సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1491వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా పట్ల ఉన్న శ్రద్ధ, సబూరీ ఎంత బలహీనంగా ఉన్నాయో తెలియజేసిన అనుభవం
2. సంకట స్థితి నుండి బయటపడేసిన బాబా

బాబా పట్ల ఉన్న శ్రద్ధ, సబూరీ ఎంత బలహీనంగా ఉన్నాయో తెలియజేసిన అనుభవం

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! సాయిభక్తులకి మరియు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారములు. అసంఖ్యాక సాయిభక్తులలో నేను ఒకదాన్ని. నేను నా చిన్నతనం నుండి సాయినే నమ్ముకొని ఉన్నాను. ఒక తల్లి తన బిడ్డ శ్రేయస్సును ఎంతలా కనిపెట్టుకొని ఉంటుందో ఆ సాయినాథుడు తన భక్తుల శ్రేయస్సు గురించి అంతలా కనిపెట్టుకొని ఉంటారనేది నేను చాలాసార్లు అనుభూతి చెందాను. జీవితంలో ఎటువంటి కష్టాలున్నా అవన్నీ బాబా చెంతకు మనల్ని తీసుకెళ్తాయి. నిజమైన విశ్వాసముంటే జీవితం పట్ల భయం అనేది ఉండదు. కానీ ఒక్కోసారి పరిస్థితులకి మనసు చెదిరిపోయి భయం కలుగుతుంది. ఆ భయం మనకు బాబా మీద ఉన్న నమ్మకాన్ని బలహీనపరుస్తుంది. అప్పుడే మనకు మన భక్తిశ్రద్ధలు ఎంత నిలకడలేనివో అర్దమవుతుంది. నేను ఈ అనుభవం మీతో పంచుకొనే ముందురోజు నేను ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. 

మా అన్నయ్యకి పెళ్ళై 4 సంవత్సరాలైంది. మా వదిన ప్రతి మాటకి విపరీత అర్థాలు తీసి మా అన్నతో గొడవపడుతూ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో మా అన్నయ్య మా అమ్మతో మాట్లాడుతుంటే మా వదిన చాటుగా విని పెద్ద గొడవ చేసి పరిస్థితి చాలా దూరం తీసుకెళ్లింది. ఆమె చేసే గొడవల వల్ల ఒక సంవత్సరంపాటు మా ఇల్లు నరకంలా ఉండింది. మా వదినావాళ్ళ కుటుంబంలో, మా కుటుంబంలో అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ సమయంలో నేను అనుభవించిన మానసిక వేదన నా మనసుపై చాలా ప్రభావం చూపింది. ఆ పరిస్థితులన్నీ భయాలుగా మారి నా మదిలో అలానే ఉండిపోయాయి. బహుశా ప్రారబ్ధ కర్మ ఏమో! బాబా అనుగ్రహం వల్ల సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అన్నయ్య, వదినల మధ్య గొడవలు తగ్గి వాళ్ల బంధం చాలావరకు బలపడింది. కానీ ఒక్కోసారి మా కుటుంబసభ్యుల పట్ల మా వదిన ప్రవర్తన బాధ కలిగిస్తుంటుంది. బాబా అనుగ్రహం వల్ల ఆమె మనసు మా విషయంలో కూడా మారుతుందనే నమ్మకం ఉంది. అయితే ఈ అనుభవం వ్రాసే ముందురోజు రాత్రి అన్నయ్య, వదినల గురించి నేను, మా అమ్మ మాట్లాడుకుంటుండగా పొరపాటున నా చేయి తగిలి వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ 6 సెకండ్లు రికార్డ్ అయి మా వదిన ఉండే గ్రూపులో సెండ్ అయింది. నేను వెంటనే డిలీట్ చేశాను. మేము కూడా వాళ్ల గురించి ఏమీ తప్పుగా మాట్లాడుకోలేదు. కానీ నా మనసులో ఒక్కసారిగా పాత భయాలన్నీ చోటుచేసుకొని నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చాలాసేపు బాబా ఫోటో ముందు కూర్చొని ఏడ్చాను. మా అమ్మ సర్దిచెప్తున్నా నా భయం పోలేదు. ఆ సమయంలో బాబా మీద నాకు శ్రద్ధ, సబూరీ ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమైంది. ఆ మెసేజ్ డిలీట్ చేసినా కూడా వదిన వినుంటుందేమోననే భయం నన్ను నిలవనీయలేదు. రాత్రంతా నిద్రపట్టక, 'ప్రతిరోజూ ఉదయాన్నే బాబా ఫోటో నాకు సెండ్ చేసే మా అన్న రేపు పొద్దున్న కూడా చేస్తే అంతా బాగానే ఉన్నట్టు' అని అనుకొని బాబాని తలచుకుంటూ, "బాబా! అన్నయ్య ఎప్పటిలాగే పొద్దున్నే మీ ఫోటో సెండ్ చేయాలి. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని, నేను పడ్డ ఆందోళనను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల అన్నయ్య పొద్దున్నే బాబా ఫోటో సెండ్ చేశాడు. నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. ఈ అనుభవం నాకు బాబా మీద ఉన్న విశ్వాసం ఎంత బలహీనంగా ఉందో తెలుసుకునేలా చేసింది ."బాబా! నాకు మీ మీద శ్రద్ధ, సబూరీ వృద్ధి చెందేలా ఆశీర్వదించండి. ఈ బ్లాగ్ ద్వారా నేను మిమ్మల్ని కోరుకునేది ఇదే. అలాగే, వైవాహిక సమస్యలతో బాధపడేవాళ్లందరికీ మీరు దారి చూపి వాళ్ల జీవితాలను శాంతిమయం చేయాలని కోరుతున్నాను. ఆరోగ్యం, సత్సంబంధాలు అత్యంత విలువైనవని నేను తెలుసుకున్నాను. మీ భక్తులందరికీ వాటిని ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను తండ్రీ"

శుభం భవతు!!!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సంకట స్థితి నుండి బయటపడేసిన బాబా

నా పేరు విజయ్. మాది ఆర్మూర్. మా అమ్మ డయాబెటిక్ పేషెంట్. తను ప్రతిరోజూ వేకువఝామునే పూజకోసం పువ్వులు తేవడానికి బయటకి వెళుతుంది. ఒకరోజు అలా వెళ్ళిన అమ్మ మామూలుగా రోజూ వచ్చే సమయానికి తిరిగి రాలేదు. తెలిసిన వాళ్లెవరైనా కలిస్తే కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చని నేను అనుకున్నాను. అంతలో 'విజయ్, విజయ్' అని ఒక గొంతు వినిపించింది. అది విని 'ఇంత తెల్లవారుఝామున నన్నెవరు పిలుస్తున్నార'న్న షాక్‌లో తలుపు తెరిచి తెరిస్తే, గుమ్మం వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను, "మీ అమ్మ పూల చెట్ల దగ్గర కాలు కదపడానికి రాక నిలబడిపోయింది" అని చెప్పాడు. అంటే, కాళ్లనొప్పుల సమస్య ఉన్న అమ్మ కాళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి. అతను చెప్పింది విన్న నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూ కంగారుగా బైక్ తీసుకొని అమ్మ ఉన్న చోటుకి వెళ్ళాను. చూస్తే, అమ్మ అంగుళం కూడా ముందుకు కదలలేని స్థితిలో ఉంది. ఆమె కదలడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన నొప్పి వస్తుంది. నేను అమ్మను నా బైక్‌పై ఎక్కించుకొనే ప్రయత్నం చేశానుగానీ నా వల్ల కాలేదు. "ఈ సంకట పరిస్థితి నుండి మమ్మల్ని బయటపడేయండి బాబా" అని సాయిబాబాను వేడుకొని ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్లి అమ్మ పరిస్థితి తమ్ముడికి చెప్పాను. ఆపై కారు తీసి ఇద్దరమూ అమ్మ దగ్గరకి వెళ్లి, అమ్మని కారులో ఎక్కించుకొని సమీపంలో ఉన్న డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళాము. డాక్టరు ఇంజెక్షన్ చేశాక అమ్మకి నొప్పి నుండి ఉపశమనం లభించింది. అప్పటివరకు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూ ఉన్న నేను హృదయపూర్వకంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

3 comments:

  1. సాయి సహాయం చేయండి సాయి నేను నా భర్తకి దూరంగా ఉండలేకపోతున్నాను సాయి తనతో మాట్లాడుకున్న చూడకుండా ఉండడం నరకంగా ఉంది సాయి. నన్ను ఇంత పెద్ద క్లిష్ట పరిస్థితులనుండి కాపాడండి సాయి నేను ఏ పాపం చేయలేదు సాయి కానీ కర్మ ఎందుకు అనిపిస్తున్నానో సాయి ఇది పూర్వజన్మ పాపమే సాయి నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి నన్ను కాపాడడానికి తీసుకెళ్లినా చూడు సాయి. మళ్లీ మేమిద్దరం కలిసి పోయేలా ఆశీర్వదించు సాయి భర్తతో కలిసి షిర్డీ వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాను సాయి పిలిస్తే పలుకుతారు కదా పలకండి సాయి తనంటే నాకు చాలా ఇష్టం సాయి

    ReplyDelete
  2. E roju published aina rendu anubhavaaluu chaalaa baagunnayi …..

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo