సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1843వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి నామజప శక్తి
2. సాయి నామజపంతో ఆరోగ్యానికి సమస్య లేదన్న నిర్ధారణ

శక్తివంతమైన సాయి నామజపం

నేను ఒక సాయిభక్తురాలిని. నేను నా సాయిని 'నాన్న' అని పిలుస్తాను. ఎందుకంటే, ఆయన తండ్రిలా అడక్కుండానే నాకన్నీ సమకూరుస్తున్నారు. ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి ఆర్థిక ఇబ్బందుల వరకు సమస్య చిన్నదైనా, పెద్దదైనా సాయి నా వెంటే ఉంటున్నారు. ఆయన నా కుటుంబ పెద్ద. అందుకే ఆయనని అడగకుండా, ఆయనకు చెప్పకుండా మా కుటుంబసభ్యులెవరమూ ఏ పనీ మొదలుపెట్టం. ఏదైనా కోరిక నెరవేరాలంటే నేను సాయి నామజపం 1200 సార్లు(మూడు లేదా నాలుగు మాలలు) చేస్తాను. అలా చేసిన వెంటనే నా కోరిక నెరవేరుతుంది. ఒకసారి నాకు, నా ఫ్రెండ్‌కి మధ్య చిన్న మాట పట్టింపు వచ్చింది. అప్పుడు నేను సాయికి నా సమస్య చెప్పుకొని 1200 నామజపం చేయగానే మా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయి.

ఒకసారి మా చెల్లికి విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల నిద్రపట్టక చాలా ఇబ్బందిపడింది. ఎంత ప్రయత్నించినా అర్థరాత్రి 2 దాటినా తనకి నిద్రపట్టలేదు. అసలే మైగ్రేన్ సమస్య ఉన్న తనకి నిద్ర సరిగా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది తను. అందుకని తను 'సాయిరాం సాయిరాం సాయిరాం' అని సాయి నామజపం చేసింది. అలా చేస్తుంటే తనకి ఒక దివ్య కాంతి కనపడింది. ఆ కాంతి కనపడిన వెంటనే తనకి ఏదో తెలియని మత్తులాగా వచ్చేసి గాఢనిద్రలోకి జారుకుంది. తెల్లవారి నిద్రలేవగానే తను తన అనుభవాన్ని నాతో చెప్పింది. అప్పుడు నాకు, 'నిద్రపట్టకపోవడమనేది ఈ రోజుల్లో చాలా సహజమైన విషయం, చిన్న సమస్య కూడా. అయినా బాబా పట్టించుకొని తనకి నిద్రపట్టేలా చేశారు. ఆయన మా ఇంటి పెద్ద కాకపోతే ఇంకేంటి?' అనిపించింది.

నేను ఇప్పుడు చెప్పబోయేది నా జీవితంలో ఎప్పటికీ, ఎన్నటికీ మరిచిపోలేనటువంటి ఒక గొప్ప అనుభవం. ఒకసారి వేరే రాష్ట్రంలో ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్‌కోసం నేను పది రోజులు వెళ్ళాను. అయితే నేను నా వృత్తిరీత్యా రోజు మొత్తంలో విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా చాలా ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. అందువల్ల అక్కడ కూడా ఒకటి, రెండు రోజులు మినహా కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాను. ఒక పక్క ఫోన్ కాల్స్, ఇంకో పక్క ఫంక్షన్‌తో నేను బాగా అలిసిపోయాను. పైగా అక్కడ ఆహారం, నీళ్లు పడక నా ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చి అనారోగ్యానికి గురయ్యాను. నిద్ర కూడా పెద్దగా పట్టేది కాదు. ఒకరోజు సాయి నామస్మరణ చేసుకుంటూ నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తే, కొద్దిసేపటికి ద్వారకామాయిలోని బాబా ఫోటో కనపడింది. అప్పటివరకు నిద్రపోవడానికి ఎంతో కష్టపడ్డ నాకు వెంటనే గాడనిద్ర పట్టేసింది. అలసిపోయిన నాకు ఆ నిద్ర ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ఇకపోతే, అక్కడున్న ఆ పదిరోజుల్లో షాపింగ్, అటుఇటు తిరగడాలు ఒక దానివెంట ఒకటి ఉండనే ఉండగా ఒక రోజైతే ఒక పెద్ద షాపింగ్ చేసిన తర్వాత 4 దేవాలయాలు దర్శించాము. ఆ మరుసటిరోజు ఒక పర్యటన ముగించుకొని ఆ మర్నాడు ఉదయమే నేను మా ఊరు తిరిగి రావాల్సి ఉంది. ఆ పర్యటనకి వెళ్ళొస్తే నేను బాగా అలిసిపోతాను. కానీ ఆ విషయం పక్కన పెట్టి పర్యటనకి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఆరోజు పొద్దున్నే సాయి ఆరతులు వింటుంటే ఇంస్టాగ్రామ్‌లో 'నీ ఎదురుగా నేనే, వెనుక నేనే, నీ ముందు నేనే, నీ పక్కన నేనే, నీలోనూ నేనే. నీకు భయమెందుకు?' అని సాయి సందేశం కనిపించింది. అంతే, నాలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. పర్యటనలో నా పక్కన 'సాయి సుష్మ' అనే అమ్మాయి కూర్చుంది. తను, నేను సాయి నామజపం చేస్తు పర్యటన సాగించాము. బాబా దయవల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా పర్యటనను చాలా బాగా ఎంజాయ్ చేసి సురక్షితంగా ఇంటికి వచ్చాము. సాయి నామజపం ఎంత శక్తివంతమైనది అంటే, అది ప్రాణాలు నిలబెట్టే ఆక్సిజన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సాయినాథ్ మహారాజ్ మన చేయి ఎన్నడూ విడివరు. మనకి తోడుగా, నీడగా అనుక్షణం నిలబడతారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయి నామజపంతో ఆరోగ్యానికి సమస్య లేదన్న నిర్ధారణ


నా పేరు రుక్మిణి. మాది మంచిర్యాల. ఒకసారి నేను నా ఆరోగ్యంలో వచ్చిన కొన్ని మార్పులు గమనించి చాలా ఆందోళన చెందాను. ముఖ్యంగా నా రొమ్ము భాగం నొప్పిగా అనిపిస్తుండటం వలన డాక్టర్ను సంప్రదిస్తే, స్కాన్ చేయించమన్నారు. నేను స్కానింగ్ చేసే సమయంలో నిరంతరాయంగా సాయి నామజపం చేశాను. డాక్టరు రిపోర్టు చూసి, 'అంతా బాగానే ఉంది, మీ ఆరోగ్యానికి ఎటువంటి సమస్యా లేద'ని నిర్ధారించారు. నేను ఆనందంగా బాబా పాదాలకు తలవంచి నమస్కరిస్తున్నాను.


15 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  3. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. baba eeroju jarigina daniki poorthiga nade tappu . nenu opputuntunnanu, nannu kshaminchi madava ki kopam taggi kindaki velli annam thini mamuluga unte nenu 1200 times sairam nama smarana chestanu baba mariyu 101/- dakshina samarpinchukuntanu baba.

    ReplyDelete
  7. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  8. Baba please take care of my daughter and bruno 🙏 🙏🙏🙏🙏

    ReplyDelete
  9. ఓం సాయిరామ్

    ReplyDelete
  10. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu

    ReplyDelete
  11. Om sai ram, baba office lo e multi project ane concept implement chayakunda unde la chudu tandri pls, daani valla pressure peruguthundi, pls tandri adi jaragakunda unde la chudu tandri pls, nve chayali neeku tappa evariki cheppalenu, aa concept ye wrong ani ardam ayye la chayandi tandri vaallaki pls, me meede a baranni vesthunnanu meere chusukovali.

    ReplyDelete
  12. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  13. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo