సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1841వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబా అండగా ఉండగా సమస్యలు తీరకుండా ఉంటాయా?
2. పెద్ద ప్రమాదం నుండి కాపాడిన బాబా

బాబా అండగా ఉండగా సమస్యలు తీరకుండా ఉంటాయా?

శ్రీసాయినాథాయ నమః. సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. మా తమ్ముడు బెంగళూరులో హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒకసారి కొన్నిరోజులు సెలవులు వస్తే, తను మా అమ్మానాన్నల దగ్గరకు వచ్చాడు. ఇక్కడకు వచ్చాక చూసుకుంటే తన పర్సు కనపడలేదు. వెంటనే తను తన స్నేహితుడికి ఫోన్ చేసి, హాస్టల్లో ఉందేమో చూడమంటే, అతను గదంతా వెతికి లేదని చెప్పాడు. క్రెడిట్ కార్డులు, ఎటిఎం కార్డులు, డబ్బులు, ఇంకా చాలా రసీదులు ఆ పర్సులో ఉన్నందున మా తమ్ముడు చాలా టెన్షన్ పడ్డాడు. అప్పుడు నేను సద్గురు సాయినాథుని, "మా తమ్ముడు పర్సు దొరికేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాను. బాబా అండగా ఉండగా మన సమస్య తీరకుండా ఉంటుందా? 15 రోజుల తర్వాత మా తమ్ముడి స్నేహితుడు ఫోన్ చేసి, "పర్సు దొరికింద"ని చెప్పాడు. మా ఇంట్లో అందరం చాలా సంతోషించాము.

2024, ఫిబ్రవరిలో ఒకరోజు అర్థరాత్రి సమయంలో ఉన్నట్టుండి నా ఛాతిలో బాగా నొప్పి వచ్చింది. నేను గ్యాస్ సమస్యేమోనని గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను కానీ, ఆ బాధ తగ్గలేదు. అప్పుడు బాబా ఊదీ తీసుకొని కొంచెం నీళ్లలో వేసుకొని తాగి, 'ఓం ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ పడుకున్నాను. ఒక గంట తర్వాత కాస్త ఉపశమనంగా అనిపించి నిద్రపట్టింది. ఇలాగే ఒకసారి కడుపునొప్పి వచ్చి ఎంతకు తగ్గకపోతే, నాకు ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాలేమో అనిపించింది. అప్పుడు బాబా ఊదీ తీసుకుని కడుపుకి రాసుకొని, "ఇంట్లో ఎవరూ లేరు బాబా. నువ్వే ఎలాగైనా ఈ బాధను తగ్గించాల"ని బాబా పటం ముందు బాధపడ్డాను. సాయినాథుడు భక్తులు బాధలు తీర్చే కల్పతరువు. కొద్దిసేపటికి ఏ మందూ  వేయకుండానే నొప్పి తగ్గింది.

ఐదు సంవత్సరాలుగా నాకు మైగ్రేన్ బాధ ఉంది. అది జీర్ణ సమస్య, వాంతులతో నరకంలా ఉంటుంది, తలిస్తేనే నాకు భయమేస్తుంది. దానివలన నేను ఎంతో వేదన అనుభవించాను. నేను ఈ బ్లాగులో సాయికృపతో ఎంతోమంది తమ వ్యాధులను తొలగించుకున్నారని చదివి, "నాకు కూడా ఈ బాధ నుండి ఉపశమనం కలిగించండి. నేను సాయి దివ్యపూజ 9 వారాలు చేస్తాను" అని సాయికి మొక్కుకొని పూజ మొదలుపెట్టాను. మీరు నమ్ముతారో, నమ్మరో కానీ, పూజ మొదలుపెట్టింది మొదలు 9 వారాల్లో ఒక్కరోజు కూడా ఆ బాధ నాకు రాలేదు. నా సాయితల్లి నా బాధను తీసేసారు. మనం శ్రద్ధ-సబూరీతో ఉంటే ఎంతటి సమస్యనైనా బాబా చాలా తేలికగా తీసేస్తారు. బాబా మీద నమ్మకం ఉంచండి, ఆయనే మనల్ని రక్షిస్తారు. సాయినాథునికి శతకోటి వందనాలు.


పెద్ద ప్రమాదం నుండి కాపాడిన బాబా

నేను ఒక సాయి భక్తుడిని. 2023, అక్టోబర్ 10న సెలవు దినం కావడంతో నేను మా బర్రెలను మేపటానికి మా గ్రామ పరిసరాలలో ఉన్న పర్వత శ్రేణులు వైపు వెళ్ళాను. కాసేపు బాగానే ఉంది. తరువాత అడవిలో నుండి  కొన్ని ఏనుగులు మా వైపుగా వచ్చి మాపై దాడి చేయబోయాయి. నాతోపాటు అక్కడున్న వారంతా తలో దిక్కుకు పారిపోయే ప్రయత్నం చేసాం. అందరూ అక్కడి నుండి తప్పించుకొని పారిపోయారు కానీ, నేను ఎటూ వెళ్లలేక కొండ అంచునున్న పొదల్లోకి దూరాను. తర్వాత చూసుకుంటే పక్కనే అతి పెద్ద లోయ. అందులోకి నేను జారిపోబోతున్న స్థితిలో, నన్ను కాపాడేవారెవరూ కనిపించక భయపడుతున్న సమయంలో హఠాత్తుగా నాకు సాయిబాబా గుర్తు వచ్చి, "బాబా! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.. పాహిమాం.. నాకు మీరే దిక్కు. నన్ను కాపాడండి. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. అంతే, మరుక్షణం ఎవరో నన్ను ఒక పక్కకి లాగారు. చూస్తే, ఎవరూ లేరు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా వుంది. బాబా పిలిస్తే పలికే దైవం. ఆయనే నన్ను అంత ఎత్తున పెద్ద ప్రమాదం నుండి కాపాడారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

14 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐

    ReplyDelete
  4. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  5. Please take care of my child and bruno

    ReplyDelete
  6. baba madava little chandra school lo cherali baba . antha savyamga jarigetattu chudandi baba

    ReplyDelete
  7. Baba Kalyan e ammai Monica ni like chasatatlu chai baba thandri pl meku satha koti vandanalu

    ReplyDelete
  8. ఓం సాయిరామ్

    ReplyDelete
  9. Baba pls help me at my work

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  12. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo