సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1827వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. డబ్బుల నెపంతో శిరిడీ ప్రయాణం మనుకోకూడదని తెలియజేసిన అనుభవం 
2. దయతో అవాంతరాలు తొలగించి రిజిష్ట్రేషన్ పూర్తి చేయించిన సాయినాథుడు

డబ్బుల నెపంతో శిరిడీ ప్రయాణం మనుకోకూడదని తెలియజేసిన అనుభవం 
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కీ జై!!!
నాపేరు ధనలక్ష్మి. మాకు బాబా, గురువుగారు చాలా అనుభవాలు ఇచ్చారు. మేము బాబా, గురువుగారిని నిరంతరం స్మరించుకోవాలంటే మాకు ఒక సత్సంగం కావాలనుకొని 2006, జనవరి 15న మా ఊరిలో సత్సంగం మొదలుపెట్టాలనుకున్నాము. బాబా దయవల్ల సత్సంగం పెట్టుకోవడానికి ఒకరు ఖాళీగా ఉన్న తమ ఇల్లు ఇచ్చారు. శ్రీనివాసరెడ్డిగారు వచ్చి సత్సంగం ప్రారంభించారు. అప్పటినుండి మేము బాబా, గురువుగారికి బాగా దగ్గరయ్యాము. అదే సంవత్సరం అంటే 2006లో గురుపౌర్ణమికి మా అమ్మవాళ్ళు శిరిడీ వెళ్తున్నారని తెలిసి నాకు కూడా వెళ్ళాలని కోరిక కలిగింది. మావారిని అడిగితే, "ఇప్పుడు వద్దు. ఇంకోసారి వెళదాం" అన్నారు. కారణం, ఆరోజుల్లో డబ్బులకు మాకు చాలా ఇబ్బంది ఉండేది. అయినా  నాకు శిరిడీ వెళ్ళాలని, బాబాని, గురువుగారిని చూడాలనే తపన చాలా ఎక్కువగా ఉండింది. కానీ మావారు, "ఇప్పుడు శిరిడీ వెళ్ళాలంటే 3,000 రూపాయలు కావాలి. షాపులో కూడా ఇబ్బంది అవుతుంది" అని అన్నారు. ఇంకా నేను సరేననుకొని శిరిడీ వెళ్ళలేదు. అదే సమయంలో అనుకోకుండా మా బాబుకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. మేము శిరిడీ వెళ్తే ఎంత ఖర్చు అనుకున్నామో! సరిగ్గా అంతే మొత్తం అంటే 3,000 రూపాయల హాస్పిటల్ బిల్ అయ్యింది. అప్పుడు నేను మావారితో, "మనం శిరిడీ వెళ్తే ఖర్చు అనుకున్నాము. కానీ ఈరోజు బాబుకి బాగలేకపోతే ఖర్చు పెట్టాము. ఇక నుండి ఎప్పుడైనా శిరిడీ వెళ్ళాలనిపిస్తే డబ్బులు లేవనే విషయం రాకూడదు. మనం వెళ్తుంది బాబా దగ్గరకు, బాబాని అడిగితే ఇస్తారు" అని అన్నాను. ఆరోజు నుండి మావారిలో మార్పు వచ్చింది. మేము చేసిన తప్పుకి బాబా, గురువుగారికి క్షమాపణ చెప్పుకొని ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్లి వస్తున్నాము. మావారు తనకి కుదిరితే వస్తున్నారు, కుదరకపోతే నన్ను, పిల్లల్ని మా అమ్మవాళ్ళతో కానీ, గురుబంధువులతో కానీ పంపిస్తున్నారు. శిరిడీ ప్రయాణం మాత్రం మానుకోవడం లేదు. మా మనసుకి శిరిడీకి వెళ్ళాలనిపిస్తే, తప్పకుండా వెళ్లొస్తున్నాము. బాబా, గురువుగారి దయవలన మా ఆర్థిక సమస్యలు తగ్గుతూ వస్తున్నాయి. బాబా, గురువుగారి ఆశీస్సులతో 2007, 2009 సంవత్సరాలలో బాబా నామం, పల్లకీ ఉత్సవం సత్సంగం తరఫున ఘనంగా జరుపుకున్నాము. మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. బాబా అంటారు కదా, 'సప్త సముద్రాలు అవతలున్నా పిచ్చుక కాలికి దారం కట్టినట్లు నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను'. అది మా కుటుంబ విషయంలో అక్షరాల నిజం. బాబా, గురువుగారి అనుగ్రహం మాపై నిరంతరం ఉండాలని వారిరువురిని ప్రార్థిస్తున్నాను.

దయతో అవాంతరాలు తొలగించి రిజిష్ట్రేషన్ పూర్తి చేయించిన సాయినాథుడు

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు గురుమూర్తి. మేము ఇటీవల ఒక స్థలం కొనే ప్రయత్నం చేశాము. అందులో రకరకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక ప్లాటుకు అడ్వాన్స్‌గా కొంత డబ్బు ఇచ్చిన తరువాత డాక్యుమెంట్లు లాయర్‌కి చూపిస్తే, "లింకు డాక్యుమెంట్లో సర్వే నెంబరు తేడాగా ఉంది. కాబట్టి మున్సిపల్ ఆఫీసు నుండి సర్వే సర్టిఫికెట్ ఖచ్చితంగా అవసరమవుతుంది" అని చెప్పారు. సాధారణంగా మున్సిపల్ సర్వే సర్టిఫికెట్ రావడానికి 180 రోజుల సమయం పడుతుంది. కానీ ఆ ఫ్లాట్ అమ్మే వ్యక్తి ఎన్నారై అవ్వడం వల్ల ఆయన ఎక్కువకాలం ఇక్కడ ఉండరని చెప్పారు. దానివలన రిజిస్ట్రేషన్ ఆగిపోతుందేమోనని మేము భయపడి, "మున్సిపల్ సర్వే సర్టిఫికెట్ సకాలంలో వచ్చేలా సహాయం చేయమ"ని సాయినాథుని, శ్రీనివాసుని వేడుకున్నాం. వారి కృపవలన మున్సిపల్ సర్వే సర్టిఫికెట్ సకాలంలో అంటే 40 రోజుల్లో వచ్చింది. దాంతో ఆ ఫ్లాట్ ఓనర్ ఇండియాలో ఉండగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళాము. రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లగానే సాయినాథుని మరియు శ్రీనివాసుని పెద్ద పటములు దర్శనమిచ్చాయి. రిజిస్ట్రార్ దగ్గరకు వెళితే, వారి టేబుల్ మీద సాయినాథుని విగ్రహం ఉంది. అవి శుభసూచకములుగా అనిపించి నాకు చాలా ఆనందం కలిగింది. అలా దేవదేవుడైన సాయినాథుని మరియు ఆపద్బాంధవుడైన శ్రీనివాసుని కృపతో ఎలాంటి అవాంతరాలు, సమస్యలు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తైంది. "ధన్యవాదాలు సాయినాథా! శ్రీనివాసా! మీ కృపాకటాక్షములతో మాకున్న మిగతా సమస్యలను కూడా త్వరలో తీరుతాయని నమ్ముతున్నాను".


18 comments:

  1. Baba a aatamkamulu kalagakunda chudu thandri. Bharam antha Meede Baba. Jai Sairam!!!

    ReplyDelete
  2. Omsai venkataraman Raksha Raksha omsaisrisai Jai Jai Sai

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  7. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  8. Om sai ram, amma nannalaki manashanti ni evvandi tandri pls

    ReplyDelete
  9. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  10. ఓం సాయిరామ్

    ReplyDelete
  11. baba, maa sai madava bharam antha meede baba. madava maarali. tammudiki kuda manchi udyogam ravali baba.

    ReplyDelete
  12. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏

    ReplyDelete
  13. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  14. 🙏🙏🙏JAYA JAYA SAINADHA🙏🙏🙏

    ReplyDelete
  15. Baba, memu anukokunda cheppina date thappu ayyindi.... mammalni thappugaa anukokunda chudandi baba....naku chala tension vasthundi baba next month ki ayina memu gattu ekkisthara inka maa papalu emina vunnaya anedi ardam kavatam ledu....edi emina mede Naku dikku,naa cheyyi vadalakandi baba....naku mee padale dikku,naa valla evaru ebbandi padakunda chudandi baba 🙏🙏🥺😭😭😭

    ReplyDelete
  16. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  17. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo