సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1832వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?
2. కేవలం ఆ సాయినాథుని అనుగ్రహం

బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?

ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సామాన్య సాయిభక్తుడిని. నా పేరు గంగాధర్. బాబా నా జీవితంలోకి చాలా సంవత్సరాల క్రితం వచ్చారు. అప్పటినుండి ఆయన లీలలు నాకు తరచూ అనుభవమవుతూ ఉన్నాయి. 2024, మార్చి నెలలో ఒకరోజు మా పాపకి తీవ్రమైన జ్వరమొచ్చి, నిరంతరాయంగా వాంతులయ్యాయి. అదే సమయంలో నాకు ఎన్నడూ లేనంతగా డబ్బు విషయంలో చాలా ఇబ్బంది ఏర్పడింది. ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. నా భార్య దగ్గర ఉండాల్సిన డబ్బు కూడా కొద్దిరోజుల ముందు పిల్లల స్కూల్ ఫీజు కోసం ఇచ్చేసింది. అందుచేత తన దగ్గర కూడా ఏమీ లేని పరిస్థితి. చాలామంది స్నేహితులని అడిగినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి లేవని సమాధానం వచ్చింది. ఇంకా నాకు ఏమి చేయాలో అర్ధంకాక బాబా మీద భారమేసి ఆయన నామస్మరణ చేస్తూ డబ్బుకోసం ప్రయత్నం సాగించాను. కానీ సాయంత్రమవుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దానికి కారణం నేనే. ఎందుకిలా అంటున్నానంటే, నేను అంతకుముందు అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి నా స్నేహితులకు సరైన సమయానికి ఇవ్వలేకపోయాను. అందువల్ల నేను కూడా అంత చనువుగా వాళ్ళని మళ్ళీ అడగలేకపోయాను. ఇకపోతే, నేను ఇంటికొచ్చి చూసేసరికి పాప ఆరోగ్యం నేను ఉదయం ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇంచుమించు అలానే ఉంది. ఏ మార్పూ లేదు. అప్పుడు డాక్టరైనా నా భార్య సిస్టర్కి ఫోన్ చేసి పాప లక్షణాలు చెప్పాము. ఆమె, "బహుశా పాపకి ప్లేట్లెట్లు పడిపోయాయేమో, తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లండి" అని సలహా ఇచ్చారు. అప్పటికి రాత్రి 9 అవ్వడంతో  నా భార్య టెన్షన్ పడసాగింది. నా దగ్గర డబ్బు లేదని చెపితే నా భార్య తన అక్కవాళ్ళని అడిగైనా డబ్బు ఏర్పాటు చేస్తుంది. కానీ నేను ఆ మాట చెప్పలేకపోయాను. ఎందుకంటే, నేను డబ్బులు విషయంలో కొన్ని పొరపాట్లు చేశాను. అవి చెప్తే, అనవసరంగా ఇంట్లో గొడవలవుతాయమోనని నాకు భయమేసింది. ఇలాంటి పరిస్థితిల్లో నాకున్న ఏకైక దిక్కు బాబా. అందువల్ల నేను పూజగదిలో ఏడుస్తూ, "బాబా! ఉదయానికల్లా నా కూతురికి నయమై తను స్కూలుకి వెళ్లగలిగేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. తర్వాత నేను చేసిన తప్పుడు నిర్ణయాల వలన డబ్బు విషయంగా ఇంత ఇబ్బందిపడాల్సి వచ్చిందని ఆలోచిస్తూ ఆ రాత్రి చాలాసేపటివరకు నిద్రపోలేదు. నా మీద నాకు ఎప్పుడు లేనంత అసహ్యం వేసింది. ఆ ఆలోచనలతో బాబాని నేను చేసిన తప్పుల్ని మన్నించమని అడిగి, బాబా భక్తుల అనుభవాలు చదువుతూ ఏ సమయానికో నిద్రపోయాను. బాబా మా జీవితంలో గొప్ప అద్భుతం చేసారు. మరుసటిరోజు ఉదయం నేను నిద్ర లేవకముందే మా పాప నిద్రలేచి నా దగ్గరకొచ్చి, "నాన్నా! లే, నేను స్కూలుకి వెళ్ళాలి" అని నన్ను లేపుతుంటే, నేను ఆశర్యపోతూ లేచాను. చూస్తే, పాపకి పూర్తిగా నయమైంది. నేను ఆనందంతో, "బాబా! మీకు శతకోటి నమస్కారాలు" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను.

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!
ఓం శ్రీసాయి రక్షక శరణం దేవా!!!

కేవలం ఆ సాయినాథుని అనుగ్రహం

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆశదీప్తి. మా బాబుకి 2024, మార్చి నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ జరిగాయి. నేను, "బాబు పరీక్షల సమయానికి ఆఫీసులో నాకు సెలవు దొరికేలా అనుగ్రహించండి" అని సాయిని వేడుకున్నాను. సాయి దయవల్ల నాకు సెలవు దొరికింది. నేను బాబుతో పాటు ఉండి వాడిచేత పరీక్షలన్నిటికీ బాగా ప్రిపేర్ చేయించాను. తను పరీక్షలు చక్కగా వ్రాసాడు. మార్కులు కూడా బాగానే వచ్చాయి. ఇదంతా కేవలం నా సాయినాథుని అనుగ్రహం. ఎందుకిలా అంటున్నానంటే, మామూలుగా మా బాబు ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ పెట్టి చదవడు. అలాంటిది ఫైనల్ ఎగ్జామ్స్‌కి మాత్రం మొత్తం సిలబస్ రోజున్నరలో పూర్తిచేసి పరీక్షలో చకచకా వ్రాసి మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసాడు.


నేను నా ఆఫీసులో ఒక ఫీచర్ డెవలప్ చేశాను. అందుకు సంబంధించి మొత్తం పని అంతా పూర్తి చేసి ఇక టెస్టింగ్ మొదలుపెడదామనుకునే సమయానికి అనుకోకుండా నా కోడ్‌లో ఒక సమస్య వచ్చింది. అది ఎలా సరి చేయాలో ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదు. దాంతో నా తోటి ఉద్యోగస్తులను ఆ సమస్యకు పరిష్కారం అడిగాను. వాళ్ళు కోడ్ చెక్ చేసి, "అంతా సరిగానే ఉంది. సమస్య ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు" అని చెప్పారు. ఇక ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించగలిగేది ఆ సాయినాథుడే అని నమ్మి ఆయన్ని శరణువేడాను. అప్పుడు ఆ సాయినాథుని దయవల్ల నాకు ఒక ఆలోచన వచ్చి ఆ విధంగా చేస్తే, వెంటనే సమస్య పరిష్కారమే కోడ్ పని చేసింది. తోటి ఉద్యోగస్తులు, "నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?" అని చాలా ఆశ్చర్యపోయారు. అంతా కేవలం ఆ సాయినాథుని దయ. "సాయిదేవా! ఎప్పుడూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపించండి తండ్రి". 


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


18 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. Om sai ram, anta bagunde la chudandi tandri nenu annukunnadi jarige la chudandi tandri, amma nannalani kshamam ga chuse badyata meede tandri

    ReplyDelete
  8. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  9. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. baba madava social exam baaga ravali, eeroju training class cancel avvali baba

    ReplyDelete
  12. Om sri sai karma dwamsine namaha 🙏

    ReplyDelete
  13. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏

    ధన్యవాదాలు సాయి 🙏🙏🙏 నేను పంపిన నా అనుభవాన్ని బ్లాగ్ లో పోస్ట్ చేసినందులకు. అలాగే నా జీవితంలో బాబా చాలా అనుభవాలు చేశారు. అవి కూడా బ్లాగ్ లో త్వరలోనే పంచుకుంటాను. ఈ గ్రూప్ ని నడిపిస్తున్న గ్రూప్ సభ్యులు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు . వారందరికీ శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏 ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  14. Sainadha thandri,meru vunnaru ane nammakam thone inka pranalutho vunnanu....naku jivitham etu velthundo ardam kavatam ledu....naa thappulu anni kshaminchi anugrahinchandi baba 🥺❤️😘😭❤️....Chala kastam gaa anipisthundi bayam vesthundi....elanti addanki lekunda pending vunnavi antha clear ayyela chudandi baba....naa valla evaru ebbandi padakunda chudandi please,naku mee padale dikku 🙏🙏🙏🙏🙏 ede vidam gaa vunte naa pranam thesukodam thappa vere option ledu

    ReplyDelete
  15. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  16. Sri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo