1. ఆపరేషన్ అవసరం లేకుండా దయచూపిన బాబా2. రెట్టింపు లోన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
ఆపరేషన్ అవసరం లేకుండా దయచూపిన బాబా
సాయి మహారాజ్ పాదపద్మములకు మా ప్రణామాలు. నా పేరు వాసంతి. మా బాబు పేరు జ్ఞాన సుకుమార్. తనకు 27 సంవత్సరాలు. మాకు సాయి యందు భక్తి, ప్రేమ, నమ్మకం ఉన్నాయి. మేము 18 సంవత్సరాలుగా సాయిని పూజిస్తున్నాము. మాకు ఏ సమస్య వచ్చినా సాయికి చెప్పుకుంటాము. ఆయన మా మనసుకి అర్థమయ్యే విధంగా సమస్యకు పరిష్కారం తెలియజేస్తారు. సాయి ప్రార్థనతోనే మాకు ఎంతో ధైర్యం కలుగుతుంది. ఇక మా అనుభవం విషయానికి వస్తే.. మా అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఐదు నెలల క్రితం ఆ వ్యాపారానికి కావలసిన సరుకులు ఖరీదు చేయడానికి మా అబ్బాయి తన స్నేహితులతో కలిసి కలకత్తా వెళ్ళాడు. అక్కడ తను బురదలో కాలుజారి బోర్లా పడిపోయాడు. ఆ ఘటనలో కంకరరాళ్ల కారణంగా మా అబ్బాయి ఎడమ మోకాలుకి దెబ్బ తగిలింది. అయితే ఆ దెబ్బ పైకి తేలినందున మా అబ్బాయి ఎలాగో తన స్నేహితుల సహాయంతో హైదరాబాద్‌లోని మా ఇంటికి తిరిగి వచ్చేసాడు. తర్వాత తనకి కాలునొప్పి, జ్వరము ఎక్కువగా ఉంటే డాక్టరుని సంప్రదించి మందులు వాడాము. కానీ ఫలితం లేకపోయింది. అప్పుడు మరో డాక్టర్‌కి చూపిస్తే, ఎక్స్‌రే తీసి ఐదు రోజులు కాలు కదలకుండా విశ్రాంతి తీసుకోమన్నారు. అలా చేసినా కూడా ఫలితం కనపడలేదు. మా బాబు అలా బాధపడుతుంటే మాకు ఏమీ తోచలేదు. మరలా డాక్టర్ దగ్గరకి వెళ్తే ఎమ్మారై తీయించమన్నారు. హాస్పిటల్లోని నర్సులు, జూనియర్ డాక్టర్లు "ఆపరేషన్ అవసరం అవ్వొచ్చు" అన్నారు. మాకు చాలా భయంగా, కంగారుగా అనిపించింది. మేము సాయిని, "బాబుకు ఆపరేషన్ అవసరం లేకుండా, అలాగే కాలు ఇబ్బందిపోయేలా చేసి ఆరోగ్యం ప్రసాదించండి. తనకు కాలునొప్పి తగ్గి చక్కగా నడపగలిగితే తోటి సాయిబంధువులతో మీ కరుణను పంచుకుంటామ"ని ప్రార్థించాము. తర్వాత రోజు ఎమ్మారై తీసాక డాక్టరు, "లిగ్మెంట్ 20% కట్ అయింది. ఇంకా కాలు వాపు వలన మోచిప్ప పక్కకు జరిగింది. ఆపరేషన్ అవసరం లేదు కానీ, మూడు నెలలు కాలు కదల్చకుండా కాలు చాపుకొని విశ్రాంతిగా ఉండాల"ని చెప్పారు. అది విని సాయి దయవలన బెడ్ రెస్టుతో బాబుకి కాలు ఇబ్బంది తగ్గిపోతుందని మేము స్థిమితపడ్డాము. ఇప్పుడు బాబు కర్ర సహాయంతో షాపుకు వెళ్లి వ్యాపారం చేస్తున్నాడు. బాబా దయవల్ల ఆపరేషన్ అవసరం లేకుండా బాబు నడవగలుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. కానీ బాబు ఐదు నెలల బెడ్ రెస్ట్ తీసుకున్న కాలంలో షాపులోని సరుకు మిస్సై వ్యాపారం తగ్గి చాలా ఇబ్బందిగా ఉంది. వ్యాపారంలోనూ, మా జీవితాలలోనూ ఉన్న సమస్యల నుండి బాబా రక్షిస్తారని నమ్మకంతో ఉన్నాము. "బాబా! జీవించడానికి కావలసిన ధైర్యాన్ని, శక్తియుక్తులను మాకు ప్రసాదించండి. మా అందరినీ సదా సన్మార్గంలో నడిపించు సాయి. అన్నిటికి ధన్యవాదాలు సాయి".
రెట్టింపు లోన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాథునికి పాదాభివందనాలు. సాయిబంధువులందరికీ నమస్కరాలు. నేను ఒక సాయి భక్తురాలిని. గత రెండు సంవత్సరాల నుండి మా కుటుంబం ఆర్ధిక యిబ్బందులతో చాలా ఇబ్బందిపడుతుంది. నేను సాయిని ప్రతిరోజూ మమ్మల్ని ఆదుకోమని వేడుకుంటూ మా స్థిరాస్తిను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ కొరకు శత విధాల ప్రయత్నించాము. అయితే రకరకాల కారణాల వల్ల లోన్ పని ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ 6 నెలలు విపరీతమైన ఒత్తిడిని అనుభవించాము. ఆ సమయంలో నా బాధని సాయికి చెప్పుకుంటూ, "నువ్వే దిక్కు తండ్రీ" అని నిత్యం ఆయనను వేడుకుంటూ వుండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు నాకు, "నీ సమస్య నేను పరిష్కరించాను. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో లోన్ వస్తుంది. వెంటనే నాకు శనగల మాల సమర్పించు. వెంటనే శుభవార్త వింటావు" అని ఒక సాయి సందేశం వచ్చింది. మరుసటిరోజు గురువారం. ఆరోజు నేను శనగల మాల గుచ్చి బాబా గుడికి వెళ్ళి, సాయితండ్రికి ఆ మాలను సమర్పించాను. తర్వాత అక్కడే బాబా ముందు ధ్యానంలో కూర్చుని, "తండ్రీ నువ్వు చెప్పినట్టు శనగలమాల నీకు సమర్పించాను. ఇంక నువ్వు నాకిచ్చిన మాటకోసం ఎదురు చూస్తున్నాను" అని మనసులోనే సాయికి చెప్పుకున్నాను. నా ఆ మాటలు ఇంకా పూర్తవలేదు. అంతలోనే అద్భుతం జరిగింది. గుడిలో వున్నానని సైలెంట్లో పెట్టిన నా సెల్‌ఫోన్ వైబ్రేట్ అవ్వసాగింది. చూస్తే, బ్యాంక్ నుండి కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే, "లోన్ శాంక్షన్ లెటర్ వచ్చింది. మీరు అడిగిన దానికి రెట్టింపు అప్రూవ్ అయింది" అని బ్యాంకువాళ్లు చెప్పారు. ఆ క్షణంలో నాకు ఊహకందనంత సంతోషం కలిగింది. అది సాయినాథుని అనుగ్రహం, ప్రేమ. ప్రత్యక్షంగా అనుభవించినవారికే తెలుస్తుంది. ఆ తండ్రి లీలలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తమ బిడ్డలను ఎన్ని విధాలుగా ఆదుకుంటారో ఎంతోమంది సాయి భక్తులకు తమ అనుభవాల ద్వారా పరిచయమే. "తండ్రీ సాయినాథా! నీ కరుణాకటాక్షాలు ఎప్పటికీ మాపై యిలాగే వుండేలా మమ్మల్ని అనుగ్రహించు సాయీ. మా తప్పులను క్షమించు, మానవ జన్మ ఎత్తినందుకు మంచి బుద్దిని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. అనుక్షణం మా మనోనేత్రంతో మిమ్మల్ని దర్శించుకునే అదృష్టాన్ని మాకు కల్పించు తండ్రీ."
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథుని కి జై!!!
Om Sai Ram 🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam 🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son and daughter in law 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet 🙏🙏💐💐
ReplyDeleteI am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteOm sai ram, amma nannalani kshamam ga chudu vaallaki prashantatani evvu tandri pls, andaru bagunde la chai tandri, arogyam ga undela chai tandri
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Sai Daya chupu
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
baba, madava ni manchi school lo join cheselaga maa varini maarchu tandri
ReplyDeleteOm sri samagra sadguru sainath maharaj ki jai 🙏
ReplyDeleteOm Sairam!!
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయినాథ్ మహారాజ్ కీ జై 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాబా నాకు కూడా లోన్ ఇష్యూ ఉంది. అది ఏ ఆటంకం లేకుండా తొందరగా లోన్ sanction అయ్యేవిధముగా నాకు అనుగ్రహించండి. నేను డబ్బులు లేక చాలా చాలా ఇబ్బందులలో ఉన్నాను, దయచేసి నాకీ లోన్ sanction చేసి పెట్టండి.
ReplyDeleteఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః 🙏🙏🙏🙏🙏
Omsairam
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏
ReplyDelete