సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1816వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాన్నతో ఒక్కరోజులో లక్ష రూపాయలు సర్దుబాటు - ‌‌మంచి ఉద్యోగం  
2. సద్గురుసాయి కృప

సాయినాన్నతో ఒక్కరోజులో లక్ష రూపాయలు సర్దుబాటు - ‌‌మంచి ఉద్యోగం  


ముందుగా సాయినాన్నకి నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను సాయిని నాన్న అని పిలుస్తాను. ఆయన నాకు కన్నతండ్రి కన్నా ఎక్కువ. ఒకసారి మావారి వ్యాపారరీత్యా ఒకరి దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాము. అయితే ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి కొంచెం కఠిన స్వభావం గలవాడు. అతను ఒక వారం రోజుల్లో మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేయాలని మమల్ని బాగా ఇబ్బందిపెట్టాడు. మాకు డబ్బు సర్దుబాటుకాక చాలా టెన్షన్ పడ్డాము. చాలామందిని అడిగాము కానీ, అందరూ లేవన్నారు. అవతల మా అప్పు ఇచ్చినతని టార్చర్ చాలా ఎక్కువగా ఉండేది. రోజులో 50 సార్లు ఫోన్ చేసి అడుగుతుండేవాడు. అతను మా బంధువు కూడా అయినందున మాటపోతుందని మాకు చాలా భయమేసింది. ఏమి చేయాలో తెలియక నేను చాలా బాధతో, "సాయీ! మీరే దారి చూపాల"ని సాయినాన్నని వేడుకొని కన్నీళ్లు పెట్టుకున్నాను. ఒక్క రోజులో చాలామందిని కొంచం కొంచం మొత్తం డబ్బులు అడిగి ఆ రోజు సాయంత్రానికల్లా డబ్బు తిరిగి మా బంధువుకి ఇచ్చేసాం. సాయినాన్మనే మాకు సహాయం చేశారు. "ధన్యవాదాలు సాయి. నేను మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను సాయినాన్నా". 


నేను ఒక లెక్చరర్‌ని. ఆ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల నాకు వచ్చే జీతం చాలా తక్కువైనప్పటికీ ఆ ఉద్యోగంలో కొనసాగుతూ ఉండేదాన్ని. అలా ఉండగా కోవిడ్ కారణంగా మావారి వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందంటే ప్రతినెలా 50 వేల రూపాయలదాకా అప్పు చేయాల్సి వచ్చేది. దానివల్ల నేను ప్రతినెలా తెలిసిన వాళ్ళందరినీ డబ్బు అడుగుతుండేదాన్ని. అప్పు ఇచ్చిన వాళ్ళు ప్రతినెలా వడ్డీకోసం ఫోన్ చేస్తూండేవాళ్లు. అదీకాక  EMIలు, క్రెడిట్ కార్డుల వాళ్ళ నుండి చాలా ఇబ్బంది ఎదురు అయ్యేది. మా పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేము, అలాగని దాచనూ లేము. నాకు చాలా బాధగా అనిపించేది. ఒక సంవత్సరంపాటు నేను రోజూ బాబా ముందు కూర్చుని, 'సాయి సచ్చరిత్ర' పారాయణం చేస్తూ, "నాకు మీరే దిక్కు సాయి" అని ఏడ్చేదాన్ని. చివరికి ఇలాగే ఉంటే వడ్డీలు కట్టలేము, అప్పులు తీర్చలేమనిపించి నేను ఉద్యోగం మారదామని అనుకున్నాను. కొత్త ఉద్యోగం రావాలంటే పాత ఉద్యోగం మానేయాలి. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఆ దైర్యం చేయలేకపోయాను. ఎందుకంటే. కొత్త ఉద్యోగం వస్తుందో, రాదో ఖచ్చితంగా తెలియదు. దానికోసం ఉన్న ఉద్యోగం వదిలియాలంటే నాకు చాలా భయమేసింది. అలాంటి స్థితిలో నేను బాబా మీద నమ్మకముంచి ముందుకు అడుగు వేసాను. ఒక పక్క ఉన్న ఉద్యోగం చేస్తూ, ఇంటికి వచ్చాక నా పాపని చూసుకుంటూ రాత్రి నిద్రపోకుండా ఒక 3 నెలలు కష్టపడి చదివి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను చాలాసార్లు బాధపడ్డాను. ఇంటర్వ్యూ జరిగే సమయంలో చాలా టెన్షన్ పడేదాన్ని. చాలాసార్లు నాకు నమ్మకం పోయినప్పటికీ సాయి మీద భారమేసి గట్టిగా ప్రయత్నిస్తూ పోయాను. ఆ క్రమంలో నేను మొదట ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. మంచి జీతం కూడా. కానీ సాయినాన్న నా మీద ఇంకా దయ చూపారు. ఇంకో మంచి కంపెనీ ఇంటర్వ్యూలో ఇంకా మంచి జీతంతో నాకు ఆఫర్ వచ్చింది. "మీ మేలు ఏ జన్మలోనూ మర్చిపోను సాయినాన్నా". 


సద్గురుసాయి కృప


నేను ఒక సాయిభక్తురాలిని. తల్లి, తండ్రి, స్నేహితుడు అన్నీ నాకు సాయే. నేను రోజూ పడుకునేముందు బాబాను తలుచుకుని, 'ఏ రూపంలో అయినా బాబా నాకు కనపడితే బాగుంటుంది' అని అనుకుంటుండేదాన్ని. నేను కోరుకున్నటు బాబా ఒకరోజు నాకు స్వప్న దర్శనమిచ్చారు. ఆయన, "మీ ఇంట్లో పరిస్థితి అసలు బాగాలేదు. ఫలానా రోజు మీ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టండి" అని అన్నారు. మేము బాబా చెప్పినట్లే చేసాము. నాలుగు రోజుల తర్వాత మా తమ్ముడు 8 నెలల వయసున్న మా పాపని ఎత్తుకొని కుర్చీలో కూర్చుంటే, ఆ కుర్చీ హఠాత్తుగా విరగడంతో ఇద్దరూ కిందపడిపోయారు. పాప బాగా ఏడ్చింది. నేను చాలా భయపడిపోయాను. బాధతో బాబాని తలుచుకొని, "పాపకి ఏమీ అవ్వకూడదు" అని అనుకున్నాను. బాబా దయవల్ల పాపకి ఏమీ కాలేదు. నిజంగా మన తండ్రి మన వెంట ఉండి మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.


2024, సంక్రాంతి పండుగ ముందు నేను నా బంగారు చెవి బుట్టలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. అస్సలు గుర్తు రాలేదు. ఇంట్లో అంతా వెతికినా దొరకలేదు. క్వశ్చన్&ఆన్సర్స్ సైట్‌లో బాబాని అడిగితే, 'దొరుకుతాయ'ని వచ్చింది. కానీ కనిపించలేదు. ఇంక దొరకవని నేను వాటికోసం మర్చిపోయాను. తర్వాత అనుకోకుండా ఒక రోజు ఆ బంగారం బట్టలు కనిపించాయి. నిజంగా బాబాకి శతకోటి వందనాలు. నా కల, నా భవిష్యత్తు అయినా ఉద్యోగం రావాలన్నా నా కోరికను తొందరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను.


18 comments:

  1. Good morning Baba!!! Om Sairam!! Nannu meere aadukovali baba. Em chestharo Ela chestharo antha meede bharam thandri.

    ReplyDelete
  2. Omsaisri Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha omsaisri Jai Jai Sai Ram

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai 🙏🙏💐💐

    ReplyDelete
  7. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  8. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Baba na manasu ardam chesukuni e samasya nunchi nannu bayata padai tandri, na manasuki ishtam lendi yedi jaragakunda unde la chudu tandri pls, nve naaku dikku

    ReplyDelete
  10. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  11. baba, madava lo maarpu ravali. kopam taggali. chaduvu meeda asakthi kalagali

    ReplyDelete
  12. ఓం సాయిరామ్

    ReplyDelete
  13. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  14. Chest pain rakunda chesaru baba thank you so much baba

    ReplyDelete
  15. Baba,meru naku anni rakalu gaa help chesthune vunnaru chala chala danyavadalu....naa cheyyi vadalakandi baba....maa situations konchem set ayyela cheyandi Baba , pending bills vachesi evariki ebbandi rakunda chudandi baba please 🥺🥺🥺🥺🥺.....naku evarini mosam cheyali ane vuddesam ledu kastha paristhiti ni saricheyali ane alochana thappa inka vere vuddesam ledu.... Dayachesi mammalni kapadandi Baba....Mee padale naku dikku 🙏🙏🙏🙏🥺❤️

    ReplyDelete
    Replies
    1. Mammalni mere kapadali baba....meru chusukuntaru ane dairyam thechukuni orpuga vuntunna....naa nammakam mere Baba 🥺🥺🥺🥺🥺

      Delete
  16. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo