సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1839వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనం చెప్పే ప్రతిదీ విని అనుగ్రహిస్తారు
2. నమ్ముకున్నవారికి కల్పతరువు బాబా

బాబా మనం చెప్పే ప్రతిదీ విని అనుగ్రహిస్తారు


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రాణి. 2024, జనవరి 14, భోగి పండగ రోజున నాకు కడుపునొప్పి వచ్చింది. కొద్దిగా ఊదీ నీళ్ళలో వేసుకొని తాగితే కొంచం నొప్పి తగ్గింది. కానీ బండి మీద వెళ్లినప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు కడుపునొప్పి వస్తుండేది. అందుకని జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళితే చాలా పరీక్షలు వ్రాశారు. ఆ టెస్టులు చేయించుకొని రిపోర్టులు తీసుకొని మళ్లీ డాక్టర్ దగ్గరకి వెళ్తే, "కుడి అండాశయంలో తిత్తి ఉంది. ఆపరేషన్ చేయాలి. వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్ళండి" అని అన్నారు. సరేనని నేను గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే, అక్కడ మళ్ళీ స్కానింగ్ చేసి, "తిట్టి చాలా పెద్దగా ఉంది. ఆపరేషన్ చేయాలి" అని చెప్పారు. నేను, "మందుల ద్వారా తగ్గదా?" అని అడిగితే, "ఆపరేషన్ చేయాలి. మందు లేదు" అని డాక్టరు అన్నారు. ఇక చేసేదేమి లేక బాబా అనుమతి తీసుకొని 2024, మార్చి 22న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఆపరేషన్‌కి అరగంట సమయం పడుతుందన్నారు కానీ, గంటన్నర పట్టింది. ఎందుకంటే, కేవలం తిత్తిని తొలగించడం సాధ్యం కాలేదు. అది అండాశయాన్ని గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల తిత్తితోపాటు కుడి అండాశయాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. ఇకపోతే, తిత్తి పరిమాణం పెద్దగా ఉండటం వల్ల దాన్ని బయాప్సీకి పంపించాలన్నారు, నేను చాలా టెన్షన్ పడి, "బయాప్సీ రిపోర్టు నార్మల్‌గా రావాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా మనం చెప్పే ప్రతిదీ వింటారు. ఆయన టైమింగ్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. కానీ మనం మమ్ములు మనుషులం. కొంచెం కూడా ఓపిక పట్టలేము. అందువల్ల ఆ వారం రోజుల్లో నేను పడిన టెన్షన్ అంతాఇంతా కాదు. కానీ చివరికి బాబా దయవల్ల ఆపరేషన్ అయిన ఒక వారం తర్వాత వచ్చిన బయాప్సీ రిపోర్టు నార్మల్ అని వచ్చింది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. బాబాకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలుపుకున్నా తక్కువే.


2024, జనవరిలో మా ల్యాప్‌టాప్ ఛార్జర్ పని చేయకపోతే నా భర్త ఆ ల్యాప్‌టాప్ బాగు చేయించడానికి తీసుకెళ్లి, 'ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పిన్ పని చేయడం లేదంటే' ఆ పిన్ మార్పించి, అలాగే వేరే ఛార్జర్ తీసుకొచ్చారు. అయితే మా పిల్లలు చిన్నవాళ్లు. వాళ్ళు ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు, తీసేటప్పుడు వాళ్ళ బలమంతా ఆ ల్యాప్‌టాప్ మీద చూపిస్తుండేవారు. దాంతో 2024, ఏప్రిల్ 7న ల్యాప్‌టాప్ ఛార్జర్ మరోసారి పని చేయలేదు. ఈ విషయంగా నా భర్త చాలా కోప్పడ్డారు. నాకు ఏం చేయాలో తోచక బాబాకి చెప్పుకొని ఊదీ ల్యాప్‌టాప్‌కి పెట్టి, ఆ రోజంతా అలాగే వదిలేసాను. మర్నాడు ఛార్జింగ్ పెడితే ల్యాప్‌టాప్ మాములుగా పనిచేసింది. అలా బాబా మా మీద దయ చూపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. అందరి మీద మీ కృప ఇలాగే ఎల్లవేళలా ఉండాలి తండ్రీ".


నమ్ముకున్నవారికి కల్పతరువు బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు కోమలవల్లి. నా వయస్సు 42 సంవత్సరాలు. నా భర్త తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఆయన వల్ల మేము మా సొంత ఇంటిని పోగొట్టుకొని ఎన్నో ఆర్థిక సమస్యలతో తినడానికి లేక పిల్లలతో సహా పస్తులు వున్నాము. అలాంటి స్థితిలో మా అమ్మాయి వివాహం చేయగలనా అని నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ బాబా ఎంత దయ గల వారంటే పెళ్ళిచూపులకి వచ్చిన మొదటి సంబంధమే ఖాయమైంది. వివాహానికి కావలసిన డబ్బు తక్కువ వడ్డీకి, నెలనెలా చెల్లించేలా సమకూరింది. అది కూడా అన్నిటికీ నా జీతం సరిపోయేలా(నేను ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను). బాబా దయతో ఏ ఆటంకాలు లేకుండా అమ్మాయి వివాహం ఎంతో వైభవంగా జరిగింది.

ఇకపోతే, మాకున్న అర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నేనొక ఆవు తీసుకున్నాను. కానీ నాకు కలిసి రాక ఆ ఆవు అనారోగ్యం పాలై నేను చాలా నష్టపోయాను. దాంతో ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఎంతో ఆవేదన చెందాను. ఇలాంటి సమయంలో ఒకరు జీతం మీద లోన్ ఇస్తామంటే, సరేనని అప్లై చేశాను. కాని వాళ్ళు ఒక ముఖ్యమైన పత్రం అడిగారు. దాన్ని ఎలా తీసుకురావాలో నాకు తెలియలేదు. నా ఆర్థిక పరిస్థితి కారణంగా నేను ఎవరితోనూ అంతగా కలవను. అందువల్ల ఆ పత్రం గురించి ఎవ్వరిని అడగాలో నాకు తెలియలేదు. అప్పుడు, "బాబా! నేను అ పత్రం గురించి ఎవరినీ అడగను. మీరే అ పత్రం నా కంటికి కనిపించేలా చేయండి. అలాగే నాకు లోన్ వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. నిజంగా బాబా ఎంత దయమయుడంటే అంతవరకు నేను ఎంత ప్రయత్నించినా దొరకనిది, బాబాను వేడుకున్న తర్వాత ఇంటర్నెట్‌లో ప్రయత్నిస్తే ఒక్క నిమిషంలోనే నాకు కావలసిన పత్రం దొరికింది. ఆ అద్భుతానికి నాకు అస్సలు మాటలు రాలేదు. నాకు లోన్ శాంక్షన్ అయి నా ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. జరగదనుకున్న పని జరిగింది. దీనికి పూర్తిగా బాబా అనుగ్రహమే కారణం. ఇలా ఎన్నో విషయాల్లో సాయినాథుని అనుగ్రహం నేను పొందాను. నమ్ముకున్నవారికి కల్పతరువు బాబా. "ధన్యవాదాలు బాబా. నా భర్త తాగుడు మానేలా చూడు దేవా".


22 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son and daughter in law 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  6. Sai, bless us and give us the jewels 🙏🙏💐💐🙏🙏

    ReplyDelete
  7. Om Sai Ram Baba please cure my husband leg skin problem.He got hurt 1 1/2 month ago.He is high daibitic patient.Be with him.please cure that hurt.i am afraid about his health.my pranams to you

    ReplyDelete
  8. ఓం సాయి రామ్ నా భర్త నీ కా పా డు.2నెలల కిందట కాలికి దే బ్బ త గిన్ నది. అయనా షుగర్ పేషంట్స్ .బాబా నాకు చాలా భయంగా ఉంది
    కాపాడు తండ్రి.ఆ దెబ్బ పూri గా త గ్గల గా దీవించు .నా వర్రీ త గ్గిచ్చు. నా న మ స్కా రాలు సాయి రామ్

    ReplyDelete
  9. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  12. sai baba madava join avvataniki manchi school chupinchu tandri. maavare swayamga aa school lo join cheddamu anali baba. meere cheyali . ayanani maarchali baba.

    ReplyDelete
  13. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  14. Sai na vamsi malli natho prema ga matladela chudu sai baba sai

    ReplyDelete
  15. ఓం సాయిరామ్

    ReplyDelete
  16. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏 బాబా ! ఆమె యొక్క భర్త తాగుడు మానెల ఆవిడకు వరం ఇవ్వండి తండ్రి !!!
    ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  17. తండ్రీ!!! నా యొక్క ఆర్ధిక పరిస్థితులు చక్కబడేలా నాను ఆశీర్వదించండి బాబా .. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏నా యొక్క కుటుంబాన్ని చక్క దిద్దుకోవడానికి నేను సరిఅయిన ఆర్ధిక స్తోమతలను ప్రసాదించు తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏

    ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  18. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi

    ReplyDelete
  19. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo