సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1825వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తిరిగి పొందుతున్న బాబాకృప
2. వేడుకున్నంతనే అనుగ్రహించిన బాబా

తిరిగి పొందుతున్న బాబాకృప


నా పేరు హ్రీం. నాకు చిన్నప్పుడు బాబాపై నమ్మకం ఉండేది. కానీ పెద్దయ్యాక క్రైస్తవ మతంపై ఆసక్తి పెరిగి సుమారు 10 సంవత్సారాలు ఒక క్రైస్తవ టీవీ ఛానల్‌లో పని చేశాను. పోనుపోను అక్కడి ధోరణి చూసి ఆ మతంపై నాకు విరక్తి కలిగింది. సోషల్ మీడియాలో బాబాపై జరిగే ప్రచారం చూసి బాబాపట్ల కూడా విముకుడనయ్యాను. ఇలా ఉండగా నా కాలి తొడ భాగంలో క్యాన్సర్ గడ్డ ఏర్పడింది. 25 సార్లు రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగింది. ఆ సమయంలో ఫిషర్స్(ఫైల్స్) సమస్య వచ్చి విపరీతంగా రక్తం పోయి నేను చాలా బలహీనంగా అయిపోయాను. ఎంతలా అంటే 103 కిలోల నుండి 65 కిలోలకు తగ్గిపోయాను. నాకు సర్జరీ చేసి సుమారు కేజీ బరువున్న గడ్డను నా తొడ నుండి తీశారు. అక్కడ కుట్లు వేసిన చోట సెప్టిక్ అయి రెండు నెలలైన తగ్గలేదు. సుమారు రెండు అంగుళాలు లోతు గొయ్యి ఏర్పడింది. చాలా బాధపడుతున్న సమయంలో సత్యసాయిబాబా ప్రసంగాలు, ఇతరుల ప్రసంగాలు చూస్తున్నప్పుడు ఒకాయన ప్రసంగంలో బాబా గొప్పతనం విని తప్పు చేశాననిపించింది. దాంతో సాయి సచ్చరిత్ర ఆడియోలు వింటూ బాబా కృపకోసం ఎదురుచూసాను. 2024, మార్చి 11, సోమవారం నుండి 3 రోజులపాటు కీమోథెరపీ మొదటి డోస్ ఇచ్చారు. ఆ సమయంలో మంచం మీద ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి బాబాని ప్రార్థిస్తూ ఎంతగానో ప్రాధేయపడ్డాను. బాబా దయవల్ల ఒక మూడు తేలికపాటి వాంతులు, సెలైన్ ఎక్కించిన చోట నల్లని గాయం, దానివల్ల నొప్పి, నిస్సత్తువ తప్ప పెద్దగా దుష్ప్రభావాలు కనిపించలేదు. బాబాకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇకపోతే కీమోథెరఫీ వల్ల డీహైడ్రేషన్ అయింది. అదీకాక తిండి తినక పోవడం వల్ల రేడియేషన్ ట్రీట్మెంట్ సమయంలో విపరీతంగా వేధించిన ఫిషర్స్ సమస్య మళ్ళీ మొదలై మలవిసర్జన చేసేటప్పుడు విపరీతమైన బాధ, ఇంకా రక్తం కూడా పడనారభించింది. అప్పుడు నేను, "బాబా! ఈ నొప్పి తగ్గించు. ఈ సమస్యను నయం చేయి. నా ప్రొఫైల్ పిక్‌గా నీ ఫోటో పెట్టుకుంటాను. అలాగే మీరు నాపై చూపే కృపను తోటి సాయిబంధువులకు తెలియజేస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆ తరువాత నుండి మలవిసర్జన సమస్య కాలేదు కానీ, విపరీతమైన నొప్పి అనుభవించాను. ఆ సాయంత్రం అదివరకు ఇచ్చిన నొప్పి టాబ్లెట్ బాబాను తలచుకుని వేసుకున్నాను. బాబా దయవల్ల నొప్పి భరించే స్థాయికి వచ్చింది. మర్నాడు ఉదయం లేవగానే మళ్ళీ భయపడుతూ బాబాని ప్రార్థించి మలవిసర్జనకి వెళ్ళాను. నొప్పి ఉన్నా రక్తం మాత్రం రాలేదు. బాబా నాకు స్వస్థ చేకూర్చారని నమ్ముతూ ఇలా నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. చివరిగా మరో చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సర్జరీ కుట్ల దగ్గర నుండి నీరు కారడం వల్ల గాయమైతే రెండవసారి కుట్లు వేశారు. అయితే ఆ కుట్లు ఊడిపోయాయి. అప్పుడు నేను, "బాబా! ప్రతి వారం దగ్గరలో ఉన్న నీ మందిరానికి వస్తాను" అని మొక్కుకుంటే, సర్జరీ గాయం నుండి నీరు కారడం చాలావరకు తగ్గింది. బాబా చూపుతున్న కృపకి ఎంతగానో ఆనందంగా వుంది. శ్రీసాయి బంధువులందర్ని నా గురించి, నా ఆరోగ్యం గురించి మీ ప్రార్దనలో బాబాకు విన్నవించుకోమని అభ్యర్థిస్తున్నాను.


వేడుకున్నంతనే అనుగ్రహించిన బాబా


నా పేరు తేజశ్రీ. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. ఒకరోజు నా భర్త మా పిల్లల్ని తీసుకొని రావడానికి స్కూలుకి వెళ్ళారు. మామూలుగా వాళ్ళు ఒక గంటలో వచ్చేస్తారు. కానీ, ఆ రోజు 3 గంటలైనా రాలేదు. దాంతో వాళ్ళు ఎక్కడకి వెళ్ళారో, ఏమైందో అని భయమేసి, "బాబా! మీ దయవల్ల వాళ్ళకి ఏం కాకుండా త్వరగా వచ్చేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు కాసేపట్లో వచ్చారు. "ధన్యవాదాలు బాబా".


మేము ఉంటున్న ఇంటి కాంట్రాక్ట్ పూర్తవడంతో వేరే ఇల్లు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మాకు చాలా తక్కువ సమయముంది. ఆలోపు ఇల్లు దొరకకపోతే మాకు చాలా సమస్య అవుతుంది. అటువంటి స్థితిలో నాకు ఏం చేయాలో అర్థంకాక, "మాకు తొందరగా ఇల్లు దొరికేలా దయచూపమ"ని బాబాను వేడుకున్నాను. బాబా యవల్ల తక్కువ సమయంలో మాకు ఇల్లు దొరికింది. "ధన్యవాదాలు బాబా".


17 comments:

  1. Baba na meeda Daya chupinchandi meere elagyna nannu kapadali. Mimmalne nammukunnanu thandri. Me anugrahanni na paina kuripinchandi. Jai Sairam!!!

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  7. నా అనుభవం పంచుకునే అవకాశం ఇచ్చిన సాయినాథుని కి నా కృతజ్ఞతలు అడ్మిన్ వారికి జై సాయిరాం నా ఆరోగ్యం 90% పైనే కోలుకున్నాను మీ అందరి ప్రార్థనలు కి బాబా నా పై చూపుతున్న ప్రేమకి ఎల్లప్పుడూ కృతజతలు

    ReplyDelete
  8. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  9. Om sai ram, amma nannalani kshamam ga chusukondi baba, na mamasu nachakunda yedi jaragakunda unde la chudandi endukante na daggera ye prashna ki samadanam ledu, anduky prashna adige situation ye rakunda chayandi pls, na badha neeku matrame telusu tandri

    ReplyDelete
  10. Om sri sainadaya namaha 🙏 🌺 🙏

    ReplyDelete
  11. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  12. baba, maa sai madava english exam baaga rasanu ani cheppali baba

    ReplyDelete
  13. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  14. Baba ,maa situations set ayyi evariki ebbandi kalagakunda chudandi please baba....naa valla uncle valla pelli time lo ebbandi padi nanna ni em antaro ani bayam vesthundi baba....vallaki time ki money andela cheyandi Baba please.....maku mere dikku Baba,syam cheyandi Baba ....Naku mee padale dikku 🙏🥺😭❤️ kapadandi baba 🙏🙏🥺😭❤️

    ReplyDelete
  15. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  16. Sri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo