సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2059వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆశీర్వాదం
2. భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారు


భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారు

బాబా నా పేరు మహేష్. ఒకసారి నేను శిరిడీలో లక్ష్మీ మందిరంకి దర్శనానికి వెళ్లి అక్కడున్న బాబా భక్తితో ప్రార్థించాను. దర్శనానంతరం బయటకు వచ్చిన నేను తొందరలో నా చెప్పులు అక్కడే మర్చిపోయాను. ఆ విషయం నాకు అస్సలు గుర్తుకు రాలేదు. నేను బస చేసిన హోటల్‌కి చేరుకున్న తర్వాత చెప్పులు లేవని గమనించాను. కొంచం ఆందోళన కలిగినప్పటికీ బాబాపై నమ్మకంతో ఆయన చూసుకుంటారని మనసులో అనుకొని ఆయనకి చెప్పుకొని ప్రశాంతంగా ఉన్నాను. ఆ రాత్రంతా బాబా ధ్యాసలో గడిచింది. మర్నాడు ఉదయం లక్ష్మీ మందిరంకి వెళ్ళడానికి బయలుదేరాను. నా మనసులో చెప్పులు దొరుకుతాయో లేదోనని భయం ఉన్నప్పటికీ దొరకుతాయన్న ఆశ కూడా ఎక్కువగానే ఉంది. అక్కడికి వెళ్ళాక చూస్తే, నా చెప్పులు కనిపించాయి. ఎవరూ వాటిని తాకకుండా అలాగే ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అది సాయిబాబా కరుణ అనిపించింది. ఆయనపట్ల నా భక్తి మరింత బలపడింది. బాబా తన భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారని ఈ అనుభవం మరోసారి నిరూపించింది.

ఒకరోజు అకస్మాత్తుగా నీళ్ల విరోచనాలు మొదలై నా శరీరమంతా బలహీనమైపోయి ఏ పని చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నేను ఈ సమస్య నుంచి బయటపడేసేది బాబా దయ తప్ప ఇంకేమీ లేదని నమ్మి ఆయనను మనస్ఫూర్తిగా ప్రార్థించి పూర్తి భారం ఆయన మీద వేసాను. డాక్టరు సూచనలననుసరించి మందులు సక్రమంగా తీసుకుంటూ ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. బయట ఆహారం పూర్తిగా మానేసి తేలికపాటి భోజనం తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నాను. డీహైడ్రేషన్(నిర్జలీకరణం)కి గురికాకుండా ఎక్కువగా నీళ్లు, ఓఆర్ఎస్ తీసుకున్నాను. ప్రతిక్షణం సాయిబాబా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండసాగాను. మొదటిరోజు చాలా కష్టంగా గడిచినప్పటికీ రెండోరోజు నుంచి పరిస్థితి క్రమంగా మెరుగుపడటం మొదలై విరోచనాలు కావడం తగ్గింది. దాంతో నా మనసుకు ప్రశాంతత వచ్చింది. ఇంకా శరీరంలో కూడా శక్తి మెల్లగా పుంజుకుంటున్నట్లు అనిపించింది. చివరికి సాయిబాబా అనుగ్రహంతో నేను పూర్తిగా కోలుకున్నాను. ఈ అనుభవం ద్వారా కష్టకాలంలో భక్తి మనకు ఎంత బలన్నిస్తుందో తెలుసుకున్నాను. ప్రార్థనతోపాటు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని అర్థమైంది. ప్రతి సమస్యకు సాయిబాబా ఒక మార్గం చూపిస్తారని నమ్మకం మరింత బలపడింది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను.

నేను ఒక IT కంపెనీలో పని చేస్తున్నాను. 2025, డిసెంబర్ నెలకు సంబంధించిన నా టైమ్‌షీట్ విషయంలో అప్రూవల్ లేకుండా రెగ్యులరైజ్ అవుతుందా అనే సందేహం నా మనసును కలవరపెట్టడంతో నేను కొంత ఆందోళనకు లోనయ్యాను. అలాంటి సమయంలో నేను ఎప్పటిలాగే, “బాబా! ఈ విషయాన్ని నీవే చూసుకుంటావని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈలోగా అనవసరమైన మెయిల్స్ లేదా రిమైండర్స్ రాకుండా మీరే చూసుకోవాలి" అని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి భారం ఆయన మీద వేసాను. ఆ రోజంతా కొద్దిగా టెన్షన్‌గా ఉన్నప్పటికీ బాబా మీద విశ్వాసం తగ్గలేదు. అనుకోకుండా సిస్టమ్‌లో నా టైమ్‌షీట్ ప్రాసెస్ అయిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ క్షణంలో నా మనసు ఎంతో ప్రశాంతమైంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా డిసెంబర్ టైమ్‌షీట్ రెగ్యులరైజ్ కావడం నిజంగా బాబా కృపే. నా ప్రయత్నం కంటే బాబా అనుగ్రహమే ఎక్కువగా పనిచేసిందని నాకు అనిపించింది. ఈ సంఘటన మరోసారి బాబా మన సమస్యలను మౌనంగా పరిష్కరిస్తారని నిరూపించింది. సమయం వచ్చినప్పుడు బాబా అన్నీ సరిచేస్తారని నాకు బలమైన నమ్మకం ఏర్పడింది. మనకు చిన్నగా అనిపించే సమస్యలు కూడా ఆయన దృష్టిలో ఉంటాయని అర్థమైంది. బాబా మీద భారమేసి నిశ్చింతగా ఉండటం ఎంత ముఖ్యమో నాకు తెలిసింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

6 comments:

  1. Om Sai Ram 🙏🙏

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om Sri Sai Raksha🙏🙏🙏
    OM Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo