా మమ్మల్ని పెట్టారు. సరే, మేము USMLE వెబ్సైట్‌కి మెయిల్ పెడితే వాళ్ళు, 'మా అబ్బాయి మెడికల్ కాలేజీవాళ్ళు, తను మా స్టూడెంటేనని కన్ఫర్మేషన్ లెటర్ పంపలేదని, అందుకే రిజల్ట్ హోల్డ్ చేసాము’ అని రిప్లై ఇచ్చారు. అప్పుడు కాలేజీవాళ్ళని కనుక్కుంటే, "మాకు ఎటువంటి మెయిల్ రాలేద"ని అన్నారు. దాంతో మరల USMLE వెబ్సైట్‌కి, "మీరు ఏమీ పంపలేదని కాలేజీవాళ్ళు అన్నార"ని మెయిల్ పెడితే, "మేము మెయిల్ కాదు. 2023, డిసెంబర్ 1న పోస్టులో లెటర్ పంపాము. మావాడి ఫ్రెండ్స్ అందరికీ మెయిల్స్ పంపి, మా వాడికి మాత్రం లెటర్ పోస్ట్ చేయడం, అది కూడా పోస్టులో(ఈరోజుల్లో) పంపడం విచిత్రంగా అనిపించింది మాకు. చూడండి, బాబా చమత్కారాలు!
ఏదేమైనా 2024, మార్చి 20న మాకు ఆ విషయం తెలిసి, ‘డిసెంబర్ 1న పంపిన లెటర్ మూడు నెలల తర్వాత ఉంటుందా? వాళ్లేమో అది తిరిగి పంపితేగాని రిజల్ట్ ఇవ్వమన్నారు. ఇప్పుడు ఆ లెటర్ ఎక్కడ వెతకాలి? ఎవరిని అడగాలి?’ అని అనుకున్నాము. అయినా బాబా మీద భారమేసి మావారు హెడ్ పోస్ట్ ఆఫీసుకి వెళ్లారు. వాళ్ళు అక్కడ, ఇక్కడ అడగండి అని తిప్పాక ఆఖరికి ఒక పోస్ట్మాన్, "కాలేజీలో ఫలానా సెక్షన్‌లో అడగండి. కానీ మూడు నెలలుపైగా అవుతుంది. మీకు అదృష్టముంటే దొరుకుతుంద"ని చెప్పాడు. మా అబ్బాయి కాలేజీలోని సదరు సెక్షన్‌కి వెళ్లి అడిగితే, అక్కడున్న ఒక మహిళ, "దొరకడం కష్టం. అయినా ప్రయత్నిస్తాన"ని చెప్పింది. మా అబ్బాయి, 'వచ్చినప్పుడు పక్కన పడేశారు. ఇప్పుడు కష్టపడి వెతుకుతారా? మనం నమ్మాలా? అయినా ఇంకేం చేస్తాం?' అని అనుకున్నాడు. అయితే బాబా అప్పటివరకు పెట్టిన పరీక్షలు చాలని నవ్వుకున్నారు కాబోలు! ‘వెతకడం, దొరకటం కల్లా!’ అని మేము అనుకుంటే ఆ మహిళ ఒక అరగంటలో మా అబ్బాయికి ఫోన్ చేసి, "నీ లెటర్ దొరికింది. నేనే స్వయంగా ప్రిన్సిపాల్‌కి తీసుకెళ్లి ఇచ్చాను. ఆయన సంతకం కూడా చేశారు. నువ్వు కొరియర్‌కి ఒక మూడు వేల రూపాయలు కడితే నేనిప్పుడే కొరియర్ చేయించేస్తాను" అని చెప్పింది. ఇదంతా ఒక అరగంటలో అయిపోయింది. మేము ఆశ్చర్యపోయాము. 'హమ్మయ్య.. ఇంకా ఈ లెటర్ పంపితే మా అబ్బాయి రిజల్ట్ ఒరిజినల్ వెబ్సైట్లో పెడతారు' అని అనుకున్నాము. కానీ జరిగిన విచిత్రం చూడండి. ఆ లెటర్ మీ కాలేజీ నుండి వస్తేగానీ, రిజల్ట్స్ అనౌన్స్ చేయమన్న USMLE వెబ్సైట్‌వాళ్ళు ఆ లెటర్ వాళ్లకు చేరకముందే రెండు గంటల్లో మా అబ్బాయి పాస్ అయ్యాడని రిజల్ట్ పెట్టారు. ఇదంతా వ్రాస్తుంటే నాకు చాలా సంతోషంతో నవ్వు వస్తుంది. ఈ విషయాన్నీ బాబా ఇలా త్రిప్పి, అలా త్రిప్పి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎంతో అద్భుతంగా, అందంగా, సంతోషంగా చేశారు కదా అని అనుకుంటున్నాం. బాబా ఎంత చిలిపివారో చూడండి. మా అబ్బాయి ఫలితాన్ని మేము మర్చిపోకుండా ఎప్పటికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మలిచారు. వెంటనే రిజల్టు వచ్చేసి ఉంటే ఒక సంతోషం ఉండేది కానీ, ఇప్పుడు ఇది మాకు ‘ఇంత జరిగిందే!’ అనే మధురమైన జ్ఞాపకం అయింది. ఇదే కాదండి, ఇప్పటివరకు బాబా మా కుటుంబానికి ఇచ్చిన అన్నీ ఆశీర్వాదాలు మధుర జ్ఞాపకాలే. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.
ఓం సాయిరామ్
ReplyDeleteOmsaisri Sai Jai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga arogyam ga chudandi tandri, na badha ni kuda teerchandi tandri, na manasuki nachakunda yedi jaragakunda unde la chudandi tandri pls
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Ome sai ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam!! Baba antha Meede bharam thandri.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba,ippude kontha relax avvudam anukunte malli Seshu health baledu antunnadu....asalu em jaruguthundo Mee Leela ento naku ardam kavatam ledu chala tension anipisthundi... Kani edi emina meru vunnaru meru chusukuntaru naku thelusu ade nammakam tho vuntanu....Naa valla evariki ebbandi rakunda chudandi baba please 🥺🥺🥺🥺🥺❤️....Naku mee padale dikku nannu anugrahinchandi 🙏🙏🙏🙏🙏....Seshu ki kuda health set ayyela chudandi baba please 🥺🥺🥺🥺🥺❤️....Maa cheyyi vadalakandi baba 🙏🙏🙏🥺🥺🥺❤️
ReplyDelete🌺🌺🙏 Om Sai Ram 🙏🌺🌺
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeletebaba madava ki final exams lo 70% anna ravali baba, social exam baaga rayali baba.
ReplyDeleteBaba take care of my daughters
ReplyDeleteSri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai,🙏🙏🙏
ReplyDelete